
క్యూ..కంటిన్యూ
యథావిధిగా నోటు పాట్లు కొనసాగుతున్నారుు. శుక్రవారం పలు బ్యాంకుల్లో నగదు కొరత ఏర్పడింది. నో క్యాష్ బోర్డులతో జనం ఉసూరుమంటూ నిట్టూర్చారు. ఏటీఎంల్లోనూ గంటల్లోనే నగదు అరుుపోరుుంది.
క్యాష్ ఉన్న బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం కిక్కిరిసి కన్పించారు. ఇక వ్యాపారాలు దారుణంగా పడిపోయారుు. గిరాకీలు లేక వ్యాపారులు ఆందోళనకు గురవుతున్నారు. - సాక్షి, సిటీబ్యూరో