ఎంటెక్ (వైర్‌లైస్ కమ్యూనికేషన్) కోర్సులు..
ఎంటెక్ (వైర్‌లైస్ కమ్యూనికేషన్) కోర్సులు..
Published Thu, Apr 10 2014 12:54 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM
టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఇండస్ట్రియల్ ఇం జనీరింగ్ -ముంబై, ఆఫర్ చేసే కోర్సులేవి?
-ప్రశాంతి, హైదరాబాద్.
ఇంజనీరింగ్ విద్యార్థుల్లో వినూత్న ఆలోచనలు పెంచడంతోపాటు ఉత్పాదకత, వ్యాపార అభివృద్ధిని మెరుగుపరచడానికి అవసరమైన నైపుణ్యాలను అందించే ఉద్దేశంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ (ఎన్‌ఐటీఐఈ)ను స్థాపించారు. ఈ సంస్థ ఆఫర్ చేసే కోర్సులు..
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్: ఇందులో ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్, ఐటీ అండ్ సిస్టమ్స్, సప్లై చైన్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్ వంటి అంశాలను బోధిస్తారు. అర్హత: బీఈ/బీటెక్. గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం.
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ మేనేజ్‌మెంట్: ఇందులో ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్ అండ్ సప్లై చైన్ మేనేజ్‌మెంట్, ఐటీ అండ్ సిస్టమ్స్ వంటి అంశాలుంటాయి. క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ అండ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్: వ్యాపార నిర్వహణపై పర్యావరణ, సాంఘిక, ఆర్థిక ప్రభావాలను మేనేజీరియల్, టెక్నికల్ దృష్టి కోణంలో అవగాహన చేసుకోవడానికి కావల్సిన అంశాలను బోధిస్తారు. అర్హత: బీఈ/బీటెక్. క్యాట్ స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. వివరాలకు:www.nitie.edu
ఎంటెక్ (వైర్‌లైస్ కమ్యూనికేషన్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లేవి? -రామకృష్ణ, వైజాగ్.
మొబైల్ ఫోన్ రంగంలో భారతదేశం శరవేగంగా విస్తరిస్తోంది. వైఫై, బ్లూటూత్, 3జీ/4జీ వంటి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీలతో ఈ రంగం రూపు రేఖలు మారిపోతున్నాయి. అంతే స్థాయిలో ఈ రంగంలో పని చేయడానికి కావల్సిన మానవ వనరుల అవసరం పెరుగుతోంది. కాబట్టి సంబంధిత కోర్సులను పూర్తి చేసిన వారికి మొబైల్ ఫోన్ సిస్టమ్ ఇంజనీర్, మొబైల్ అప్లికేషన్స్ డెవలపర్, మొబైల్ ఆర్కిటెక్ట్, గేమ్ డెవలపర్, మొబైల్ ప్లాంట్ ఎక్విప్‌మెంట్ మెకానిక్,టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్, మొబైల్ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్‌గా అవకాశాలు ఉంటాయి.
ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఐఐఐటీ-అలహాబాద్
వెబ్‌సైట్: www.iiita.ac.in
జేఎన్‌టీయూ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.jntuh.ac.in
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మెస్రా
వెబ్‌సైట్:
www.bitmesra.ac.in
వెల్లూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-వెల్లూరు
వెబ్‌సైట్: www.vit.ac.in
ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ వివరాలను తెలపండి?
-రవీందర్, బోధన్.
బయోఇన్ఫర్మాటిక్స్ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే వారికి చక్కని ఇన్‌స్టిట్యూట్ ది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ (ఐబీఏబీ). బయోఇన్ఫర్మాటిక్స్ రంగంలో భారత ప్రభుత్వ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం ‘ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’గా ఐబీఏబీకు గుర్తింపు ఉంది. ఈ ఇన్‌స్టిట్యూట్‌ను కర్ణాటక ప్రభుత్వం 2001లో బెంగళూరులో స్థాపించింది. ఐబీఏబీ ఆఫర్ చేస్తున్న కోర్సుల వివరాలు..
ఎంఎస్సీ (బయోఇన్ఫర్మాటిక్స్ అండ్ అప్లయిడ్ బయోటెక్నాలజీ). ఈ డిగ్రీని యూనివర్సిటీ ఆఫ్ మైసూరు అందిస్తుంది.
అర్హత: 50 శాతం మార్కులతో బీటెక్/బీఈ/బీఎస్సీ/ఎంబీబీఎస్/బీడీఎస్/బీవీఎస్సీ/బీఫార్మసీ/బీఏఎంస్.
ప్రవేశం:
రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా
(ప్రస్తుతం ఎంఎస్సీ కోర్సుకు నోటిఫికేషన్ వెలువడింది.
దరఖాస్తుకు చివరి తేదీ:
మే 17, 2014.)
పీజీ డిప్లొమా ఇన్ బయోఇన్ఫర్మాటిక్స్
పీజీ డిప్లొమా ఇన్ లేబొరేటరీ
మాడ్యూలర్ కోర్సులు (కెమ్‌ఇన్ఫర్మాటిక్స్, జెనోమిక్స్)
పీహెచ్‌డీ (ఈ డిగ్రీని మణిపాల్ యూనివర్సిటీ అందిస్తుంది)
వివరాలకు: www.ibab.ac.in
బీకామ్ తర్వాత అందుబాటులో ఉన్న అవకాశాలను తెలపండి?
-మహేష్, గద్వాల్.
బీకామ్ తర్వాత పీజీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌తో ఎంకామ్ పూర్తి చేయవచ్చు. అవి.. ఫైనాన్స్, అకౌంటింగ్, టాక్సేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్, ఇన్సూరెన్స్, మార్కెటింగ్, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్ (హెచ్‌ఆర్‌ఎం). వీటిల్లో ప్రస్తుతం ఫైనాన్స్, అకౌంటింగ్ స్పెషలైజేషన్స్‌కు మంచి డిమాండ్ ఉంది. మేనేజ్‌మెంట్‌వైపు ఆసక్తి ఉంటే ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ వంటి కోర్సులను ఎంచుకోవచ్చు. ప్రస్తుత సాంకేతిక యుగంలో కంప్యూటర్ పరిజ్ఞానం కూడా కీలకమే. ఈ క్రమంలో అకౌంటింగ్‌కు సంబంధించిన పలు సాఫ్ట్‌వేర్ ప్యాకేజ్‌లు అందుబాటులో ఉన్నాయి. అవి.. ట్యాలీ 9.0 (www.tallysolutions. com), వింగ్స్ (www.wingsinfo.net), పీచ్‌ట్రీ ((www.peachtreefinancial.com) వంటివి. బ్యాచిలర్, పీజీ కోర్సులకు అనుబంధంగా ఈ కోర్సులను నేర్చుకుంటే జాబ్ మార్కెట్లో అదనపు అర్హతగా నిలుస్తాయి. సొంతంగా ట్యాక్స్ ప్రాక్టీషనర్లుగా స్థిరపడాలనుకున్న వారికి కూడా ఈ ప్యాకేజ్‌లు ఎంతో ప్రయోజనకరం. అంతేకాకుండా నేషనల్ కమెడిటిస్ అండ్ డెరివేటివ్స్ ఎక్స్ఛేంజ్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్, సెబీ , నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, బజాబ్ క్యాపిటల్ వంటి సంస్థలు ఆఫర్ చేసే యాడ్ ఆన్ కోర్సులను చేయడం కూడా కెరీర్ పరంగా ప్రయోజనకరం. కామర్స్ గ్రాడ్యుయేట్లకు న్యాయశాస్త్రంలోనూ పట్టా ఉంటే ఎన్నో అవకాశాలు సొంతమవుతాయి. అంతేకాకుండా చార్టర్డ్ అకౌంటెన్సీ (సీఏ), కాస్ట్ అండ్ మేనేజ్‌మెంట్ అకౌంటెన్సీ (సీఎంఏ), కంపెనీ సెక్రటరీషిప్ (సీఎస్) కోర్సులను కూడా ఎంచుకోవచ్చు.
Advertisement