సాక్షి, హైదరాబాద్: ఎంసెట్-3 ర్యాంకులను ఈనెల 15వ తేదీన విడుదల చేసేందుకు ఎంసెట్ కమిటీ కసరత్తు చేస్తోంది. ముందస్తు షెడ్యూలు ప్రకారం ఈనెల 16వ తేదీన ర్యాంకులను విడుదల చేయాలని అనుకున్నా.. ప్రవేశాలు ఆలస్యం కాకుండా ఓ రోజు ముందే ఫలితాలు విడుదల చేయాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా కమిటీ విడుదల చేసిన రాత పరీక్ష ప్రాథమిక కీపై ఈనెల 14వ తేదీ సాయంత్రం వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు.
అదే రోజు సాయంత్రం నిపుణుల కమిటీ సమావేశం నిర్వహించి అభ్యంతరాలను పరిశీలించి ఫైనల్ కీని ఖరారు చేయనున్నారు. ఆ ప్రకారం 15వ తేదీన తుది ర్యాంకులను ఖరారు చేసి అదే రోజు ప్రకటించాలని, లేదంటే 16న విడుదల చేయాలని కమిటీ భావిస్తోంది.