సాక్షి, హైదరాబాద్: మైనర్ బాలికతో అసభ్యంగా చాటింగ్ చేసిన ఘటనలో రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలానికి చెందిన యువకుడిపై మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. విచారణ ప్రారంభించిన భోపాల్ పోలీసులు శనివారం రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం గంగన్నగూడ గ్రామానికి చెందిన సాయినాథ్‌రెడ్డిని అరెస్టు చేశారు. భోపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివాసముండే ఓ మైనర్ బాలికకు సాయినాథ్‌రెడ్డి నకిలీ ఫేస్‌బుక్ ఖాతా నుంచి అసభ్యకర మెసేజ్‌లు పెడుతున్నాడు. దీంతో సదరు బాలిక అక్టోబర్‌లో అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
(చదవండి: తోబుట్టువుల మధ్య పెళ్లి ఆమోదయోగ్యం కాదు:హైకోర్టు)
పోలీసులు ఫేస్‌బుక్ చాటింగ్ ఆధారంగా విచారణ చేపట్టగా, కొందుర్గు మండలం ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన ఓ బాలిక ఫేస్‌బుక్ ఐడీ నుంచి మెసేజ్‌లు వస్తున్నట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన బాలికను విచారించగా.. తన ఫేస్‌బుక్ ఖాతాను సాయినాథ్‌రెడ్డి సాయంతో తెరిచానని చెప్పడంతో శనివారం పోలీసులు సాయినాథ్‌రెడ్డిని అరెస్టు చేసి భోపాల్ తీసుకెళ్లారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుపుతామని వారు తెలిపారు. కాగా తనను అనుమానిస్తున్నారని భావించిన ఉత్తరాసిపల్లి గ్రామానికి చెందిన బాలిక శనివారం శానిటైజర్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం శంషాబాద్ లీమ్స్ ఆస్పత్రికి తరలించారు.
(చదవండి: భార్య నగ్న వీడియోలు యూట్యూబ్‌లో..)
Comments
Please login to add a commentAdd a comment