వెబ్ ఆప్షన్లకు రెడీ | Web options will | Sakshi
Sakshi News home page

వెబ్ ఆప్షన్లకు రెడీ

Published Sun, Aug 17 2014 12:22 AM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM

వెబ్ ఆప్షన్లకు రెడీ - Sakshi

వెబ్ ఆప్షన్లకు రెడీ

  •     నేటి నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు వెబ్ కౌన్సెలింగ్
  •      జిల్లాలో మూడు హెల్ప్‌లైన్ సెంటర్లు
  •      ప్రతి కేంద్రంలో నాలుగు సిస్టమ్స్ ఏర్పాటు
  • ఎంసెట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు ఆదివారం నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. విద్యార్థులు నచ్చిన కళాశాలలను ఎంపిక చేసుకునే అవకాశం వచ్చింది. ఈ నెల 17 నుంచి ఇంటర్నెట్‌లో తమ ఆప్షన్లను నమోదు చేసుకోవచ్చు. దీనికి సంబంధించి కంచరపాలెం పాలిటెక్నిక్ కళాశాల, ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో నాలుగు కంప్యూటర్ సిస్టమ్‌లను ఇందు కోసం ఏర్పాటు చేశారు. వెబ్ ఆప్షన్లపై ఇప్పటికే అధికారులు శిక్షణ తరగతులు నిర్వహించారు. అవకాశం ఉంటే ఇంటి వద్దే ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చు. - విశాఖపట్నం
     
     సైట్‌లోని ప్రవేశించండిలా..

     ముందుగా hhttps://eamcet. nic.inవెబ్‌సైట్ అడ్రస్‌ను టైప్ చేయాలి. ఇది కేవలం ఇం టర్నెట్ ఎక్స్‌ప్లోరర్ విండోస్-7 ఆపరేటింగ్ సిస్టమ్ వెర్షన్ 9.0లో మాత్రమే తెరుచుకుంటుంది. అడ్రస్ టైప్ చేయగానే హోమ్ పేజీ వస్తుంది.
    ఇందులో 8 రకాల వివరాలు ఉంటాయి. హెల్ లైన్ కేంద్రాల వివరాలు, కోర్సుల జాబితా, జిల్లాల వారీగా కళాశాలలు వివరాలు, 2013లో ఎంసెట్ కౌన్సెలింగ్‌లో కటాఫ్ ర్యాంకుల వివరాలు లభ్యమవుతాయి. వీటిని తెరిచి మనం సమాచారం పొందాలి. ప్రతి కళాశాల, జిల్లాకు ప్రత్యేక కోడ్ నంబర్ ఇంగ్లీషు షార్ట్‌ఫామ్‌లో ఉంటుంది. వీటిని మనం నోట్ చేసుకుంటే మాన్యువల్ ఆప్షన్ ఫారం నింపడానికి సులువవుతుంది.
     
    ఆప్షన్ల నమోదు

    హోమ్ పేజీకి వెళ్లి క్యాండిడేట్స్ లాగిన్ వద్ద క్లిక్ చేయగానే ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇందులో క్యాండిడేట్‌కు కేటాయించిన లాగిన్ ఐడీ నంబరు, హాల్ టికెట్ నంబరు, పాస్‌వర్డు, పుట్టిన తేదీ టైప్‌చేసి సైన్ ఇన్ చేయాలి. వెంటనే మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. (లాగిన్ అవగానే మీకు ఓటీపీ (ఒన్‌టైమ్ పాస్‌వర్డు)నంబరు మీమొబైల్‌కు వస్తుంది.) మీరిప్పుడు టెక్ట్స్ బాక్స్‌లో ఓటీపీ నంబరు ఎంటర్ చేయాలి. దీన్ని కన్ఫ్‌ర్మ్ చేసి తర్వాత క్లిక్ హియర్ ‘ఆప్షన్ ఎంట్రీ ’వద్ద క్లిక్ చేయాలి. సెలెక్ట్ డిజైర్డ్ డిస్ట్రిక్ట్స్ అనే స్క్రీన్ వస్తుంది. ఇందులో రీజినల్ వెజ్ (ఏయూ, ఓయూ, ఎస్వీయూ) జిల్లాలు వస్తా యి. ఇప్పుడు మీకు నచ్చిన జిల్లాను సెలెక్ట్ చేసుకున్న వెంటనే అన్ని వివరాలు డిస్‌ప్లే అవుతాయి. అనంతరం ఆప్షన్ ఎంట్రీ ఫారం వద్ద క్లిక్ చేస్తే ఫారం వస్తుంది. ఇందులో అక్కడి కాలేజీలోని కోర్సులకు ప్రాధాన్యత క్రమంలో ఆప్షన్లు ఇవ్వాలి. మనం ఎంపిక చేసుకున్న  ప్రతి కోర్సుకు ప్రాధాన్య క్రమంలో నంబరు ఇవ్వాలి. ఇందుకోసం ముందుగానే మాన్యువల్ ఆప్షనల్ ఫారం నింపి ఉంచుకుంటే పని సులువవుతుంది.
         
    ఆప్షన్లు ఇచ్చినప్పుడు అయిదు నిమిషాలకోసారి సేవ్ చేయడం మర్చిపోవద్దు.
         
    మీరు చేసిన ప్రతిసారి ఎంసెట్ హాల్‌టికెట్ నంబరు అడుగుతుంది. దీన్ని టైప్ చేస్తేనే సేవ్ అవుతుంది.
     
    సరిచూసుకోండి
     
    మీరిచ్చిన ఆప్షన్లు సరిచూసుకోవడానికి వ్యూ అండ్ ప్రింట్ పై క్లిక్ చేయండి. అన్ని వివరాలు వస్తాయి. ఒకవేళ మార్చుకోవాలంటే వెనక్కి వెళ్లి మార్చుకోవాలి. ఇలాంటప్పుడు మార్చిన ప్రతిసారి సేవ్ చేసుకుంటూ పోవాలి. లేదంటే పాత ఆప్షన్లు ఉండిపోతాయి. అంతా సరిగా ఉందని నిర్ధారించుకున్న తర్వాత సేవ్ అనంతరం కన్‌ఫర్మ్ చేసి లాగ్ అవుట్ చేయాలి. ఇక్కడితో ఐచ్ఛికాల ఎంపిక నమోదు ప్రక్రియ పూర్తవుతుంది. ఒక్కసారి కన్‌ఫర్మ్ చేసి లాగవుట్ అయిన తర్వాత మళ్లీ మార్పులు చేసే వీలు ఉండదు. దీన్ని అందరూ గమనించాలి.
     
    లాగిన్ ఐడీ

    ప్రతి అభ్యర్థికి ఒక లాగి న్ ఐడీ కేటాయిస్తారు. ఇది చాలా ముఖ్యమైనది. మనం దీన్ని మర్చిపోకూడదు. పాస్ వర్డు సేవ్ అయిన వెంటనే మీకొక లాగిన్ ఐడీ మీ మొబైల్‌కు పంపిస్తారు. దీని ద్వారా మనం లాగిన్ అవ్వొచ్చు.
     
    సీట్ల కేటాయింపు
     
    సీట్ల కేటాయింపు వివరాలు ఎప్పటికప్పుడు వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు. మీ మొబైల్‌కు కూడా వివరాలు వస్తాయి. క్యాండిడేట్ లాగిన్ ఆప్షన్ ద్వారా సీటు కేటాయింపు ఆర్డరును డౌన్‌లోడ్ చేసుకుని ఫీజు ఆంధ్రా బ్యాంకు, ఇండియన్ బ్యాంకుల్లో చెల్లించుకోవచ్చు. మెరిట్ అభ్యర్థికి ఇచ్చిన ఆప్షన్ కేటాయింపు అనంతరం ఆ తర్వాతి ర్యాంకర్‌కు సీటు కేటాయిస్తారు.
     
    గమనిక
     
    ఆప్షన్లు ఇవ్వడానికి ముందుగా లాగిన్ ఐడీ రాకపోతే ఎంసెట్ స్పేస్ 01 స్పేస్ హాల్ టికెట్ నంబరు టైప్ చేసి మీ మొబైల్ ద్వారా 87904 99899కి మెసేజ్ పెడితే లాగిన్ ఐడీ పంపిస్తారు. ఒక వేళ పాస్‌వర్డ్ మర్చిపోతే లాగిన్ అయినప్పుడు ఫర్‌గెట్ పాస్‌వర్డ్ వద్ద క్లిక్ చేసి కొత్త పాస్‌వర్డు ఎంటర్ చేసుకోవచ్చు. మీ పాస్‌వర్డ్ ఎవ్వరికి తెలియనివ్వకూడదు.
     
    హెల్ప్‌లైన్ కేంద్రాలు
     
    కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ వద్ద ఇందుకోసం నాలుగు సిస్టమ్స్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ కళాశాల, నర్సీపట్నం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఇందుకోసం హెచ్‌ఎల్‌సీలు ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని కేటాయించారు. వెబ్ ఆప్షన్‌లో సందేహాలు ఉన్నవారు  ఈ కేంద్రాలకు వెళ్లి నమోదు చేసుకోవచ్చని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సంధ్యారాణి, కెమికల్ ఇంజిజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.దేముడు చెప్పారు.  
     
    పాస్‌వర్డ్ క్రియేషన్

    రెండో స్టెప్‌లో పాస్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఇది వెబ్ ఆప్షన్ ప్రక్రియలో అత్యంత కీలకమైనది. ఇందుకోసం హోమ్‌పేజీలోని అడ్రస్ బార్‌లో క్యాండిడేట్స్ రిజిస్ట్రేషన్ వద్ద క్లిక్ చేస్తే స్లాట్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీరు ధ్రువపత్రాల పరిశీలన సమయంలో పొందిన రశీదులో ఉన్న రిజిస్ట్రేషన్ నంబరు, ఎంసెట్ హాల్‌టికెట్ నంబరు, ర్యాంకు, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ‘జెనరేషన్ పాస్‌వర్డ్’ అనే సూచన వద్ద క్లిక్ చేయాలి. అప్పుడు మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఇందులో మీకు నచ్చిన పాస్‌వర్డ్ ఎంటర్ చేయాలి. పాస్‌వర్డ్‌లో ఆంగ్ల అక్షరాలతో పాటు అంకెలు కూడా వాడాలి. కనీసం 8 క్యారక్టర్స్ ఉండాలి. మ్యాగ్జిమమ్ పది క్యారెక్టర్స్ ఉపయోగించాలి. దీన్ని మళ్లీ రీఎంటర్ పాస్‌వర్డ్‌లో నమోదు చేయాలి. మొబైల్ నంబరు తప్పనిసరి. ఇది కూడా వె రిఫికేషన్ సమయంలో ఇచ్చినదై ఉండాలి. ఈ-మెయిల్ ఉంటే నమోదు చేసి సేవ్‌పాస్‌వర్డ్ అనే కమాండ్ వద్ద క్లిక్ చేయాలి. ఇప్పుడు లాగవుట్ అవ్వాలి. తర్వాత హోమ్ పేజీకి వెళ్లాలి.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement