సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యపై వస్తున్న ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. అటు రాజకీయ వర్గాలు, ఇటు జిల్లా ప్రజల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యవహారంపై రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. కాగా, ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మంగళవారం స్పందించారు. తనపై కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని, బురద జల్లేందుకే కొందరు సోషల్ మీడియా వేదికగా కుట్రలు చేశారని ఆరోపించారు.
వారి వివరాలను బయటపెడతానని స్పష్టం చేశారు. మూడు రోజులుగా సోషల్ మీడియా లో యువతుల కోసం చాటింగ్ పేరుతో వైరలైన ఫొటోలతో తనకు సంబంధంలేదని తెలిపారు. డెయిరీ విస్తరణ కోసం ఎమ్మెల్యేగా పిలిస్తే వెళ్లానని, అంతకుమించి తనకు ఏం తెలియదన్నారు. బాధిత రైతులు నిర్వాహకులపై కేసులు పెట్ట గా, కొందరు కావాలనే తనపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు.
డెయిరీ నిర్వాహకులపై ఆంధ్రప్రదేశ్‌లో గతంలోనే పలుచోట్ల కేసులు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేశారని డెయిరీలో పనిచేసిన ఓ ఉద్యోగి, పలువురు రైతులు నిర్వాహకులపై ఆరోపణలు చేశా రు. కాగా, డెయిరీ భాగస్వామి షెజల్ మంగళవారం మరో వీడియోను విలేకరులకు విడుదల చేశారు. ‘మేం బ్లాక్‌మెయిల్ చేస్తున్నామంటున్నారు, ఇంతటి తో ఆపేస్తే ఆయనకు మంచిది, లేదంటే నిజాల్ని బయటపెడతా’ అని వీడియోలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment