న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల సంఖ్య 200 కోట్లకు చేరింది. ప్రపంచ జనాభాలో ఇది సుమారు 25 శాతం. వాట్సాప్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపింది. ప్రతీ వ్యక్తిగత మెసేజీకి పూర్తి స్థాయిలో గోప్యత ఉండేలా ఎప్పటికప్పుడు తమ ప్లాట్‌ఫాంను సురక్షితంగా తీర్చిదిద్దుతున్నట్లు సంస్థ వివరించింది. గతేడాది జూలై గణాంకాల ప్రకారం వాట్సాప్‌నకు భారత్‌లో 40 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment