
కొండపై రద్దు ఎఫెక్ట్
తిరుమల యాత్రాస్థలంలో చిరు వ్యాపారాలు ఎక్కువ.
దర్శనం కోసం తగ్గుతున్న భక్తులు
ఫలితంగా సగానికి పడిపోరుున కొండ వ్యాపారాలు
నో క్యాష్ ఏటీఎంలతో భక్తులకు చిల్లర కష్టాలు
తిరుమల: తిరుమల యాత్రాస్థలంలో చిరు వ్యాపారాలు ఎక్కువ. ఇక్కడ టీటీడీ టెండర్ కింద కేటారుుంచిన 17 పెద్ద హోటళ్లు, సుమారు 600 దుకాణాలు, మ రో 700 హాకర్‌లెసైన్సు దుకాణాలు ఉన్నారుు. ని త్యం వందల నుంచి వేల వరకు నగదు లావాదేవీ లు జరుగుతుంటారుు. పెద్ద నోట్ల రద్దు తర్వాత భక్తులు చిల్లర కోసం నానా ఇబ్బందులు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. ఫలితంగా తిరుమలకొండ వ్యాపారాలు సగానికి పైగా పడిపోయారుు. దుకాణాల్లోని సరుకుల అప్పులకు కూడా గిట్టుబాటు కావడం లేదని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏటీఎంలలో నో క్యాష్
తిరుమలలో ఇంకా ఏటీఎంలు పనిచేయడం లేదు. ఒకటి రెండు తప్ప మిగిలిన ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిస్తున్నారుు. భక్తులకు కరెన్సీ కష్టాలు తప్పడం లేదు. తీర్థయాత్రకు వచ్చిన భక్తులు నగదు లావాదేవీలు నిర్వహించుకునేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. తమ వద్ద డెబిట్, క్రెడిట్ కార్డులు ఉన్నప్పటికీ వాటిని నిర్వహించే స్వైపింగ్ యంత్రాలు సరిపడా లేకపోవడం, ఉన్నవీ పనిచేయక పోవడంతో భక్తులకు కష్టాలు తప్పలేదు. దీంతో తమ వద్ద ఉన్న చిల్లరతోనే లావాదేవీలు నిర్వహిస్తూ తిరుగుముఖం పడుతున్నారు.
పెరుగుతున్న హుండీ కానుకలు
భక్తుల రద్దీ తగ్గినప్పటికీ శ్రీవారి హుండీ కానుకలు మాత్రం క్రమంగా పెరుగుతున్నారుు. సాధారణం గా నవంబరు సీజన్‌లో రూ.2.5 కోట్లులోపే లభి స్తుంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఈ మొత్తం రూ.4 కోట్ల వరకు చేరుతుండడం గమనార్హం. గురువారం కూడా రూ.3.18 కోట్లు హుండీ కానుకలు లభించడం విశేషం. డిసెంబరు తర్వాత హుండీ కానుకలు రెట్టింపు స్థారుులో లభించే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషకులు, టీటీడీ అధికారుల అంచనా.