బిహారీలను కాపాడిన పోలీసులు | nellore police helps to bihar youth in structed floods | Sakshi
Sakshi News home page

బిహారీలను కాపాడిన పోలీసులు

Published Wed, Dec 2 2015 3:46 PM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM

nellore police helps to bihar youth in structed floods

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో వరద నీళ్లలో చిక్కుకున్న బిహార్ యువకులను స్థానిక పోలీసులు రక్షించారు. దొరవారిసత్రం మండలం పోలిరెడ్డిపాళెం రైల్వే స్టేషన్‌లో వరదల కారణంగా చప్రా ఎక్స్‌ప్రెస్ రైలును బుధవారం మధ్యాహ్నం నిలిపివేశారు.

రైలులో ప్రయాణిస్తున్న నలుగురు బిహారీ యువకులు రైలు దిగి నీళ్లలో నడుచుకుంటూ వస్తుండగా ఒక్కసారిగా వరదనీళ్లు రావడంతో అందులో చిక్కుకున్నారు. దారి తెలియక ఇబ్బందిపడుతున్న వారిని అటుగా వెళ్తున్న దొరవారిసత్రం ఎస్‌ఐ సుబ్బారావు, పోలీసులు గమనించి వెంటనే యువకులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో రైల్లోని ప్రయాణికులు కాపాడిన పోలీసులను అభినందించారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement