
శృతి (ఫైల్)
తల్లి ఫోన్‌ను లాక్కొని ఎవరితో చాటింగ్ చేస్తున్నావని ప్రశ్నించి మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శృతి..
శంకరపల్లి (చేవెళ్ల): ఫోన్‌లో చాటింగ్ చేస్తున్నావని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఒంటికి నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన శంకర్‌పల్లి మండలంలోని కొండకల్‌లో చోటు చేసుకుంది. సీఐ లింగయ్య కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన శృతి(20) శనివారం ఉదయం తన మొబైల్ ఫోన్‌తో ఇతరులతో చాటింగ్ చేయసాగింది. ఈ విషయం గమనించిన తల్లి పుణ్యవతి ఫోన్‌ను లాక్కొని ఎవరితో చాటింగ్ చేస్తున్నావని ప్రశ్నించి మందలించింది.
దీంతో మనస్తాపం చెందిన శృతి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్ని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమె మృతిచెందింది. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ప్లోఈసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.