EAMCET Ranks
-
ఎంసెట్‌లో మెరిసిన పల్లె కుసుమాలు
హుజూరాబాద్ : తెలంగాణ విద్యాశాఖ శనివారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో హుజూరాబాద్ విద్యార్థులు రాష్ట్ర్రస్థాయి ర్యాంకులు సా«ధించి మండలానికి పేరు తెచ్చారు. మండలంలోని బోర్నపల్లి గ్రామానికి చెందిన మండల అభిషేక్ 783 ర్యాంక్ సాధించగా, పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన బోయినపల్లి అనూప్‌రావు 910 ర్యాంక్ సాధించాడు. ఎంసెట్‌లో రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులిద్దరూ గ్రామీణ ప్రాంతానికి చెందినవారు కావడం విశేషం. పట్టణంలోని మాంటిస్సోరి ఇంగ్లిష్ మీడియం పాఠశాల్లో పదో తరగతి పూర్తి చేసి.. ఉన్నత చదవుల కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో విద్యనభ్యసించారు. రాష్ట్రస్థాయిలో ర్యాంకు సాధించి భవిష్యత్తులో ఏ కావాలనుకుంటున్నారో వారి మాటల్లోనే.. తల్లిదండ్రుల సహకారంతోనే అధ్యాపకులు, తల్లిదండ్రులు సహాదేవ్–వసంత సహకారంతో ఎంసెట్‌లో 783 రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించాను. భవిష్యత్తులో మరెన్నో విజయాలు సాధించి మంచి ఇంజినీర్‌గా పేరు తెచ్చుకోవాలని ఉంది. – మండల అభిషేక్, 783 ర్యాంక్ మెకానికల్ ఇంజినీర్ లక్ష్యం అధ్యాపకులు, తల్లిదండ్రులు ఉమాపతిరావు–నవ్యశ్రీ సూచనలు అనుసరిస్తూ 910 రాష్ట్రస్థాయి ర్యాంక్ సాధించా. మెకానికల్ ఇంజినీర్‌గా రాణించి దేశానికి సేవలందించాలని భావిస్తున్నాను. – బోయినపల్లి అనుప్‌రావు, 910 ర్యాంక్ మొగిలిపేట విద్యార్థికి 813 ర్యాంకు మల్లాపూర్(కోరుట్ల): తెలంగాణ విద్యాశాఖ ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట విద్యార్థిని ర్యాగల్ల మనీషా అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 813 ర్యాంకు సాధించింది. మొగిలిపేటకు చెందిన ర్యాగల్ల వెంకటేశ్వర్–గౌతమి దంపతుల ఏకైక కుమార్తె మనీషా మెట్‌పల్లిలోని ప్రైవేటు పాఠశాలలో 10వ తరగతిలో 9.8 జీపీఏ, కరీంనగర్‌లోని అల్ఫోర్స్ కళాశాలలో ఇంటర్మీడియేట్‌లో భైపీసీలో 984 మార్కులతో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించింది. ఎంసెట్ ఫలితాల్లో మనీషా రాష్ట్రస్థాయిలో ప్రతిభను కనబర్చడంతో ఎంపీపీ బద్దం విజయ, జెడ్పీటీసీ దేవ ముత్తమ్మ, తహసీల్దార్ రాజేశ్వర్, ఎంపీడీవో వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంఈవో శ్రీనివాస్, ఎస్సై సతీశ్, ఆర్ఎస్ఎస్ జిల్లా సభ్యుడు దేవ మల్లయ్య, మండల అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ ఉసికెల మల్లవ్వ, ఎంపీటీసీ దండవేని వెంకవ్వ, ఉపసర్పంచ్ ఎనడ్ల రాములు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు హర్షం వ్యక్తంచేసి ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభచూపిన హర్షవర్ధ్దన్ మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి పట్టణానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ ఎల్మి ప్రదీప్ కుమారుడు హర్షవర్దన్ శనివారం ప్రకటించిన ఎంసెట్ ఫలితాల్లో ఇంజినీరింగ్ విభాగంలో 355 ర్యాంకు సాధించాడు. హర్షవర్దన్ 1 నుంచి 5 తరగతి వరకు స్థానిక జయ కాన్వెంట్ స్కూల్లో చదివాడు. 6 తరగతికి జవహర్ నవోదయకు ఎంపికయ్యాడు. అందులోనే 10 తరగతి వరకు చదివి అనంతరం హైదరాబాద్ నారాయణ కళాశాల నుంచి ఇంటర్ (ఎంపీసీ) పూర్తి చేశాడు. తర్వాత ఐఐటీ(జేఈఈ) ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యాడు. కొన్ని రోజుల క్రితం జేఈఈ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 1348 ర్యాంకు సాధించాడు. ప్రస్తుతం ఎంసెట్ ఫలితాల్లో 355 ర్యాంకు పొందాడు. ప్రతిభచూపిన హర్షవర్దన్‌ను పలువురు అభినందించారు. సత్తాచాటిన జైహింద్‌రెడ్డి మల్యాల (చొప్పదండి) : మల్యాల మండల కేంద్రానికి చెందిన నల్ల మహిపాల్‌రెడ్డి కుమారుడు నల్ల జైహింద్‌రెడ్డి ఎంసెట్‌లో 63 ర్యాంకు సాధించి సత్తాచాటాడు. ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చొప్పదండి నవోదయ పాఠశాలలో చదివిన జైహింద్ ఇంటర్మీడియేట్ హైదరాబాద్‌లో పూర్తిచేశాడు. ఎంసెట్‌లో ఉత్తమ ర్యాంకు సాధించడంతో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు నేళ్ల రాజేశ్వర్‌రెడ్డి అభినందించారు. -
15న ఎంసెట్ ర్యాంకులు!
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ర్యాంకులను ఈనెల 15వ తేదీన విడుదల చేసేందుకు ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 16వ తేదీన ర్యాంకులను విడుదల చేయాలని అనుకున్నా.. ప్రవేశాలు ఆలస్యం కాకుండా ఓ రోజు ముందే ఫలితాలు విడుదల చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కమిటీ విడుదల చేసిన రాత పరీక్ష ప్రాథమిక కీపై ఈనెల 14వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. అదే రోజు సాయంత్రం నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని ఖరారు చేయనున్నారు. ఆ ప్రకారం 15వ తేదీన తుది ర్యాంకులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించాలని, లేదంటే 16న విడుదల చేయాలని కమిటీ భావిస్తోంది. -
నేడు ఎంసెట్ ర్యాంకులు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు ఈనెల 26న విడుదల కానున్నాయి. సచివాలయంలో డీ బ్లాక్ కాన్ఫరెన్స్ హాల్లో ఉదయం 11 గంటలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఈ ర్యాంకులను విడుదల చేస్తారు. విద్యార్థులు తమ ర్యాంకులను www.sakshieducation.com, http://www.tseamcet.in సైట్లలో పొందవచ్చు. ఎంసెట్‌లో సాధించిన మార్కులు, ఇంటర్ మార్కులకు ఇచ్చే 25 % వెయిటేజీ కలిపి ఇచ్చే తుది ర్యాంకుల వివరాలను వెల్లడిస్తారు. ఈ నెల 15న జరిగిన ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కు 1,33,442 మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్ పరీక్షకు 89,792 మంది హాజరయ్యారు. కాగా జూన్ 9 లేదా 10న కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
ఈ నెల 27లోగానే ఎంసెట్ ర్యాంకులు
* జూన్ మొదటి వారంలో కౌన్సెలింగ్ * జూలై 1 నుంచి తరగతులు, జూలైలోనే స్లైడింగ్‌కు అవకాశం * ఉన్నత విద్యా మండలి చైర్మన్ప్రొఫెసర్ పాపిరెడ్డి వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో ప్రవేశాల కోసం ఈ నెల 15న జరిగే ఎంసెట్‌కు హాజరు కానున్న విద్యార్థులకు ర్యాంకులను ఈ నెల 27న ఇస్తామని ప్రకటించామని, వీలైతే అంతకంటే ముందుగానే ర్యాంకులను ప్రకటించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఎంసెట్ ఏర్పాట్లలో భాగంగా శనివారం మీడియా ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. జూన్ మొదటి వారంలోనే ప్రవేశాలకు కౌన్సెలింగ్ చేపడతామని, జూన్ 20 నాటికి మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లను పూర్తి చేసేలా షెడ్యూల్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జూలై 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో తరగతులను ప్రారంభిస్తామని, అలాగే సీట్లు పొందిన విద్యార్థులు తమ కాలేజీలు, ఆప్షన్లు మార్పు చేసుకునేందుకు చర్యలు చేపడుతున్నామని, జూలై మొదటి వారంలోనే విద్యార్థులకు స్లైడింగ్‌కు అవకాశం కల్పిస్తామన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని వసతులు కల్పించామని, అన్నీ పరిశీలించాకే ఎంసెట్ కేంద్రాలను ఏర్పాటు చేశామని వెల్లడిం చారు. వేసవి దృష్ట్యా కొన్ని కేంద్రాల్లో తాగునీటి సమస్య ఉన్నందున అన్ని కేంద్రాల్లో విద్యార్థులకు అర లీటర్ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రైవేటు కాలేజీల మెడ్‌సెట్ పరీక్షపై రెండు మూడు రోజుల్లో స్పష్టత వస్తుందని పాపిరెడ్డి తెలిపారు. సీబీఎస్ఈ విద్యార్థులకు పాయింట్ ర్యాంకులు సీబీఎస్ఈ సిలబస్‌లో చదివే విద్యార్థుల 12వ తరగతి ఫలితాలు.. ఎంసెట్ ర్యాంకులు ఇచ్చేనాటికి అందకపోతే ఆ తర్వాత వారికి పాయింట్ ర్యాంకులు ఇస్తామని ఎంసెట్ కమిటీ ప్రకటించింది. మే 30న సీబీఎస్ఈ విద్యార్థుల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అయితే అంతకంటే ముందే విద్యార్థుల ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ ఇచ్చి ఎంసెట్ ర్యాంకులను ప్రకటించేందుకు ఎంసెట్ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ విద్యార్థుల ఫలితాలు అప్పటికి రావు కాబట్టి వారికి పాయింట్ ర్యాంకులను ఇవ్వాలని నిర్ణయించింది. ఇక రాష్ట్రంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఆ ఫలితాలు వచ్చాక సప్లిమెంటరీ ర్యాంకులను ఇస్తామని కమిటీ వెల్లడించింది. ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్‌లు వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ఆలోచిస్తున్నామని జేఎన్టీయూ వైస్ చాన్స్‌లర్ శైలజా రామయ్యార్ పేర్కొన్నారు. అయితే కాలేజీల్లో నాణ్యత ప్రమాణాలపైనే ప్రధానంగా దృష్టి సారించామని, కాలేజీల వారీగా వసతులు, ఫ్యాకల్టీ వివరాలన్నీ విద్యార్థులు చూసుకునేలా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నట్లు వెల్లడించారు. -
జూలై 7 నుంచి ఇంజనీరింగ్ తరగతులు
ప్రవేశాలకు జూన్12న షెడ్యూల్ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్ తరగతులు ఈసారి జూలైలోనే ప్రారంభం కానున్నాయి. గత ఐదారేళ్లుగా ప్రవేశాల ప్రక్రియలో తీవ్ర జాప్యంతో తరగతులు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. కానీ ఈ ఏడాది మాత్రం జూలైలోనే తరగతుల ప్రారంభానికి ప్రభుత్వం పక్కాగా ప్రణాళికను రూపొందించింది. అందులో భాగంగానే ఎంసెట్ ర్యాంకులు వెల్లడించిన రోజునే ప్రవేశాల నోటిఫికేషన్‌ను కూడా జారీ చేసింది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం ఆగస్టు 1వ తేదీ నాటికి ఇంజనీరింగ్ తరగతులు ప్రారంభం కావాలి. అయితే అంతకన్నా ముందుగానే జూలై 7 నుంచే ఇంజనీరింగ్ తరగతుల ప్రారంభానికి సర్కారు చర్యలు చేపట్టింది. ఇందుకోసం జూన్ 12న ప్రవేశాల షెడ్యూల్‌ను జారీ చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. సీట్ల భర్తీ కోసం వెబ్ ఆప్షన్లలో పాత విధానాన్నే అమలు చేయనున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. వన్‌టైమ్ పాస్వర్డ్ విధానం ఉంటుందని.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసుకున్నపుడే విద్యార్థులు తమ మొబైల్ నంబర్ ఇవ్వాలని చెప్పారు. విద్యార్థులు వెబ్సైట్లోకి లాగిన్ అయిన ప్రతిసారి కొత్త పాస్వర్డ్ వస్తుంది. ప్రవేశాల షెడ్యూల్ జూన్ 12న ప్రవేశాలకు నోటిఫికేషన్ 18 నుంచి 24 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 20 నుంచి 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం 27న ఆప్షన్లలో మార్పులకు అవకాశం 30న సీట్ల కేటాయింపు జూలై 7 నుంచి తరగతుల ప్రారంభం 9 నుంచి 14 వరకు చివరిదశ కౌన్సెలింగ్ 21 నుంచి చివరి దశ తరగతులు -
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు విడుదల
హైదరాబాద్ : తెలంగాణలో ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గురువారం హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉదయం 11.30 గంటలకు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను విడుదల చేశారు. 85.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మెడిసిన్ లో 85.98, ఇంజినీరింగ్ లో 70.65 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేశారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇవ్వగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు. విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా విడుదల చేశారు. -
నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు
-
నేడు తెలంగాణ ఎంసెట్ ర్యాంకులు
* విడుదల చేయనున్న కడియం శ్రీహరి * ఇంటర్ వార్షిక పరీక్షల మార్కుల వెయిటేజీతో ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ర్యాంకులను గురువారం విడుదల చేయనున్నట్లు సెట్ కన్వీనర్ ప్రొ. ఎన్వీ రమణరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న జరిగిన ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ర్యాంకులను హైదరాబాద్ జేఎన్టీయూ ఆడిటోరియంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి విడుదల చేస్తారని వెల్లడించారు. విద్యార్థులు ఇంటర్మీడియెట్‌లో సాధించిన మార్కులకు 25 శాతం వెయిటేజీ కలిపి ఈ ర్యాంకులను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇందులో విద్యార్థుల ర్యాంకులతోపాటు ఎంసెట్‌లో సాధించిన మార్కులను కూడా ఇవ్వనున్నట్లు వివరించారు. ఇంజనీరింగ్ కూ 1,28,174 మంది, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్‌కు 84,678 మంది పరీక్ష రాశారు. ప్రస్తుతం ఇంటర్ వార్షిక పరీక్షల్లో విద్యార్థులు సాధించిన మార్కులకు వెయిటేజీ కలిపి ర్యాంకులను ఇస్తుండగా, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు వేరుగా ర్యాంకులను ఇస్తారు. ఫలితాల కోసం www.sakshieducation.com www.tseamcet.in www.results.cgg.gov.in -
పాత పద్ధతిలోనే ఎంసెట్ ర్యాంకులు: కడియం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28న విడుదల చేయనున్న ఎంసెట్ తుది ర్యాంకులను పాత పద్ధతిలోనే వెల్లడిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇంటర్ మార్కులకు వెయిటేజీనిచ్చాకే తుది ర్యాంకులను ఖరారు చేస్తామన్నారు. టెన్త్ ఫలితాలను విడుదల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈసారి ఏపీలో ఇంటర్ ఫలితాలు పెరిగినందున జేఈఈ మెయిన్ తరహాలో పర్సంటైల్ నార్మలైజేషన్ విధానంలో ఎంసెట్ తుది ర్యాంకులను ఖరారు చేయాలన్న డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో ఈ మేరకు స్పష్టతనిచ్చారు. ఎంసెట్‌ను కొనసాగించేదీ లేనిదీ తర్వాత ఆలోచిస్తామన్నారు. ‘ఎంసెట్ వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు కౌన్సెలింగ్ ద్వారా తమకు నచ్చిన కాలేజీని ఎంచుకునే విధానం ఉంది. ఎంసెట్ లేకపోతే ఇది సాధ్యం కాదు. మరోవైపు రాష్ట్రంలో ఇంజనీరింగ్ సీట్ల కంటే ఎంసెట్‌లో అర్హత సాధిస్తున్న విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. కాబట్టి ఇంజనీరింగ్‌కు ఎంసెట్ అవసరమా అన్న వాదనలు ఉన్నాయి. దీనిపై తర్వాత ఆలోచిస్తాం. తెలంగాణ యూనివర్సిటీ యాక్ట్ ప్రస్తుతం సీఎం పరిశీలనలో ఉంది. త్వరలోనే నిర్ణయం వెలువడుతుంది. ఆ తర్వాత వర్సిటీలకు వైస్ఛాన్స్లర్లను నియమిస్తాం’ అని చెప్పారు. -
కిటకిట లాడిన ఎంసెట్ హెల్ప్‌లైన్ కేంద్రాలు
గుంటూరు ఎడ్యుకేషన్ ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కళాశాలల్లో తమకు లభించిన సీట్లను ధ్రువీకరించుకునేందుకు విద్యార్థులు సోమవారం పెద్ద సంఖ్యలో తరలిరావడంతో హెల్ప్‌లైన్ కేంద్రాలు కిటకిటలాడాయి. గత నెలలో జరిగిన సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ కౌన్సెలింగ్‌కు హాజరైన ఎంసెట్ ర్యాంకర్లకు రాష్ట్ర ఉన్నత మండలి శనివారం సీట్లు కేటాయించింది. ఈ క్రమంలో ఇంజినీరింగ్ కళాశాలలో పొందిన తమ సీటును ధ్రు వీకరించుకునేందుకు విద్యార్థులు సోమవారం జిల్లాలోని నాలుగు హెల్ప్ లైన్ కేంద్రాలకు వచ్చారు. ఉదయం 9 గంటలకు మొదలైన ఈ ప్రక్రియ రాత్రి 7 గంటల వరకూ కొనసాగింది. దీనికి జిల్లాలో మొత్తం 1,804 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎంసెట్‌లో ఒకటి నుంచి 50 వేల మధ్య ర్యాంకులు సాధించిన విద్యార్థులను అలాట్మెంట్ ఆర్డర్స్‌తో వచ్చి అడ్మిషన్ ధ్రువీకరించు కోవాలని ప్రకటించడంతో జిల్లా నలుమూలల నుంచి విద్యార్థులు తమ తల్లిదండ్రులను వెంట పెట్టుకుని హెల్ప్‌లైన్ కేంద్రాలకు తరలివచ్చారు. సర్టిఫికెట్ల పరిశీలన జరిగిన హెల్ప్‌లైన్ కేంద్రానికి అలాట్మెంట్ ఆర్డర్‌తో హాజరుకావాలని అధికారులు స్పష్టం చేసినప్పటికీ విద్యార్థులు గుంటూరులోని గుజ్జనగుండ్ల, సాంబశివపేటలోని హెల్ప్‌లైన్ కేంద్రాలకు పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఈ సందర్భంగా కేంద్రం నిర్వాహకులతో పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు వాగ్వాదానికి దిగారు. ఫీజు రీ-యింబర్స్‌మెంట్ రూ. 35 వేలకు పైబడి ఫీజును చలానా రూపంలో చెల్లించాల్సి ఉండటంతో విద్యార్థులు హడావుడిగా బ్యాంకుల వద్దకు పరుగులు తీశారు. ఆ తరువాత తిరిగి వచ్చి తమ వంతు కోసం గంటల కొద్దీ ఎదురుచూశారు. రాత్రి 7 గంటల వరకూ కొనసాగిన అడ్మిషన్ ధ్రువీకరణ ప్రక్రియకు గుజ్జనగుండ్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో 491 మం ది, నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 413 మంది, సాంబశివపేటలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 550 మం ది, ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయంలో 350 మంది హాజరయ్యారు. నేడు 50,001 నుంచి లక్ష వరకూ హాజరు కావాలి.. 50,001 నుంచి లక్ష ర్యాంకు వరకూ సర్టిఫికెట్ల పరిశీలన పూర్తి చేసుకుని సీట్లు పొందిన విద్యార్థులు మంగళవారం ధ్రువీకరణకు హాజరుకావాల్సి ఉంది. గతంలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైన హెల్ప్‌లైన్ కేంద్రంలోనే తిరిగి హాజరుకావాలని ఆయా కేంద్రాల కో-ఆర్డినేటర్లు తెలిపారు. పాలిసెట్ ప్రవేశాల ప్రక్రియ పూర్తి పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పాలిటెక్నిక్ కళాశాలల్లో అడ్మిషన్ల ధ్రువీకరణ ప్రక్రి య సోమవారం ముగిసింది. చివరి రోజు గుజ్జనగుండ్లలోని పాలిటెక్నిక్ కళాశాల హెల్ప్‌లైన్ కేం ద్ర ంలో 588 మంది, నల్లపాడులోని పాలిటెక్నిక్ కళాశాలలో 600 మంది విద్యార్థులు హాజరయ్యారు. -
9న ఎంసెట్ ర్యాంకుల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకులను ఈనెల 9న సాయంత్రం 4:30 గంటలకు వెల్లడించనున్నట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ రమణరావు తెలిపారు. తెలంగాణ విద్యాశాఖ మంత్రి ఈ ర్యాంకుల వెల్లడి కార్యక్రమంలో పాల్గొంటారని పేర్కొన్నారు. మే 22న జరిగిన ఈ పరీక్ష రాసేందుకు 3,95,670 మంది దరఖాస్తు చేసుకోగా 3,73,286 మంది హాజరయ్యారు. ఇంజనీరింగ్‌లో 2,82,815 దరఖాస్తు చేసుకోగా 2,66,895 (94.37 శాతం) మంది, అగ్రికల్చర్ అండ్ మెడికల్‌లో 1,12,855 మంది దరఖాస్తు చేసుకోగా 1,06,391 (94.27 శాతం) మంది పరీక్ష రాశారు. ఎంబీఏ, ఎంసీఏ ఫలితాలు విడుదల సాక్షి, హైదరాబాద్: ఎంబీఏ, ఎంసీఏ మొదటి, మూడవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను జేఎన్టీయూహెచ్ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థులు తమ ఫలితాలను వర్సిటీ వెబ్సైట్లో చూసుకోవచ్చు. రీకౌంటింగ్, రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 13లోగా దరఖాస్తు చేసుకోవాలని డెరైక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఈశ్వర్ప్రసాద్ తెలిపారు. -
మెడిసిన్ యాజమాన్య కోటాలో.. ప్రత్యేక పరీక్షకే మొగ్గు
మెడిసిన్ యాజమాన్య కోటా భర్తీపై కళాశాలల నిర్ణయం కర్ణాటక తరహాలో నిర్వహిస్తామని సర్కారుకు వినతి యాజమాన్య కోటా భర్తీకి గతంలో ఎంసెట్ ర్యాంకు,ఇంటర్ మార్కులు, ప్రవేశ పరీక్ష ఆప్షన్లు ఇచ్చిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్లకు భారీ గిరాకీ ఏర్పడిన నేపథ్యంలో సీట్ల భర్తీకి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మెడిసిన్ యాజమాన్య కోటా సీట్ల భర్తీకి కర్ణాటక తరహాలోనే ప్రైవేటు కాలేజీ యాజమాన్యాలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకుంటామని ఇప్పటికే ప్రభుత్వానికి వినతిపత్రం ఇచ్చాయి. దీనికి ఇప్పటివరకూ ప్రభుత్వం ఆమోదం తెలుపనప్పటికీ యాజమాన్యాల ఒత్తిడి నేపథ్యంలో యాజమాన్యకోటాకు ప్రత్యేక ప్రవేశ పరీక్ష ఉంటుందని తెలుస్తోంది. ఇంటర్ మార్కుల మెరిట్, ఎంసెట్ ర్యాంకు, ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారా యాజమాన్య కోటాను భర్తీ చేసుకోవచ్చని ప్రభుత్వం గతంలో ఆప్షన్లు ఇచ్చింది. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ అనంతరం ప్రైవేటు కళాశాలలు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి, ఈ ఆప్షన్లలో దేన్నయినా ఎంచుకోవచ్చునని సూచించింది. భారతీయ వైద్యమండలి సైతం ప్రైవేటు కాలేజీలు ఎంచుకునే ఆప్షన్ ఏదైనా సరే, ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా యాజమాన్య కోటా సీట్లు భర్తీ చేసి, ఆయా వివరాలను ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకి పంపించాలని కోరింది. ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు మాత్రం ప్రత్యేక ప్రవేశ పరీక్షకే మొగ్గు చూపుతుండటంతోపాటు ఉన్నతాధికారులపైనా ఒత్తిడి తెచ్చాయి. కర్ణాటక, మహరాష్ర్టలో సైతం ఇలా చేస్తున్నాయని యాజమాన్యాలు చెబుతున్నాయి. బహుశా ప్రత్యేక ప్రవేశ పరీక్ష ద్వారానే యాజమాన్య కోటా సీట్లు భర్తీ అయ్యే అవకాశాలున్నట్టు ఒక ఉన్నతాధికారి ‘సాక్షి’తో అన్నారు. అయితే ఈ విధానం అమల్లో ఉన్న పలు రాష్ట్రాల్లో సీట్ల భర్తీలో అవకతవకలు జరిగాయని, దీనికంటే ఇంటర్ మార్కులు లేదా, ఎంసెట్ ర్యాంకింగ్‌ల ద్వారా భర్తీ జరిగితే బావుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. యాజమాన్యకోటా సీట్లు పెరిగే అవకాశం ప్రస్తుతం ప్రైవేటు వైద్య కళాశాలల్లో 3,650 సీట్లున్నాయి. ఇందులో 40 శాతం సీట్లు అంటే 1,460 సీట్లు యాజమాన్య కోటా సీట్లు వస్తాయి. ఈ ఏడాది మరో ఐదారు కొత్త కళాశాలలకు అనుమతి వచ్చే అవకాశముంది. దీనివల్ల మరో 150 నుంచి 200 సీట్లు పెరిగే అవకాశ ముంది. 40 శాతం యాజమాన్య కోటా సీట్లలోనే 15 శాతం సీట్లు ప్రవాస భారతీయ కోటా (ఎన్ఆర్ఐ) కింద భర్తీ చేసుకుంటారు. అంటే మొత్తం సీట్లలో 25 శాతం మాత్రమే యాజమాన్యకోటా కింద భర్తీ చేసుకోవాల్సి ఉంది. గత ఏడాది యాజమాన్య సీట్ల భర్తీలో తీవ్ర అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. తమకు నచ్చిన అభ్యర్థులకు ఒక్కో సీటును రూ.80 లక్షల నుంచి రూ.90 లక్షల వరకూ యాజమాన్యాలు అమ్ముకున్నాయి. దీనిపై హైకోర్టు సైతం తీవ్రంగా స్పందించింది. భారతీయ వైద్యమండలి కూడా దీనిపై స్పందిస్తూ ఇకపై మెరిట్ వివరాలు ఆన్లైన్లో పెట్టాలని సూచించింది. -
3 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల ప్రక్రియ షురూ సర్టిఫికెట్ల తనిఖీకి మరో నాలుగు రోజుల గడువు ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు కొత్త షెడ్యూలు అప్పటికి కూడా హాజరుకాకపోతే 12 వరకు అవకాశం నేటి నుంచి సీమాంధ్రలో పనిచేయనున్న 36 కేంద్రాలు సెప్టెంబర్ 17న సీట్ల కేటాయింపు 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాలి ఉన్నత విద్యామండలి ప్రకటన సాక్షి, హైదరాబాద్: ఎంసెట్ ర్యాంకుల ఆధారంగా ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి వచ్చేనెల 3 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. 17న సీట్ల కేటాయింపు జాబితా వెల్లడి కానుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం శుక్రవారంతో సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియ పూర్తవ్వాల్సి ఉండగా.. సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా సీమాంధ్ర ప్రాంతంలో కొన్ని సహాయక కేంద్రాలు పనిచేయలేదు. దీంతో శనివారం నుంచి వచ్చేనెల 3 వరకు నాలుగు రోజులు ప్రత్యేకంగా షెడ్యూలు పొడిగించారు. ఈ కొత్త షెడ్యూలు ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఇప్పటివరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరుకాలేకపోయిన వారు ఇప్పుడు హాజరుకావొచ్చు. ఒకవేళ మూడో తేదీలోగా కూడా హాజరుకాలేకపోయిన వారు 12వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల తనిఖీకి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించారు. ఈమేరకు ఉన్నత విద్యామండలి శుక్రవారం ప్రకటించింది. ఇప్పటివరకు సీమాంధ్రలో 37 సహాయక కేంద్రాలు ఉండగా కొన్ని కేంద్రాలు పనిచేయలేదు. శుక్రవారం నుంచి 36 కేంద్రాలు పనిచేయనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు వెల్లడించారు. అనంతపురం జిల్లా ఎస్కేయూలోని సహాయక కేంద్రం మినహా అన్ని కేంద్రాలు పనిచేస్తాయని తెలిపారు. సాంకేతిక విద్య కమిషనర్ అజయ్‌జైన్ పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారు. అనంతరం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సహాయక కేంద్రాలు తెరిచేందుకు అధ్యాపకులు అంగీకరించారని వివరించారు. సర్టిఫికెట్ల తనిఖీ ప్రక్రియపై శుక్రవారం రాత్రి మండలిలో చైర్మన్ అధ్యక్షతన జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా, సాంకేతిక విద్య కమిషనర్ అజయ్ జైన్, మండలి కార్యదర్శి డాక్టర్ సత్తిరెడ్డి, అడ్మిషన్ల క్యాంపు ప్రధాన అధికారి డాక్టర్ కె.రఘునాథ్ పాల్గొన్నారు. మరో 15 వేల మంది హాజరయ్యే అవకాశం.. ఆగస్టు 19 నుంచి శుక్రవారం వరకు జరిగిన సర్టిఫికెట్ల తనిఖీకి మొత్తం 2.17 లక్షలకు గాను 1.22 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని, గ తేడాది 1.38 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారని చైర్మన్ తెలిపారు. శుక్రవారం సీమాంధ్రలో 35 కేంద్రాలకు గాను 27 కేంద్రాల్లో 5,034 మంది, తెలంగాణలో 22 కేంద్రాల్లో 5,552 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనిఖీకి హాజరుకావాలని ఇప్పటికే ఒకసారి మొబైల్ ద్వారా సంక్షిప్త సందేశాన్ని పంపించామని, శుక్రవారం రాత్రి మరోసారి పంపించనున్నామని తెలిపారు. మరో 15 వేల మంది విద్యార్థులు హాజరుకావొచ్చని అంచ నా వేస్తున్నట్టు పేర్కొన్నారు. హాజరుకాలేకపోయిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కేంద్రాల్లో శనివారం 1 నుంచి 50 వేల వరకు, సెప్టెంబర్ 1న 50 వేల నుంచి లక్ష వరకు, 2వ తేదీన లక్ష నుంచి 1.5 లక్షల వరకు, 3వ తేదీన 1.5 నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికెట్ల తనిఖీకి హాజరు కావొచ్చని వివరించారు. 3వ తేదీ నాటికి కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరుకాలేకపోయిన వారు 4 నుంచి 12లోగా సహాయక కేంద్రాల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు హాజరై, స్క్రాచ్ కార్డు పొంది అక్కడే వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని వివరించారు. ఇక ప్రత్యేక కేటగిరీ కింద రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు (ఎన్సీసీ, సైనికోద్యోగుల పిల్లలు, క్రీడాకారులు, వికలాంగులు తదితర కేటగిరీలవారు) మాత్రం హైదరాబాద్ మాసబ్‌ట్యాంకులోని సాంకేతిక విద్యాభవన్‌లో మాత్రమే హాజరుకావాల్సి ఉంటుంది. 9న సహాయక కేంద్రాలకు సెలవు విద్యార్థులు ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ నుంచి గానీ, ఎంసెట్ సహాయక కేంద్రం నుంచి గానీ వెబ్ ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 9న మాత్రం వినాయక చవితి పండుగ నేపథ్యంలో సహాయక కేంద్రాలు పనిచేయవు. ఇంటర్నెట్ సెంటర్ నుంచి నమోదు చేసుకోవచ్చు. ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులు వాటిని మార్చుకోవాలనుకుంటే సెప్టెంబర్ 13, 14ల్లో మార్చుకోవచ్చు. 13న 1 నుంచి 1 లక్ష వరకు, 14వ తేదీన 1,00,001 నుంచి చివరి ర్యాంకు వరకు గల అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను మార్చుకునే వెసులుబాటును కల్పించారు. వెబ్ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ముగిసిన తర్వాత సెప్టెంబర్ 17న సాయంత్రం 6 గంటలకు సీట్ల కేటాయింపు జాబితా వెల్లడిస్తారు. సీట్లు పొందిన అభ్యర్థులు సెప్టెంబర్ 23న కళాశాలల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అదేరోజు తరగతులు ప్రారంభమవుతాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ వెల్లడించారు. బీ-కేటగిరీపై నేడు కాలేజీలతో భేటీ సాక్షి, హైదరాబాద్: ఇంజనీరింగ్‌లో బీ కేటగిరీ (యాజమాన్య కోటా) సీట్ల భర్తీ సమయంలో ఒకే విద్యార్థి ఒకటి కంటే ఎక్కువ సీట్లు పొందినప్పుడు ఎదుర య్యే సమస్యకు పరిష్కారం వెతికేందుకు ఉన్నత విద్యామండలి శనివారం దాదాపు 30 కళాశాలలతో సమావేశం కానుంది. బీ- కేటగిరీ సీట్ల భర్తీని జీవో 66, 67 ఆధారంగా సింగిల్ ఆన్లైన్ పోర్టల్ ద్వారా భర్తీ చేయాలన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు ప్రకారం ఉన్నత విద్యామండలి చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా కొత్త నోటిఫికేషన్‌కు మార్గదర్శకాలు రూపొందించే పనిలో పడింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినప్పుడు ఒకే అభ్యర్థి ఒకటి కంటే ఎక్కువ కాలేజీల్లో సీట్లు పొందితే సీట్లు బ్లాక్ అయిపోయే పరిస్థితి నెలకొంటుందని, ఈ సమస్యపై పిటిషన్‌దారులైన కళాశాలల యాజమాన్యాలతో చర్చించి పరిష్కారం కనుగొనాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో 30 కళాశాలల యాజమాన్యాల ప్రతినిధులు విద్యామండలి భేటీ కానుంది. కళాశాలల సూచనలు పరిగణనలోకి తీసుకుని తగిన మార్గదర్శకాలు రూపొందిస్తామని మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ పి.జయప్రకాశ్‌రావు పేర్కొన్నారు. -
బీ‘టఫ్’
ఇంటర్ బ్రిలియంట్స్... ఎంసెట్ టాపర్స్... ఇంజనీరింగ్‌లో మాత్రం ఫెయిల్. ఇటీవల విడుదలైన ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు చెబుతున్న చేదు నిజమిది. ఈ తీరుకు కారణాలేంటి? దీనికి పరిష్కారాలేంటి? ‘సాక్షి ’ విశ్లేషణాత్మక కథనం... సాక్షి, సిటీబ్యూరో : నగరంలోని జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో సుమారు 289 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలు ఉండగా, వీటిలో చదువుతున్న విద్యార్థులు 2.5 లక్షలకు పైమాటే. ఇందులో ఫస్ట్ ఇయర్ విద్యార్థులు 70,872 మంది. వీరంతా గతేడాది ఎంసెట్‌లో ర్యాంకులు సాధించి వివిధ సాంకేతిక కోర్సుల్లో అడుగిడినవారే. ప్రతిభావంతులైన ఈ విద్యార్థులు గత మేలో జరిగిన ఇంజనీరింగ్ వార్షిక పరీక్షల్లో మాత్రం గుడ్లు తేలేశారు. జేఎన్టీయూహెచ్ గతవారం విడుదల చేసిన ఫలితాల ప్రకారం మొదటి సంవత్సరం ఉత్తీర్ణత (34.59 శాతమే) పాస్ మార్కులు కూడా దాటలేదు. ఈ తీరుకు కారణాలేంటని పరిశీలిస్తే ప్రొఫెసర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు భిన్న వాదనలు వినిపిస్తున్నారు. కళాశాలల్లో మౌలిక వసతులు, బోధనా సిబ్బంది లేకపోవడమే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తోంటే.. విద్యార్థులకు ఇంటర్ తర్వాత విపరీతమైన స్వేచ్ఛ లభించడమే కారణమేనని ఆచార్యులు అంటున్నారు. విద్యార్థులు మాత్రం తాము పరీక్షలు బాగానే రాస్తున్నామని, మార్కులు ఎందుకు రావడం లేదో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లిదండ్రుల్లో ఆందోళన ఇంజినీరింగ్ ఫస్టియర్ ఫలితాలను చూసి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు తీవ్రమైన ఆందోళన వ్యక్తమౌతోంది. ప్రతియేటా మార్చినెల మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు పూర్తయినప్పటి నుంచి ఇంజినీరింగ్‌లో చేరేవరకు సుమారు ఐదు నెలల పాటు విద్యార్థులు విద్యాభ్యాసానికి దూరమవడం, ఇంటర్ వరకు తమ పిల్లల చదువు పట్ల ఎంతో శ్రద్ధ చూపే తల్లిదండ్రులు, బీటెక్ కోర్సుల్లో చేరిన విద్యార్థులను అంతగా పట్టించుకోకపోవడమే దీనికి కారణమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా.. ఇంటికి సమీపంలోని జూనియర్ కళాశాలల్లో చదివే విద్యార్థులు ఇంటర్ పుస్తకాలను గంటల కొద్దీ బట్టీలు కొట్టేవారని... ప్రస్తుతం నగరానికి దూరంగా ఉండే ఇంజనీరింగ్ కళాశాలల్లో చేరడం వల్ల గంటల కొద్దీ సమయం బస్సుల్లోనే గడుపుతుండటం వల్ల చదువుకు ఇబ్బందవుతుందని వారు విశ్లేషిస్తున్నారు. దానికితోడు ఇంజినీరింగ్ విద్యార్థులకు లభిస్తోన్న విపరీతమైన స్వేచ్ఛ.. వారి వార్షిక పరీక్షా ఫలితాలపై ప్రభావం చూపుతోందని అంటున్నారు. ఇంజనీరింగ్ సిలబస్ విభిన్నం టెన్త్, ఇంటర్‌లతో పోలిస్తే ఇంజనీరింగ్ సిలబస్ విభిన్నంగా ఉంటుంది. బీటెక్‌లో అపరిమితమైన సిలబస్ ఉండడంతో విద్యార్థులు భారంగా భావిస్తారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఒక్కసారిగా తెలుగు మీడియం నుంచి ఇంగ్లీష్ మీడియంలోకి మారడం, నివాస ప్రాంతాలకు కళాశాలలు దూరంగా ఉండడం, సీనియర్స్ నుంచి ర్యాగింగ్.. తదితర అంశాలు కూడా ఫస్టియర్ విద్యార్థులకు ప్రతిబంధకాలుగా మారతాయి. మరో ముఖ్యమైన విషయమేమంటే.. ఎక్కువ శాతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఫస్టియర్ విద్యార్థులకు సీనియర్ ఫ్యాకల్టీ లేకపోవడం వల్ల విద్యార్థులు చదువు పట్ల ఆసక్తిని కనబర్చడం లేదు. ఫస్టియర్‌లో వార్షిక పరీక్షలకు ఎక్కువ సబ్జెక్టులు ఒకేసారి రాయాల్సి రావడం కూడా ఉత్తీర్ణత తగ్గడానికి మరో కార ణం. - ప్రొఫెసర్ బి. సుధీర్ ప్రేమ్‌కుమార్, మెకానికల్ విభాగాధిపతి, జేఎన్టీయూహెచ్ ఆకర్షణల వలయంలో ఉక్కిరిబిక్కిరి ఇంటర్ వరకు స్వేచ్ఛ లేకుండా చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్ ఫస్టియర్‌లో చేరగానే జైలు నుంచి బయటకు వచ్చినట్లు ఫీలవుతారు. సహజంగానే ఈ వయసులో శారీరకంగా, మానసికంగా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. ఫలితంగా ఎన్నో ఆకర్షణ (స్మార్ట్ ఫోన్లు, బైక్‌లు, వెరైటీ దుస్తులు.. తదితరాలు)లకు లోనవుతారు. అదేవిధంగా ఇంటర్ వరకు విద్యార్థిని కంటికి రెప్పలా అంటిపెట్టుకునే తల్లిదండ్రులు.. తమ పిల్లాడు ఇంజనీరింగ్‌లో చేరాక నాలుగేళ్లపాటు ఇట్టే వదిలేస్తారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల చదువు మందగిస్తుంది. పరీక్షలు రాసేందుకు 70 శాతం హాజరు ఉంటే చాలని యూనివర్సిటీ అధికారులు నిర్దేశించడం విడ్డూరమే. అంటే.. ఎటువంటి వైద్య కారణాలు లేకున్నా 30 శాతం తరగతులు ఎగ్గొట్టమని చె ప్పినట్లవుతోంది. 90శాతం ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బీటెక్ ఫస్టియర్ విద్యార్థులకు ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే బోధిస్తున్నారు. టెన్త్, ఇంటర్లో శిక్షణ పొందిన ఉపాధ్యాయులు బోధిస్తుంటే చక్కగా వినే విద్యార్థులకు ఇంజనీరింగ్‌లో ఫ్రెష్ గ్రాడ్యుయేట్ చెప్పే తరగతులు బోర్ కొట్టించక మానవు. బ్యాక్‌లాగ్‌లు ఉంటే నాలుగేళ్లలో ఎప్పుడో ఒకప్పుడు పూర్తి చేయవచ్చులేనన్న భావనతో కూడా విద్యార్థులు ఫస్టియర్ పరీక్షల పట్ల శ్రద్ధ కనబర్చడం లేదని తెలుస్తోంది. - గంపా నాగేశ్వరరావు, సైక్రియాటిస్ట్ ఐదారు కోర్సులకే ఆదరణ.. బీటెక్‌లో పేరుకు 30 ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నా.. ఎక్కువమంది విద్యార్థులు చేరుతోంది ప్రధానంగా ఐదారు కోర్సుల్లోనే. గత ఐదేళ్లుగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్దే ఆధిపత్యం కొనసాగుతుండగా, ఐటీలో చేరుతున్న విద్యార్థుల సంఖ్య అంతంత మాత్రమే. గతేడాది(2012-13) ఈసీఈ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు వరుసగా.. కంప్యూటర్ సైన్స్, మెకానికల్, ఈఈఈ, సివిల్ ఇంజనీరింగ్ కోర్సుల్లోనే చేరారు. మిగిలిన 24 కోర్సుల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఏ కోర్సులోనూ వెయ్యి దాటలేదు. కొన్ని కోర్సుల్లోనైతే ఆ సంఖ్య 100కి లోపే. ఫలితాలను పరిశీలిస్తే.. ఈసీఈలో 41.96 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, సివిల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత కేవలం 22.93 శాతమే. సీఎస్ఈలో 35.83 శాతం, ఈఈఈలో 34.56 శాతం, మెకానికల్ ఇంజినీరింగ్‌లో 25.92 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. పరిష్కారాలివీ... ఇంజనీరింగ్‌లో కొత్తగా చేరిన విద్యార్థులకు కోర్సు పట్ల, ఆపై ఉద్యోగావకాశాల పట్ల ఆసక్తిని పెంపొందించే విధంగా ఓరియెంటేషన్(అవగాహన) కార్యక్రమాలను కళాశాలల్లో ఏర్పాటు చేయాలి. బాహ్య ప్రపంచంలో రకరకాల ఆకర్షణలకు గురికాకుండా, విద్యార్థులు తమంతట తాము నియంత్రించుకునేలా మానసిక నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించాలి. తల్లిదండ్రులు సెమిస్టర్ల వారీగా విద్యార్థి ప్రగతిని సమీక్షించాలి. ఇలా చేస్తే కొద్దిపాటి భయంతోనైనా విద్యార్థి చదువు పట్ల శ్రద్ధ చూపుతాడు. ఏళ్ల తరబడి ఒకే మాదిరి సిలబస్ కాకుండా, మారుతున్న కాలానికి అనుగుణంగా ఆయా కోర్సుల సిలబస్ మార్పుపై యూనివర్సిటీలు దృష్టి పెట్టాలి. ఔట్ డేటెడ్ సిలబస్‌తో బోర్ ఫీలయ్యే విద్యార్థులు.. కొత ్త సిలబస్ అంటే ఎక్కువ శ్రద్ధ చూపుతారు. విద్యార్థులు ఎంజాయ్‌మెంట్‌తో పాటు ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులు మిగలకుండా చూసుకోవాలి. ఎందుకంటే.. బహుళజాతి కంపెనీల్లో బ్యాక్‌లాగ్స్ ఉన్నా, కనీసం 60-65 శాతం మార్కులు లేకున్నా ఉద్యోగాలకు దూరం పెడుతున్నారు. కళాశాలలో జరిగే తరగతులకు రెగ్యులర్‌గా వెళుతూ ఇంటివద్ద కేవలం ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక గంట చదువుకుంటే చాలు అత్యుత్తమ ఫలితాలు ఇట్టే సొంతమవుతాయి.