ఫేస్‌బుక్ స్నేహం ప్రమాదకరం
హైస్కూల్ స్థాయి విద్యార్థి సైతం ఫేస్‌బుక్ వినియోగిస్తున్నాడంటే యూజర్లు ఏ సంఖ్యలో ఉన్నా రో అర్థమవుతుంది. చదువుకంటే ముందు దీనికి బాని సగా మారు తూ ఫేస్‌బుక్ అకౌంట్ లేకుంటే చిన్నతనంగా భావించే వారున్నారంటే అతిశయోక్తి కాదు. తీరిక దొరికినప్పుడల్లా కంప్యూటర్, సెల్‌ఫోన్‌లలో ఫేస్‌బుక్ చాటిం గ్‌లు చేస్తూ గంటల తరబడి వాటికే అతుక్కుపోతున్నారు యువతీ యువకులు. ఈ తరహ లోకంలో ఎందరో అపరిచిత వ్యక్తులు తారసపడుతున్నారు. వారితో చాటింగ్, పోస్టు లు, లైకులు చేస్తూ స్నేహం పెంచుకుంటున్నారు. ఇలాంటి పరిచయాలు కొందరి జీవి తాలను చీకట్లోకి నెట్టేస్తున్నాయి. తీయటి పలుకుతో వచ్చే సందేశాలకు యువతీ యువకులు వారి మాయలోపడి అనవసరంగా ఇబ్బందుల్లో పడుతున్నారు. దీనికితోడు బినా మీ అకౌంట్‌లతో ఫేస్‌బుక్ క్రియేట్ చేసి అశ్లీల చిత్రాలు, సెలబ్రేటీలు, ప్రముఖల ఫొటోలను మార్ఫింగ్ చేసి అపలోడ్ చెయ్యడంతో కొందరికి తెలియని కష్టాలు వచ్చిపడుతున్నాయి. పైశాచిక ఆనందంతో అలా చేసేవారెవరో తెలి యకపోగా అమాయకులు అడ్డంగా బుక్ అవుతున్నారు.
న్యూఢిల్లీ : మారిన సాంకేతిక విప్లవంలో వింత ప్రపంచం లాంటి ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్ అకౌంట్‌లతో మునిగి తేలుతున్న వారికి వయస్సుతో పనిలేదనిపిస్తుంది. చిన్నా పెద్దా తేడా లేకుండా ఫేస్‌బుక్ అకౌం ట్ కలి గి ఉండడమే ఇందుకు నిదర్శనం. ప్రస్తుత పరిస్థితుల్లో విరివిగా విస్తరించిన సోషల్ నెట్‌వర్క్‌గా ఫేస్‌బుక్ ప్రాచుర్యం పొందింది. తమకు నచ్చిన అంశాన్ని స్నేహితులతో పంచుకోవడం, నచ్చిన చిత్రాలను, సందేశాలను పోస్ట్ చేయడం. ఆ తరువాత వాటికి ఎన్ని లైక్‌లు, షేర్ లు, కామెంట్‌లు వచ్చాయో చూసుకోవడం పరిపాటయింది. కళాశాలల, పాఠశాలల విద్యార్థులే కాదు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఫేస్ బుక్‌తో నిత్యం బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఎక్కడ చూసినా, సందర్భమేదైనా ఫేస్‌బుక్ చర్చలే కనిపిస్తున్నాయి. సోషల్ నెట్‌వర్క్ ఎంత ఫేమస్ అంటే చాలామంది మొబైల్‌ఫోన్లనో ఫేస్‌బుక్ అకౌంట్‌లు ఉంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే సంఘటన క్షణాల్లో నేడు సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. ఏమూల ఏం జరుగుతోందో తెలుసుకోవాలన్న ఆత్రుత అందరినీ ఫేస్‌బుక్ వైపు మళ్ళిస్తోంది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో యువత ఫేస్‌బుక్ ద్వారా చేసుకున్న చాటింగ్‌లు ఘర్షణలకు దారితీయడం, ఒకరి పార్టీని ఒకరు విమర్శించుకుంటూ తగవులు పెట్టుకోవడం మనకు తెలిసిందే. ఇంటర్ విద్యార్థినితో ఓ ఆకతాయి చేసిన చాటింగ్ ఆ యువతి ఇల్లు విడిచి వచ్చేలా చేసింది. దీంతో కుటుంబ తగాదాలు చోటు చేసుకున్నాయి.
తల్లిదండ్రులు దృష్టి సారించాలి
సమాచార సేకరణకు, విజ్ఞానాన్ని పెంచుకునేందుకు ఫేస్‌బుక్ ఉపయోగిస్తే ఆదో విజ్ఞాన గని అవుతుంది. అలాకాకుండా టైంపాస్‌కు వాడుకుంటే పలు అనర్థాలకు దారి తీస్తుందని పలువురు విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించా లి. తమ పిల్లలు కంప్యూటర్, ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌లతో ఏంచేస్తున్నా రు. వాటిని ఏవిధంగా వాడుతున్నారనే దానిపై దృష్టిసారించాలి. అడగ్గానే ఇంటర్ విద్యార్థికి కూడా తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొని చేతి లో పెడుతున్నారు. ఫోన్‌లలో గేమ్‌లాడుతున్నామని చెప్పి ఎక్కువ సమ యం ఫేస్‌బుక్ చాటింగ్‌లు చేస్తుంటారు.. వాటిని గమనించాలి. పిల్లల స్నేహాలు, పరిచయాలు, ప్రవర్తనలపై ఎప్పటికప్పుడు గమనించాలి. లేదంటే చెడు వ్యసనాలకు బానిసలయ్యే ప్రమాదం ఉంది.
ఆఫర్‌లతో హోరెత్తిస్తున్న ఆపరేటర్‌లు
వినియోగదారుల వాడకాన్ని దృష్టిలో పెటుకుని వివిధ కంపెనీలకు చెందిన సెల్‌ఫోన్ ఆపరేటర్‌లు ఇంటర్‌నెట్, ఫేస్‌బుక్‌ల అకౌంట్‌ల కోసం ప్రత్యేక ఆఫర్‌లు అందిస్తున్నారు. ఆఫర్‌లు కూడా ఎక్కువగా రాత్రి సమయంలో వినియోగించుకునే విధంగా ఉంటున్నాయి. కొన్ని నెట్‌వర్‌కలు ఒక్క రూపాయితో రాత్రి ఫేస్‌బుక్, రూ.12 లతో అర్ధరాత్రి దాటిన తరువాత అన్‌లిమిటెడ్ ఇంటర్‌నెట్ సదుపాయాలు కల్పిస్తున్నాయి. ఇవన్నీ యువతకోసమేనంటూ ప్రచారం చేస్తున్నాయి.
బినామీపేర్లతో అకౌంట్లు ఎన్నో...
కొందరు బినామీ పేర్లతో అకౌంట్‌లు తెరుస్తున్నారు. వీటిలో అమ్మా యిల పేర్లు, ఫొటోలతో అకౌంట్‌లు ఎక్కువగా ఉంటున్నాయి. రిక్వెస్ట్ లతో ఫ్రెండ్‌షిప్‌లు పెంచుకుని వారితో చాటింగ్ చేస్తారు. ఒకరికి ఒక రు తెలియక పోయినా రిక్వెస్ట్‌లతో వేలసంఖ్యలో ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ పెరి గిపోతారు. ఈ క్రమంలోనే అశ్లీల చిత్రాలు అప్‌లోడ్ చెయ్యడం దగ్గర నుంచి వ్యక్తిగత కామెంట్‌లతో మెసేజ్‌లు పెడుతున్నారు. ముఖ్యంగా సెలబ్రేటీలు, ప్రజాప్రతినిధుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేయ డం, ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అందరికీ మెసేజ్‌ను ఫార్వర్డ్ చేయడం వంటి చర్యలతో పైశాచిక ఆనందం పొందు తున్నా రు. ఒక ఫేస్‌బుక్ అకౌంట్‌కు ఫ్రెండ్స్‌గా ఉన్న వారందరికి ఈ మెసేజ్ లేదా చిత్రాలు అప్‌లోడ్ అవుతాయి. వీటన్నింటినీ బినామీ అకౌంట్‌ల నుంచి పంపుతున్నారు.
వీటివల్ల వచ్చే సమస్యల్లో చిక్కు కుని అమా యకులు కేసుల్లో ఇరు క్కుని చట్టానికి చిక్కుతున్నారు. సైబర్ నేరాల గురించి తెలియని అమాయకులు ఫేస్‌బుక్‌లో ఫొటోలు పెట్టు కుంటే వాటిని డౌన్‌లోడ్ చేసి కామెంట్‌లతో అప్‌లోడ్ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు నిత్యం ఏదో ఒకచోట చోటుచేసుకోవడం చూస్తున్నాం. ఈ సంఘట నలు వెలుగులోకి వచ్చి కేసుల వరకూ వెళితే గాని బినా మీల సంగతి బయటకు రావడంలేదు. పోలీస్‌ల దర్యాప్తుల్లో నేరాలకు పాల్పడ్డవారిని గుర్తించి ఫేస్‌బుక్ అకౌంట్ గురించి ఆరాతీస్తే అసలు ఫేస్‌బుక్ అంటే తెలియని అమాయకుల వివరాలు బయటపడుతున్నాయి. ఎక్కువగా నెట్ సెంటర్‌కు వెళ్లి చాటింగ్ చేసేవారు బినామీ అకౌంట్‌లు క్రియేట్ చేసి అమాయకులను ఇరికిస్తున్నారు.