
వెన్నెల మృతదేహం
మారేడుపల్లి : వాట్సాప్ చాటింగ్ కారణంగా కుటుంబాల్లో నెలకొన్న వివాదం ఇద్దరి ఆత్మహత్యకు దారితీసిన సంఘటన మారేడుపల్లి, వాల్మీకినగర్‌లో చోటు చేసుకుంది. మారేడుపల్లి సీఐ శ్రీనివాసులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వాల్మీకినగర్‌కు చెందిన వెన్నెల (19, సంజీవయ్యనగర్‌కు చెందిన శివకుమార్ చిన్ననాటి స్నేహితులు. శివకుమార్‌కు గత ఆగస్టు 15న లహరి అనే యువతితో వివాహం జరిగింది. అతను తరచూ వెన్నెలతో వాట్సాప్‌లో ఛాటింగ్ చేస్తున్నట్లు గుర్తించిన లహరి భర్తను నిలదీసింది.
దీంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో మనస్తాసానికిలోనైన శివకుమార్ శనివారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయంతెలియడంతో వెన్నెల అదేరోజు సాయంత్రం యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందింది. వెన్నెల తండ్రి రాములు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడి మరణాన్ని తట్టుకోలేకనే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇరువురి మృతితో వాల్మీకినగర్, సంజీవయ్యనగర్‌లలో విషాధ ఛాయలునెలకొన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment