వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో ప్రైస్‌లెస్ చాటింగ్! | Free chatting with wireless communication | Sakshi
Sakshi News home page

వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో ప్రైస్‌లెస్ చాటింగ్!

Published Sat, Aug 31 2013 12:48 AM | Last Updated on Thu, Jul 26 2018 5:21 PM

వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో ప్రైస్‌లెస్ చాటింగ్! - Sakshi

వైర్‌లెస్ కమ్యూనికేషన్‌లో ప్రైస్‌లెస్ చాటింగ్!

మన కమ్యూనికేషన్ వైర్ లెస్... దీన్ని ప్రైస్ లెస్‌గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. టెక్ట్స్, ఆడియో, వీడియో... ఏ రూపంలోనైనా సరే... మూడు మిక్స్ చేసి అయినా సరే... ఉచితంగా కమ్యూనికేట్ అవ్వడానికి చాలా సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయమున్న స్మార్ట్ డివైజ్ చేతిలో ఉండాలి కానీ.. స్నేహితులతో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు. సెల్‌ఫోన్ బిల్లును తగ్గించేసుకోవచ్చు! ఈ సదుపాయాన్ని కలిగించే స్మార్ట్‌ఫోన్ కమ్ పీసీ అప్లికేషన్లివి...
 
 చాలా మందికి స్కైప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. అయితే దీన్ని అందరూ ఉపయోగించట్లేదు. కొందరు తెలియక, మరి కొందరికి తీరిక లేక! కోట్లాది ఫేస్‌బుక్ అకౌంట్స్ ఉన్న మన దేశంలో ఈ స్కైప్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే. ప్రత్యేకంగా స్కైప్ అకౌంట్ లేకపోయినా, కేవలం స్కైప్ అప్లికేషన్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్‌బుక్ ఫ్రెండ్స్‌తో వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. అయితే.. మన వాళ్ల దగ్గర వెబ్‌క్యామ్ సదుపాయం సరిగా లేకపోవడం స్కైప్ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని అంటున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్‌లు వాడుతున్న వారు మాత్రం స్కైప్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఉచితంగా వీడియో చాటింగ్ ముచ్చట తీర్చుకుంటున్నారు. కేవలం సదుపాయ కోణంలో మాత్రమే కాదు.. ఎగ్జైట్‌మెంట్ విషయంలో కూడా స్కైప్ వీడియో చాటింగ్ మంచి కిక్ ఇస్తుంది!
 
 మొబైల్స్ కోసం వియ్‌చాట్...
 భిన్నమైన మొబైల్ ప్లాట్‌పామ్స్ మీద పనిచేస్తుంది ఈ అప్లికేషన్. లైవ్‌చాట్, గ్రూప్‌చాట్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియన్, విండోస్‌ఫోన్‌లపై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది.
 దీంట్లోని ‘షేక్’ ఫీచర్ ద్వారా కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
 
 పీసీ అయినా స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్స్..
 జీమెయిల్ లేదా, గూగుల్‌ప్లస్ ద్వారా ఈ హ్యాంగౌట్‌ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్‌క్యామ్ ఉన్న పీసీ అయినా, ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే స్కైప్, వుయ్ చాట్‌ల కన్నా గూగుల్ హ్యాంగౌట్ వెనుకపడింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ విషయంలో 2.3 జింజర్ బ్రీడ్ ఆ తర్వాతి మోడళ్లపై ఇది పనిచేస్తుంది. ఐఫోన్‌ల విషయంలో ఐఓఎస్6 ఆ తర్వాతి మోడళ్లపై పనిచేస్తుంది.
 
 రీచార్జ్ అవసరం లేకుండా చేసే టాంగో...
 మొబైల్ ద్వారా ఫ్రీ కాల్స్ చేసుకోవడానికున్న మరో అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా వీడియో, వాయిస్ కాల్స్, టెక్ట్స్, ఫోటో షేరింగ్‌కు అవకాశం ఉంటుంది.
 
 ఫ్రింగ్ తో ఫోన్‌కాల్స్ ఫ్రీ...
 ఫ్రీగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అవకాశమిచ్చే మరో ఉచిత అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా గరిష్టంగా నలుగురి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉంటుంది.
 
 ఫోన్ నంబర్‌తో అకౌంట్.. వైబర్
 ఈ అప్లికేషన్ ద్వారా ప్రత్యేకమైన అకౌంట్ ఏదీ లేకుండానే ఫ్రీ ఛాటింగ్ చేసుకోవచ్చు. వైబర్‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ నంబర్ ద్వారానే అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మిగతా నంబర్‌లలో వేటికైనా వైబర్ అకౌంట్ ఉంటే  అవన్నీ ఆటోమెటిక్‌గా యాడ్ అవుతాయి. ఇవేకాదు...
 ఇంకా ఉన్నాయి..
 నింబజ్ , వాట్స్ అప్, హైక్.. తదితరాలు కూడా
 ఉచిత కాలింగ్, టెక్ట్స్ మెసేజింగ్, వీడియో చాటింగ్ విషయాల్లో సదుపాయవంతమైన అప్లికేషన్స్‌గా ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement