
షేకీ వీడియోలను సరిచేస్తుంది!
సైకిల్ తొక్కుతూ లేదా మెట్లు ఎక్కుతూ లేదా అటూ ఇటూ తిరుగుతూ ‘గోప్రో’ వంటి కెమెరాలతో వీడియోలు తీశారా? కెమెరా కదిలినప్పుడల్లా వీడియోల్లోని దశ్యాలు షేక్ అవుతున్నాయా? అయితే ఆ సమస్యను ఫిక్స్ చేసేందుకు మైక్రోసాఫ్ట్ కంపెనీ నుంచి ‘హైపర్‌లాప్స్’ అనే కొత్త సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చింది. ఈ సాఫ్ట్‌వేర్ మూడు దశల్లో పనిచేస్తుంది. మొదట ప్రతి సీన్‌లో ముఖ్యమైన ఫీచర్స్‌ను విశ్లేషించి ఓ వీడియోను సుమారు అంచనాతో పునర్‌నిర్మిస్తుంది.
రెండోదశలో కెమెరా కదలికలు లేకుండా స్మూత్ ఫ్రేమ్‌లతో వర్చువల్ రీకన్‌స్ట్రక్షన్ చేస్తుంది. చివరగా తొలుత రూపొందించిన వీడియోను ఈ స్మూత్ ఫ్రేమ్‌లతో కూడిన కెమెరా పాత్‌లో బంధిస్తుంది. ఒరిజినల్ ఫుటేజీలో లేని అదనపు ఫ్రేములను ఉత్పత్తి చేసి కెమెరా జంప్‌లను తీసేస్తుంది. దీంతో షేక్ అయ్యే వీడియో.. స్మూత్‌గా ప్లే అయిపోతుంది. అయితే ఇలాంటి ఇమేజ్-స్టెబిలైజేషన్ సాఫ్ట్‌వేర్‌లు మార్కెట్లోకి ఇంతకుముందే కొన్ని వచ్చినప్పటికీ, వాటి కన్నా ఈ కొత్త సాఫ్ట్‌వేర్ చాలా వేగంగా, సమర్థంగా పనిచేస్తుందని దీని రూపకర్తలు చెబుతున్నారు.