తగ్గని క్యూలైన్
► అందని నగదు
► ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు
► అరకొర సేవలతో ఏటీఎంలు
కరీంనగర్ బిజినెస్ : నోట్ల రద్దు కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నారుు. దాదాపు నెల రోజులకు దగ్గరపడుతున్నా నగదు ఇబ్బందులు తీర డం లేదు. శుక్రవారం ఉదయం బ్యాంకులు పెన్షనర్లు, ఉద్యోగులతో నిండిపోయారుు. ఏ బ్యాంకులో చూసిన జనం బారులుతీరి కనిపించారు. జిల్లావ్యాప్తంగా పలు బ్యాం కులు నగదు అవసరానికి తగ్గట్టుగా అంది స్తున్నప్పటికీ కొన్ని మాత్రం రూ.4 నుంచి రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తున్నారుు. డ బ్బులు పెట్టిన గంటలోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నారుు. గురువారం సాయంత్రం మార్కెట్లోకి రూ.500 నోట్లు వచ్చారుు. రూ.500నోట్లను ఏటీఎంల ద్వా రానే విడుదల చేయాలని నిబంధనలున్నా..రూ.2వేల నోట్లు మాత్రమే వస్తున్నారుు.
బారులుతీరిన ఉద్యోగులు
ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు రాకపోవడంతో మిగతా వారికి శుక్రవారం ఖాతాల్లో చేరారుు. దీంతో ఉదయమే బ్యాంకులకు ఉద్యోగులు చేరుకున్నారు. బ్యాంకుల ప్రధానశాఖల వద్ద ఉన్న ఏటీంఎంలలోనూ డబ్బులు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్ పలు శాఖలు ఉద్యోగులకు రూ.10వేలు చెల్లించారుు. ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదును బ్యాంకులకు సరఫరా చేస్తేనే ఇక్కట్లు తొలగుతాయని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో పది రోజుల వరకు నగదు కష్టాలు తీరవని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా బంగారంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను పలువురు మహిళలు స్వాగతించగా మరికొందరు విభేదించారు. వారసత్వ బంగారు నిల్వలు లెక్క చెప్పాలంటే కష్టమేనన్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ప్రతి కొనుగోలుపై బిల్లుల రూపంతో జాగ్రత్త పరుచుకుంటేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు.