హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం హెల్ప్‌లైన్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. మరోవైపు వర్షాల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నిటిని దారి మళ్లించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వద్ద రైల్వే ట్రాక్పై వరద నీరు చేరటంతో సికింద్రాబాద్-హౌరా మధ్య నడిచే 13 రైళ్లను దారి మళ్లించారు.
ఫలక్‌నామా, షాలిమర్ ఎక్స్‌ప్రెస్, హౌరామెయిల్, చెన్నె మెయిల్ రైళ్లు విజయవాడ మీదుగా దారి మళ్లించగా,పలు రైళ్లను పలాస వరకూ నడిపిస్తున్నారు.ఇక విశాఖ-భువనేశ్వర్ ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-భువనేశ్వర్ విశాఖ ఎక్స్ప్రెస్, తిరుపతి-పూరి ఎక్స్ప్రెస్ పలాస వరకు..భువనేశ్వర్-బెంగళూరు ఎక్స్ప్రెస్ అంగుల్, కిట్లాగర్, విజయనగరం, విశాఖ మీదుగా దారి మళ్లించారు.
విజయవాడ హెల్ప్‌లైన్ నంబర్ 0866 2575 038
రాజమండ్రి హెల్ప్‌లైన్ నంబర్ 0883 2420 780