పనిచేయని ఏటీఎంలు
ఆలూరు: జిల్లాలో చాలాచోట్ల ఏటీఎంలు పనిచేయడం లేదు. దీంతో నగదు కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలూరు నియోజకవర్గంలో ఐదు రోజులుగా ఒక్క ఏటీఎంను కూడా తెరవలేదు. కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి నుంచే కాకుండా గుంతకల్లు పట్టణ కేంద్రంనుంచి మంత్రాలయం రాఘవేంద్రస్వామి దర్శనం కోసం రోజు వందల సంఖ్యలో ప్రయాణికులు ఆలూరు నుంచే వెళ్తున్నారు. పట్టణకేంద్రంలో ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు.
నోక్యాష్ బోర్డు ఎందుకు?: నారాయణస్వామి, ఆలూరు (ఫోటోనం04సి)
ఏటీఎంలో నగదును ఉంచనప్పుడు నో క్యాష్ బోర్డును ఉంచడం ఎందుకు? మూసేవేసినట్లు రాస్తే సరిపోతుంది కదా? మా డబ్బు మేం తీసుకునేందు ఇన్ని ఇబ్బందులా?
ఏటీఎంలో డబ్బు ఉంచాలి: మురళీస్వామి, ఉపాధ్యాయుడు(ఫోటోనం04డి)
ఉదయం విధులకు వెళ్లాలి. సాయింత్రం డబ్బు తీసుకుందామంటే బ్యాంకు వద్ద పెద్ద క్యూలైన్ ఉంటుంది. ఆరోగ్యం సరిగా లేకపోతే ఇబ్బందే కదా? ఏటీఎంలో డబ్బు ఉంచితే మాలాంటి వారి కష్టాలు తీరుతాయి.