ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ మెసేజింగ్ యాప్!
న్యూయార్క్: ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సరికొత్త మెసేజింగ్ యాప్తో ముందుకు రాబోతోంది. దీనికోసం గూగుల్ సంస్థ దాదాపు ఏడాది కాలంగా తీవ్రంగా కసరత్తులు చేస్తోందని వాల్స్ట్రీట్ జర్నల్ బుధవారం తెలిపింది. గూగుల్ మెసేజింగ్ యాప్ 'హ్యాంగౌట్' ఆశించినంత మేర యూజర్లను ఆకట్లుకోకపోవటంతో గూగుల్ ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది.
ఈ కొత్త మెసేజింగ్ యాప్లో ఫేస్‌బుక్‌ను తలదన్నేలా యూజర్లకు అన్నిరకాల ఫీచర్లను అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో ఉండే ఫీచర్లను, వెబ్పేజ్ లింక్లు యూజర్లకు యాప్లో అందుబాటులో ఉండేలా గూగుల్ దీన్ని రూపొందిస్తోంది. ఇటీవలి మొబైల్ ఫేస్బుక్ లోని ఫీచర్ల కంటే అడ్వాన్స్గా గూగుల్ ఈ యాప్ను తీసుకురానున్నట్లు తెలుస్తున్నా.. ఇది ఎప్పటికి అందుబాటులోకి రానుందనే విషయం మాత్రం తెలియరాలేదు.