‘షార్ట్స్’ కోసం యూట్యూబ్ కొత్త వీడియో ఎఫెక్ట్, ఎడిటింగ్ టూల్స్‌ను ప్రవేశపెట్టనుంది. దీనివల్ల క్రియేటర్స్ మరింత మెరుగైన ‘షార్ట్స్’ను రూపొందించడానికి వీలవుతుంది. వ్యక్తిగత కామెంట్స్‌కు రిప్లే ఇచ్చే సదుపాయం కూడా రానుంది.
‘షార్ట్స్’ ద్వారా డబ్బు అర్జించడానికి ‘బ్రాండ్‌కనెక్ట్’ నుంచి ‘బ్రాండెడ్ కంటెంట్’ను బిల్డ్ చేయడం, షాపబుల్ వీడియోలు, లైవ్‌షాపింగ్... మొదలైన వాటికి ఐడియాలు, ఎలాంటి కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది? అనేదానిపై సలహాలు పొందవచ్చు.
మరో కొత్త ఫీచర్
స్ట్రీమింగ్ దిగ్గజం యూట్యూబ్ కొత్త మొబైల్ యాప్(ఐఫోన్, ఆండ్రాయిడ్‌లలో)ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా వీడియోలను లైక్, డిస్‌లైక్ చేయడం, షేర్ చేయడం సులభం అవుతుంది. ఫుల్ స్క్రీన్ మోడ్‌లో కూడా బాటమ్ కార్నర్‌లో బటన్ వరుస కనిపిస్తుంది. దీని వల్ల రకరకాల ఆప్షన్‌లతో యాక్సెస్ కావడానికి వీలవుతుంది. యూట్యూబ్ ‘లూపింగ్ ఫీచర్’ అనే కొత్త ఫీచర్‌ను పరిక్షిస్తోంది. (క్లిక్: ప్రాణం లేదు.. అయినా బుడ్డోడి హావభావాలు అదుర్స్)
Comments
Please login to add a commentAdd a comment