మీరు వేసిన డూడుల్‌..గూగుల్‌లో..! | The 2019 Doodle Theme For Google Contest | Sakshi
Sakshi News home page

మీరు వేసిన డూడుల్‌..గూగుల్‌లో..!

Published Tue, Aug 20 2019 7:21 PM | Last Updated on Tue, Aug 20 2019 8:36 PM

The 2019 Doodle Theme For Google Contest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని గూగుల్‌.. ఈ ఏడాది భారతీయ చిన్నారుల కోసం డూడుల్‌ పోటీ నిర్వహిస్తోంది. ‘నేను పెరిగి పెద్దవాడినయ్యేటప్పటికి నేను ఆశిస్తుంది.. అనే థీమ్‌తో  ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులు ఎంట్రీస్‌ పంపాలని గూగుల్‌ ఆహ్వానిస్తోంది. ఉదాహరణకు ఎగరగలిగే షూస్? కాలుష్యరహిత ప్రపంచం, చందమామపై మానవ జీవితం తదితర అంశాలను విద్యార్థులు స్కెచ్‌ లేదా పెయింటింగ్‌లో అందంగా చిత్రీకరించాలి.

అంతేకాకుండా ప్రతి గూగుల్‌ డూడుల్‌పై ఉన్నట్లే వారి పెయింటింగ్‌పై గూగుల్‌ అని ఉండాల్సిందిగా తెలిపింది. విద్యార్థులు వారి థీమ్‌ను డూడుల్‌ ఎంట్రీ ఫారమ్‌తో కొరియర్‌ లేదా ఆన్‌లైన్‌ doodles.google.co.in/d4g ద్వారా పంపించాలని పేర్కొంది. దరఖాస్తులు పంపడానికి చివరి గడువు సెప్టెంబర్‌ 30. ఈ పోటీలో గెలుపొందిన విజేతకు రూ. 5 లక్షల  ఉపకారవేతనం, ఆ విద్యార్థి పాఠశాలకు రూ.2 లక్షల సాంకేతిక ప్యాకేజీతో పాటు మరిన్ని బహుమతులను గూగుల్‌ సంస్థ ఇవ్వనుంది. అంతేకాకుండా ఈ పోటీలో గెలుపొందిన విజేత ఆర్ట్‌ను గూగుల్‌ డాట్‌ కామ్‌లో డూడుల్‌గా ఉపయోగించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement