కిటకిట లాడిన ఎంసెట్ హెల్ప్‌లైన్ కేంద్రాలు | EAMCET indulges helpline centers | Sakshi
Sakshi News home page

కిటకిట లాడిన ఎంసెట్ హెల్ప్‌లైన్ కేంద్రాలు

Published Tue, Sep 2 2014 2:05 AM | Last Updated on Thu, Jul 25 2019 5:24 PM

EAMCET indulges helpline centers

గుంటూరు ఎడ్యుకేషన్
 ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో తమకు లభించిన సీట్లను ధ్రువీకరించుకునేందుకు విద్యార్థులు సోమవారం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో  హెల్ప్‌లైన్ కేంద్రాలు కిటకిటలాడాయి. గత నెలలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన ఎంసెట్ ర్యాంకర్లకు రాష్ట్ర ఉన్నత మండలి శనివారం సీట్లు కేటాయించింది.
 
 ఈ క్రమంలో ఇంజినీరింగ్ కళాశాలలో పొందిన తమ సీటును ధ్రు వీకరించుకునేందుకు విద్యార్థులు సోమవారం జిల్లాలోని నాలుగు హెల్ప్ లైన్ కేంద్రాలకు వచ్చారు.  ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ రాత్రి 7 గంటల వరకూ కొనసాగింది. దీనికి జిల్లాలో మొత్తం 1,804 మంది విద్యార్థులు హాజరయ్యారు.
 
 ఎంసెట్‌లో ఒకటి నుంచి 50 వేల మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్థులను అలాట్‌మెంట్ ఆర్డర్స్‌తో వచ్చి అడ్మిషన్ ధ్రువీకరించు కోవాలని ప్రకటించడంతో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని హెల్ప్‌లైన్ కేంద్రాలకు తరలివచ్చారు.
 
 సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన హెల్ప్‌లైన్ కేంద్రానికి అలాట్‌మెంట్ ఆర్డర్‌తో హాజరుకావాలని అధికారులు స్పష్టం చేసినప్పటికీ విద్యార్థులు గుంటూరులోని గుజ్జనగుండ్ల, సాంబశివపేటలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వెళ్లారు.
 
 ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఫీజు రీ-యింబర్స్‌మెంట్ రూ. 35 వేలకు పైబడి ఫీజును చలానా రూపంలో చెల్లించాల్సి ఉండటంతో విద్యార్థులు హడావుడిగా బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. ఆ తరువాత తిరిగి వచ్చి తమ వంతు కోసం గంటల కొద్దీ ఎదురుచూశారు.
 
 రాత్రి 7 గంటల వరకూ కొనసాగిన అడ్మిషన్ ధ్రువీకరణ ప్రక్రియకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 491 మం ది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 413 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 550 మం ది, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 350 మంది హాజరయ్యారు.
 
 నేడు 50,001 నుంచి
 లక్ష వరకూ హాజరు కావాలి..
 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం ధ్రువీకరణకు హాజరుకావాల్సి ఉంది. గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన హెల్ప్‌లైన్ కేంద్రంలోనే తిరిగి హాజరుకావాలని ఆయా కేంద్రాల కో-ఆర్డినేటర్లు తెలిపారు.
 
 పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి
 పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ల ధ్రువీకరణ ప్రక్రి య సోమవారం ముగిసింది. చివరి రోజు  గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేం ద్ర ంలో 588 మంది, నల్లపాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో 600 మంది విద్యార్థులు హాజరయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement