Boy Shares Beer Pic On Family WhatsApp Group, See His Desi Parents Reactions Viral - Sakshi
Sakshi News home page

ఏంటిది బ్రో.. ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూప్‌లో ఆ ఫోటో పెట్టి.. అడ్డంగా బుక్‌ అయ్యావ్‌!

Published Sun, May 28 2023 7:17 PM | Last Updated on Mon, May 29 2023 10:57 AM

Boy Shares Beer Tin Pic On Family Whatsapp Group Goes Viral - Sakshi

మా పిల్లలు బుద్ధిమంతులు, చెడు అలవాట్లు లేవు.. ఇది తల్లిదండ్రులకు వారి పిల్లలపై ఉన్న నమ్మకం. అంతెందుకు ఇరుగు పొరుగు, బంధువులు దగ్గర కూడా ఇలానే చెప్పడం మనం చూసే ఉంటాం​. ఇక కొందరైతే ఇంట్లో సైలెంట్‌గా బయట వైలెంట్‌గా ప్రవర్తిస్తుంటారు. కానీ ఏది ఏమైనా ఏదో ఒక రోజు అసలు బండారం మన పేరెంట్స్‌కి తెలిసి తీరుతుంది. తాజాగా ఓ కుర్రాడు ఇదే తరహాలోనే అడ్డంగా బుక్‌ అయ్యాడు.

యువతలో ఐపీఎల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  వీటిలో చెన్నై, ముంబై, ఆర్సీబీ వంటి టీమ్‌లకు ఫ్యాన్స్‌ ,ఫాలోవర్స్‌ ఎక్కవనే చెప్పాలి. ఇక తమ అభిమాన జట్టు గెలిస్తే ఆ ఆనందంతో సంబరాలు జరుపుకోవడం సహజమే.  తాజాగా ఓ యువకుడు బీర్‌ తాగుతూ ఐపీఎల్‌ మ్యాచ్‌ చూస్తూ ఎంజాయ్‌ చేస్తున్నాడు. అంతటి ఆగక వెంటనే ఆ బీర్‌ టిన్‌ ఫోటో తీసి "ముంబయి గెలుస్తుంది...లెట్స్ గో" అని వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్‌ చేశాడు.



అయితే ఇక్కడే ఓ పొరపాటు జరిగిపోయింది. అతను తన ఫ్రెండ్స్ గ్రూప్‌లో అనుకుని ఫోటోని ఫ్యామిలీ గ్రూప్‌లో షేర్‌ చేశాడు. ఇంకేముంది...ఆ కుర్రాడి తల్లిదండ్రులు ఇది చూసి ఖంగుతిన్నారు. "నీకు తాగే అలవాటుందా..? ఇదేంటి..?' అని అతన ప్రశ్నించారు. మరోవైపు ఆ ఫోటోని వెంటనే డిలీట్‌ చేయాలని సానియా తన సోదరుడిని కోరింది. దీంతో అతను తొందర్లో డెలీట్‌ ఫర్‌ ఎవరీ వన్‌ అనే ఆప్షన్‌ కాకుండా డెలీట్‌ ఫర్‌ మీ అనే దాన్ని క్లిక్‌ చేశాడు. ఇంకేముంది జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఆ తరవాత పెద్ద రచ్చ జరిగింది.

ఆ కుర్రాడి అన్న ఈ ఛాటింగ్‌కి సంబంధించిన స్క్రీన్‌షాట్స్‌ని ట్విటర్‌లో షేర్ చేశాడు. "మా తమ్ముడు చేసిన పని ఇది" అంటూ పోస్ట్ చేశాడు. ఈ ఫోటో చూసిన నెటిజన్లు కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. " ఏంటి బ్రో తాగితే తాగావ్..ఆ ఫోటోలు అవసరమా" అని ఆ కుర్రాడికి క్లాస్ పీకుతున్నారు. ఇంకొందరైతే "సెల్ఫ్ డ్యామేజ్ ఎలా చేసుకోవాలి అనే కోర్స్ చేసుంటాడు" అని ఫన్నీగా స్పందిస్తున్నారు. 
 

చదవండి: మీరు లావుగా ఉన్నారా.. అయితే ఆ రెస్టారెంట్‌లో పుడ్ ఫ్రీ, ఫ్రీ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement