compitition
-
ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు.. పోస్టర్ ఆవిష్కరణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తోంది. దేశ నలుమూలల నుంచి కోడింగ్ పట్ల ఆసక్తిగల విద్యార్థులు ఎవరైనా ఈ కాంపిటిషన్లో పాల్గొనవచ్చు. ఈ పోటీలో టాప్ స్కోర్ సాధించిన వారికి ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో అడ్మిషన్ లభిస్తుంది. వారికి నచ్చిన కోర్సు ఎంచుకోవచ్చు. ట్యూషన్ ఫీజుపై 100 శాతం వరకు స్కాలర్షిప్ లభిస్తుంది. అలాగే రూ.లక్ష విలువ చేసే బహుమతులు అందుకోవచ్చు. నేషనల్ టాలెంట్ హంట్ పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఏపీ సచివాలయంలో ఆవిష్కరించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ హ్యాకథాన్‌ను రెండు భాగాలుగా నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మొదట మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ (ఎంసీక్యూ) పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఇందులో జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్‌కు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. రెండో భాగంలో కోడింగ్ నైపుణ్యానికి సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి. ఈ రెండు టెస్టులు ఆన్లైన్లోనే నిర్వహిస్తారు. హ్యాకథాన్ పోటీ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 13న ప్రారంభమైంది. జనవరి 31 వరకు కొనసాగుతుంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. చదవండి: అస్వస్థతతో వైఎస్సార్సీపీ నేత మృతి.. స్పందించిన సీఎం జగన్ -
మీరు వేసిన డూడుల్..గూగుల్‌లో..!
సాక్షి, హైదరాబాద్: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్.. ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డూడుల్ పోటీ నిర్వహిస్తోంది. ‘నేను పెరిగి పెద్దవాడినయ్యేటప్పటికి నేను ఆశిస్తుంది.. అనే థీమ్‌తో ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఎంట్రీస్ పంపాలని గూగుల్ ఆహ్వానిస్తోంది. ఉదాహరణకు ఎగరగలిగే షూస్? కాలుష్యరహిత ప్రపంచం, చందమామపై మానవ జీవితం తదితర అంశాలను విద్యార్థులు స్కెచ్ లేదా పెయింటింగ్‌లో అందంగా చిత్రీకరించాలి. అంతేకాకుండా ప్రతి గూగుల్ డూడుల్‌పై ఉన్నట్లే వారి పెయింటింగ్‌పై గూగుల్ అని ఉండాల్సిందిగా తెలిపింది. విద్యార్థులు వారి థీమ్‌ను డూడుల్ ఎంట్రీ ఫారమ్‌తో కొరియర్ లేదా ఆన్లైన్ doodles.google.co.in/d4g ద్వారా పంపించాలని పేర్కొంది. దరఖాస్తులు పంపడానికి చివరి గడువు సెప్టెంబర్ 30. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు రూ. 5 లక్షల ఉపకారవేతనం, ఆ విద్యార్థి పాఠశాలకు రూ.2 లక్షల సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులను గూగుల్ సంస్థ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ పోటీలో గెలుపొందిన విజేత ఆర్ట్‌ను గూగుల్ డాట్ కామ్‌లో డూడుల్‌గా ఉపయోగించనున్నారు. -
పోటీ త్రిముఖం
చిరకాల ప్రత్యర్థుల తాజా పోరు జిల్లాలో ఆసక్తిగా మారింది. జిల్లాలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అత్యధికంగా గత ఎన్నికల్లో పోటీపడ్డ అభ్యర్థులే మరోసారి వివిధ పార్టీల తరఫున బరిలోకి నిలవడం విశేషం. ఇందులో రామగుండం, పెద్దపల్లిల్లో పోటీ త్రిముఖం కాగా, ప్రత్యేకతను సంతరించుకున్న మంథనిలో ముఖాముఖి పోటీ నెలకొంది. సాక్షి, పెద్దపల్లి : పెద్దపల్లిలో రెండో విజయం కోసం మాజీ ఎమ్మెల్యేలు పోటీపడుతున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీల నుంచి తలపడుతున్న దాసరి మనోహర్‌రెడ్డి, చింతకుంట విజయరమణారావు, గుజ్జుల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు కావడం విశేషం. వీరంతా ఇప్పటి వరకు ఒక్కోసారి ఎమ్మెల్యేగా గెలుపొంది, రెండో విజయం కోసం తహతహలాడుతున్నారు. దాసరి మనోహర్‌రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్యే కాగా, ఆయన మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీపడుతున్నారు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన చింతకుంట విజయరమణారావు ఈసారి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచారు. బీజేపీ ఎమ్మెల్యేగా పెద్దపల్లి నుంచి గతంలో గెలిచిన గుజ్జుల రామకృష్ణారెడ్డి మరోసారి అదే పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా, ప్రధాన పోటీ మాత్రం ముగ్గురు మాజీ ఎమ్మెల్యేల నడుమనే కొనసాగనుంది. కొత్త జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేల ఫైట్‌ను ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మంథనిలో నువ్వా.. నేనా ! రాష్ట్రంలోనే ప్రత్యేకతను సంతరించుకున్న మంథనిలో చిరకాల ప్రత్యర్థుల మరోపోరు ఆసక్తి రేకెత్తిస్తోంది. ఒకప్పటి సన్నిహితులు, ఆ తరువాత ప్రత్యర్థులు మాజీమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, తాజామాజీ ఎమ్మెల్యే పుట్ట మధు వరుసగా మూడోసారి తలపడుతున్నారు. ఇప్పటి వరకు ఇరువురు రెండుసార్లు పోటీపడగా, చెరోమారు విజయం సాధించడం గమనార్హం. గత ఎన్నికల తరహాలోనే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ నుంచి, పుట్ట మధు టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగారు. నియోజకవర్గంలో మొత్తం పది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ చిరకాల ప్రత్యర్థులు శ్రీధర్‌బాబు, మధుల మధ్యే పోటీ నువ్వా నేనా అన్నట్లుగా సాగుతుంది. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు కాంగ్రెస్ రాష్ట్రస్థాయి నేత కావడంతో ఈ పోటీ రాష్ట్ర వ్యాప్తంగా ఆకర్షిస్తుంది. బీజేపీ నుంచి సనత్‌కుమార్ పోటీ చేస్తున్నారు. రామగుండంలో త్రిముఖం రామగుండం నియోజకవర్గంలో పాత ప్రత్యర్థుల పోరు మరోసారి కొనసాగుతుంది. గత ఎన్నికల్లో తలపడిన అభ్యర్థులే ప్రస్తుతం వివిధ పార్టీల తరఫున పోటీలోకి దిగారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సోమారపు సత్యనారాయణ మరోసారి అదే టీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్నారు. గతంలో మాదిరిగానే టీఆర్ఎస్ టికెట్ ఆశించి బంగపడ్డ కోరుకం టి చందర్ ఈసారి కూడా సింహం గుర్తుపై ఫార్వర్డ్ బ్లాక్ నుంచి తలపడుతున్నారు. గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన శాప్ మాజీ చైర్మన్ మక్కాన్‌సింగ్ రాజ్‌ఠాకూర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పడుతున్నారు. సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ వరుసగా మూడుసార్లు తలపడుతుండడం విశేషం. నియోజకవర్గంలో మొత్తం 16 మంది అభ్యర్థులుండగా, ప్రధానంగా మక్కాన్‌సింగ్‌రాజ్‌ఠాకూర్, సోమారపు సత్యనారాయణ, కోరుకంటి చందర్ నడుమే పోరు కొనసాగుతుంది. -
ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ మెసేజింగ్ యాప్!
న్యూయార్క్: ఫేస్‌బుక్‌కు పోటీగా గూగుల్ సరికొత్త మెసేజింగ్ యాప్‌తో ముందుకు రాబోతోంది. దీనికోసం గూగుల్ సంస్థ దాదాపు ఏడాది కాలంగా తీవ్రంగా కసరత్తులు చేస్తోందని వాల్‌స్ట్రీట్ జర్నల్ బుధవారం తెలిపింది. గూగుల్ మెసేజింగ్ యాప్ 'హ్యాంగౌట్' ఆశించినంత మేర యూజర్లను ఆకట్లుకోకపోవటంతో గూగుల్ ఈ ప్రయత్నాన్ని ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఈ కొత్త మెసేజింగ్ యాప్‌లో ఫేస్‌బుక్‌ను తలదన్నేలా యూజర్లకు అన్నిరకాల ఫీచర్లను అందుబాటులోకి తేవాలని గూగుల్ భావిస్తోంది. ఇందుకోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్‌లో ఉండే ఫీచర్లను, వెబ్‌పేజ్ లింక్‌లు యూజర్లకు యాప్‌లో అందుబాటులో ఉండేలా గూగుల్ దీన్ని రూపొందిస్తోంది. ఇటీవలి మొబైల్ ఫేస్బుక్ లోని ఫీచర్ల కంటే అడ్వాన్స్‌గా గూగుల్ ఈ యాప్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తున్నా.. ఇది ఎప్పటికి అందుబాటులోకి రానుందనే విషయం మాత్రం తెలియరాలేదు. -
పోటీ తత్వమే నా విజయ రహస్యం
టూల్స్ పట్టిన క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్ చెన్నై, సాక్షి ప్రతినిధి: దశాబ్దానికి పైగా క్రీడామైదానంలో బ్యాట్ చేతపట్టి క్రికెట్ అభిమానులను అలరించిన సచిన్ టెండూల్కర్ టూల్స్ చేతపట్టి ఔరా అనిపించారు. చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల ప్లాంట్‌లో గురువారం సచిన్ సందడి చేశారు. నిర్మాణంలో ఉన్న ఒక కారుకు ఇంజిన్‌ను అమర్చి ఆనందించారు. ‘ఇది చిన్ననాటి నుంచి నా డ్రీమ్ కారు. అదే కారు ప్లాంట్‌కు తనను అతిథిగా ఆహ్వానించడం జీవితంలో తాను అందుకున్న ఒక గొప్ప బహుమతిగా భావిస్తున్నాను.’ అని సచిన్ అన్నారు. ‘తమ సంస్థ మరో సంస్థతో కలసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది, రాటుదేలిన క్రికెట్ వీరుడిగా ఎటువంటి సలహా ఇస్తారు.’ అని సచిన్‌ను బీఎండబ్ల్యూ ఎండీ రాబర్ట్ అడిగారు. ‘పోటీ తత్వంతో ప్రత్యర్థులను ఓడించాలి, అలాగే మైదానం నుంచి బైటకు వచ్చిన తరువాత ప్రత్యర్థికి తగిన గౌరవం ఇవ్వాలి. క్రికెట్ క్రీడాకారుడిగా ఇదే నా విజయ రహస్యం.’ అని సచిన్ బదులిచ్చారు.