
అంగన్‌వాడీల వేతనాన్ని పెంచకపోవడం దారుణం
అంగన్‌వాడీల వేతనాన్ని పెంచకపోవడం దారుణం
కలెక్టరేట్ (మచిలీపట్నం) :
. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహారదీక్ష బుధవారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. రఘు మాట్లాడుతూ నిత్యావసర ధరలు పెరుగుతున్నా అంగన్‌వాడీ కార్యకర్తలకు వేతనాలు పెంచకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తలకు కనీస వేతనం రూ. 10వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్‌సీహెచ్ శ్రీనివాస్ మాట్లాడుతూ అంగన్‌వాడీ కార్యకర్తల పరిష్కారం కోసం ఉద్యమ ప్రణాళిక రూపొందించి పోరా టాలు చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోందన్నారు. దీక్ష సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ వెంకటేశ్వరరావు, అంగన్‌వాడీ వర్క ర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుప్రజ, కార్యకర్తలు పి రజీనారాణి, భవానీ, గజ లక్ష్మి, జి కస్తూరి, జి మార్గరేట్, సీహెచ్ నాంచారమ్మ పాల్గొన్నారు. నిరాహారదీక్షకు సంఘీభావంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు తరలివచ్చారు.