ఏ ఒక్కరికి మీ సమాచారం తెలియదు (స్పాన్సర్డ్‌) | Samsung Galaxy A51 A71: Privacy Guaranteed Sponsored | Sakshi
Sakshi News home page

ప్రైవసీకి హామీ: శాంసంగ్ గెలాక్సీ ఏ71, ఏ51

Published Wed, Sep 23 2020 2:05 PM | Last Updated on Mon, Dec 21 2020 11:51 AM

Samsung Galaxy A51 A71: Privacy Guaranteed Sponsored - Sakshi

ఆల్ట్ జడ్ జీవితంలో భాగంగా క్విక్ స్విచ్ పేరుతో శాంసంగ్ నూతన స్మార్ట్ఫోన్ ప్రైవసీ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. కేవలం పవర్ కీని డబుల్ క్లిక్ చేయడం ద్వారా ఫోటోలు, యాప్స్ వంటివి ప్రైవేట్ నుంచి పబ్లిక్ మోడ్‌కు సులభంగా మార్చుకునే వెసులుబాటు లభిస్తుంది. 

ఫీచర్ భాగస్వామి, హెచ్‌టీ బ్రాండ్ స్టూడియో స్మార్ట్‌ఫోన్లు మన జీవితంలో అంతర్భాగమయ్యాయి- స్మార్ట్‌ఫోన్లు లేకుండా మనం ఏమీ చెయ్యలేం.. మిలీనియల్స్, జడ్ జనరేషన్ అయితే వారి స్మార్ట్‌ఫోన్ల పైనే పూర్తిగా ఆధారపడతారు. పని, ఆటల మధ్య సరైన సమతూకం పాటించేందుకు వారికి స్మార్ట్‌ఫోన్లు కీలకం. మీరు రోజంతా జర్నలిస్టుగా పనిచేసి సాయంత్రం డీజేగా మారితే ఎలా ఉంటుందో ఊహించుకోండి.. పనికి సంబంధించిన కీలక సమాచారం నుంచి వ్యక్తిగత ఫోటోల వరకూ మీ ఫోన్లో ఎన్నో నిక్షిప్తమై ఉంటాయి. ఇతరులు మీ ఫోన్ వంక చూస్తే మీరు ఎంత కంగారు పడతారో ఆలోచించండి? సరిగ్గా ఇక్కడే ప్రైవసీ ముందుకొస్తుంది. ప్రైవసీ కేవలం ఇతరులకే పరిమితం కాదు. ఇది మీ ప్రైవేట్ సమాచారాన్ని మీ స్నేహితులు, కుటుంబ సభ్యులకు దూరంగా ఉంచడం కూడా. 

మిలీనియల్స్‌లా మనం మన ఫోన్లను ఏ ఒక్కరికీ ఇవ్వడానికి సంకోచిస్తాం. ఫోన్‌ ఎవరికైనా ఇచ్చినా, వారు మన ప్రైవేట్ సమాచారాన్ని చూస్తారా అనే భయం మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. యూజర్ తన తొలి ప్రాధాన్యంగా భావించే శాంసంగ్ అందుకే మీకోసం గెలాక్సీ ఏ71, గెలాక్సీ ఏ51లపై క్విక్ స్విచ్, ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ వంటి పరిశ్రమలోనే తొలి వినూత్న ప్రైవసీ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. శాంసంగ్ ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమంలో భాగంగా ఈ ఫీచర్లను ప్రవేశపెట్టింది. యూజర్లు, ప్రత్యేకించి జడ్ జనరేషన్ వారి స్మార్ట్‌ఫోన్లను ఇతరులతో పంచుకున్న సందర్భాల్లో ఎదురయ్యే ఆందోళనను ఈ ఫీచర్లు తొలగించడమే కాకుండా వారి అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించేందుకు వెసులుబాటు కల్పిస్తాయి. మీ ప్రైవసీని ఎవరైనా హరిస్తారనే విచారం లేకుండా పూర్తి స్వేచ్ఛతో జీవితాన్ని అనుభవించడమే ఆల్ట్ జడ్ జీవిత సారాంశం. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. 

మీ చేతుల్లోనే ప్రైవసీ
మిలీనియల్స్, జడ్ జనరేషన్ అసంఖ్యాక సెల్ఫీలు, వీడియోలు తీస్తుంటారన్నది తెలిసిందే. వాటిని ఏ ఒక్కరూ చూడరాదని కూడా వారు కోరుకుంటారు. గతంలో గ్యాలరీని లాక్ చేసే ఒకేఒక్క ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా మీ స్నేహితులు పాస్‌వర్డ్‌ అడిగితే ఇవ్వాల్సి వచ్చేది. మీకు అసౌకర్యం వాటిల్లినా మీ ప్రైవసీకి భంగం కలిగేది. క్విక్ స్విచ్‌తో మీరు ఇలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. పవర్ కీని డబుల్ క్లిక్ చేయడంతో మీ ఫోటోలు, యాప్స్ సహా అన్నింటినీ ప్రైవేట్, పబ్లిక్ మోడ్‌లోకి మార్చేసుకోవచ్చు. అవును మీరు సరిగ్గానే విన్నారు! (ఏ ఒక్కరికి మీ సమాచారం తెలియదు) ఉదాహరణ తీసుకుంటే.. మీరు ఆఫీసులో ఉన్నారు... మీ బాస్‌పై మీరు చేసిన మీమ్స్‌ కొలీగ్స్‌కు చూపుతున్నారు.. అయితే ఇలా చేస్తే ఏమవుతుందో  ఊహించండి. మీ బాస్ మీ దగ్గరకు వచ్చి మీ ఫోన్ను చూపించమని కోరితే.. మీరు ఏం చేస్తారు?

ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడేందుకు నటి రాధికా మోహన్ క్విక్ స్విచ్‌ను వాడే పద్ధతిని అనుసరించండి. రాధిక కూడా తన బాయ్‌ఫ్రెండ్‌, సోదరిల మధ్య తన ప్రైవసీకి భంగం వాటిల్లకుండా ఈ వినూత్న ఫీచర్‌ను వాడారు. 

మన జీవితాల్లోకి తొంగిచూసేందుకు ఇష్టపడుతూ, మన ఫోన్లలో మనం ఏం చేస్తున్నామో పసిగట్టాలని ఎవరో ఒకరు ప్రయత్నిస్తారని మనందరికీ తెలుసు కదా? 

వినూత్న ఫీచర్లకు పేరొందిన శాంసంగ్ క్విక్ స్విచ్ ఫీచర్‌తో మరోసారి విశిష్టతను నిరూపించుకుంది. సౌకర్యవంతమైన, అవరోధాలు లేని మేలుకలయికగా ఈ ఫీచర్లను యూజర్ల ముందుంచింది. శాంసంగ్ గెలాక్సీ ఏ71, ఏ51 స్మార్ట్ఫోన్లపై అందుబాటులో ఉన్న క్విక్ స్విచ్ మీకు ఆల్ట్ జడ్ జీవితాన్ని అనుభవంలోకి తీసుకువస్తుంది. క్విక్ స్విచ్‌కు కొనసాగింపుగా ఇంటెలిజెంట్ కంటెంట్ సజెషన్స్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్ లోపలే ఏఐ ఫీచర్‌గా కంటెంట్ సజెషన్స్ ఫోటోలను ప్రైవేట్ ఫోల్డర్‌కు తరలించాలని ఆటోమేటిగ్గా సజెస్ట్ చేస్తుంది. శాంసంగ్ నాక్స్ భద్రతతో ఇది పనిచేస్తుంది. మీరు ప్రైవేట్‌గా ఉంచదల్చుకున్న ఫోటోలు, వ్యక్తుల ముఖాలను ఎంపికచేసుకుంటే కంటెంట్ సజెషన్స్ ఫీచర్ ప్రైవేట్ గ్యాలరీకి తరలించాల్సిన ఫోటోలను తెలివిగా సూచిస్తుంది. ప్రైవేట్ గ్యాలరీలో ఫోటోలను ఏ ఒక్కరూ చూసే అవకాశం ఉండదు.

అందుబాటు ధరల్లో అద్భుత ఫీచర్లు
శాంసంగ్ మరోసారి మెరుగైన స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను అందుబాటు ధరల్లో ప్రవేశపెట్టింది. రెండు ఫోన్లు ఇన్ఫినిటీ-ఓ అమోల్డ్ ప్లస్ డిస్ప్లే, స్లీక్ ప్రిస్మ్ క్రష్ డిజైన్, క్వాడ్ కెమెరా మాడ్యూల్, ఫ్లాగ్షిప్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లతో ముందుకొచ్చాయి. సింగిల్ టేక్, నైట్ హైపర్‌లాప్స్‌ వంటి కెమెరా ఫీచర్లు యూజర్లను ఆకట్టుకుంటాయి. సింగిల్ టేక్ ఫీచర్ మూడు నుంచి పది సెకన్లలో 14 రకాల ఫోటోలు, వీడియోల (పది ఫోటోలు, నాలుగు వీడియోలు)ను క్యాప్చర్ చేసేందుకు మిమ్మల్ని అనమతిస్తుంది. వీటిలో కొన్ని స్టైలైజ్డ్ ఫోటోలు, షార్ట్ మూవీ, కొన్ని జిఐఎఫ్ యానిమేషన్లు కూడా ఉంటాయి. దీని ప్రత్యేకత ఏంటంటే మీరు వీటన్నింటినీ ఒకే ఆల్బమ్లో పొందవచ్చు. మీరు సింపుల్గా ఈ ఆప్షన్ను పిక్ చేసుకుని ఎంపిక చేసుకుంటే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం చూస్తారు. నైట్ హైపర్‌లాప్స్‌తో మీరు తక్కువ వెలుతురులో మెరుగైన హైపర్‌లాప్స్‌ వీడియోలను షూట్ చేసుకోవచ్చు. రాత్రిపూట వీడియోలు తీసేందుకు ఈ ఫీచర్ మెరుగ్గా ఉంటుంది. నైట్ లైఫ్కు పేరొందిన నగరాన్ని సందర్శించేందుకు మీరు ప్లాన్ చేస్తే ఈ ఫోన్లో మీరు తీసే వీడియోలు అద్భుతంగా ఉంటూ ఔరా అనిపిస్తాయి. గెలాక్సీ ఏ71 మెరుగైన ఫీచర్లలో బ్యాటరీ లైఫ్ కూడా ఒకటి. 4,500 ఎంఏహెచ్ బ్యాటరీ మీకు రోజుకుపైగా పనిచేస్తుంది! చదవడం, వీక్షించడం, గేమ్స్ ఆడటంతో పాటు మీ హృదయానికి దగ్గరైన కంటెంట్‌కు సంబంధించి ఏ పనులైనా ఎలాంటి అవాంతరం లేకుండా యాక్సెస్ చేసుకోవచ్చు. వెనుక వైపు 64 ఎంపీ కెమెరా, 25 వాట్స్ వైర్డ్ చార్జింగ్, 6.7 ఇంచ్ అమోల్డ్ డిస్‌ప్లే ఈ ఫోన్ ప్రత్యేకతలు. 

ఏ71 తరహా డిజైన్లోనే రూపొందిన గెలాక్సీ ఏ51 చిన్న ఛేసిస్తో ఉంటుంది. 6.5 ఇంచ్ అమోల్డ్ స్క్రీన్, 48 ఎంపీ కెమెరా, 4000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం, 15 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, ఒక యూఐ 2.0 ఫీచర్లతో ఏ51 అందుబాటులో ఉంది.

శాంసంగ్ నాక్స్‌తో ముమ్మర భద్రత
భద్రత విషయంలో మరింత ముందడుగు వేస్తూ పలు అంచెల భద్రతా ఫ్లాట్ఫాం నాక్స్తో శాంసంగ్ అదనపు భద్రతను కల్పిస్తోంది. స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్‌ చిప్‌లో దీన్ని నిర్మించారు. కీలక ఫైళ్లను, శాంసంగ్ పే లావాదేవీలు, పాస్వర్డ్లు, ఫోటోలు, వీడియోలు, ఫోన్ ఆరోగ్యం సహా మొత్తం డేటాను నాక్స్ సంపూర్ణంగా కాపాడుతుంది. 

ఇక ఈ ఫోన్లు మీకు ఏమేం అందిస్తారో తెలుసుకున్నారు, అల్ట్ జడ్ జీవితాన్ని ఆస్వాదించేందుకు మీరు సిద్ధంగా ఉన్నారా? గెలాక్సీ ఏ51, గెలాక్సీ ఏ71 రిటైల్ స్టోర్లు, శాంసంగ్.కాం, ఈకామర్స్ వేదికలపై అందుబాటులో ఉన్నాయి. గెలాక్సీ ఏ71పై 2600 రూపాయల వరకూ, గెలాక్సీ ఏ51పై 1500 రూపాయల వరకూ అద్భుత క్యాష్బ్యాక్ ఆఫర్ ప్రస్తుతం నడుస్తోంది. 

ఇది పరిమిత కాల ఆఫర్, ఇక వేచిచూడకండి! (Advertorial)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement