అవే పాట్లు | lack of notes in banks | Sakshi
Sakshi News home page

అవే పాట్లు

Published Thu, Nov 24 2016 12:09 AM | Last Updated on Mon, Sep 4 2017 8:55 PM

అవే పాట్లు

అవే పాట్లు

బ్యాంకుల్లోనూ నోట్లు కరువు
95 శాతం ఏటీఎంలు మూత
బడాబాబులకే వాణిజ్య బ్యాంకుల ప్రాధాన్యం
సామాన్యులను పట్టించుకోని వైనం ఇస్తున్న నోట్లు రూ.2 వేలవే
 చిల్లర కోసం జనం తిప్పలు
 

సాక్షి ప్రతినిధి, ఒంగోలు : సామాన్యుడి చిల్లర కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు. పెద్దనోట్ల రద్దరుు రెండు వారాలు దాటుతున్నా కష్టాలు తీరడంమాట అటుంచి.. రోజురోజుకూ మరింత పెరుగుతున్నారుు. కొత్త రూ.500,రూ.1000 నోట్లు వస్తాయని అధికారులు చెబుతున్నా ఇప్పటికీ వాటి ఊసేలేదు. రూ.100 నోట్లు అసలు కనిపించడం లేదు. బ్యాంకుల్లోనూ అటు అరకొరగా పనిచేస్తున్న ఏటీఎంల లోనూ  రెండు వేల నోట్లే ఇస్తున్నారు. వాటికి చిల్లర దొరక్క జనం ఇబ్బందులు పడుతున్నారు.
 
అలంకారప్రాయంగా ఏటీఎంలు..
జిల్లావ్యాప్తంగా 95 శాతానికిపైగా ఏటీఎంలు మూతబడ్డారుు. మార్కాపురంలో 16 బ్యాంకుల పరిధిలో 22 ఏటీఎంలు ఉంటే నాలుగు చోట్ల మాత్రమే డబ్బులు పెడుతున్నారు. గిద్దలూరులో 12 ఏటీఎంలు ఉండగా మూడు మాత్రమే సేవలు అందిస్తున్నారుు. దర్శిలో 1, 2 ఏటీఎంలల్లో డబ్బులు అందుబాటులో లేవు. ఇక చీరాలలో సైతం ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా 95 శాతానికిపైగా ఏటీఎంలలో బ్యాంకులు డబ్బులు పెట్టడం లేదు. ఇక బ్యాంకుల్లో సైతం తగిన మేర డబ్బులు లేక పోవడంతో పేరుకు తెరిచి ఉన్నా లావాదేవీలు దాదాపు నిలిచిపోయారుు. వచ్చిన అరకొర డబ్బులను కొందరికి మాత్రమే మొక్కుబడిగా ఇచ్చి బ్యాంకులు మిన్నకుండిపోతున్నారుు.

సామాన్యుల ఇబ్బందులు పట్టని బ్యాంకులు..
ఇక వాణిజ్యబ్యాంకులు, సామాన్యుల కష్టాలను పట్టించుకోవడం లేదు. తమ ఖాతాదారులైన బడాబాబుల సేవలోనే తరిస్తున్నారన్న ఆరోపణలున్నారుు. చాలా బ్యాంకుల్లో కొందరు ఉన్నతాధికారులు పెద్ద నోట్ల రద్దు వ్యవహారాన్ని అనుకూలంగా మలుచుకొని నల్లధనాన్ని భారీ ఎత్తున మార్పిడి చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతుంది. ఇందులో నల్లబాబుల నుంచి 30 శాతం కమీషన్లు తీసుకుంటున్నట్లు సాక్షాత్తు కొందరు బ్యాంకు ఉద్యోగులే పేర్కొంటుండటం గమనార్హం. జిల్లాలోని స్టేట్ బ్యాంకుల్లో ఎక్కువ మొత్తంలో నగదు ఉండటంతో అక్కడే ఎక్కువ లావాదేవీలు నడుస్తున్నారుు. మిగిలిన బ్యాంకుల్లో డబ్బులు అందుబాటులో లేకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. ఆయా బ్యాంకుల ప్రధాన కార్యాలయాల నుంచి సాయంత్రం పూట మాత్రమే డబ్బులు వస్తున్నారుు. దీంతో అందుబాటులో ఉన్న వారికే డబ్బుల పంపిణీ జరుగుతుంది.

సొంత కస్టమర్లకే ప్రాధాన్యం..
బ్యాంకులు తమ కస్టమర్లకే అధిక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో కూడా ఆర్థిక స్థోమత ఉన్న నల్లకుబేరులకే సేవలు అందిస్తున్నట్లు ఆరోపణలున్నారుు. వచ్చిన డబ్బులను పెద్దల నల్లధనాన్ని మార్చేందుకే ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం క్యూ కట్టినా ప్రయోజనం లేకుండాపోతోంది. మొక్కుబడిగా డబ్బులు విదిల్చి బ్యాంకులు చేతులు దులుపుకుంటున్నారుు. తగినంత డబ్బులను బ్యాంకులకు అందించటంలో ఇప్పటికే ఆర్‌బీఐతో పాటు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.రెండు వారాల దాటుతున్న సమస్య కొలిక్కి రాకపోవడంతో సామాన్యుల ఇబ్బందులు వర్ణనాతీతం.

నిత్యావసర సరుకులు కూడా డబ్బులు అందుబాటులో లేదు. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. సమస్య ఎన్నిరోజులకు పరిష్కారమవుతుందో కూడా తెలియకపోవడంతో జనంలో తీవ్ర ఆందోళనలు నెలకొంది. అన్ని పనులు మానుకొని జనం రోడ్లపై పడి చిల్లర కోసం వెంపర్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా పెద్దనోట్ల రద్దుతో జిల్లాలో జనజీవనం స్తంభించిపోరుుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement