![hyderabad: Ex Manager Misbehaves Chatting Whatsapp Interview Girl Jubilee Hills - Sakshi](/styles/webp/s3/article_images/2021/04/28/women2.jpg.webp?itok=OpfddPES)
సాక్షి, బంజారాహిల్స్: ఉద్యోగం కావాలంటే ఓయో రూమ్‌కు రావాలంటూ ఓ ఉద్యోగి అసభ్యంగా చాటింగ్ చేశాడని బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుడిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌కు చెందిన యువతి(28) వారం క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెం.36లోని ఓ ఇమ్మిగ్రేషన్ సంస్థలో ఉద్యోగానికి హాజరైంది.
ఇక్కడ పని చేస్తున్న మాజీ మేనేజర్ సుమంత్ మూడ్రోజుల క్రితం ఆమెతో చాటింగ్‌లో చేయసాగాడు. ఓయో రూమ్ బుక్ చేశానని ఉద్యోగం అక్కడే ఇస్తానంటూ చెప్పాడు. ఆందోళన చెందిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు ఇమ్మిగ్రేషన్ సెంటర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సుమంత్‌పై పోలీసులు ఐపీసీ 509 సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
( చదవండి: మహిళ ఫిర్యాదు.. యాంకర్ శ్యామల భర్త అరెస్ట్ )
Comments
Please login to add a commentAdd a comment