పోటీ తత్వమే నా విజయ రహస్యం
- టూల్స్ పట్టిన క్రికెట్ వీరుడు సచిన్ టెండూల్కర్
చెన్నై, సాక్షి ప్రతినిధి: దశాబ్దానికి పైగా క్రీడామైదానంలో బ్యాట్ చేతపట్టి క్రికెట్ అభిమానులను అలరించిన సచిన్ టెండూల్కర్ టూల్స్ చేతపట్టి ఔరా అనిపించారు. చెన్నైలోని బీఎండబ్ల్యూ కార్ల ప్లాంట్‌లో గురువారం సచిన్ సందడి చేశారు. నిర్మాణంలో ఉన్న ఒక కారుకు ఇంజిన్‌ను అమర్చి ఆనందించారు. ‘ఇది చిన్ననాటి నుంచి నా డ్రీమ్ కారు. అదే కారు ప్లాంట్‌కు తనను అతిథిగా ఆహ్వానించడం జీవితంలో తాను అందుకున్న ఒక గొప్ప బహుమతిగా భావిస్తున్నాను.’ అని సచిన్ అన్నారు.
‘తమ సంస్థ మరో సంస్థతో కలసి పనిచేసేందుకు సిద్ధమవుతోంది, రాటుదేలిన క్రికెట్ వీరుడిగా ఎటువంటి సలహా ఇస్తారు.’ అని సచిన్‌ను బీఎండబ్ల్యూ ఎండీ రాబర్ట్ అడిగారు. ‘పోటీ తత్వంతో ప్రత్యర్థులను ఓడించాలి, అలాగే మైదానం నుంచి బైటకు వచ్చిన తరువాత ప్రత్యర్థికి తగిన గౌరవం ఇవ్వాలి. క్రికెట్ క్రీడాకారుడిగా ఇదే నా విజయ రహస్యం.’ అని సచిన్ బదులిచ్చారు.