► నెలవారీ ఖర్చుల కోసం ఉద్యోగుల దిగాలు
► నేటి నుంచి ఏటీఎంల వద్ద భారీ బందోబస్తు
► రాష్ట్రంలో ఆందోళనలు
పెద్ద నోట్లు రద్దరుున తరువాత వస్తున్న తొలి ఒకటో తేదీని తలచుకుని ప్రజలు వణికిపోతున్నారు. నెలవారీ ఖర్చులను ఎలా అధిగమించాలో అర్థం కావడం లేదని వారువాపోతున్నారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసినట్లు కేంద్రం ఈనెల 8వ తేదీ ప్రకటించిన తరువాత ప్రజలు అల్లకల్లోలానికి గురయ్యా రు. ఈ 20 రోజులపాటూ బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు కాసి బిక్కచచ్చిపోరుున ప్రజలు డిసెంబరు 1వ తేదీ సమీపించడాన్ని చూసి జడుసుకుంటున్నారు. బ్యాంకు ల్లో డబ్బులు లేవు, ఏటీఎంల నుంచి రావు...మరి నెలవారీ అవసరాలకు ఎక్కడికి పోవాలని వాపోతున్నారు. నెల పుట్టగానే ఇంటి బాడుగ, పాలు, ఫలసరుకులు తదితర సామన్లు తెచ్చుకుంటేగానీ ఇల్లు గడవని పరిస్థితిలో డబ్బు కోసం ఎక్కడికి పోవాలనే ఆలోచన అందరినీ భయపెడుతోంది. బ్యాంకు ఖాతాలో తమ డబ్బు ఉన్నా, జీతం సొమ్ము పడినా డ్రా చేసుకోలేని చిత్రమైన సమస్యను ఎదుర్కోవాలని ఆందోళన చెందుతున్నారు. అనేక ఏటీఎంల వద్ద ఇంకా నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తుండగా, పనిచేస్తున్న పరిమితమైన ఏటీఎంలలో రూ.2వేల నోట్లు మాత్రమే రావడం ప్రజలను అసహనానికి గురిచేస్తోంది.
కొన్ని రోజులుగా ఏటీఎంలు మూతపడి ఉండడం, శని, ఆది, బ్యాంకులకు సెలవు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో అన్నిచోట్ల బారులు తీరారు. గంటల తరబడి క్యూలో నిల్చుని తీరా ఏటీఎంలలోకి వెళ్లితే చిల్లర నోట్లు రావడం లేదు. నవంబరు నెల జీతాలు డ్రా చేసుకునేందుకు వీలుగా బుధ, గురువారాల్లో ఏటీఎంలలో నగదు నింపే అవకాశం ఉండడంతో భారీ పోలీసు బందోబస్తుకు ఏర్పాట్లు జరుగుతున్నారుు. కరెన్సీ కొరత కారణంగా రాష్ట్రంలోని ఏ బ్యాంకులోనూ ఖాతాదారుడు కోరుతున్నట్లుగా రూ.24వేలు ఇవ్వడం లేదు. అలాగే వివాహాది శుభకార్యాలకు రూ.2.50 లక్షలు పొందలేక పోతున్నారు. గత 20 రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతోంది. కరెంట్ అకౌంట్ కలిగి ఉన్నవారు రూ.50వేలు డ్రా చేసుకోవచ్చనే అవకాశం ఉత్తిమాటగానే మిగిలింది.
రిజర్వు బ్యాంకు నుంచి కొత్త కరెన్సీ, రోజుకు రూ.10 లక్షల కంటే తక్కువగా చెలామణిలోకి వస్తోంది. దీంతో గంటల తరబడి క్యూలో నిలుచున్నా డబ్బు అందడం లేదు. రూ.24వేలు కోరిన వారికి రూ.4వేలుగా సర్దిపంపుతున్నారు. డబ్బులేకుండా బ్యాంకులు ఎందుకంటూ అధికారులతో ఖాతాదారులు ఘర్షణ పడడం నిత్యకృత్యమైంది. కరెన్సీ నోట్ల రద్దుతో చెన్నై విమానాశ్రయంలో కారు పార్కింగ్ వసూళ్లను కొన్నాళ్లు ఆపారు. కరెన్సీ కష్టాలు తీరకున్నా, చిల్లర సమస్య తీవ్రరూపం దాల్చి ఉన్నా లెక్కచేయకుండా సోమవారం అర్ధరాత్రి నుంచి మళ్లీ పునరుద్ధరించారు.ఏటీఎం క్యూలో పుదుచ్చేరీ సీఎం: పుదుచ్చేరీ ముఖ్యమంత్రి నారాయణస్వామి మంగళవారం అక్కడి ఏటీఎం వద్ద క్యూలో నిల్చుని డబ్బును డ్రా చేశారు. పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా మంగళవారం కాంగ్రెస్ తరఫున ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు.
వాణిజ్య సంఘాల ఆందోళన: పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని నిరసిస్తూ, బ్యాంకుల్లో కరెన్సీ కొరతను దుయ్యబడుతూ తమిళనాడు వాణిజ్య సంఘాల సమ్మేళనం కార్యదర్శి విక్రమ్‌రాజా అధ్వర్యంలో చెన్నైలో మంగళవారం ఆందోళనా కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 50 చోట్ల నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. నగదు నిల్వలేని బ్యాంకులు తెరవడం ఎందుకని దుయ్యబడుతూ వన్నార్‌పేటలో ఖాతాదారులు రాస్తారోకో నిర్వహించారు.ఈ పరిస్థితిపై ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పురసవాక్కం శాఖ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ బాలరాజ్ మాట్లాడుతూ తమ శాఖకు రోజుకు రూ.1.5 కోట్లు అవసరం కాగా రూ.10 లక్షలు మాత్రమే వస్తున్నట్లు తెలిపారు. డిమాండ్‌కు సప్లరుుకి మధ్య ఇంత తేడా ఉంటే ప్రజలకు ఎలా నచ్చజెప్పాలని ఆయన అవేదన వ్యక్తం చేశారు.
నకిలో నోటీసులతో జాగ్రత్త : ఆదాయపు పన్ను శాఖ నల్ల ధనం నిర్మూలనకు పెద్ద కరెన్సీని రద్దు చేస్తూ కేంద్రం ప్రభుత్వం చేపట్టిన చర్యలను అవకాశం తీసుకునేవారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్నుశాఖ హెచ్చరించింది. నకిలీ నోటీసులను నమ్మవద్దని మంగళవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. 044-28338314/52 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
కోవైలో రూ.1.4 కోట్ల కరెన్సీ స్వాధీనం: మూడు కార్లలో తీసుకువెళుతున్న రూ.1.4 కోట్ల రద్దరుున కరెన్సీని పోలీసులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. కోయంబత్తూరు జిల్లా కునియపుత్తూరులోని ఒక ప్రరుువేటు కాలేజీలో 30 శాతం కమీషన్‌పై కొత్త నగదు ఇచ్చి పాత నగదు మార్పిడికి తీసుకెళుతుండగా పట్టుపడింది. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
సీఎం మాట్లాడరేం: స్టాలిన్ ప్రజల కరెన్సీ కష్టాలు ఆకాశాన్ని అంటినా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడడం లేదని డీఎంకే కోశాధికారి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. ఎన్నికలు, ఇతర సమస్యలపై ఆసుపత్రి నుంచే జయ తగిన ఆదేశాలు ఇస్తున్నారని ప్రచారం చేస్తున్న అన్నాడీఎంకే శ్రేణులు తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రజలను మోసగిస్తున్న మోదీ: కాంగ్రెస్ నల్లధనాన్ని రూపుమాపేందుకే తాను పెద్ద నోట్లను రద్దు చేసినట్లు ప్రచారం చేసుకుంటూ ప్రజలను ప్రధాని మోసం చేస్తున్నాడని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు తిరునావుక్కరసర్ విమర్శించారు.
అమ్మో ఒకటోతారీఖు
Published Wed, Nov 30 2016 3:15 AM | Last Updated on Mon, Sep 4 2017 9:27 PM
Advertisement
Advertisement