Wireless communication
-
6జీ టెక్నాలజీపై నోకియా డెమో.. అదిరిపోయే ఫీచర్లు
న్యూదిల్లీలో జరుగుతున్న ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2023లో కంపెనీలు 5జీ, 6జీ టెక్నాలజీలను ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా నోకియా 6జీటెక్నాలజీకు సంబంధించి డెమో ఇచ్చింది. కంపెనీ వార్షిక టెలికాం టెక్నాలజీ ఫోరమ్‌లో 6జీ కనెక్టివిటీ, ర్యాపిడ్ రైల్ ఎన్సీఆర్టీసీ, ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్, చంద్రునిపై 4జీ/LTE నెట్వర్క్ వంటి సెన్సింగ్ టెక్నాలజీలతో పాటు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్, ఎక్స్టెండెడ్ రియాలిటీ (ఎక్స్ఆర్), బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ పై ఆధారపడే మెటావర్స్ ఇంటెలిజెంట్ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ సాంకేతికతలపై డెమో ప్రదర్శించింది. నోకియా ప్రదర్శించిన 6జీ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా వినియోగదారులకు వారి పరిసరాల గురించి, అక్కడి పరిస్థితులపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సెన్సింగ్ టెక్నాలజీ వినియోగదారుల గోప్యతను కాపాడుతుందని, రాడార్ లాగా పనిచేస్తుందని, వ్యక్తులు, వస్తువులు వాటి కదలికలను పసిగట్టగలదని నోకియా చెబుతుంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఎన్సీఆర్టీసీ) దిల్లీ నుంచి మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కోసం ఒక ప్రైవేట్ వైర్లెస్ నెట్‌వర్క్‌ను కూడా ప్రదర్శించింది. దీన్ని ఫ్రెంచ్ సంస్థ అయిన అల్స్టోమ్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఎల్టీఈ/ 4.9జీ ప్రైవేట్ వైర్లెస్ నెట్వర్క్. నాసా ప్రోత్సాహంతో చంద్రునిపై మొట్టమొదటి సెల్యులార్ 4జీ/ఎల్టీఈ నెట్వర్క్ని ఆవిష్కరించేందుకు నోకియా బెల్ ల్యాబ్స్ ఇంటూటివ్ మెషీన్స్, లూనార్ అవుట్‌పోస్ట్‌తో జతకట్టింది. భూమిపై ఉన్న స్మార్ట్ఫోన్లను కనెక్ట్ చేయడానికి ఉపయోగించే అదే సెల్యులార్ సాంకేతికతను భవిష్యత్తులో చంద్రుడితో అనుసంధానం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
10 సెకన్లలో 60 జీబీని పంపారు!
బెర్లిన్: వైర్లెస్ సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా వేగంగా పంపించడంలో జర్మన్ శాస్త్రవేత్తలు కొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. జర్మనీలోని స్టట్గార్ట్ వర్సిటీ, ఫ్రాన్హోఫర్ ఇన్స్టిట్యూట్కు చెందిన అప్లయిడ్ సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ విభాగానికి చెందిన పరిశోధక బృందం ఈ రికార్డును సాధించారు. జర్మనీలోని వాచ్బెర్గ్ టౌన్‌కు కొలొగ్నె కు మధ్య దూరం 36.7 కి.మీటర్లు. ఈ బృందం రెండుప్రాంతాలకు 60 గిగాబైట్ల సమాచారాన్ని రేడియో తరంగాల ద్వారా కేవలం 10 సెకన్లలో పంపింది. అంటే సెకనుకు 6 గిగాబైట్లా సమాచారాన్ని పంపించారు. ఇందుకు ఈ-బ్యాండుగా పిలిచే 71-76 గిగా హెట్జ్ రేడియో ఫ్రిక్వెన్సీలో ఈ సమాచారాన్ని అందించి ప్రపంచ రికార్డు నెలకొల్పారు. భవిష్యత్తులో పల్లెల్లోనూ వేగవంతమైన ఇంటర్నెట్ సేవల్ని అందుబాటులోకి తీసుకురావచ్చని పరిశోధకులంటున్నారు. 250 ఇంటర్నెట్ కనెక్షన్లు ఒక సెకనుకు 24 మెగాబైట్ల సమాచారాన్ని పంపగల్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు. -
ఎంటెక్ (వైర్‌లైస్ కమ్యూనికేషన్) కోర్సులు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇండస్ట్రియల్ ఇం జనీరింగ్ -ముంబై, ఆఫర్ చేసే కోర్సులేవి? -ప్రశాంతి, హైదరాబాద్. ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు పెంచడంతోపాటు ఉత్పాదకత, వ్యాపార అభివృద్ధిని మెరుగుపరచడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్ఐటీఐఈ)ను స్థాపించారు. ఈ సంస్థ ఆఫర్ చేసే కోర్సులు.. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్: ఇందులో ఆపరేషన్స్ మేనేజ్మెంట్, ఐటీ అండ్ సిస్టమ్స్, సప్లై చైన్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి అంశాలను బోధిస్తారు. అర్హత: బీఈ/బీటెక్. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్: ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్, ఐటీ అండ్ సిస్టమ్స్ వంటి అంశాలుంటాయి. క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్: వ్యాపార నిర్వహణపై పర్యావరణ, సాంఘిక, ఆర్థిక ప్రభావాలను మేనేజీరియల్, టెక్నికల్ దృష్టి కోణంలో అవగాహన చేసుకోవడానికి కావల్సిన అంశాలను బోధిస్తారు. అర్హత: బీఈ/బీటెక్. క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు:www.nitie.edu ఎంటెక్ (వైర్‌లైస్ కమ్యూనికేషన్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -రామకృష్ణ, వైజాగ్. మొబైల్ ఫోన్ రంగంలో భారతదేశం శరవేగంగా విస్తరిస్తోంది. వైఫై, బ్లూటూత్, 3జీ/4జీ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో ఈ రంగం రూపు రేఖలు మారిపోతున్నాయి. అంతే స్థాయిలో ఈ రంగంలో పని చేయడానికి కావల్సిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. కాబట్టి సంబంధిత కోర్సులను పూర్తి చేసిన వారికి మొబైల్ ఫోన్ సిస్టమ్ ఇంజనీర్, మొబైల్ అప్లికేషన్స్ డెవలపర్, మొబైల్ ఆర్కిటెక్ట్, గేమ్ డెవలపర్, మొబైల్ ప్లాంట్ ఎక్విప్మెంట్ మెకానిక్,టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, మొబైల్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా అవకాశాలు ఉంటాయి. ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఐఐఐటీ-అలహాబాద్ వెబ్సైట్: www.iiita.ac.in జేఎన్టీయూ-హైదరాబాద్ వెబ్సైట్: www.jntuh.ac.in బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మెస్రా వెబ్సైట్: www.bitmesra.ac.in వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వెల్లూరు వెబ్సైట్: www.vit.ac.in ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ వివరాలను తెలపండి? -రవీందర్, బోధన్. బయోఇన్ఫర్మాటిక్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కని ఇన్స్టిట్యూట్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ (ఐబీఏబీ). బయోఇన్ఫర్మాటిక్స్ రంగంలో భారత ప్రభుత్వ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ‘ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఐబీఏబీకు గుర్తింపు ఉంది. ఈ ఇన్స్టిట్యూట్ను కర్ణాటక ప్రభుత్వం 2001లో బెంగళూరులో స్థాపించింది. ఐబీఏబీ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు.. ఎంఎస్సీ (బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ). ఈ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ మైసూరు అందిస్తుంది. అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఈ/బీఎస్సీ/ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ/బీఫార్మసీ/బీఏఎంస్. ప్రవేశం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా (ప్రస్తుతం ఎంఎస్సీ కోర్సుకు నోటిఫికేషన్ వెలువడింది. దరఖాస్తుకు చివరి తేదీ: మే 17, 2014.) పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్ పీజీ డిప్లొమా ఇన్ లేబొరేటరీ మాడ్యూలర్ కోర్సులు (కెమ్ఇన్ఫర్మాటిక్స్, జెనోమిక్స్) పీహెచ్డీ (ఈ డిగ్రీని మణిపాల్ యూనివర్సిటీ అందిస్తుంది) వివరాలకు: www.ibab.ac.in బీకామ్ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలను తెలపండి? -మహేష్, గద్వాల్. బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ (హెచ్ఆర్ఎం). వీటిల్లో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. మేనేజ్‌మెంట్‌వైపు ఆసక్తి ఉంటే ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. ప్రస్తుత సాంకేతిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కీలకమే. ఈ క్రమంలో అకౌంటింగ్‌కు సంబంధించిన పలు సాఫ్ట్వేర్ ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ట్యాలీ 9.0 (www.tallysolutions. com), వింగ్స్ (www.wingsinfo.net), పీచ్ట్రీ ((www.peachtreefinancial.com) వంటివి. బ్యాచిలర్, పీజీ కోర్సులకు అనుబంధంగా ఈ కోర్సులను నేర్చుకుంటే జాబ్ మార్కెట్లో అదనపు అర్హతగా నిలుస్తాయి. సొంతంగా ట్యాక్స్ ప్రాక్టీషనర్లుగా స్థిరపడాలనుకున్న వారికి కూడా ఈ ప్యాకేజ్‌లు ఎంతో ప్రయోజనకరం. అంతేకాకుండా నేషనల్ కమెడిటిస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, సెబీ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, బజాబ్ క్యాపిటల్ వంటి సంస్థలు ఆఫర్ చేసే యాడ్ ఆన్ కోర్సులను చేయడం కూడా కెరీర్ పరంగా ప్రయోజనకరం. కామర్స్ గ్రాడ్యుయేట్లకు న్యాయశాస్త్రంలోనూ పట్టా ఉంటే ఎన్నో అవకాశాలు సొంతమవుతాయి. అంతేకాకుండా చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్) కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. -
వైర్లెస్ కమ్యూనికేషన్లో ప్రైస్‌లెస్ చాటింగ్!
మన కమ్యూనికేషన్ వైర్ లెస్... దీన్ని ప్రైస్ లెస్‌గా చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. టెక్ట్స్, ఆడియో, వీడియో... ఏ రూపంలోనైనా సరే... మూడు మిక్స్ చేసి అయినా సరే... ఉచితంగా కమ్యూనికేట్ అవ్వడానికి చాలా సదుపాయాలున్నాయి. ఇంటర్నెట్ సదుపాయమున్న స్మార్ట్ డివైజ్ చేతిలో ఉండాలి కానీ.. స్నేహితులతో ఉచితంగా చాటింగ్ చేసుకోవచ్చు. సెల్‌ఫోన్ బిల్లును తగ్గించేసుకోవచ్చు! ఈ సదుపాయాన్ని కలిగించే స్మార్ట్‌ఫోన్ కమ్ పీసీ అప్లికేషన్లివి... చాలా మందికి స్కైప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.. అయితే దీన్ని అందరూ ఉపయోగించట్లేదు. కొందరు తెలియక, మరి కొందరికి తీరిక లేక! కోట్లాది ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్న మన దేశంలో ఈ స్కైప్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువే. ప్రత్యేకంగా స్కైప్ అకౌంట్ లేకపోయినా, కేవలం స్కైప్ అప్లికేషన్‌ను ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఫేస్బుక్ ఫ్రెండ్స్‌తో వీడియో చాటింగ్ చేసుకోవచ్చు. అయితే.. మన వాళ్ల దగ్గర వెబ్‌క్యామ్ సదుపాయం సరిగా లేకపోవడం స్కైప్ వినియోగం తక్కువగా ఉండటానికి ఒక కారణమని అంటున్నారు నిపుణులు. ల్యాప్‌టాప్‌లు వాడుతున్న వారు మాత్రం స్కైప్‌ను విస్తృతంగా వాడుతున్నారు. ఉచితంగా వీడియో చాటింగ్ ముచ్చట తీర్చుకుంటున్నారు. కేవలం సదుపాయ కోణంలో మాత్రమే కాదు.. ఎగ్జైట్మెంట్ విషయంలో కూడా స్కైప్ వీడియో చాటింగ్ మంచి కిక్ ఇస్తుంది! మొబైల్స్ కోసం వియ్‌చాట్... భిన్నమైన మొబైల్ ప్లాట్పామ్స్ మీద పనిచేస్తుంది ఈ అప్లికేషన్. లైవ్‌చాట్, గ్రూప్‌చాట్, వీడియో కాలింగ్ చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్, బ్లాక్‌బెర్రీ, సింబియన్, విండోస్ఫోన్లపై ఈ అప్లికేషన్ పనిచేస్తుంది. దీంట్లోని ‘షేక్’ ఫీచర్ ద్వారా కొత్త ఫ్రెండ్స్‌ను సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. పీసీ అయినా స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్స్.. జీమెయిల్ లేదా, గూగుల్‌ప్లస్ ద్వారా ఈ హ్యాంగౌట్‌ను ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్‌క్యామ్ ఉన్న పీసీ అయినా, ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ అయినా గూగుల్ హ్యాంగౌట్‌ను సపోర్ట్ చేస్తుంది. అయితే స్కైప్, వుయ్ చాట్ల కన్నా గూగుల్ హ్యాంగౌట్ వెనుకపడింది. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ విషయంలో 2.3 జింజర్ బ్రీడ్ ఆ తర్వాతి మోడళ్లపై ఇది పనిచేస్తుంది. ఐఫోన్ల విషయంలో ఐఓఎస్6 ఆ తర్వాతి మోడళ్లపై పనిచేస్తుంది. రీచార్జ్ అవసరం లేకుండా చేసే టాంగో... మొబైల్ ద్వారా ఫ్రీ కాల్స్ చేసుకోవడానికున్న మరో అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా వీడియో, వాయిస్ కాల్స్, టెక్ట్స్, ఫోటో షేరింగ్‌కు అవకాశం ఉంటుంది. ఫ్రింగ్ తో ఫోన్‌కాల్స్ ఫ్రీ... ఫ్రీగా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి అవకాశమిచ్చే మరో ఉచిత అప్లికేషన్ ఇది. ఈ అప్లికేషన్ ద్వారా గరిష్టంగా నలుగురి వీడియో కాన్ఫరెన్స్‌కు అవకాశం ఉంటుంది. ఫోన్ నంబర్‌తో అకౌంట్.. వైబర్ ఈ అప్లికేషన్ ద్వారా ప్రత్యేకమైన అకౌంట్ ఏదీ లేకుండానే ఫ్రీ ఛాటింగ్ చేసుకోవచ్చు. వైబర్ను ఇన్స్టాల్ చేసుకుంటే మీ మొబైల్ నంబర్ ద్వారానే అకౌంట్ క్రియేట్ అవుతుంది. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఉన్న మిగతా నంబర్లలో వేటికైనా వైబర్ అకౌంట్ ఉంటే అవన్నీ ఆటోమెటిక్‌గా యాడ్ అవుతాయి. ఇవేకాదు... ఇంకా ఉన్నాయి.. నింబజ్ , వాట్స్ అప్, హైక్.. తదితరాలు కూడా ఉచిత కాలింగ్, టెక్ట్స్ మెసేజింగ్, వీడియో చాటింగ్ విషయాల్లో సదుపాయవంతమైన అప్లికేషన్స్‌గా ఉన్నాయి.