శాంసంగ్ మీ గోప్యతకు సంబంధించి కొత్త ఆవిష్కరణకు నాంది పలికింది. స్మార్ట్‌ఫోన్ ఉపయోగిస్తున్నప్పుడు, గేమ్ ఆడడానికో, లేదంటే పిక్ తీసుకోవడానికో ‘మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి’ అని ఎవరైనా అడిగితే, మనం ఒక్క నిమిషం ఆలోచనలో పడిపోతాం.. మన సెల్‌ఫోన్ ఇతరులకిస్తే.. ‘వారు ఏం చూస్తారు? రహస్యంగా ఉంచిన సమాచారాన్ని చూసేస్తారా? అనే సందేహం కలుగుతుంది.. కదా...
మీరు మీ ఫోన్లో మీ భాగస్వామి సెల్ఫీని ఆరాధిస్తున్న సమయంలో, మీ ఇంట్లో వారు పక్కనుంచి వెళుతూ దాన్ని చూస్తే ఎలా? ఈ పరిస్థితులలో కనీసం ఒకదాన్ని మనం ఎదుర్కొన్నా.. విషయం అర్థమవుతుంది. మన వ్యక్తిగత విషయాలు బహిర్గతమైతే చాలా ఆందోళన చెందుతాం. అదే మీ స్మార్ట్ఫోన్లోని మొత్తం డేటా, సమాచారాన్ని సురక్షితంగా ఉంచడానికి సులభమైన మార్గం ఉంటే? ప్రైవసీ ఎలా అనే సమస్య లేకపోతే? అపుడు మీరు కుటుంబ సభ్యులకు లేదా స్నేహితులకు స్మార్ట్ ఫోన్ హ్యాపీగా ఇవ్వవచ్చు. ఇప్పుడు శాంసంగ్ మీ గోప్యతా రక్షణ కోసం అద్భుతమైన ఫీచర్స్ ను పరిచయం చేస్తోంది.
ఆల్ట్ జెడ్ లైఫ్ ఫీచర్
స్మార్ట్ఫోన్ వాడకంలో శాంసంగ్ కొత్త విప్లవానికి నాంది పలికింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఫోటోలు, వీడియోల ప్రైవసీని కాపాడేలా ఆల్ట్ జెడ్ లైఫ్ ఫీచర్ను విడుదల చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ 71 స్మార్ట్‌ఫోన్లలో ప్రైవసీ సెక్యూరిటీ ఫీచర్ "ఆల్ట్ జెడ్ లైఫ్''ను తీసుకు వచ్చింది. ఇందులో భాగంగా క్విక్ స్విచ్, ఇంటిలిజెంట్ కంటెంట్ సజెషన్ అనే వినూత్న వ్యూహాలను గెలాక్సీ ఎ 51 , గెలాక్సీ ఎ 71 స్మార్ట్ఫోన్లలో ప్రవేశపెట్టింది. ఈ అద్భుతమైన ఆల్ట్ జెడ్ లైఫ్ ఫీచర్ ఉండగా ఇక గోప్యత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆల్ట్ జెడ్ లైఫ్ మీ ప్రైవసీని రక్షిస్తుంది.
మునుపెన్నడూ ఎరగని ప్రైవసీ (గోప్యతలో మరింత భద్రత)
ఈ ఫీచర్ గురించి మరింత తెలుసుకుందాం.
మీరు మెట్రోలో ఉండి, మీ స్మార్ట్‌ఫోన్ గ్యాలరీని బ్రౌజ్ చేస్తుంటే, పక్కనున్న వ్యక్తి మీ ఫోటోలు చూడటం ఇష్టం ఉండదు కదా. అలాంటపుడు క్విక్ స్విచ్ ఉపయోగపడుతుంది. పవర్ బటన్ రెండు సార్లు (డబుల్ క్లిక్) చేస్తే గ్యాలరీ, బ్రౌజర్, వాట్సాప్ ప్రైవేట్ వెర్షన్ల నుండి వారి జనరల్ (నాన్ ప్రైవేట్ ) వెర్షన్లకు మారుతుంది.
దీన్ని యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
క్విక్ స్విచ్‌కు ధన్యవాదాలు, రాధిక మదన్ కూడా తన సోదరి నిఘా నుంచి తప్పించుకుంది.
మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.
ఇంటిలిజెంట్ కంటెంట్ సజెషన్. ఇదొక ఇన్ బిల్ట్ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ ఫీచర్ . గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 సెక్యూర్ ఫోల్డర్స్ లో ఇది ఉంటుంది. ఇది ప్రైవేట్, నాన్ ప్రైవేట్ కంటెట్ ను దానికదే క్రమబద్ధీకరిస్తుంది. దీనికోసం మీరు చేయాల్సిందల్లా కొన్ని పారామీటర్స్ ను సెట్ చేసుకోవడమే. అంటే ముఖ్యంగా ప్రత్యేకమైన ఆయ వ్యక్తుల ముఖాలు, ఫోటోలు సెలెక్ట్ చేసుకోవాలి. దీనికనుగుణంగా ఫోన్ లోని ఏఐ ఫీచర్ ఎంపిక చేసుకుంటుంది.
ఈ ఫీచర్ ను యాక్టివేట్ చేసుకోవడం ఎలా?
మీలోని ఫోటోగ్రాఫర్ ఫుల్ పవర్ తో బయటకు రావడం ఖాయం
మీ కెంతో ఇష్టమైన ప్రైవసీ ఫీచర్లే కాకుండా మీలోని ఫోటోగ్రఫీ నైపుణ్యాన్ని కూడా వెలికి తీస్తుంది గెలాక్సీ ఏ51 , ఏ71 ఫోన్లలోని మరో ఫీచర్. ఇందులో క్వాడ్-కెమెరా (నాలుగు వెనుక కెమెరాలు)ల నుంచి తీసిన ఫోటోలు మిమ్మల్ని ఆశ్యర్యంలో ముంచెత్తుతాయి. ఓ పార్క్ కు వెళ్లినా, మీరు వెళ్లిన ఆహ్లాదకరమైన రెస్టారెంట్ లో వెలుగు తక్కువ ఉన్నా, గ్రాఫిటీతో నిండిన వీధులకు వెళ్లినా వీటిన్నింటినీ ఈ కెమెరా సమర్ధవంతంగా నిర్వహించుకుంటుంది. అద్భుతమైన షార్ప్ నెస్, ఫోకస్, డీటైయిల్స్ తో మీరు తీసిన ఫోటోలకు మీ ఇన్స్టాలో ప్రశంసల వెల్లువ కురుస్తుంది.
సింగిల్ టేక్తో, ఖచ్చితమైన ఫ్రేమ్ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీ స్నేహితులు అల్లరి చేస్తున్నా..లేదా వేగంగా కదిలే టెన్నిస్ ఆడుతున్నా.. కెమెరాలోని సింగిల్ టేక్ ఆప్షన్ ఎంచుకుంటే సరి. 7 ఫోటోలు, 3 వీడియోలను ఒకేసారి వస్తాయి. వీటిలో షార్ట్ మూవీ, ఒక జిఫ్ ఫైల్, శైలీకృత ఫోటోలు వస్తాయి.
దీంతో పాటు నైట్ హైపర్లాప్స్, స్మార్ట్ సెల్ఫీ యాంగిల్, క్విక్ వీడియో, కస్టమ్ ఫిల్టర్, రికార్డింగ్ చేసేటప్పుడు కెమెరాను మార్చుకోవడం. ఏఐ గ్యాలరీ జూమ్ లాంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. గెలాక్సీ ఏ51 , ఏ71 స్మార్ట్ ఫోన్ తో తీసిన ఫోటోలు మిగిలిన వాటితో పోలిస్తే అద్భుతంగా ఉంటాయి. స్విచ్ కెమెరా వైల్ రికార్డింగ్ అనే ఫీచర్ గెలాక్సీ ఏ51 లో మాత్రమే లభిస్తుంది.
మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో శాంసంగ్ హవా
శాంసంగ్ గెలాక్సీ ఏ51 , ఏ71 స్మార్ట్‌ఫోన్లు 2020 లో మిడ్-రేంజ్ విభాగంలోకి దూసుకు వచ్చాయి. ఇందులోని కెమెరా ఫీచర్స్ యూజర్ల ఫోటోగ్రఫర్ ను వెలికి తీస్తుంది. నాక్స్ సెక్యూరిటీ తో మీ డేటా గురించి చింతించాల్సిన అవసరం లేదు. అంతేనా.. మీ వాలెట్ ఇంట్లో మర్చిపోయినా... శాంసంగ్ పే ఆ లోటును కనిపించనివ్వదు. రోజంతా ఎంజాయ్ చేసేలా చేస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ ఏ51, ఏ71 స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో టాప్లో ఉన్నాయనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. పరిశోధనా సంస్థ స్ట్రాటజీ అనలిటిక్స్ ప్రకారం 2020లోని త్రైమాసికంలో గెలాక్సీ ఏ 51 ప్రపంచంలో అత్యధికంగా అమ్ముడైన ఆండ్రాయిడ్ ఫోన్ గా నిలిచింది. ప్రస్తుత పోటీ మార్కెట్లో ఇది అద్భుతమైన విజయం. “అద్భుతమైన స్క్రీన్, అద్భుతమైన కెమెరా, దీర్ఘకాలిక బ్యాటరీ జీవితం” తో, ఈ స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలను మార్చేస్తాయి.
గెలాక్సీ ఏ 51 రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 22,999
8 జీబీ ర్యామ్ ,128 జీబీ స్టోరేజ్ మోడల్ రూ. 24,999
గెలాక్సీ ఏ 71 సింగిల్ కాన్ఫిగరేషన్లో లభ్యం.
8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ రూ. 29,499
స్విచ్ , ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్ ఫీచర్లు
ఈ స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని మరింత సులభతం చేస్తాయి.
రాధిక మదన్ ఇప్పటికే గెలాక్సీ ఏ71 స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు. (Advertorial)
Comments
Please login to add a commentAdd a comment