Cancellation of banknotes
-
నోట్ల రద్దుతో నల్లధనం బయటకురాదు
న్యూఢిల్లీ: నోట్ల రద్దు (డీమోనిటైజేషన్)తో నల్లధనం నియంత్రణపై పెద్దగా సాధించేదేమీ ఉండదని ఆర్బీఐ బోర్డు అభిప్రాయపడింది. పైగా స్వల్ప కాలంలో ఆర్థిక వృద్ధికి దీనివల్ల విఘాతం కలుగుతుందని హెచ్చరించింది. 2016 నవంబర్ 8న రాత్రి ప్రధాని మోదీ నోట్ల రద్దుకు సంబంధించి జాతినుద్దేశించి ప్రసంగించడానికి సరిగ్గా రెండున్నర గంటల ముందు ఆర్బీఐ బోర్డు సమావేశం జరిగింది. డీమోనిటైజేషన్ కోసం ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని ఆమోదించడం జరిగింది. ఈ సమావేశానికి అప్పటి గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వం వహించగా, నాడు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి హోదాలో, ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ఓ డైరెక్టర్‌గా పాలుపంచుకున్నారు. నాటి సమావేశం వివరాలను సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద కార్యకర్త వెంకటేష్ నాయక్ సమీకరించి కామన్వెల్త్ హ్యూమన్‌రైట్స్ ఇనీషియేటివ్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకోదగిన చర్యగా పేర్కొంటూనే, స్వల్పకాలంలో జీడీపీపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆర్బీఐ బోర్డు పేర్కొంది. ‘‘నల్లధనం అనేది ఎక్కువ శాతం నగదు రూపంలో లేదు. రియల్ ఎస్టేట్ ఆస్తులు, బంగారం రూపంలో ఉంది. కనుక ఈ నిర్ణయం సంబంధిత ఆస్తులపై ప్రభావం చూపించదు’’ అని ఆర్బీఐ 561వ బోర్డు సమావేశం అభిప్రాయపడింది. నల్లధనం నియంత్రణ, నకిలీ కరెన్సీ ప్రవాహానికి చెక్ పెట్టే లక్ష్యాలతో రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేస్తున్నట్టు నాడు ప్రధాని మోదీ ప్రకటించడం గుర్తుండే ఉంటుంది. నగదు కట్టడికి ఉపశమన చర్యలను ప్రభుత్వం తీసుకుంటుందని ఆర్బీఐ బోర్డు భరోసా వ్యక్తం చేసింది. రూ.10,720 కోట్లే తిరిగి రాలేదు... నకిలీ కరెన్సీ గురించి ఆందోళన చెందుతున్నట్టయితే, దేశం మొత్తం మీద చలామణిలో ఉన్న నగదుతో పోలిస్తే రూ.400 కోట్లు అనేది పెద్ద మొత్తం కాదని ఆర్బీఐ బోర్డు పేర్కొంది. పెద్ద నోట్ల రద్దు నాటికి వ్యవస్థలో రూ.500, రూ.1,000 నోట్లు రూ.15.41 లక్షల కోట్ల విలువ మేర చలామణిలో ఉండగా, రద్దు తర్వాత బ్యాంకుల్లో జమ అయిన మొత్తం రూ.15.31 లక్షల కోట్లుగా ఉన్నాయి. కేవలం రూ.10,720 కోట్లు మాత్రమే తిరిగి వ్యవస్థలోకి రాలేదు. దీంతో కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా నోట్ల రద్దు వ్యవహారం ఉందంటూ ప్రతిపక్షాలు విమర్శలు సంధించాయి. అయితే, నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఆశించిన ప్రయోజనాలు నెరవేరాయని, జీడీపీపై పెద్దగా ప్రభావం లేదని, ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో ప్రకటించిన విషయం గమనార్హం. -
పసిడిపై సుంకం 4%కి తగ్గించాలి
ముంబై: నోట్ల రద్దు, జీఎస్టీ తాలూకూ ప్రభావాలను ఇంకా ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో బంగారంపై దిగుమతి సుంకాన్ని 10 శాతం నుంచి 4 శాతానికి తగ్గించాలని రత్నాభరణాల పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కట్, పాలిష్డ్ వజ్రాలు, కట్, పాలిష్డ్ రత్నాలపై పన్నును ప్రస్తుతమున్న 7.5 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని, వీటికి అదనంగా రుణ నిబంధనలను సరళతరం చేయాలని ఈ పరిశ్రమ కేంద్ర ఆర్థిక శాఖకు రాసిన లేఖలో పేర్కొంది. వచ్చే శుక్రవారం కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి పార్లమెంట్‌కు బడ్జెట్ సమర్పించనున్న నేపథ్యంలో తమ డిమాండ్లను అఖిల భారత జెమ్స్, జ్యుయలరీ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ లేఖ రూపంలో తెలియజేశారు. ‘‘కరెంటు ఖాతా లోటు అధికంగా ఉన్నప్పుడు దానికి కళ్లెం వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బంగారం దిగుమతులపై సుంకాన్ని 10 శాతానికి పెంచింది. నాటి నుంచి వాణిజ్య లోటు తగ్గడంతో కరెంటు ఖాతా లోటు నియంత్రణలోకి వచ్చింది. అయితే, బంగారంపై అధిక దిగుమతి సుంకాలతో ఈ లోహం దొంగ రవాణా పెరిగేందుకు దారితీస్తుంది. దీంతో సంబంధిత లక్ష్యాలు నెరవేరవు’’ అని పద్మనాభన్ పేర్కొన్నారు. బడ్జెట్లో పరిశ్రమ ఆశిస్తున్నవి ఇవే... బంగారు ఆభరణాల కొనుగోళ్ల సమయంలో విలువ రూ.2 లక్షలు, అంతకుమించి ఉంటే పాన్ నంబర్ సమర్పించాలన్న నిబంధనను సడలించాలి. రూ.5 లక్షలకు పెంచాలి. దేశంలో 50 శాతం మందికి పాన్ లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి ఇబ్బంది అవుతోంది. ప్రత్యేకంగా గుర్తించిన జోన్ల ద్వారా ముడి వజ్రాలను విదేశీ మైనింగ్ కంపెనీలు విక్రయించేందుకు ఆదాయపన్ను నిబంధనల్లో మార్పులు చేయాలి.ఇన్పుట్ సేవలపై 0.25 జీఎస్టీ ఉండాలి. మూలధన అవసరాల కోసం రుణాలను సులభంగా పొందేందుకు నిబంధనలు సడలించాలి.రత్నాభరణాల ఎగుమతులకు సంబంధించి తీసుకునే రుణాలపై 5 శాతం వడ్డీ రాయితీని తిరిగి ప్రవేశపెట్టాలి.కమోడిటీ ట్రేడింగ్ ట్యాక్స్ ఎత్తివేయాలి. ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ డిమాండ్లు.. దిగుమతి చేసుకునే ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులపై సుంకాలు పెంచడంతోపాటు, వీటికి సంబంధించిన విడిభాగాల దిగుమతులపై మాత్రం సుంకాలు తగ్గించాలని కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీ దారుల సంఘం (సీఈఏఎంఏ) కోరింది. ∙టీవీలు, ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు వంటి పూర్తి స్థాయి ఉత్పత్తుల దిగుమతులపై సుంకాలు పెంచాలి. వాస్తవానికి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల వల్ల వీటి దిగుమతులపై సుంకాలు విడిభాగాల కంటే తక్కుగా ఉంటున్నాయి. ∙కంప్రెషర్లు, ఓపెన్ సెల్, డిస్ప్లే ప్యానెళ్లపై ప్రస్తుతమున్న 10 శాతం సుంకాన్ని 5 శాతానికి తగ్గించాలి. దీనివల్ల దేశీయ తయారీకి ప్రోత్సాహం లభిస్తుంది. ధరల పరంగా స్థానిక కంపెనీలు పోటీ పడగలుగుతాయి. ఓపెన్ సెల్స్, డిస్ప్లే ప్యా నెళ్లు, కంప్రెషర్లను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవడం వల్ల, అధిక సుంకాల కారణంగా దేశీయ పరిశ్రమలో రెండేళ్లుగా వృద్ధి ఉండటం లేదు. ∙దేశీయంగా తయారయ్యే విడిభాగాలు, ఉత్పత్తులకు సబ్సిడీలు ఇవ్వడం వల్ల స్థానిక తయారీ పెరుగుతుంది. ∙భారీగా దిగుమతి అవుతున్న సెక్యూరిటీ, నిఘా కెమెరాల విషయమై దృష్టి సారించాలి. వీటిపై దిగుమతి సుంకాన్ని 15% నుంచి 20 శాతానికి పెంచాలి. దిగుమతులను నిరుత్సాహపరిచి, స్థాని క తయారీని ప్రోత్సహించేందుకు ఇది అవసరం. ఎగుమతులను పెంచేందుకు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం ఎగుమతిదారుల సమాఖ్య ‘ఎఫ్ఐఈవో’ న్యూఢిల్లీ: నత్తనడకన ఉన్న దేశీయ ఎగుమతుల వృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వపరంగా బడ్జెట్లో ప్రోత్సాహం అవసరమని భారతీయ ఎగుమతిదారుల సమాఖ్య (ఎఫ్ఐఈవో) పేర్కొంది. గడిచిన 2–3 నెలల్లో ఎగుమతుల వృద్ధి నామమాత్రంగానే ఉందని, ఇది ఆందోళనకరమని ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ గణేశ్ కుమార్ అన్నారు. ‘‘రానున్నది మధ్యంతర బడ్జెటే అయినా కొన్ని ప్రోత్సాహకాలు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈ రంగానికి, పరిశోధన, అభివృద్ధికి ఇవ్వాల్సి ఉంది. ఇది ఎగుమతులను పెంచడంతోపాటు తయారీ, ఉద్యోగాల కల్పనకు ఊతమిస్తుంది’’ అని కుమార్ పేర్కొన్నారు. 2018 నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి 0.8 శాతం, డిసెంబర్లో 0.34 శాతంగా ఉంటే, గడచిన ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 10.18 శాతం పెరుగుదలతో 245 బిలియన్ డాలర్ల మేర ఉండటం గమనార్హం. పెట్రోలియం, విద్యుత్‌పై పన్నుతోపాటు రాష్ట్రాల పన్నులను తిరిగి ఇచ్చేయాలని కోరారు. ఉద్యోగాలను కల్పించే యూనిట్లకు పన్ను రాయితీలు ఇవ్వాలని. ఎగుమతి ప్రోత్సాహక నిధి ఏర్పాటుకు సైతం డిమాండ్ చేశారు. -
వెంటాడుతున్న నగదు కొరత
మోర్తాడ్(బాల్కొండ): పెద్ద నోట్ల రద్దు తరువాత ఏర్పడిన నగదు కొరత ఇంకా ప్రజలను వెంటాడుతూనే ఉంది. రూ.1000, రూ.500ల నోట్లు రద్దు అయ్యి రెండేళ్లు గడచినా బ్యాంకుల్లో ఖాతాదారులకు సరిపడేంత నగదు దొరకక ఇబ్బందులు కలుగుతున్నాయి. మధ్యమధ్యలో నగదు కొరత తీరినట్లు అనిపించినా నగదు కొరత ప్రభావం సామాన్యులను వెంటాడుతుండటంతో ప్రజలు సతమతం అవుతున్నారు. పక్షం రోజుల నుంచి బ్యాంకుల్లో నగదు నిలువలు తగ్గిపోవడంతో ఖాతాదారులకు పరిమితంగానే నగదు విత్‌డ్రాకు బ్యాంకర్లు అనుమతి ఇస్తున్నారు. ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నా అవగాహన లేమితో ఆన్లైన్ లావాదేవీలు నామమాత్రంగానే సాగుతున్నాయి. గతంలో బ్యాంకుల్లో ఒక్కో ఖాతాదారుకు రోజుకు రూ.40వేల వరకు నగదు అందించిన బ్యాంకర్లు ఇప్పుడు రూ.10వేలకు మించి ఇవ్వడం లేదు. జిల్లాలో సహకార, వాణిజ్య, ప్రైవేటు బ్యాంకుల శాఖలు 268 వరకు ఉన్నాయి. గతంలో వివిధ బ్యాంకుల శాఖలకు ప్రధాన బ్రాంచీల నుంచి నుంచి నగదు సరఫరా అయ్యేది. అలా సరఫరా అయిన నగదును ఖాతాదారులకు బ్యాంకర్లు అందించేవారు. అయితే కొన్నిరోజుల నుంచి బ్యాంకు శాఖలకు నగదు సరఫరా కావడం లేదు. వివిధ బ్యాంకుల పరిధిలోని విద్యుత్, టెలికం, గ్రామ పంచాయతీలు, పెట్రోల్ బంక్‌లు, మద్యం దుకాణాలు, ఇతర వ్యాపారులు బ్యాంకుల్లో నగదును జమచేస్తేనే ఆ నగదును ఖాతాదారులకు బ్యాంకర్లు అందించే పరిస్థితి ఏర్పడింది. పెట్రోల్ బంక్‌లలో ఎక్కువ మంది స్వైపింగ్ మిషన్ ద్వారానే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేస్తుండటంతో నగదు తగ్గిపోయింది. కొంతమంది ఖాతాదారులు బ్యాంకుల నుంచి నగదును విత్‌డ్రా చేసుకోవడమే తప్ప బ్యాంకుల్లో నగదును జమచేయకపోవడంతో నగదుకు కొరత ఏర్పడటానికి కారణం అయ్యింది. ఇది ఇలా ఉండగా కొన్ని నెలల నుంచి బ్యాంకుల్లో రూ.2వేల నోటు కనిపించడం లేదు. ఎన్నికల కారణంగా పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల ఖర్చు కోసం పెద్ద మొత్తంలో నగదును బ్లాక్ చేయడం వల్లనే నగదు కొరత ఏర్పడటానికి కారణం అయ్యిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బ్యాంకుల్లో నగదును జమ చేస్తే మళ్లీ నగదు తమ చేతికి లభించదనే ఉద్దేశంతో అనేక మంది నగదును ఇండ్లలోనే దాచుకుంటుండటంతో నగదు కొరత తీవ్రం అయ్యిందని కూడా తెలుస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం, బ్యాంకర్లు స్పందించి నగదు కొరత తీర్చడంతో పాటు ఆన్లైన్ లావాదేవీలపై ఖాతాదారులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నగదు కొరత తీర్చాలి బ్యాంకుల్లో ఖాతాదారులకు సరిపడేంత నగదు ఇవ్వకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. నగదు కొరతను తీర్చాల్సిన అవసరం ఉంది. పెద్ద నోట్లు ఇవ్వకపోయినా చిన్న నోట్లనైనా ఖాతాదారులకు అందించాలి. నగదు కొరతను తీర్చాలి. సల్ల రాజేశ్వర్, రైతు, తొర్తి కూలి ఇవ్వాలంటే దొరకడం లేదు వ్యవసాయ పనులకు వచ్చే కూలీలకు నగదు రూపంలోనే కూలి ఇవ్వాల్సి ఉంది. అయితే నగదు కొరత వల్ల కూలీలకు కూలి ఇవ్వాలంటే ఇబ్బందిగా ఉంది. నగదు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగతూ పని నష్టపోతున్నాం. ప్రభుత్వం స్పందించి నగదు కొరతను తీర్చాలి. కౌడ పెద్ద భూమేశ్వర్, రైతు, తొర్తి -
చిన్న షేర్లు కరెక్షన్‌లోనే!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పెద్ద నోట్ల రద్దు తర్వాత బంగారం, రియల్టీల్లో నగదు పరమైన పెట్టుబడులు చాలా వరకూ తగ్గాయి. డిజిటల్ ఇన్వెస్ట్మెంట్స్– అంటే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. దీంతో ఒక్కసారిగా మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్లలోకి పెట్టుబడులు వచ్చాయి. ఒకదశలో లార్జ్ క్యాప్స్ షేర్ల కంటే ఇవే జోరు మీదున్నాయి కూడా. కానీ, ప్రస్తుతం మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్ల విలువలు బాగా పెరిగిపోయాయని.. దీంతో ఈ ఏడాది జనవరి నుంచి మిడ్, స్మాల్ క్యాప్స్ షేర్లు తిరోగమనంలో సాగుతున్నాయని ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ అండ్ పోర్ట్‌ఫోలియో మేనేజర్ (ఈక్విటీస్) లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. ఎన్నికల వరకూ అంటే 2–3 త్రైమాసికాల వరకూ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని.. ఆ తర్వాతే మళ్లీ పరిస్థితి మెరుగుపడే అవకాశముందని ఆయన అంచనా వేశారు. విపణిలోకి కొత్తగా ఈక్విటీ సేవింగ్ ఫండ్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో మాట్లాడారు. ‘మిడ్, స్మాల్ క్యాప్స్‌లో పెట్టుబడులు జోలికి వెళ్లకపోవటమే మంచిది. ఒకవేళ పెట్టాల్సి వస్తే మాత్రం ఐదేళ్ల కాలపరిమితికి మించి ఇన్వెస్ట్ చేయడం ఉత్తమం’ అని సూచించారు. కాగా వచ్చే నెల 3–17 మధ్య ఫ్రాంక్లిన్ ఇండియా ఈక్విటీ సేవింగ్స్ ఫండ్ (ఎఫ్ఐఈఎస్ఎఫ్) అందుబాటులో ఉంటుందని కనీసం పెట్టుబడి రూ.5 వేలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. మెటల్, ప్రైవేట్ బ్యాంక్‌లే మేలు.. :ఆయిల్ ధరలు, వడ్డీ రేట్లు పెరగడం, తగిన వర్షపాతంపై అనుమానాలు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), పెద్ద నోట్ల రద్దు వంటివాటితో మార్కెట్లలో ప్రతికూల వాతావరణం నెలకొందని దీంతో కంపెనీలు పెద్దగా లాభాల్లో లేవని.. మొండి బకాయిల (ఎన్పీఏ) భారంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌లూ ఇబ్బందుల్లోనే ఉన్నాయని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో ప్రైవేటు బ్యాంకులు, మెటల్ కంపెనీలు, ఆటోమొబైల్ కంపెనీల్లో పెట్టుబడులు ఉత్తమమని సూచించారు. 2014–17 మధ్య కాలాన్ని మార్కెట్ల సంవత్సరంగా అభివర్ణించవచ్చన్నారు. ఆయిల్ ధరల పెరుగుదల, ఎన్నికల ప్రభావంతో వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకూ మార్కెట్లు ఒడిదుకుల్లోనే కొనసాగుతాయని తెలిపారు. ఉదాహరణకు 2014లో 6 వేల పాయింట్లుగా ఉన్న నిఫ్టీ, ఎన్నిక సమయంలో తగ్గి.. ప్రస్తుతం మళ్లీ రికార్డు స్థాయిలకు చేరుకుందన్నారు. ఎన్నికల దృష్ట్యా మార్కెట్ ఒడిదుడుకులు తప్పవని విశ్లేషించారు. -
మళ్లీ ‘క్యాషే’ కింగ్!
న్యూడిల్లీ: దేశవ్యాప్తంగా మళ్లీ నగదు చలామణి పెరుగుతోంది. ప్రజలు నగదు వినియోగానికి... లేదంటే క్రెడిట్ కార్డుల వైపు మొగ్గు చూపుతున్నారు. చిన్న కొనుగోళ్లకు నగదు చెల్లించే సంప్రదాయ అలవాటుకే తిరిగి వారు మళ్లుతున్నారు. కేంద్ర సర్కారు 2016 నవంబర్ 8న పెద్ద నోట్లను రద్దు చేసిన తరవాత డిజిటల్ లావాదేవీలు పెరగటం తెలిసిందే. పెద్ద నోట్లను రద్దు చేయడం వెనుక ‘క్యాష్ లెస్ ఎకానమీ’గా (తక్కువ నగదు వినియోగం కలిగిన ఆర్థిక వ్యవస్థ) మార్చాలన్న ఆశయాన్ని కేంద్ర ప్రభుత్వం వినిపించింది. కానీ, డీమోనిటైజేషన్ తర్వాత తొలి నాళ్లలో నగదు కొరత కారణంగా డిజిటల్ చెల్లింపులను ఆశ్రయించిన ప్రజలు... ఇప్పుడు పాత విధానాలకే ప్రాధాన్యమిచ్చే పరిస్థితులు వచ్చేశాయి. గత ఆర్థిక సంవత్సరం క్రెడిట్, డెబిట్ కార్డు లావాదేవీలను విశ్లేషించినప్పుడు ఈ వివరాలు వెల్లడయ్యాయి. నోట్ల రద్దుకు ముందున్న స్థాయికి నగదు అందుబాటులోకి రావటం దీనికి వీలు కల్పించినట్టు చెప్పుకోవాలి. ఈ ఏడాది మే 25 నాటికి వ్యవస్థలో రూ.18.5 లక్షల కోట్ల నగదు చలామణిలో ఉందని అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. యూపీఐ, ఇతర సాధనాల రాక... 2016 నవంబర్‌లో పెద్ద నోట్లను రద్దు చేశాక డెబిట్ కార్డు చెల్లింపులు ఎక్కువగా జరిగాయి. చలామణిలో ఉన్న 85 శాతం నగదు (అన్నీ రూ.500, రూ.1,000 నోట్ల రూపంలో ఉన్నది) చెల్లుబాటు కాకుండా పోవడమే ఇందుకు కారణం. దేశంలో మొత్తం కార్డు చెల్లింపుల్లో 96 శాతం డెబిట్ కార్డుల ద్వారానే జరిగాయి. క్రెడిట్ కార్డుల వాటా 4 శాతం. అయితే, అదేమంత కాలం కొనసాగలేదు. గతేడాది ఆగస్ట్‌లో క్రెడిట్ కార్డు లావాదేవీలు డెబిట్ కార్డు లావాదేవీలను మించేశాయి. వ్యవస్థలోకి నగదు సరఫరా మెరుగు పడుతూ వచ్చింది. ఈ ఏడాది మార్చి మాసంలో క్రెడిట్ కార్డు లావాదేవీల విలువ 15 నెలల గరిష్ట స్థాయికి చేరి రూ.44,308 కోట్లుగా నమోదైంది. అదే నెలలో డెబిట్ కార్డు చెల్లింపుల విలువ రూ.41,857 కోట్లకు పరిమితమైనట్లు ఆర్బీఐ తాజా గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 2017 డిసెంబర్ నాటికి చలామణిలో రూ.7.8 లక్షల కోట్ల నగదు ఉండగా, 2018 మే నాటికి రూ.18.5 లక్షల కోట్లకు పెరిగింది. అయితే, షాపుల వద్ద మొబైల్ ఆధారిత చెల్లింపులు పెరగడం కూడా డెబిట్‌కార్డు లావాదేవీల విలువ తగ్గడానికి కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. ఇక యూపీఐ ఆధారిత లావాదేవీలు గతేడాది ఇదే కాలంలో 9 లక్షలుగా ఉంటే, ఈ ఏడాది మే నెలలో 18.9 కోట్ల లావాదేవీలకు పెరగటం కూడా డెబిట్ కార్డు లావాదేవీలు తగ్గడానికి కారణంగా భావించొచ్చు. నగదు లభ్యత పెరగడం వల్లే... నోట్ల రద్దు తర్వాత తీసుకున్న చర్యలు అమలు కాలేదని, దీంతో పూర్వపు స్థితి వచ్చేసిందని డిజిటల్ పేమెంట్ కంపెనీల సంఘం ‘పేమెంట్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా’ చైర్మన్ నవీన్‌సూర్య తెలిపారు. ‘‘నగదుకు కొరత ఉన్నప్పుడు మరో మార్గం లేక సాధారణ కొనుగోళ్లకు వారు డెబిట్ కార్డులు వినియోగించారు. ఇప్పుడు మళ్లీ పాత విధానానికే మళ్లారు’’ అని సూర్య వివరించారు. చాలా మంది డెబిట్ కార్డుల కంటే క్రెడిట్ కార్డుల వినియోగానికే ప్రాధాన్యం ఇస్తున్నారని... డెబిట్ కార్డులు నేరుగా బ్యాంకు ఖాతాతో అనుసంధానమైనవి కనుక, వాటిని అధిక రిస్క్ ఉన్నవాటిగా పరిగణించడమే ఇందుకు కారణమని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. అయితే, దేశంలో 86.1 కోట్ల డెబిట్ కార్డులుంటే, వినియోగంలో ఉన్న క్రెడిట్ కార్డుల సంఖ్య కేవలం 3.7 కోట్లు కావడం గమనార్హం. చిన్న దుకాణాలకు కార్డు స్వైప్‌ల కోసం పాయింట్ ఆఫ్ సేల్స్ టర్మినల్స్ అందించే ఎంస్వైప్ కంపెనీ వ్యవస్థాపకుడు మనీష్ పటేల్ స్పందిస్తూ... దేశంలోని మొత్తం కార్డుల్లో క్రెడిట్ కార్డులు 4 శాతమే ఉన్నప్పటికీ, వీటి ద్వారా జరిగే లావాదేవీల విలువ మొత్తం చెల్లింపుల్లో 51 శాతం మేర ఉంటుందని తెలియజేశారు. నగదు వినియోగమనేది జనం అలవాటని, దాన్ని అంత సులభంగా మార్చలేమని అభిప్రాయపడ్డారు. రూ.2,000 వరకు లావాదేవీలపై దుకాణదారులు బ్యాంకులకు ఎలాంటి చార్జీలు చెల్లించక్కర్లేదని, కానీ, పరిస్థితులను గమనిస్తే డిజిటల్ కంటే నగదు చెల్లింపులకే కస్టమర్లు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలుస్తోందని చెప్పారాయన. 2023 నాటికి యూపీఐ లావాదేవీల హవా ‘‘డిజిటల్ చెల్లింపులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. యూపీఐ లావాదేవీల సంఖ్య బాగా పెరుగుతోంది. 2017 మార్చిలో 3% ఉంటే 2018 మార్చిలో 20%కి యూపీఐ లావాదేవీలు పెరిగాయి. 2023 నాటికి దేశ డిజిటల్ లావాదేవీల్లో యూపీఐ వాటా సగానికి పెరుగుతుంది. అదే సమయానికి దేశ జీడీపీలో డిజిటల్ లావాదేవీల వాటా 20% ఉంటుంది’’ అని మోర్గాన్‌స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. క్రెడిట్ కార్డుల వాటా 4% చెల్లింపుల విలువలో క్రెడిట్ కార్డుల వాటా 51% 2017 డిసెంబర్ నాటికి నగదు రూ.7.8 లక్షల కోట్లు 2018 మే 25 నాటికి నగదు రూ.18.5 లక్షల కోట్లు -
యుద్ధంలో నిలిచి గెలిచాం: మోదీ
న్యూఢిల్లీ: ఏడాది క్రితం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం నిర్ణయాత్మకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 125 కోట్ల మంది ప్రజలు నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారన్నారు. ‘నల్లధనం, అవినీతిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో మద్దతుగా నిలిచిన ప్రజలకు తలొంచి నమస్కరిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. నోట్లరద్దు వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపే చిన్న షార్ట్‌ఫిల్మ్‌ను కూడా ప్రధాని పోస్టు చేశారు. నోట్లరద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధంగా మారిందని, వ్యవస్థలో స్వచ్ఛత తీసుకురావటం వల్ల ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు. అవినీతి, నల్లధనాన్ని పెకలించివేయటంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అభిప్రాయాలను ‘నరేంద్ర మోదీ యాప్’లో తెలపాలన్నారు. -
‘రద్దు’కే మద్దతు
నోట్లరద్దు నిర్ణయానికి ఏడాదైన సందర్భంగా ఎకనమిక్ టైమ్స్ వెబ్సైట్ చేసిన సర్వేలో ప్రజలు మోదీకే మద్దతు తెలిపారు. నోట్లరద్దు ద్వారా అవినీతి, నల్లధనంపై పోరాటంలో అడుగు ముందుకు పడిందని అభిప్రాయపడ్డారు. ఈ సర్వేలో పదివేల మంది పాల్గొన్నారు. సర్వేలో వేసిన ప్రశ్నలు, ప్రజాభిప్రాయాన్ని పరిశీలిస్తే.. ► నోట్లరద్దు నిర్ణయంపై మీ అభిప్రాయం? విజయవంతమైంది 38 శాతం మిశ్రమ ఫలితం 32శాతం విఫలమైంది 30 శాతం ► ఆర్థిక వ్యవస్థపై నోట్లరద్దు ప్రభావం? దీర్ఘకాల నష్టం 26 శాతం పారదర్శకత పెరిగింది 32 శాతం పారదర్శకత పెరిగినా కొన్ని సమస్యలున్నాయి 42శాతం ► ఉద్యోగాలపై నోట్లరద్దు ప్రభావం? ప్రభావమేమీ లేదు 32 శాతం దీర్ఘకాల నష్టం 23 శాతం స్వల్పకాల నష్టమే 45 శాతం ► ఉన్నపళంగా మోదీ రూ.2వేల నోటును రద్దుచేస్తే? నిజాయితీగా పనిచేసే వ్యాపారులకు నష్టం 12 శాతం ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం 31 శాతం అక్రమార్కులకే అసలు సమస్య 56 శాతం ► నోట్లరద్దు వెనక మోదీ వ్యూహం? మత ఘర్షణలనుంచి దృష్టి మరల్చటం 14 శాతం పేదల ఓట్లు గెలవటం 15 శాతం ఆర్థిక వ్యవస్థలో నల్లధనాన్ని తగ్గించటం 71 శాతం ► నోట్లరద్దుతో ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం? ప్రతిష్ట పెరిగింది 55 శాతం పెద్ద ప్రభావమేమీ ఉండదు 19 శాతం మసకబారింది 26 శాతం -
నోట్ల రద్దుతో ఒరిగిందేమిటి?
పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించి నేటికి ఏడా దవుతోంది. నిరుడు నవంబర్ 8 రాత్రి పెద్ద నోట్లన్నీ ఈ క్షణం నుంచి చిత్తు కాగితాలవుతాయని ఆయన చెప్పినప్పుడు అందులోని అంతరార్ధాన్ని అవగాహన చేసుకున్నది చాలా తక్కువమంది. తెల్లారాక వారందరికీ తత్వం బోధపడింది. ఉన్న పెద్ద నోట్లను జమ చేయడానికి, చిన్న నోట్లుగా మార్చుకోవడానికి బ్యాంకు లకు పోతే అవన్నీ కిక్కిరిసి కనబడ్డాయి. అక్కడ గంటల తరబడి ఓపిగ్గా నిలబడ వలసి వచ్చింది. ఏటీఎంలు సరేసరి... అవి మూతబడ్డాయి. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, పేద వర్గాల ప్రజలు ఊపిరి సలపని స్థితిలో కొట్టుమిట్టాడారు. ప్రధాని ప్రకటన తర్వాత వారం రోజులకే పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని గట్టిగా నిల దీస్తాయని, ఏదోమేరకు ఉపశమనం లభించగలదని భావించిన జనానికి నిరాశే ఎదురైంది. ఉభయ సభలూ వాయిదాలతో కాలక్షేపం చేశాయి. పార్టీలన్నీ సభా నిబంధనల చుట్టూ గిరికీలు కొట్టాయి. ఒకపక్క వీధుల్లో బ్యాంకుల ముందూ, కొన్నాళ్లకు వాటితోపాటు ఏటీఎంల ముందూ జనం గంటల తరబడి లైన్లలో నిలబడి నిస్త్రాణలో పడుతుంటేæ– నోట్ల రద్దుపై ప్రధాని మాట్లాడాలా లేక కేంద్ర ఆర్థికమంత్రి మాట్లాడితే సరిపోతుందా? ప్రభుత్వ ప్రకటన తర్వాత సభ్యులు చర్చించాలా లేక చర్చ అయ్యాకే ప్రభుత్వ ప్రకటన ఉండాలా? ప్రభుత్వం జవాబిచ్చాక సభ్యులు మళ్లీ ప్రశ్నించవచ్చా... లాంటి అంశాలపై చెలరేగిన వివా దాలతో కాలం గడిచిపోయింది. దేనిపైనా అంగీకారం కుదరక సభలు స్తంభిం చాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుల్లో అధికభాగం మూజువాణి ఓటుతో ఆమోదం పొందాయి. ఉభయ సభలూ 20 శాతంలోపే పనిచేశాయి. నల్లడబ్బు వెలికి తీయడానికి, అవినీతిని అంతమొందించడానికి, ఉగ్రవాదం, తీవ్రవాదం వంటి సమస్యలు లేకుండా చేయడానికి పెద్ద నోట్ల రద్దు చర్య తీసుకుంటున్నామని నరేంద్రమోదీ చెప్పారు. అనంతరకాలంలో ‘నగదు రహిత లావాదేవీలు పెంచ డం’ వీటికి అదనంగా వచ్చిచేరింది. నిజానికి పెద్ద నోట్ల రద్దు బీజేపీ ప్రచారం చేసుకున్నట్టు ఇదే తొలిసారి కాదు. 1978లో ఆనాటి జనతాపార్టీ ప్రభుత్వం వెయ్యి, అయిదువేలు, పదివేల నోట్లను రద్దు చేసింది. ఆ నోట్ల వాటా మొత్తం చలామణిలో ఉన్న కరెన్సీలో ఒక శాతం మించలేదు. రెండురోజుల్లో ఆ డబ్బంతా బ్యాంకులకు చేరిపోయింది. న్యూఢిల్లీ, ముంబై లాంటిచోట్ల మినహా మిగిలిన నగరాల్లోని బ్యాంకు శాఖల ముందు పెద్దగా క్యూలు లేవు. పలుకుబడి ఉన్నవారు వీటితో సంబంధం లేకుండానే సుల భంగా నోట్లు మార్చుకున్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత నిరుడు జరి గిన పెద్ద నోట్ల రద్దు సమయంలో సైతం పలుకుబడి ఉన్నవారికి సమస్యలు ఎదు రుకాలేదు. చలామణిలో ఉన్న కరెన్సీలో 86 శాతం వాటా ఉన్న పెద్ద నోట్ల రద్దు వల్ల చిరు ఉద్యోగాలు చేసుకుంటున్నవారు, చిన్న వృత్తులవారు, కార్మికులు, వ్యవ సాయ కూలీలు విలవిల్లాడారు. పనులు దొరక్క, అప్పు పుట్టక అలమటించారు. క్యూ లైన్లలో నిలబడి. తోపులాటల వల్ల ప్రాణాలు కోల్పోయిన ఉదంతాలు జరి గాయి. అసంఘటిత రంగంలో దాదాపు 15 లక్షల ఉద్యోగాలు గల్లంతయ్యాయని ఒక అంచనా. రద్దయిన నోట్ల స్థానంలో చాన్నాళ్లకు వచ్చిన రూ. 2,000, రూ. 500 నోట్లు వ్యవహారం మరో ప్రహసనం. ఆ నోట్ల సైజు ఏటీఎంల సాఫ్ట్‌వేర్‌కు అను గుణంగా లేకపోవడంతో సమస్య తీరడానికి మరికొన్నాళ్లు పట్టింది. పెద్ద నోట్ల రద్దు విషయంలో ప్రభుత్వ అంచనాలు ఏమేరకు నెరవేరాయో గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. రద్దయిన నోట్లలో అత్యధిక భాగం బ్యాంకులకు తిరిగొచ్చింది. మొన్న సెప్టెంబర్‌లో రిజర్వ్‌బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం రద్దయిన నోట్లలో 99 శాతం అంటే... రూ. 15.28 లక్షల కోట్ల డబ్బు తిరిగి ఖజానాకు చేరింది. అంటే ప్రభుత్వం లెక్కేసినంతగా నల్లడబ్బు చలామ ణిలో లేదు. ఇక అవినీతి అంతం గురించి చెప్పనవసరమే లేదు. ఇంకా ఏటీఎం లకు కూడా చేరని పెద్ద నోట్లు నేరుగా బడా బాబుల ఇళ్లకే కట్టలు కట్టలుగా వెళ్లాయి. చెన్నైలో బడా వ్యాపారి శేఖర్‌రెడ్డి ఇంట్లో అప్పట్లో భారీయెత్తున రద్దయిన పెద్ద నోట్లు రూ. 96.89 కోట్లు పట్టుబడ్డాయి. రూ. 33 కోట్ల విలువైన రూ. 2,000 నోట్లు దొరికాయి. వీటి వెనకున్న లోగుట్టును రిజర్వ్‌బ్యాంక్, సీబీఐ ఈనాటికీ చెప్పలేకపోయాయి. ఇక జమ్మూ–కశ్మీర్లో మిలిటెన్సీ ఇంతక్రితం కంటే బాగా పెరిగింది. నగదు రహిత లావాదేవీలు మునుపటితో పోలిస్తే పెరిగిన మాట వాస్తవమే అయినా ఇప్పటికీ డబ్బు చలామణియే అధికంగా ఉంది. ఒకేసారి 86 శాతం వాటా ఉండే నోట్లు రద్దు కావడం వల్ల వెనువెంటనే ఆన్లైన్ చెల్లింపులు పెరిగాయనడంలో సందేహం లేదు. కానీ రద్దయిన నోట్ల స్థానంలో కరెన్సీ విడు దలయ్యాక ఆ లావాదేవీలు బాగా తగ్గాయి. పెద్ద నోట్ల రద్దుకు ముందు నెలలో డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 29,942 కోట్లుంటే రద్దు తర్వాత నెల్లాళ్లకు దాని విలువ రూ. 58,000 కోట్లకు చేరింది. కానీ మొన్న ఆగస్టులో డెబిట్ కార్డు లావాదేవీల విలువ రూ. 36,000 కోట్ల మేర ఉంది. నల్లడబ్బు అధికంగా పోగు బడి ఉంటుందని అందరూ భావించే రియల్ఎస్టేట్ రంగంలో మాత్రం ఆన్లైన్ లావాదేవీలు పెరిగాయి. అయితే అది మునుపటిలా కళకళలాడటం లేదు. పెద్దనోట్ల రద్దు వ్యవహారం సంఘటిత లూటీ అని మాజీ ప్రధాని మన్మోహన్ అన్నందుకు కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీ నొచ్చుకున్నారు. కనీసం తగినంత కరెన్సీని సిద్ధం చేసుకుని ఈ చర్యకు దిగితే సాధారణ ప్రజానీకానికి ఇన్ని ఇబ్బందులు ఎదురయ్యేవి కాదు. ప్రభుత్వపరంగా ముందస్తు వ్యూహం లేక పోవడం వల్ల పెద్దనోట్ల రద్దు వల్ల జనం పడరాని పాట్లుబడ్డారు. ఈ చర్య వల్ల దీర్ఘకాలంలో సత్ఫలితాలుంటాయని ప్రభుత్వం చెబుతోంది. అలాంటి భవిష్యత్తు ఉంటుందన్న భరోసా కల్పించాల్సింది వర్తమానమే. అది భారంగా మారిన ప్పుడు భవిష్యత్తు గురించి కలలు కంటూ కూర్చోవడం ఎలా సాధ్యమో పాలకులే చెప్పాలి. -
నోట్ల కష్టాలు రద్దయ్యాయా!
అప్పటిదాకా చెలామణిలో ఉన్న రూ.1,000, రూ.500 నోట్లు రద్దవుతున్నాయంటూ ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించి... ఇప్పటికి సరిగ్గా ఏడాది. ఆ తరవాత కొన్ని నెలలపాటు జరిగిన సంఘటనల్ని బహుశా... దేశం ఎన్నటికీ మరిచిపోలేదేమో!! డబ్బుల కోసం ఏటీఎంల ముందు బారులు తీరటం... బ్యాంకుల్లో కొట్లాడుకోవటం... పెళ్లిళ్ల వంటి కార్యాల్ని కూడా వాయిదా వేసుకోవటం... ఇలా చెప్పలేనన్ని సంఘటనలు జరిగిపోయాయి. ఇదే అవకాశంగా డిజిటల్ మనీ విజృంభించింది. కొత్త వాలెట్లు పుట్టుకొచ్చాయి. డిజిటల్ లావాదేవీలూ పెరిగాయి. కాకపోతే మెల్లగా డబ్బులు అందుబాటులోకి వచ్చేసరికి పరిస్థితి సర్దుమణిగింది. మరి ఈ పెద్ద నోట్ల రద్దు వల్ల వాస్తవంగా ఒనగూరిన లాభనష్టాలేంటి? ప్రధాని కార్యాలయం ఏం చెబుతోంది? వివిధ కంపెనీలు, వాటి ప్రతినిధులు ఏం చెబుతున్నారు? ఒకసారి చూద్దాం... – న్యూఢిల్లీ నోట్ల రద్దుకు ఏడాదైన సందర్భంగా ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్ చేసింది. దాన్లో పేర్కొన్నదాని ప్రకారం... ⇒ డీమోనిటైజేషన్ తరువాత బ్యాంకులు ఒక శాతం వడ్డీతగ్గించాయి. ఇది దేశాభివృద్ధికి దోహపడే అంశం. ⇒ నోట్ల రద్దు నేపథ్యంలో జరిగిన భారీ నగదు డిపాజిట్లు– బ్యాంక్ వడ్డీరేట్ల తగ్గింపునకు దారితీశాయి. ⇒ జనవరి 1న ఎస్బీఐ అనూహ్యంగా ఎంసీఎల్ఆర్ను 0.9 శాతం తగ్గించింది. ఇతర బ్యాంకులూ దీనిని అనుసరించాయి. ⇒ నవంబర్ 8 నాటికి చెలామణిలో ఉన్న నోట్ల మొత్తం విలువ రూ.15,44 లక్షల కోట్లు. దాదాపు రూ.15.28 లక్షల కోట్లు (దాదాపు 99%) వెనక్కు వచ్చేశాయి. రియల్ ఎస్టేట్ ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా అర్బన్ లోకల్ బాడీస్ (యూఎల్బీ) ఆదాయాలు దాదాపు 3 రెట్లు పెరిగాయి. తమ బకాయిలను వినియోగదారులు పాత నోట్లతో తీర్చేయటం దీనికొక కారణం. ఈ తరహా ఆదాయాలు 4 రెట్లు పెరగ్గా, మధ్యప్రదేశ్, గుజరాత్లో ఈ పరిమాణం ఏకంగా ఐదు రెట్లు. డిజిటల్ పేమెంట్ల గణనీయ వృద్ధి... డిజిటల్ పేమెంట్లు గణనీయంగా పెరిగాయి. డెబిట్ కార్డ్ లావాదేవీల సంఖ్య వృద్ధి రేటు ఆగస్టులో 50 శాతం పెరిగి 26.55 కోట్లకు చేరింది. అంతక్రితం ఏడాది ఆగస్టులో డెబిట్ కార్డ్ లావాదేవీల వృద్ధి కేవలం 13.05 శాతం. లావాదేవీల విలువ సైతం 48 శాతం పెరిగి, రూ.35,413 కోట్లకు ఎగసింది. బ్యాంకులు మహా హ్యాపీ... భారత్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా పేర్కొనే బ్యాంకులకు నోట్ల రద్దు తగిన సానుకూల ఫలితాలనే అందించింది. రూ.500, రూ.1,000 నోట్లను రద్దు చేయడం తమకు లాభం కలిగించిందని, డిపాజిట్లు పెరగడంతోపాటు, డిజిటలైజేషన్ వేగం పుంజుకుందని బ్యాంకులు పేర్కొంటున్నాయి. ఎంతో ధనం అధికారిక వ్యవస్థలోకి వచ్చిందని, డిపాజిట్లు 2.5–3 శాతం పెరిగాయని ఎస్బీఐ చైర్మన్ రజనీష్ కుమార్ చెప్పారు. మ్యూచువల్ ఫండ్స్, బీమా రంగాల్లోకి నిధుల వెల్లువ పెరిగిందని ఐసీఐసీఐ బ్యాంకు చీఫ్ చందా కొచ్చర్ చెప్పారు. రెండు స్థానంలో నాలుగు కొత్తవి... నోట్ల రద్దు తరువాత పాత రూ.500, రూ.1,000 నోట్లు వ్యవస్థలోంచి బయటకు వెళ్లిపోయాయి. కొత్త రూపురేఖలతో నాలుగు కొత్తనోట్లు ఆర్థికవ్యవస్థలోకి వచ్చాయి. డీమోనిటైజేషన్ తరువాత కేంద్రం తక్షణం కొత్త రూ.2,000 రూ.500 నోట్లను ఆవిష్కరించింది. ఎనిమిది నెలల తర్వాత కొత్తగా రూ.50, రూ.200 నోట్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. విమర్శలూ ఉన్నాయ్... నోట్ల రద్దు నిర్ణయం పెద్ద ఎత్తున విమర్శలకూ దారితీసింది. అవి చూస్తే... ⇒ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా మందగమనంలోకి జారిపోయింది. నోట్ల రరద్దు జరిగిన తొలి రెండు నెలల కాలంలో ఏటీఎంలు పనిచేయక, చేతుల్లో డబ్బులేక ప్రజలు, వినియోగదారులు త్రీవ కష్టాలు పడ్డారు. చిన్న వ్యాపారాలు పూర్తిగా కుంటుపడ్డాయి. ⇒ మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయ వృద్ధి రేటు (ఏప్రిల్–జూన్) ఆందోళనకరమైన స్థాయిలో మూడేళ్ల కనిష్టానికి 5.7 శాతానికి పడిపోయింది. త్రైమాసిక పరంగా చూస్తే, వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ హోదాను భారత్ తిరిగి చైనాకు కోల్పోయింది. ⇒ పలు ఆర్థిక, రేటింగ్, బ్యాంకింగ్ సంస్థలు దేశ వృద్ధిరేటు అంచనాలను దాదాపు 7 శాతానికి కుదించేశాయి. దీర్ఘకాలంలో డీమోనిటైజేషన్ నిర్ణయం మంచిదని పేర్కొంటూనే తక్షణ అంశాల ప్రాతిపదికన దేశానికి ప్రతికూల ఆర్థిక సంకేతాలను ఇచ్చాయి. ⇒ రద్దయిన నోట్లలో 99 శాతానికి పైగా ఆర్బీఐకి చేరిపోవడం కూడా చర్చనీయాంశమైంది. దేశంలో ఇంతకీ నల్లధనం ఉన్నట్లా, లేనట్లా అన్న సందేహాలు విస్తృతమయ్యాయి. బ్యాంకుల్లో జమైన డబ్బు మొత్తం సక్రమమైనదేననుకుంటే పొరపాటేనని ప్రభుత్వ వర్గాలు ప్రకటిస్తూ వస్తున్నాయి. రియల్టీకి వచ్చే 18 నెలలూ కీలకం... నోట్ల రద్దుతో రియల్టీపై పిడుగు పడినట్లయింది. తరవాత వచ్చిన రెరా, జీఎస్టీ కూడా తొలుత ప్రతికూల ప్రభావాలే చూపించాయి. అయితే ఈ రంగం పురోగతిపై మాత్రం అన్ని వర్గాలూ విశ్వాసంతో ఉన్నాయి. ఇందుకు వచ్చే 12 – 18 నెలలు కీలకమని భావిస్తున్నాం. రియల్ ఎస్టేట్ సెంటిమెండ్ ఇండెక్స్ సెప్టెంబర్ త్రైమాసికానికి కొంత మెరుగుపడటం ఊరటనిచ్చింది. – శిశిర్ బైజాల్, నైట్ ఫ్రాంక్ ఇండియా ఆన్లైన్ సేవలు మెరుగయ్యాయి... నోట్ల రద్దుతో చాలా మంది కస్టమర్లు ఆన్లైన్ సేవలవైపు ఉత్సాహం చూపించారు. బ్యాంక్ రుణ మంజూరీలో మందగమనం ఆన్లైన్ లెండింగ్ పురోగతికి కూడా దోహదపడింది. మా సంస్థ ఇపుడు నెలకు దాదాపు 400 రుణాలను ప్రాసెసింగ్ చేస్తోంది. గత ఏడాది నవంబర్, డిసెంబర్లలో మేం నెలకు 130 రుణాలను మాత్రమే ప్రాసెసింగ్ చేసేవారం. – రజత్ గాంధీ, ఫెయిర్‌సెంట్.కామ్ సీఈఓ ఆర్థిక వ్యవస్థకు మేలే... భారత ఆర్థిక వ్యవస్థకు ఇది సానుకూల ఫలితాలే అందించింది. ప్రతికూలతలు క్రమంగా సడలిపోయాయి. అసంఘటిత రిటైలర్లు కూడా ఆన్లైన్ వైపు మళ్లారు. దీనితో ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత మెరుగుపడింది. డిజిటల్ పేమెంట్లు ఆర్థిక వ్యవస్థపై వ్యయ భారాన్ని తగ్గిస్తాయి. ఇక మా వ్యాపారానికి సంబంధించి చూసినా, ఆన్లైన్ ఆటోమొబైల్ మార్కెట్ వార్షికంగా 220 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోంది. –సందీప్ అగర్వాల్, సీఈఓ ఆన్లైన్ ఆటోమొబైస్ స్టోర్ డ్రూమ్ -
ఆ నోట్లు 99% తిరిగొచ్చాయి!
రద్దయిన నోట్లపై ఆర్బీఐ ప్రకటన ► రూ. 15.44 లక్షల కోట్లకు గానూ ► రూ. 15.28 లక్షల కోట్లు డిపాజిట్ అయ్యాయి ► వెయ్యి నోట్లలో 1.4 శాతమే తిరిగి రాలేదు ► మండిపడ్డ కాంగ్రెస్; ఆర్బీఐకి సిగ్గుచేటని వ్యాఖ్య ముంబై: అవినీతి, నల్లధనంపై పోరాటంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకున్న సంచలన నిర్ణయమైన నోట్ల రద్దు తదనంతర ఫలితాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) వెల్లడించింది. నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్లలో రద్దు అనంతరం 99% బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయని పేర్కొంది. రూ. 15.44 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లలో రూ. 15.28 లక్షల కోట్లు తిరిగి బ్యాంకుల్లో జమ అయ్యాయని తెలిపింది. అంటే, కేవలం రూ. 16, 050 కోట్లు మాత్రమే తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ కాలేదని వెల్లడించింది. అలాగే, రద్దు నిర్ణయం అనంతరం రూ. 1000 నోట్లలో కేవలం 1.4% మాత్రమే తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థలోనికి రాలేదని, 98.6% నోట్లు బ్యాంకుల్లో జమ అయ్యాయని పేర్కొంది. అలాగే, రద్దు నాటికి సంఖ్యాపరంగా, 1,716.5 కోట్ల రూ. 500 నోట్లు చలామణిలో ఉన్నాయని తెలిపింది. అయితే, రద్దయిన రూ. 500 నోట్లలో ఎన్ని తిరిగి వచ్చాయనే కచ్చితమైన సంఖ్యను ఆర్బీఐ వెల్లడించలేదు. 2016–17 ఆర్థిక సంవత్సర వార్షిక నివేదికను బుధవారం విడుదల చేసిన ఆర్బీఐ.. అందులో నోట్ల రద్దు తదనంతర వివరాలను వెల్లడించింది. దేశంలో నల్లధనాన్ని రూపుమాపే లక్ష్యంతో గత సంవత్సరం నవంబర్ 8న రూ. 1000, రూ. 500 నోట్లను ప్రభుత్వం రద్దు చేసింది. అసాధారణ డిపాజిట్లపై విచారణ జరుపుతామని పేర్కొంటూ.. రద్దయిన నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ చివరి వరకు గడవు విధించింది. ఎన్ఆర్ఐలు సహా కొన్ని వర్గాలకు మాత్రం షరతులతో జూన్ 30, 2017 వరకు పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు అవకాశమిచ్చింది. అనంతరం, కొత్త డిజైన్‌లో రూ. 500 నోట్లను, కొత్తగా రూ. 2 వేల నోట్లను మార్కెట్లోకి ఆర్బీఐ విడుదల చేసింది. తాజాగా, రూ. 200, కొత్త డిజైన్‌లో రూ. 50 నోట్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ. 1000 నోటును మాత్రం మళ్లీ తీసుకురాలేదు. కాగా, 2016, డిసెంబర్ 2న నోట్ల రద్దు వివరాలను ఆర్థిక శాఖ సహాయమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ లోక్‌సభకు తెలిపారు. అప్పుడు, రద్దయిన రూ. 1000 నోట్ల సంఖ్యను ఆయన 685.8 కోట్లుగా పేర్కొన్నారు. అప్పటికి మార్కెట్లో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్ల మొత్తం విలువ రూ. 15.44 లక్షల కోట్లని తెలి పారు. ఆ వివరాలకు, బుధవారం ఆర్బీఐ వెల్లడించిన వివరాలకు తేడా ఉండటం గమనార్హం. వారికి నోబెల్ ఇవ్వాలి: చిదంబరం నోట్ల రద్దును సిఫారసు చేసిన ఆర్బీఐ ఇప్పుడు ఈ వివరాలతో సిగ్గుపడాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరం మండిపడ్డారు. ‘నోట్ల రద్దు.. బ్లాక్‌మనీని వైట్‌గా మార్చుకొనే పథకమా? అని ప్రశ్నించారు. నోట్ల రద్దుకు ప్రణాళిక రచించినవారికి నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ ఎద్దేవా చేశారు. రూ. 15.44 లక్షల కోట్లలో రూ. 16 వేల కోట్లు మాత్రమే వెనక్కురాకపోవడంపై స్పందిస్తూ.. ‘రూ. 16 వేల కోట్లు సంపాదించి.. కొత్త నోట్ల ప్రింటింగ్ కోసం రూ. 21 వేల కోట్లను పోగొట్టుకుంది’ అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. పార్లమెంటరీ కమిటీకి తప్పుడు వివరాలు ఇచ్చినందుకు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై సభాహక్కుల ఉల్లంఘన తీర్మానాన్ని ప్రవేశపెడ్తానని సమాజ్‌వాదీ నేత నరేశ్ అగర్వాల్ హెచ్చరించారు. నోట్ల రద్దు విజయవంతం: జైట్లీ నోట్లరద్దు నిర్ణయం విఫలమైందన్న వాదనను ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తోసిపుచ్చారు. ‘నల్లధనం నిర్మూలన, ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని తగ్గించడం, పన్ను చెల్లింపుదారుల విçస్తృతి తదితర నోట్ల రద్దు లక్ష్యాలను సాధించగలిగాం’ అన్నారు. బ్యాంకుల్లో డిపాజిట్ అయి న నగదులో గణనీయ భాగం నల్లధనమయ్యే అవకాశముందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆర్బీఐ నివేదికలోని వివరాలు ♦ సంఖ్యాపరంగా.. 632.6 కోట్ల వెయ్యి నోట్లలో 8.9 కోట్ల నోట్లు మాత్రమే బ్యాంకుల్లో జమ కాలేదు. అంటే 623. 7 కోట్ల నోట్లు తిరిగి వ్యవస్థలోకి వచ్చాయి. విలువ పరంగా.. రూ. 6.326 లక్షల కోట్లలో రూ. 8,900 కోట్లు మాత్రమే బ్యాంకుల్లోకి తిరిగి రాలేదు. ♦ మార్చి 31, 2017 నాటికి 588. 2 కోట్ల కొత్త, పాత రూ. 500 నోట్లు మార్కెట్లో ఉన్నాయి. అలాగే, మార్చి 31, 2016 నాటికి మార్కెట్లో ఉన్న రూ. 500 నోట్ల సంఖ్య 1,570.7 కోట్లు. ♦ కరెన్సీ నోట్ల ప్రింటింగ్ ఖర్చు భారీగా పెరిగింది. 2015–16లో రూ. 3,421 కోట్లు ఖర్చు కాగా, 2016–17లో అది రెండింతలు దాటి రూ. 7,965 కోట్లకు చేరింది. ♦ చలామణిలో ఉన్న నగదు విలువ 2017 మార్చి నాటికి 13.1 లక్షల కోట్లు. గత సంవత్సరం కన్నా ఇది 20.2% తక్కువ. ♦ గత మార్చి నాటికి చలామణిలో ఉన్న నగదు విలువలో రూ.2 వేల నోట్ల వాటా 50.2% (సంఖ్యాపరంగా 328.5 కోట్ల నోట్లు). ♦ 2016 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన నకిలీ నోట్ల సంఖ్య 6.32 కోట్లు కాగా, 2017లో అది 7.62 కోట్లు. ♦ ఆర్బీఐ శాంపిల్ సర్వేలో నోట్ల రద్దు నాటికి చలామణిలో ఉన్న పది లక్షల రూ. 500 నోట్ల లో సగటున 7.1 నోట్లు, 10 లక్షల రూ. వెయ్యి నోట్లలో 19.1నోట్లు నకిలీగా తేలాయి. -
రాష్ట్రానికి పెద్ద నోట్ల కోత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి రూ.2,000 నోట్ల సరఫరాను రిజర్వు బ్యాంకు పూర్తిగా నిలి పేసింది. వాటి స్థానంలో రూ.500 నోట్లను పంపిణీ చేస్తోంది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఇప్పటివరకు రాష్ట్రానికి రూ. 67 వేల కోట్ల విలువైన నోట్లను రిజర్వు బాంకు సరఫరా చేయగా వాటిలో దాదాపు 90 శాతం రూ.2,000 నోట్లే ఉన్నాయి. అందుకు భిన్నంగా ఈ మధ్య కాలంలో రాష్ట్రంలో రూ.2,000 నోట్ల సరఫరా తగ్గింది. ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత పెద్ద నోట్ల పంపిణీ ఆర్బీఐ భారీగా తగ్గించేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి 3 నెలల్లో రిజర్వు బాంకు నుంచి రాష్ట్రానికి రూ. 25 వేల కోట్ల విలువైన కరెన్సీ రాగా, అందులో అధికంగా రూ.500, రూ.100 నోట్లున్నాయి. రూ.2,000 సరఫరా 5 శాతం మించిలేదని అధికారులు చెబుతున్నారు. చిల్లర సమస్యతో పాటు గ్రామీణ ప్రాంతాల అవసరాల దృష్ట్యా చిన్న నోట్ల చలామణికే బ్యాంకు ప్రాధాన్యమిస్తోందనే అభిప్రాయాలున్నాయి. మరోవైపు ఆర్బీఐ త్వరలోనే కొత్తగా రూ.200 నోట్లను ముద్రించి చలామణిలోకి తెచ్చే అవకాశాలున్నాయి. రూ. 2,000 నోట్ల సరఫరాను తగ్గించి రద్దు చేయాలని ఆర్బీఐ యోచిస్తున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు భావిస్తున్నాయి. -
నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే
న్యూఢిల్లీ: నోట్లరద్దు ప్రక్రియలో భాగమైన ప్రతి ప్రభుత్వ విభాగం అందుకు సబంధించిన సమాచారాన్ని బయట పెట్టాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు. రద్దు సమయంలో ఎంత డబ్బు, ఎంత మందికి మార్చి ఇచ్చారో తెలపాలని ఓ వ్యక్తి పింటోపార్క్ ఎయిర్‌ఫోర్స్ పోస్టాఫీస్‌కు సమాచార హక్కు (సహ) దరఖాస్తు చేశారు. అందుకు అధికారులు నిరాకరించడంతో అప్పీల్ చేశారు. కేసును విచారించిన శ్రీధర్ పై విధంగా వ్యాఖ్యానించారు. -
జీతాలు రావు.. జీవితాలకూ దెబ్బే!
పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటికీ పనిచేయని 25 శాతం ఏటీఎంలు వాటి మూతతో ఏటీఎం నిర్వహణ సంస్థల నష్టం రూ.600 కోట్లు నగదు సరఫరా చేసే క్యాష్ లాజిస్టిక్ సంస్థల నష్టం రూ.170 కోట్లపైనే ఏటీఎంల తయారీ, వాటితో ముడిపడి ఉన్న సంస్థలన్నీ నష్టాల్లోనే.. చివరికి సెక్యూరిటీ గార్డులనందించే ఏజెన్సీలపైనా ప్రభావం ఏటీఎంల ముందుండే సెక్యూరిటీ గార్డుల వేతనాల్లో కోత నగదు కొరతలో వైట్ లేబుల్ ఏటీఎంలు.. క్యాష్ లాజిస్టిక్ సంస్థల మూత ఈ ఏటీఎం ఆర్థిక వ్యవస్థ డిజిటల్ వైపు మళ్లడం ప్రశ్నార్థకమే! ఏటీఎం అంటే.. ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్.. మన దృష్టిలోమాత్రం ఎనీ టైమ్ మనీ! కానీ పెద్ద నోట్ల రద్దు తర్వాత చాలా ఏటీఎంలకు అర్థం మారిపోయింది. ఇప్పుడు ఎనీ టైమ్ మూత! అనుకోవాల్సి వస్తోంది. ఎందుకంటే నోట్ల రద్దు నాటి నుంచి ఇప్పటిదాకా డబ్బుల ముఖం చూడని ఏటీఎంలు చాలానే ఉన్నాయి. దేశంలో నగదు వినియోగం తగ్గి డిజిటల్ వైపు మళ్లాలనేది ప్రభుత్వ సంకల్పం. అందుకోసం నగదు తక్కువగా అందుబాటులో ఉండేలా చేసి.. రకరకాల డిజిటల్ పేమెంట్ వ్యవస్థల్ని అందుబాటులోకి తెస్తోంది. డిజిటల్ వైపు మళ్లితే.. జవాబుదారీతనం పెరుగుతుందని, పన్నుల వసూళ్లు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతోంది.... కానీ ఇదంతా నోటుకు ఒకవైపు మాత్రమే. అదే మరోవైపు చూస్తే.. దారుణమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏటీఎంలు పనిచేయకుంటే సామాన్యుల జీతాలు చేతికి రావు. ఏటీఎంల చుట్టూ అల్లుకున్న కొన్ని వేల జీవితాలు కూడా ఛిద్రమైపోతున్నాయ్. ఏటీఎంల చుట్టూ ఉన్న ఆర్థిక వ్యవస్థ కొన్ని వేల కోట్లు నష్టపోతోంది. ఆ వ్యవస్థపై ఆధారపడ్డ చిన్నాపెద్దా ఉద్యోగులంతా దిక్కులు చూస్తున్నారు. ఈ చీకటి కోణంపై ఈ వారం ‘ఫోకస్’.. (శ్రీనాథ్ అడెపు, సాక్షి బిజినెస్ బ్యూరో) చిన్నపిల్లలు కథ చెప్పమని అడగ్గానే.. తల్లిదండ్రులైనా, తాతబామ్మలైనా మొదట చెప్పేది ఏడు చేపల కథే. ఎండలేని చేప వెనుక ఎంత నిర్లక్ష్యపు నెట్వర్క్ ఉందో చెప్పడమే ఆ కథ ఉద్దేశం. ఇప్పుడు అదే కథను ఏటీఎంలకు అన్వయిస్తే!? ఎందుకంటే ఎన్నో ఏటీఎంలున్నా చాలా వాటిలో డబ్బుల్లేవు. కొన్నయితే తెరుచుకోవటమే లేదు. మరి ఏటీఎంకు వెళ్లి.. ఏటీఎం ఏటీఎం ఎందుకు డబ్బులివ్వటం లేదని అడిగితే అది ఏం చెబుతుంది? డబ్బులు లోడ్ చేయకుండా నేనెక్కడిస్తా అంటుంది.. లోడ్ చేసే సంస్థని అడిగితే బ్యాంకులు డబ్బులివ్వందే తామెలా పెడతా మంటాయి. మరి బ్యాంకుల్ని అడిగితే రిజర్వు బ్యాంకువైపు వేలు చూపిస్తాయి.. రిజర్వుబ్యాంకును అడిగితే.. డబ్బులెందుకు? డిజిటల్ లావాదేవీలు చేసుకోవచ్చుగా? అంటుంది. కానీ ఈ గొలుసులో బయటకు కనిపించకుండా దెబ్బతిన్న పాత్రలు చాలానే ఉన్నాయి. అవి జవాబుదారీ కాకపోయినా ప్రభావి తమయ్యాయన్నది మాత్రం పచ్చినిజం. నష్టాల్లో సంస్థలు ఈ ఏటీఎం గొలుసులో దెబ్బతిన్న వాటిలో మొదట చెప్పుకోవాల్సింది ఏటీఎం తయారీ సంస్థల గురించి.. తరవాత క్యాష్ లాజిస్టిక్ కంపెనీలు, నిర్వహణ సంస్థలు, ఏటీఎం సెక్యూరిటీ సంస్థల గురించి..! ప్రస్తుతం దేశంలోని 2,07,402 ఏటీఎంలలో 25 శాతం అంటే 51,850 ఏటీఎంలు మూతపడి ఉన్నట్లు సమాచారం. దీంతో ఈ గొలుసు సంస్థలు రోజుకు రూ.5 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంటున్నాయి. మూతపడిన ఏటీఎంల సంఖ్య ఇంకా ఎక్కువేనన్నది పరిశ్రమ వర్గాల మాట. ఆ లెక్కన నష్టమూ ఎక్కువే. నవంబర్ 9 నుంచి చూస్తే.. ఇప్పటిదాకా ఏటీఎం నిర్వహణ సంస్థలకు రూ.600 కోట్లు, నగదు సరఫరా చేసే లాజిస్టిక్ సంస్థలకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని ఆయా సంస్థలు చెబుతున్నాయి. అంటే రోజుకు రూ.5 కోట్ల చొప్పున మొత్తం రూ.770 కోట్ల నష్టం. ఇక సెక్యూరిటీ సంస్థలు, నిర్వహణ సంస్థల నష్టాన్ని కూడా కలిపితే ఇంకా పెరుగుతుంది. ఏపీ, తెలంగాణల్లో 17 వేల ఏటీఎంలు ఆర్బీఐ గణాంకాల ప్రకారం ప్రస్తుతం దేశంలో 52 బ్యాంకులు, 2,07,402 ఏటీఎంలున్నాయి. ప్రతి లక్ష మంది జనాభాకు 19.7 ఏటీఎంల చొప్పున అన్న మాట. మహారాష్ట్రలో అత్యధికంగా 24,829 ఏటీఎంలుండగా... తమిళనాట 23,728 ఏటీఎంలు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి 17 వేల ఏటీఎంలున్నాయి. ఈ ఏటీఎంలలో అత్యధికం బ్రౌన్ లేబుల్ కాగా.. దీన్నొక వ్యాపారంగా భావించి వైట్‌లేబుల్ ఏటీఎంలు కూడా నాలుగేళ్ల కింద రంగంలోకి దిగాయి. ప్రైవేటు సంస్థల ‘వైట్ లేబుల్’ ఏ ఏటీఎంపై అయినా దాని బ్యాంకు లోగో ముద్రించి ఉంటుంది. ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ.. ఇలా ముద్రించి ఉన్నవన్నీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలే. వైట్ లేబుల్ ఏటీఎంలకు బ్యాంకు లోగోలుండవు. వీటిని పూర్తిగా ప్రైవేట్ కంపెనీలు నిర్వహిస్తుంటాయి. అంటే ఏటీఎం యంత్రాన్ని కొనటం నుంచి సాఫ్ట్వేర్, నిర్వహణ, నగదు సరఫరా వరకు అన్ని సేవలూ ప్రైవేట్ సంస్థలే నడిపిస్తాయి. ఈ కంపెనీలకు ఏం లాభమంటే? మనం ఏ బ్యాంకు క్రెడిట్/డెబిట్ కార్డుతో ఆ ఏటీఎంలో లావాదేవీలు నిర్వహిస్తామో ఆ బ్యాంకు వైట్ లేబుల్ సంస్థలకు ఇంటర్చేంజ్ చార్జీలను చెల్లిస్తుంది. ⇒ ఇంటర్చేంజ్ చార్జీలు నగదు లావాదేవీలకైతే ఒక్కో దానికి రూ.15, నాన్ –క్యాష్ లావాదేవీలకు అంటే ఖాతా వివరాలు, మినీ స్టేట్మెంట్, చెక్‌బుక్ రిక్వెస్ట్, పిన్ చేంజ్ వంటి వాటికైతే ఒక్కోదానికి రూ.5 చొప్పున ఉంటాయి. ⇒ టాటా కమ్యూనికేషన్స్ , ఎన్ సీఆర్, ముత్తూట్ ఫైనాన్స్ , హిటాచీ, వక్రంగి, ఏజీఎస్ తదితర 15 కంపెనీలు ఈ రంగంలో సేవలందిస్తున్నాయి. బ్యాంకులు+ ఔట్సోర్సింగ్ = బ్రౌన్ లేబుల్ ⇒ బ్యాంకు లోగోలున్నవన్నీ బ్రౌన్ లేబుల్ ఏటీఎంలే. వీటిలో బ్యాంకు ఆవరణలో ఉండేవి ఆన్ సైట్, ఇతర ప్రాంతాల్లో ఉండేవి ఆఫ్‌సైట్ ఏటీఎంలు. ఈ ఏటీఎంలలో చాలావరకూ బ్యాంకులు ఔట్సోర్సింగ్కే ఇస్తాయి. ⇒ నగదు సరఫరా, ఏటీఎం స్థలాన్ని ఎంపిక చేయటం మాత్రమే బ్యాంకులు చేస్తాయి. వాటిలో విద్యుత్ సరఫరా, స్టేషనరీ, మౌలిక ఏర్పాట్లు, సెక్యూరిటీ గార్డు వంటివన్నీ ప్రైవేట్ సంస్థలే నిర్వహిస్తాయి. ఇందుకు బ్యాంకులు నెలవారీ చార్జీలు చెల్లిస్తాయి. ⇒ ఎన్ సీఆర్, టాటా, హిటాచీ, ఐసీఐసీ ఐ, ధనలక్ష్మి, రత్నా కర్ తదితర సంస్థ లు ఈ నిర్వహణ రంగంలో ఉన్నాయి. వైట్‌లేబుల్ మూత..బ్యాంకులకూ నష్టమే బ్యాంకులు తమ ఆదాయంలో 20–25 శాతాన్ని ఏటీఎంలపై ఖర్చు చేస్తుంటాయి. వాటివల్ల బ్యాంకులకు ఆదాయమేమీ రాకపోయినా ఖాతాదారులకు అందుబాటులో ఉండటానికి ఆ ఖర్చు తప్పదు. ఒక్కో ఏటీఎం నిర్వహణకు బ్యాంకుకు నెలకు రూ.50 వేల వరకు ఖర్చవుతోంది. దీన్ని బ్యాంకులు రికవరీ చేయాలంటే ఆయా ఏటీఎం నుంచి నెలకు 5 వేలు లేదా రోజుకు 170 లావాదేవీలు జరగాల్సి ఉంటుంది. కానీ నోట్ల రద్దు తర్వాత ఈ లావాదేవీల సగటు 120కి పడిపోయినట్లు ఆలిండియా బ్యాంకు ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ చెప్పారు. ‘‘దీంతో బ్యాంకుల ఏటీఎంలూ నష్టాల్లోనే నడుస్తున్నాయి. కానీ బ్యాంకులకు ఇతరత్రా ఆదాయ మార్గాలుంటాయి కనక ఈ వ్యయాన్ని భరిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు. ప్రైవేటు సంస్థలు నిర్వహించే వైట్ లేబుల్ ఏటీఎంలు ఈ వ్యయాన్ని భరించలేక.. నగదు కొరతతో ఏటీఎంలను మూసేస్తున్నాయి. వైట్ లేబుల్ ఏటీఎంల నష్టం రూ.600 కోట్లు 2012లో వైట్ లేబుల్ ఏటీఎంలకు ఆర్బీఐ అనుమతిచ్చింది. ప్రస్తుతం ఇవి దేశవ్యాప్తంగా 13,900 దాకా ఉన్నాయి. టాటా కమ్యూనికేషన్స కు 9,060, బీటీఐ పేమెంట్స్‌కు 4,096, హిటాచీ పేమెంట్స్‌కు 652, వక్రంగీకి 328, ముత్తూట్‌కు 207, ఏటీఎస్‌కు 218 ఏటీఎంలు ఉన్నాయి. వాటిలో 45 శాతం గ్రామీణ, ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనే ఉన్నాయి. ప్రస్తుతం అవన్నీ మూతపడి ఉన్నాయి. నోట్ల రద్దు నుంచి ఇప్పటివరకు వైట్ లేబుల్ ఏటీఎంల నిర్వహణ కంపెనీలకు రూ.600 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. 60 వేల మంది ఉద్యోగుల భవిష్యత్తేంటి? దేశంలో ఎన్ సీఆర్, ఒర్టెక్స్, ఏసీజీ, క్యాష్ కనెక్ట్, డైబోల్డ్ నిక్స్డోర్ఫ్, ఎఫ్ఎస్ఎస్, టీఎండీ సెక్యూరిటీ, జీఎంవీ వంటి 20కి పైగా కంపెనీలు ఏటీఎంల తయారీలో ఉన్నాయి. ఇవి ఏటీఎం తయారీతో పాటూ సాఫ్ట్వేర్, సీఆర్ఎం, నగదు నిర్వహణ, నెట్వర్క్ మేనేజ్మెంట్ వంటి సేవలు కూడా అందిస్తుంటాయి. నవంబర్‌లో పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధాని ప్రకటన చేయటానికి వారం రోజుల ముందే 18–20 వేల కొత్త ఏటీఎంల తయారీ కోసం వాటికి ఆర్డర్లు వచ్చాయి. కానీ నోట్ల రద్దు తరవాత పరిస్థితి మారిపోయింది. ఉన్న ఏటీఎంలనే తగ్గించుకోవటానికి బ్యాంకులు ప్రయత్నిస్తున్నాయి. ‘‘ఉన్న ఏటీఎంలకే డబ్బులివ్వలేకపోతున్నాం. అంతా డిజిటల్‌వైపు మళ్లుతున్న తరుణంలో కొత్త ఏటీఎంలు ఇకపై అవసరం ఉండకపోవచ్చు’’ అని ఓ బ్యాంకు ప్రతినిధి వ్యాఖ్యానించారు. ఇదే విషయాన్ని తాము ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) తరఫున ఆర్బీఐకి ప్రతిపాదించనున్నట్లు తెలిపారు. దీంతో బ్యాంకులు ఆర్డర్లను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘‘అలాగని చెప్పలేం. ఈ పరిస్థితి కొద్ది కాలమే ఉంటుంది. మరో 6 నెలల్లో పరిస్థితి సానుకూలంగా మారుతుంది’’ అని హిటాచీ పేమెంట్ సర్వీసెస్ ఎండీ లినోయ్ ఆంటోని ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం దేశంలోని ఏటీఎం తయారీ సంస్థల్లో సుమారు 60 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పుడు వారికి చేతినిండా పనిలేదు. ఏటీఎంల ఆర్డర్లు లేక సతమతమవుతున్న కంపెనీలు ఉద్యోగులకు వేతనాలు చెల్లించటం భారంగా మారుతున్నట్లు ఓ కంపెనీ ప్రతినిధి వ్యాఖ్యానించారు. సెక్యూరిటీ గార్డుల జీతాలూ తగ్గాయి! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 800 ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలున్నాయి. వాటిలో నాలుగు లక్షల మంది ఉద్యోగులున్నారు. వీరిలో 50 వేల మంది ఏటీఎం సెక్యూరిటీ గార్డులేనని అసోసియేషన్ ఆఫ్ ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అధ్యక్షుడు సి.భాస్కర్‌రెడ్డి ‘సాక్షి’తో చెప్పారు. ‘‘గార్డుల విభాగంలో 20 శాతం కొరత ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో గార్డు ఉద్యోగం అంటే చిన్నచూపు. అందుకే అస్సాం, బిహార్, మహారాష్ట్ర నుంచి తీసుకుంటుంటాం. వారికి ఎక్కువ పనిగంటలు కల్పిస్తూ వేతనాలు ఎక్కువొచ్చేలా చేస్తాం. అంటే 8 గంటల పని దినాలను 4 గంటల ఓవర్‌టైం కలిపి 12 గంటలు చేస్తాం. దీంతో వారికి రూ.10–11 వేల జీతం వస్తుంది. నోట్ల రద్దు తర్వాత ఏటీఎంలు ఖాళీగా ఉంటుండడంతో బ్యాంకులు సెక్యూరిటీ గార్డులు వద్దంటున్నాయి. వారికి పని కల్పించడం కోసం మిగతా వాళ్ల పని గంటలను తగ్గిస్తున్నాం. దీంతో గార్డుల వేతనాల స్థాయి రూ.6 వేలకు పడిపోయింది’’ అని వివరించారు. ఇంకా చెప్పాలంటే ఏటీఎం సెక్యూరిటీ గార్డులకు కేటాయించే 3 జతల దుస్తులు, షూలు ఇప్పుడు పనికిరాకుండా మూల నపడున్నాయి. వాటి మీద ఆధారపడి ఉన్న బట్టలు కుట్టేవాళ్లు, లాండ్రీ షాపులు వంటి వ్యాపారులకూ ఇబ్బందే. ఇక ఏటీఎంల కోసం షట్టర్లు కేటాయిస్తే ఎక్కువ అద్దె వస్తుందని ఆశపడేవారికీ చుక్కెదురే. ఇవన్నీ చెబుతూ పోతే... ఏటీఎంల చుట్టూ చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థే ఉంది. మరి ఇదంతా డిజిటల్‌కు మళ్లుతుందా? ఏమో! నగదు సరఫరా సంస్థలూ దెబ్బతిన్నాయ్! బ్యాంకు నుంచి ఏటీఎంకు నగదును సరఫరా చేసేందుకు ప్రత్యేకంగా క్యాష్ లాజిస్టిక్ సంస్థలున్నాయి. దేశంలో ఎక్సెల్ క్యాష్ మేనేజ్మెంట్, చెక్‌మేట్, బ్రింక్స్ ఆర్య ఇండియా, ఐఎస్ఎస్–ఎస్డీబీ, ఎస్ఐఎస్ క్యాష్ సర్వీసెస్, సీఎంఎస్ సెక్యూరిటీస్, రింటర్ సేఫ్‌గార్డ్ వంటి 50కి పైగా సంస్థలు ఈ రంగంలో ఉన్నాయి. ఇవన్నీ స్ట్రాంగ్ రూమ్స్, ఏటీఎం రీప్లేస్మెంట్, క్యాష్ పికప్, డెలివరీ, క్యాష్ ఇన్ ట్రాన్సిట్, స్మార్ట్ కార్డ్స్, పాస్‌పోర్ట్, డాక్యుమెంట్స్ వంటి సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థల్లో లక్షకు పైగా లాజిస్టిక్ వాహనాలు, 2 లక్షల మంది ఉద్యోగులుంటారని క్యాష్ లాజిస్టిక్స్ అసోసియేషన్ (సీఎల్ఏ) చెబుతోంది. నగదు సరఫరా లేక ఈ వాహనాలు ఖాళీగా ఉంటున్నాయని, దీంతో ఈ సంస్థలకు రూ.170 కోట్ల నష్టం వాటిల్లిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 14 క్యాష్ లాజిస్టిక్స్ సంస్థలు, 42 వేల వాహనాలున్నాయి. క్యాష్ లాజిస్టిక్ సంస్థల్లో డ్రైవర్లు, గన్ మన్లు, కస్టోడియన్లు, లోడర్స్, క్యాష్ ఆపరేటర్స్, మేనేజర్లు.. ఇలా 85 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఒక్క ఏటీఎంలో నెలకు 10 సార్లు నగదు నింపితే వీరికి చెల్లించేది రూ.7 వేలు. ఒక ఏటీఎంలో నగదును నింపటానికి డ్రైవర్, గన్ మన్, కస్టోడియన్, క్యాష్ లోడర్, క్యాష్ ఆపరేటర్ మొత్తం ఐదుగురు ఉద్యోగుల అవసరముంటుంది. ‘‘నోట్ల రద్దుకు ముందువరకూ ఈ సంస్థలు రోజుకు రూ.15,000 కోట్ల నగదును సరఫరా చేసేవి. ఇపుడు రూ.5,000 కోట్లు కూడా కష్టంగా మారింది. కనీసం 10 వేల వాహనాలు కూడా తిరగటం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రోజుకు రూ.15–20 లక్షల నష్టం వాటిల్లుతోంది’’ అని ఎక్సెల్ క్యాష్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ సి.మురళీ మాధవన్ ‘సాక్షి’తో చెప్పారు. క్యాష్ సరఫరా వాహనాలు ప్రత్యేకంగా తయారు చేసేవి కనుక వీటిని ఇతర అవసరాలకు వినియోగించలేరు. వాహనాలను ఖాళీగా ఉంచటం, ఉద్యోగులకు వేతనాలు చెల్లించాల్సి రావటంతో.. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన 3 కంపెనీలు బోర్డు తిప్పేశాయి. క్యాష్ ట్రాన్సిట్ సేవలతో పాటూ ఇతర వ్యాపారాలు కూడా చేస్తున్న ఒకటిరెండు పెద్ద కంపెనీలు మినహా మిగిలినవన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. అమెరికాకు చెందిన బ్రింక్స్.. ఇండియాలోని బ్రింక్స్ ఆర్య ఇండియా యూనిట్‌ను రూ.400 కోట్లకు విక్రయించేందుకు సిద్ధమైంది కూడా. -
నోట్ల రద్దు, సర్జికల్ దాడులు భేష్!
-
నోట్ల రద్దు, సర్జికల్ దాడులు భేష్!
అవినీతి, నల్లధనంపై కేంద్రం సాహసోపేత నిర్ణయం ► సంయుక్త పార్లమెంటు భేటీలో రాష్ట్రపతి ప్రశంస ► ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలన్న ప్రణబ్ న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పెద్దనోట్ల రద్దు, సర్జికల్ దాడులతో పాటు పలు ప్రభుత్వ పథకాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రశంసల వర్షం కురిపించారు. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సెంట్రల్హాల్లో ఉభయసభలనుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ సర్కారు తీసుకున్న నిర్ణయాలను, సమాజంలో మార్పుకోసం తెచ్చిన పథకాలను అభినందించారు. ‘దేశం ఎదుర్కొంటున్న అవినీతి, నల్లధనం, ఉగ్రవాదం వంటి అంశాలపై దేశ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుంది’ అని అన్నారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు.. ఉగ్రవాద చొరబాట్లపై సర్జికల్‌దాడులకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని.. దీన్ని విజయవంతంగా అమలుచేసిన సైన్యం ధైర్య సాహసాలను ప్రణబ్ ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ► లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించటం వల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ఆటంకమేర్పడుతుంది. దీంతోపాటు అత్యవసర సేవలకు, ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అందుకే ఒకేసారి ఎన్నికలపై చర్చ జరగాలనే అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పార్టీలకు నిధులివ్వటం ద్వారా ఎన్నికల్లో ధనప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకూ ఆస్కారం ఉంటుంది. ఈ దిశగా ఎన్నికల సంఘం తీసుకుంటున్న చొరవ అభినందనీయం. ► నాలుగు దశాబ్దాలుగా భారత్‌కు సవాల్‌గా మారిన ఉగ్రవాదంపై పోరులో భారత సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంసనీయం. భారత్‌లో విధ్వంసానికి ప్రయత్నించిన చొరబాటుదారులకు సరైన సమాధానమిచ్చేలా వారి స్థావరాలపై సెప్టెంబర్ 29న భారత ఆర్మీ సర్జికల్‌దాడులు చేపట్టింది. ఈ దాడులను విజయవంతంగా పూర్తిచేయటంలో భారత భద్రతా దళాల అసమాన ధైర్యసాహసాలు అభినందనీయం. ► బలమైన భారత స్థూల ఆర్థిక విధానాల వల్ల సుస్థిర అభివృద్ధికి వేదిక ఏర్పడింది. దీనివల్లే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత్ ఓ వెలుగుదివ్వెలా మారింది. ఈ దిశగా నల్ల ధనాన్ని, పన్ను ఎగవేతను అరికట్టేందుకు తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం భేష్. కేంద్రం నిర్ణయాల కారణంగా 2014 నుంచి ద్రవ్బోల్బణం రేటు, చెల్లింపులు, కరెంట్ అకౌంట్ లోటు, ద్రవ్యలోటు వంటివి మెల్లిగా తగ్గుముఖం పట్టాయి. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ► డిసెంబర్ 30న ప్రధాని ప్రారంభించిన భీమ్ యాప్ చాలా ప్రాచుర్యం (జనవరి 15 వరకు 1.1 కోట్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు) పొందింది. త్వరలో ఆవిష్కరించనున్న ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ చెల్లింపు వ్యవస్థ దేశంలో సాంకేతిక విప్లవానికి బాటలు వేయనుంది. ► యువతే మన దేశానికి బలం. ఈ యువత నైపుణ్యాన్ని పెంచి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచేందుకు దేశవ్యాప్తంగా 50 భారత–అంతర్జాతీయ నైపుణ్య కేంద్రాలను కేంద్రం ప్రారంభించింది. కేంద్రం రూ.6 వేల కోట్లతో చేపట్టిన పథకాల వల్ల 1.1 కోట్ల ఉద్యోగాల కల్పన జరగనుంది. ► భవిష్యత్ భారతం కోసం అత్యాధునిక మౌలికవసతుల కల్పన ప్రభుత్వ ధ్యేయం. సాగరమాల, గ్రామీణ భారతంలో వెలుగులు తీసుకురావటం, స్మార్ట్ సిటీలు, హైవేలు, రైల్వేలు, గ్యాస్ పైప్లైన్లు, ఐ–వేల (కంప్యూటర్ అనుసంధానం) వంటి పలు అంశాలు ప్రభుత్వ ప్రాధాన్యత జాబితాలో ఉన్నాయి. మావోయిస్టులప్రభావం ఉన్న 44 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకోసం 5వేల కి.మీ. రోడ్లు వేస్తున్నారు. మౌలికవసతుల కల్పన కోసం ఇప్పటికే రూ. లక్షకోట్ల విలువైన కార్యక్రమాలు అమలవుతున్నాయి. ►దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లే యత్నంలో ఈశాన్య రాష్ట్రాలను కేంద్రం ‘అష్టలక్ష్మి’గా భావిస్తోంది. ఆగ్నేయాసియాతో భారత్‌ను కలిపే ఈ రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటుతో కుప్పకూలిన ఎంపీ రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలోనే కేంద్ర మాజీ మంత్రి, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఎంపీ ఈ.అహ్మద్ (78) గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయనను రామ్ మనోహర్ లోహి యా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. పార్లమెంట్ సైడ్‌లైన్స్ ⇒ రాష్ట్రపతి ప్రణబ్ ప్రసంగంలో పెద్ద నోట్లరద్దు, సర్జికల్ దాడులను ప్రస్తావించినప్పుడు అధికార ఎన్డీఏ సభ్యులు బల్లలు చరుస్తూ హర్షం వ్యక్తం చేయగా, విపక్ష సభ్యులు మాత్రం నిరుత్సాహం వ్యక్తం చేశారు. ⇒ గతంలో ఉమ్మడి సమావేశాలకు పార్లమెంట్ సెంట్రల్‌హాల్ నిండి, అదనపు కుర్చీలు వినియోగించేవారు. చాలా మంది ఎంపీలు నిలబడి రాష్ట్రపతి ప్రసంగాన్ని వినేవారు. మంగళవారం మాత్రం అనేక కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. ⇒ ఈసారి సభ్యుల హాజరు కూడా తక్కువగా నమోదైంది. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు సమావేశాలకు హాజరుకాలేదు. ⇒ గంట సేపు రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ సమయంలో పలువురు ఎంపీలు తమ మొబైల్ ఫోన్లలో ఫొటోలు తీసుకుంటూ కనిపించారు. ⇒మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, హెచ్డీ దేవెగౌడలు బీజేపీ అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీలతో కలసి మొదటి వరుసలో కూర్చున్నారు. ⇒ రాష్ట్రపతి ప్రసంగం ముగిసిన తర్వాత సభ్యులు సభ నుంచి వెళ్తుంటే రాహుల్ గాంధీ మాత్రం మల్లికార్జున ఖర్గే, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి అహ్లువాలియాతో సంభాషిస్తూ కనిపించారు. -
‘రద్దు’.. గురిలేని క్షిపణి
నోట్ల రద్దుపై అమర్త్యసేన్ ముంబై: పెద్ద నోట్ల రద్దు లక్ష్యం లేకుండా ఏకపక్షంగా ప్రయోగించిన క్షిపణి అని, ఎన్డీఏ సర్కారు ప్రజాస్వామిక సంప్రదాయాలను తుంగలో తొక్కి ఈ నిర్ణయం తీసుకుందని ప్రముఖ ఆర్థికవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ విమర్శించారు. ‘ఇది హడావుడిగా నిరంకుశత్వంతో తీసుకున్న నిర్ణయం. ప్రభుత్వం తరచూ గురిలేని క్షిపణులను ప్రయోగిస్తోంది. నోట్లరద్దు అందులో ఒకటి..’ అని ఆయన శనివారం ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో అన్నారు. చైనాలో కొద్దిమంది ఆలోచనల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారని, కానీ భారత్ వంటి ప్రజాస్వామిక దేశాల్లో ప్రజల ఆకాంక్షల మేరకు నిర్ణయాలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
మంత్రి అక్రమాస్తులు రూ.115 కోట్లు
-
మంత్రి అక్రమాస్తులు రూ.115 కోట్లు
సాక్షి, బెంగళూరు: ఆదాయపు పన్ను శాఖ అధికారుల సోదాల్లో కర్ణాటక చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి రమేష్ జారకీహోళీకి చెందిన అక్రమ ఆస్తులు భారీగా వెలుగుచూస్తున్నాయి. మొత్తం రూ.115.2 కోట్ల మేరకు ఆస్తులను గుర్తించారు. బెంగళూరు, బెళగావి, గోకాక్ ప్రాంతాల్లో రమేష్ గృహ సముదాయాలు, కార్యాలయాలతోపాటు ఆయన బంధువుల ఇళ్లపై నాలుగు రోజులుగా ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తన వద్ద ఉన్న నగదును మార్చుకునేందుకు మంత్రి అక్రమమార్గం పట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా సహకార బ్యాంకుల్లో బంధువులు, స్నేహితుల పేర్లపై అకౌంట్లను తెరిచి అందులో నగదును డిపాజిట్ చేస్తూ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తన వద్ద ఉన్న నగదుతో భారీ స్థాయిలో బంగారం బిస్కెట్లు, నగలు కొనుగోలు చేశారు. మరోవైపు స్థిర, చరాస్తులను సైతం నోట్ల రద్దు తర్వాతే ఎక్కువ సంఖ్యలో కొన్నట్లు తెలుస్తోంది. ఇలా ఉండగా, బెళగావి నగరంలో కర్ణాటక పీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీహెబ్బళ్కర్ నివాసంలో జరిపిన ఐటీ సోదాల్లో రూ.50 కోట్ల విలువైన నగదు, బంగారం బయటపడ్డాయి. -
ఆ లావాదేవీలపై కన్ను
కొత్త ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లపై నిశిత పరిశీలన న్యూఢిల్లీ: నోట్ల రద్దు పథకం చివరి 10 రోజుల్లో జరిగిన కొన్ని అనుమానాస్పద లావాదేవీల్ని క్షుణ్నంగా విశ్లేషించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కొత్త ఖాతాల్లో చేసిన డిపాజిట్లు, రుణాల చెల్లింపులు, ఈ–వాలెట్లకు నగదు బదిలీలు, దిగుమతుల కోసం ముందస్తుగా చేసిన చెల్లింపులపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, రుణ ఖాతాలపై కూడా దృష్టి సారించారు. ‘రూ. 50 వేలకు మించిన డిపాజిట్లకు పాన్ నెంబర్ జత చేయని వారిపై ఐటీ శాఖ చర్యలు మొదలుపెట్టింది’ అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు ఆదివారం వెల్లడించారు. నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి ఆర్జీటీఎస్, ఇతర పద్ధతుల్లో చేసిన నగదు రహిత డిపాజిట్లపైనా దృష్టి సారించారని, తమ విచారణలో వెల్లడవుతున్న అంశాల్ని సంబంధిత విచారణ సంస్థలతో పంచుకుంటున్నామని చెప్పారు. -
నోట్ల రద్దుపై అనుభవం లేకనే ఇక్కట్లు
ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు విజయవాడ (వన్ టౌన్): నోట్ల రద్దు ఈ మధ్య కాలంలో ఎప్పుడూ జరగకపోవటం వల్ల అటు ప్రభుత్వ పెద్దలకు గానీ, ఆర్బీఐ అధికారులకు గానీ దాని అనుభావాలు తెలియలేదని, దీని వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. విజయవాడ పుస్తక మహోత్సవంలో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుధవారం ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్బీఐ పాత్ర’ అనే అంశంపై సదస్సు జరిగింది. ఈ సందర్భంగా దువ్వూరి సుబ్బారావు మాట్లాడుతూ.. ఆర్బీఐ పని కేవలం నగదును ముద్రించి జారీ చేయటం మాత్రమే కాదన్నారు. దేశంలో బ్యాంకులకు బ్యాంకర్‌గా వ్యవహరించటంతో పాటు ద్రవ్యోల్బణాన్ని నియంత్రించటం, వడ్డీ రేట్లను సమీక్షించటం, ధరల పెరుగుదలను అరికట్టడం వంటి అనేక రకాల బాధ్యతలను ఆర్బీఐ నిర్వహిస్తోందన్నారు. పెద్ద నోట్ల రద్దు అనేది చాలా దేశాల్లో జరిగే ప్రక్రియేనని చెప్పారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని ముందుగా ప్రకటిస్తే దాని వలన ఎలాంటి ప్రయోజనం ఉండదని వివరించారు. కానీ నోట్ల రద్దు ఎందుకు చేశారనే అంశంపై కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ పెద్దలు పలు రకాల ప్రకటనలు చేయటంతో తాను అయోమయానికి గురయ్యానని చెప్పారు. నోట్ల రద్దు ఫలితాలు మాత్రం ఇప్పటికిప్పుడు రావని, వాటికి రెండు మూడేళ్ల సమయం పడుతుందన్నారు. రానున్న కాలంలో పన్ను మీద ఆదాయం కనీసం రూ.50 వేల కోట్ల మేర రాకుంటే మాత్రం ఈ నిర్ణయం వృథా ప్రయత్నమేనని అభిప్రాయపడ్డారు. కాగా, నోట్ల రద్దు వ్యవహారంపై ప్రజలకు వ్యక్తమవుతున్న సందేహాలకు ఆర్బీఐ గవర్నర్ వంటి వ్యక్తులు సమాధానాలిచ్చి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. -
మళ్లీ అవే బారులు
► వేతన కష్టాలు షురూ.. ► ఇబ్బందులు పడ్డ పెన్షనర్లు ► బ్యాంకులు, ఏటీఎంల క్యూ నిర్మల్ టౌన్ : వేతనజీవుల కష్టాలు ప్రారంభమయ్యాయి. వేతనాలు అలా ఖాతాలో వేయడమే ఆలస్యం బ్యాంకుల వద్ద, ఏటీఎంల వద్ద బారులు ప్రారంభమయ్యాయి. ప్రతీ నెల వేతనం కోసం ఎదురుచూసే సగటు జీవికి ఈసారి కూడా కష్టాలు తప్పేలా లేవు. బ్యాంకుల్లో తగినంత నగదు లేకపోవడంతో బ్యాంకు అధికారులు సైతం ఏమీ చేయలేకపోతున్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా ప్రత్యేకంగా ఎలాంటి ఏర్పాట్లను చేయలేదు. దీంతో మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. ఇంకా ఎన్ని రోజులు ఈ కష్టాలు పడాలి అంటూ వారు అసహనం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన వెలువడి 50 రోజులు దాటినా ఇంకా ఎలాంటి నగదు కొరత వేధిస్తుండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉదయం నుంచే బారులు బ్యాంకులు, ఏటీఎంల వద్ద వేతన జీవులు ఉదయం నుంచే బారులు తీరి కనిపించారు. బ్యాంకుల్లో పూర్తిస్థాయిలో నగదు లేకపోవడంతో మళ్లీ పాత పరిస్థితే కనిపించింది. బ్యాంకుల నుంచి ప్రతీరోజు రూ.10 వేలు డ్రా చేసుకునే వెసులుబాటు ఉన్నా, అంతస్థాయిలో నగదు లేకపోవడంతో పరిమితిని తగ్గించి నగదును ఖాతాదారులకు అందజేశారు. ఏటీఎంలలో కూడా భారీ సంఖ్యలో ప్రజలు బారులు తీరి కనిపించారు. ఎస్బీహెచ్ ప్రధాన ఏటీఎం మూసి ఉండడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత ఎక్కువగా సేవలు అందించిన ఏటీఎం మూసి ఉండడంతో వారు ఇక్కట్లు పడ్డారు. ఏటీఎంలలో రూ.4,500 నగదు వస్తుండడం ఒక్కటే ఇన్ని కష్టాల మధ్య వేతన జీవులకు ఊరట కలిగించే అంశం. తప్పని ఇబ్బందులు రెండు నెలలుగా వేతనాల ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటి నుంచి బ్యాంకు అధికారులు ఎలాంటి గుణపాఠం నేర్చుకోలేదు. బ్యాంకుల్లో వేతనాల కోసం వచ్చే ఉద్యోగులు, పెన్షనర్లకు ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదు. దీంతో పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే మహిళ ఉద్యోగులు సైతం క్యూలైన్లలో వేచి ఉండలేక అవస్థలు పడ్డారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెప్పినప్పటికీ బ్యాంకుల్లో అ లాంటి ఏర్పాట్లు కనిపించలేదు. ఒకవైపు కార్యాలయాలకు వెళ్లాల్సి రావడం మరోవైపు క్యూలైన్లలో నిల్చుండాల్సి రావడంతో వారు అసహనం వ్యక్తంచేశారు. మొదటి తేదీ ఆదివారం రావడంతో సోమవారం పెద్ద సంఖ్యలో ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్దకు చేరుకున్నారు. ఉదయం బ్యాంకులు తెరవకముందే పింఛన్ దారులు పడిగాపులు కాయడం కనిపించింది. వేతన ఇబ్బందులకు మూడో నెల పెద్ద నోట్ల రద్దు అనంతరం రెండు నెలలుగా వేతన కష్టాలను వివిధ ఉగ్యోగులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు మూడో నెల కూడా వారికి వేతనాల వెతలు తప్పలేదు. నిత్యావసర సరుకులు, ఇంటి అద్దె, విద్యుత్ బిల్లులు, ఇతర అవసరాల కోసం నగదు అవసరమవుతుంది. కనీస అవసరాలయిన వీటి కోసం కూడా సరిపడా నగదు చేతికి అందకపోతుండడంతో వేతన జీవులు ఆవేదన చెందుతున్నారు. రెండు నెలలుగా తాము కష్టాలను ఎదుర్కొంటున్నామని, ఈ నెల అయినా ప్రభుత్వం తగిన ఏర్పాట్లను చేస్తుందని వారు ఆశపడ్డారు. అయితే ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో వారి ఆశలు అడియాశలయ్యాయి. -
కార్పొరేట్ ప్రతిష్టకు ‘టాటా’!!
2016 రివైండ్ దేశంలో పెద్దది, అత్యంత విశ్వసనీయమైనది అనుకునే బ్రాండ్ ఏదైనా ఉంటే అది టాటానే. పచారీ సరుకుల నుంచి ఆభరణాల దాకా దాదాపు ప్రతి రంగంలోనూ ఉండటం... అన్నిట్లోనూ కోట్ల మంది వినియోగదారులుండటం దీనికి కారణంగా భావించొచ్చు. కాకపోతే ఇంతటి గ్రూప్ పరువు ఈ అక్టోబర్ 24న వీధిలోకొచ్చింది. గ్రూపు చైర్మన్ గా ఉన్న సైరస్ పల్లోంజీ మిస్త్రీని టాటా బోర్డు అనూహ్యంగా తొలగించింది. అప్పట్లో కారణాలు తెలియరాకున్నా... రానురాను జరిగిన ఘటనలు చూస్తే ఇది కేవలం ‘రతన్ టాటా– సైరస్ మిస్త్రీ’ మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ముగింపు పలకటానికేనని తేలిపోయింది. నిజానికి 2012 డిసెంబర్ 28న మిస్రీ్తని ఈ పదవిలో కూర్చోబెట్టింది కూడా రతన్ టాటానే. మిస్త్రీ కుటుంబానికి టాటా సన్స్ లో 18 శాతం వాటా కూడా ఉంది. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి... మిస్రీ్తని గెంటేసి రతన్ టాటా తిరిగి తాత్కాలిక చైర్మన్ బాధ్యతల్లోకి వచ్చేశారు. తీవ్ర ఆరోపణలు, ప్రత్యారోపణలు... బోర్డ్ రూమ్ సమావేశాలు, ఎత్తులు పైఎత్తుల పర్వం తర్వాత ఈ వివాదం చివరికి కంపెనీ లాబోర్డును చేరింది. మిస్త్రీని తొలగించటానికి కారణాలు చెబుతూ... టాటా గ్రూపు పలు ఆరోపణలు చేసింది. ఆయన గ్రూపు రుణభారాన్ని పెంచేశారని, సమస్యలున్నాయంటూ పలు కంపెనీలను వదిలించుకోవటానికి ప్రయత్నించారని, టాటాల విలువల్ని ఏమాత్రం పట్టించుకోలేదని, అధికార రహస్యాలను కూడా బయటపెట్టారని ఆరోపించింది. మిస్త్రీ తక్కువేమీ తినలేదు. రతన్ టాటా తనకు చైర్మన్ బాధ్యతలు అప్పగించినా, స్వతంత్రంగా పనిచేసుకోనివ్వకుండా, మరో అధికార కేంద్రాన్ని నడిపించారని... కార్పొరేట్ గవర్నెన్స్ ను మంటగలిపారని, నష్టాలొస్తున్నా పట్టించుకోకుండా తన అహం కోసం నానో వంటి బ్రాండ్లను నడిపిస్తున్నారని, చాలా కొనుగోళ్లకు ఎక్కువ మొత్తం పెట్టారని... రకరకాల ఆరోపణలు చేశారు. కానీ టాటా బోర్డు రతన్ టాటా వైపే ఉండటంతో మిస్రీ్తని దాదాపు అన్ని టాటా కంపెనీల నుంచీ తొలగించారు. ఆయనకు మద్దతు పలికిన స్వతంత్ర డైరెక్టరు నుస్లీ వాడియానూ అదే చేశారు. నిజానికి ఈ వివాదం ఈ ఏడాదితో ముగిసిపోలేదు. 2017లో కంపెనీ లాబోర్డు ముందు కొత్త మలుపు తీసుకోవచ్చు కూడా. పెద్ద నోట్ల రద్దు... దేనికంట? ఈ ఏడాది నవంబర్ 8న రాత్రి 8 గంటల సమయంలో ప్రధాని నరేంద్రమోదీ ఓ బాంబు పేల్చారు. ఆ రోజు అర్ధరాత్రి నుంచీ రూ.500, రూ.1000 నోట్లు చెల్లవని ప్రకటించారు. వాటిని డిసెంబర్ 30 వరకూ బ్యాంకుల్లో మాత్రం డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పారు. దీనికి ఆయన చెప్పిన కారణాలు రెండు!! 1) నకిలీ నోట్లు భారీగా చలామణిలోకి వచ్చి, వాటి సాయంతో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారని. 2) చాలామంది దగ్గర ఈ పెద్ద నోట్ల రూపంలో నల్లధనం పోగుపడిపోయి ఉందని, ఈ దెబ్బతో వారు దాన్ని డిపాజిట్ చేయలేక గంగానదిలో విసిరేయటమో, తగలబెట్టడమో చేస్తారని. అది విన్న జనం... నల్ల కుబేరుల్ని మోదీ భలే దెబ్బతీశారని సంతోషించారు. కాకపోతే రోజులు గడుస్తున్నకొద్దీ పాతనోట్లు చెల్లక, కొత్త నోట్లు అందుబాటులో లేక, వ్యాపారాలేవీ సాగకపోయేసరికి మోదీ ఎవరిని దెబ్బతీశారనేది అర్థంకాలేదు. కనీసం తిండికి కూడా కరువయ్యే పరిస్థితులొచ్చేసరికి దెబ్బతిన్నది తామేనని తెలిసిపోయింది. చలామణిలో ఉన్న నోట్లకన్నా ఎక్కువ నగదు బ్యాంకుల దగ్గర డిపాజిట్ అయినట్లు వార్తలు వెలువడటంతో... కొన్ని దొంగనోట్లూ బ్యాంకుల్లోకి చేరాయని... అక్రమార్కులు తెలివిగా బ్లాక్ మనీ మొత్తాన్ని మార్చేసుకున్నారని అర్థమైంది. అయితే ప్రభుత్వం డిజిటల్ లావాదేవీల్ని పెంచటానికే పెద్ద నోట్లు రద్దు చేశామంటూ కొత్త పల్లవి అందుకుంది. మరి దీని ప్రభావమేంటి? వృద్ధి రేటు అంచనాలు బాగా తగ్గాయి. చివరి త్రైమాసికంలో వృద్ధిరేటు దారుణంగా తగ్గొచ్చనే అంచనాలు వెలువడ్డాయి. కాకపోతే ఇబ్బందులు తాత్కాలికమేనంటూ అందరూ తమను తాము సమాధానపరచుకుంటున్నారు. అదే ఈ ఏడాదికి ఊరట!!. ఈక్విటీ, డెట్ .. ప్చ్! ఈ ఏడాది స్టాక్, రుణ మార్కెట్లు రెండూ ఇన్వెస్టర్లకు సరైన లాభాలు ఇవ్వలేకపోయాయి. ఈ ఏడాది బడ్జెట్ తర్వాత స్టాక్ మార్కెట్లలో మొదలైన ర్యాలీ... అనేక ఆటుపోట్ల తరవాత ప్రస్తుతం మళ్లీ మొదటికొచ్చింది. ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ మార్పు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్యంగా డొనాల్డ్ ట్రంప్ విజయం, పెద్ద నోట్ల రద్దు... ఇవన్నీ అనిశ్చితికి దారితీశాయి. గతేడాది ముగింపు 26,117.54 పాయింట్లతో పోలిస్తే ఈ ఏడాది చివరికి సెన్సెక్స్ 508 పాయింట్లు మాత్రమే లాభపడింది. ఇక విదేశీ ఇన్వెస్టర్లు ఈ ఏడాది తొలి 9 నెలల్లో రూ.51,293 కోట్లు ఇన్వెస్ట్ చేసి... అక్టోబర్ నుంచి అమ్మకాలకు దిగారు. దీంతో డిసెంబర్ 27 నాటికి నికర పెట్టుబడులు రూ.26,213 కోట్లకు పరిమితం అయ్యాయి. టెలికం బరిలో జియో ఫ్రీ ఎంట్రీ! రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడులతో రిలయన్స్ జియో సెప్టెంబర్ 3న మెగా ఎంట్రీ ఇచ్చింది. జీవిత కాలం ఉచిత కాల్స్, మూడునెలల పాటు 4జీ డేటా ఉచితం అంటూ వల విసిరింది. 83 రోజుల్లో 5 కోట్ల మంది కస్టమర్లను సంపాదించింది. దీంతో ప్రత్యర్థులు ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ కూడా దిగొచ్చాయి. అపరిమిత కాల్స్, పరిమిత డేటా పథకాలు ప్రకటించాయి. కానీ కాల్స్ కనెక్ట్ కాక, ఉచిత డేటాలో వేగం లేక జియో కస్టమర్లు అసంతృప్తితోనే ఉన్నారు. జియో పోటీని తట్టుకోవటానికి వీడియోకాన్ నుంచి ఎయిర్టెల్ రూ.4,428 కోట్లకు స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసింది. ఎయిర్‌సెల్‌కు చెందిన 4జీ ఎయిర్వేస్ను కూడా రూ.3,500 కోట్లకు కొనుగోలు చేసింది. ఇక సెప్టెంబర్‌లో వొడాఫోన్ గ్రూపు ఇండియా కార్యకలాపాల కోసం రూ.47,000 కోట్ల నిధుల్ని కేటాయించింది. తనిఖీలతో ఫార్మా కుదేలు... పలు ఫార్మా కంపెనీలు ఈ ఏడాది యూఎస్ ఎఫ్‌డీఏ తనిఖీల్ని ఎదుర్కొన్నాయి. వోకార్డ్, దివీస్ ల్యాబ్స్ ప్లాంట్లలో తగిన ప్రమాణాలు లేవని ఎఫ్‌డీఏ అభ్యంతరాలు వ్యక్తం చేయడం ఆయా షేర్లను పడగొట్టింది. అరబిందో ఫార్మా, సన్ ఫార్మా తదితర కంపెనీలు ధరల విషయంలో కుమ్మక్కయ్యాయంటూ అమెరికా చర్యలు చేపట్టడం వీటి షేర్లపై ప్రభావాన్ని చూపించింది. మరోవంక బ్రెగ్జిట్ కూడా ఫార్మా కంపెనీల ఆదాయాలపై ప్రభావం చూపుతుందనే విశ్లేషణలు వెలువడ్డాయి. 2018లోనే జీఎస్టీ అమలు!! ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వస్తు సేవల పన్నుకు (జీఎస్టీ) ఆగస్ట్ 8న మోక్షం లభించింది. వివిధ రకాల రాష్ట్రాల పన్నులు, కేంద్రం పన్నుల స్థానంలో జీఎస్టీ అమల్లోకి రావడం ద్వారా యావత్‌దేశం ఒకే మార్కెట్‌గా అవతరించనుంది. 2017లో ఇది అమల్లోకి రావచ్చని భావిస్తున్నా... నోట్ల రద్దు నేపథ్యంలో 2018లోనే అమల్లోకి వస్తుందనేది తాజా అంచనా. ఎగుడు దిగుళ్ల రియల్టీ!! కొన్నేళ్లుగా డౌన్ లో ఉన్న మార్కెట్ ఈ ఏడాది కాస్త మెరుగుపడింది. తొలి 10 నెలల్లో ఇళ్ల విక్రయాలు పర్వాలేదనిపించాయి. తొలిసారి గృహరుణం తీసుకున్న వారికి అదనంగా రూ.50వేల వడ్డీ మినహాయింపు ప్రయోజనాన్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించడం ఈ రంగానికి జోష్ నిచ్చింది. రియల్ ఎస్టేట్ నియంత్రణ, అభివృద్ధి బిల్లును ఈ ఏడాదే పార్లమెంటు ఆమోదించింది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్‌ల లిస్టింగ్‌కూ అడ్డంకులు తొలగిపోయాయి. నవంబర్‌లో నోట్ల రద్దు నిర్ణయం వెలువడ్డాక మాత్రం మార్కెట్ మళ్లీ డౌనయింది. డెవలపర్లు తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఈ ఏడాది ప్రయివేటు ఈక్విటీ ఇన్వెస్టర్ల నుంచి రూ.48,300 కోట్లు సమీకరించారు. ఇది గతేడాది కంటే 53 శాతం అధికం. 2017 రియల్టీకి గోల్డెన్ ఇయర్ అవుతుందనేది ఆ వర్గం నమ్మకం. రూపాయి... బాగా పడింది 2016లో రూపాయి మారకపు విలువ డాలర్‌తో పోలిస్తే 2.5 శాతం క్షీణించింది. గతేడాది చివర్న 66.15 స్థాయి వద్ద ఉన్న రూపాయి అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలిచాక 68.90 రికార్డు స్థాయికి పడింది. తర్వాత స్వల్పంగా కోలుకుని డిసెంబర్ 30న 67.90 వద్ద ముగిసింది. భారత్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు నిధుల్ని వెనక్కు తీసుకోవడం రూపాయి పతనానికి ప్రధాన కారణం. 2013లో సమీకరించిన విదేశీ కరెన్సీ డిపాజిట్లను భారత్ ఈ నవంబర్‌లో చెల్లించాల్సి రావటం కూడా రూపాయిని పడేసింది. గల్ప్ దేశాల నుంచి రెమిటెన్సులు తగ్గడం, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడం వంటివి ఈ పతనానికి ఆజ్యం పోశాయి. ట్రంప్... భారత ఐటీకి చిక్కేనా? 2016లో అంతర్జాతీయంగా ఐటీపై ఖర్చులు 0.3 శాతం తగ్గాయి. మాంద్యం పరిస్థితులతో దేశీ ఐటీ దిగ్గజాలు మెరుగైన ఫలితాలను సాధించలేకపోయాయి. పులిమీద పుట్రలా తాత్కాలిక వర్కింగ్ వీసా ఫీజుల్ని అమెరికా భారీగా పెంచింది. విప్రో 50 కోట్ల డాలర్లతో అప్పీరియోను... హెసీఎల్ టెక్నాలజీస్ 20 కోట్ల డాలర్లతో జియోమెట్రిక్ను కొనుగోలు చేశాయి. ఇన్ఫోసిస్ పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టింది. 150 బిలియన్ డాలర్ల దేశీ ఐటీ విపణిలో 60% ఎగుమతుల ద్వారా వస్తున్నదే. కానీ, అమెరికా అధ్యక్ష ఎన్నికలో ట్రంప్ గెలవటం ఐటీ అనిశ్చితికి దారితీసింది. ఇమిగ్రేషన్ వీసా నిబంధనలను కఠినం చేయవచ్చని, వ్యయాలు పెరిగిపోతాయని అంచనాలున్నాయి. బ్రెగ్జిట్ ప్రభావం కూడా ఐటీ ఎగుమతులపై పడొచ్చనే ఆందోళనలున్నాయి. ఫెడ్ రేట్ల... భయం భయం! అమెరికా సెంట్రల్ బ్యాంకు ఫెడరల్ రిజర్వ్... డిసెంబర్లో ఫండ్ రేటును పావు శాతం పెంచింది. అమెరికా ఆర్థిక రంగం కోలుకుంటున్నందున వచ్చే ఏడాది నుంచి మూడేళ్ల పాటు... ఏటా మూడు సార్లు రేట్లను పెంచుతామనే సంకేతాలూ ఇచ్చింది. దీంతో డాలర్ బలపడింది. మన రూపాయి రూ.68కి క్షీణించింది. ఎఫ్ఐఐల నిధుల ఉపసంహరణ కూడా మొదలైంది. అదే వచ్చే ఏడాది మార్కెట్లపై ఒక అంచనాకు రాలేకుండా చేస్తోంది. మూడేళ్ల తర్వాత లాభాల్లో∙పుత్తడి వరుసగా మూడేళ్లు నష్టాల్ని మూటగట్టుకున్న పుత్తడి 2016లో స్వల్ప లాభాలందించింది. ఈ ఏడాది ఒక దశలో 29 శాతం పెరిగిన బంగారం ధర... సంవత్సరాంతానికి చాలా కోల్పోయింది. బులియన్ విశ్లేషకుల వేసిన అంచనాలకు పూర్తి భిన్నంగా బంగారం ధర హెచ్చుతగ్గులకు లోనవటం విశేషం. 2015 డిసెంబర్లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచాక పుత్తడి ధర పతనమవుతుందని, ట్రంప్ గెలవటంతో ఈ ధర పెరుగుతుందని విశ్లేషకులు అంచనావేయగా, అందుకు భిన్నమైన రీతిలో జరిగింది. ఈ డిసెంబర్ 14న ఫెడ్ తిరిగి రేట్లను పెంచాక పుత్తడి క్షీణిస్తూ వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ ఏడాది ప్రారంభంలో 1060 డాలర్ల వద్దనున్న ఔన్సు బంగారం ధర ఆగస్టుకల్లా 29 శాతం ఎగబాకి 1,372 డాలర్ల గరిష్టస్థాయికి చేరింది. తర్వాత 1,158 డాలర్లకు దిగింది. దీంతో ఏడాది మొత్తంమీద 9 శాతం పెరిగినట్లయింది. దేశీయంగా ముంబై బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల పుత్తడి ధర ర్యాలీ రూ.25,150 నుంచి మొదలై ఆగస్టులో నాలుగేళ్ల గరిష్టస్థాయి రూ.31,720 వద్దకు చేరింది. సంవత్సరంలో చివరి ట్రేడింగ్ రోజున రూ.28,050 వద్ద ముగిసింది. దీంతో ఏడాది మొత్తంమీద రూ. 2,900 మేర (11.3 శాతం) పెరిగినట్లయింది. ప్రపంచ మార్కెట్‌తో పోలిస్తే దేశీయంగా ఎక్కువ పెరగడానికి కారణం రూపాయి మారకపు విలువ క్షీణించటమే. కొనుగోళ్లు, విలీనాల రిటైల్ ఈ కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్ సవాళ్లను తట్టుకుంటూ రిలయన్స్ రిటైల్, మహీంద్రా, ఫ్యూచర్ రిటైల్, మోర్ సంస్థలు బాగా విస్తరించాయి. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్... ‘ఫరెవర్21’ను సొంతం చేసుకుంది. ఫ్యూచర్ రిటైల్ సంస్థ ఫ్యాబ్ ఫర్నిష్.కామ్‌ను, హెరిటేజ్ ఫ్రెష్ దుకాణాలను సొంతం చేసుకుంది. మహీంద్రా రిటైల్ సంస్థ బేబీఓయే కార్యకలాపాలను విలీనం చేసుకుంది. కాకపోతే పెద్ద నోట్ల రద్దుతో ఏడాది చివర్లో విక్రయాలు మందగించాయి. స్వీడన్ కు చెందిన రిటైల్ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా భారత్‌లోకి అడుగుపెట్టింది. వచ్చే కొన్నేళ్లలో రూ.10వేల కోట్ల పెట్టుబడికి ప్రణాళికలు వేసుకుంది. ప్రభుత్వం 100 శాతం సింగిల్ బ్రాండ్ రిటైల్‌కు అనుమతించడంతో పుమా, అడిడాస్ సొంత స్టోర్లను తెరిచాయి. పడిలేచిన ముడిచమురు! 2016లో ముడి చమురు భారీ రాబడుల్ని అందించింది. ఇది కూడా పుత్తడిలానే మూడేళ్లపాటు క్షీణిస్తూ వచ్చింది. 2016 జనవరిలో 14 ఏళ్ల కనిషా్ఠనికి పడిపోయింది. చమురు ఎగుమతి దేశాల నుంచి సరఫరాలు పెరగడం, అమెరికాలో షేల్ గ్యాస్ దిగుబడులు పెరగడంతో క్రూడ్ క్షీణిస్తూ వచ్చింది. అధికంగా క్రూడ్ దిగుమతి చేసుకునే అమెరికా స్వదేశంలోనే షేల్ గ్యాస్ ద్వారా ఉత్పత్తిని పెంచుకోవడం క్రూడ్ పతనానికి ముఖ్య కారణం. 2016 జనవరిలో 37.22 డాలర్ల వద్దనున్న బ్యారల్ బ్రెంట్ క్రూడ్ అదే నెల మధ్యలో 27.88 డాలర్ల వద్దకు పతనమయింది. అప్పట్నుంచి వేగంగా పెరిగిన క్రూడ్ దాదాపు రెట్టింపై 57 డాలర్ల స్థాయిని దాటింది. డిసెంబర్ 30న 56.68 డాలర్లకు చేరింది. దీంతో ఏడాది మొత్తం మీద క్రూడ్ 52%పైగా రాబడినిచ్చినట్లయ్యింది. -
ఇక ప్లాస్టిక్ నోట్లు
ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టనున్నట్లు పార్లమెంట్లో ప్రకటించిన కేంద్రం న్యూఢిల్లీ: ఒకవైపు పెద్ద నోట్ల రద్దుపై పార్లమెంట్లో గందరగోళం కొనసాగుతుండగానే ప్రభుత్వం మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఇకపై ప్లాస్టిక్ కరెన్సీ ముద్రించాలని నిర్ణయించి నట్లు శుక్రవారం పార్లమెంట్లో తెలిపింది. కరెన్సీ నోట్లను ప్లాస్టిక్ లేదా పాలిమర్స్‌తో ముద్రించాలని నిర్ణయించామని, దీనికి సంబంధించిన ప్రక్రియ ఇంకా ప్రాథమిక దశలో ఉందని ఆర్థికశాఖ సహాయమంత్రి అర్జన్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. పేపర్ కరెన్సీ స్థానంలో ప్లాస్టిక్ కరెన్సీ ప్రవేశపెట్టాలని కొన్నాళ్ల క్రితం రిజర్వ్ బ్యాంక్ ప్రతిపాదించింది. పది రూపాయల విలువ గల వందకోట్ల ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా దేశంలోని భౌగోళిక వైవిధ్యం గల కొచ్చి, మైసూర్, భువనేశ్వర్, జైపూ ర్, సిమ్లా నగరాల్లో ప్రవేశపెట్టనున్నట్లు 2014లో ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపిందని, దానికి కొనసాగింపు ప్రయత్నంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. మేఘ్వాల్ మరోప్రశ్నకు సమాధానమిస్తూ 2015 డిసెంబర్లో ఎటువంటి సెక్యూరిటీ త్రెడ్ లేని వెయ్యి రూపాయల నోట్లు కొన్ని తమకు వచ్చినట్లు ఆర్బీఐ తెలిపిందని, ఇవి నాసిక్‌లోని కరెన్సీ ముద్రణా కేంద్రం నుంచి వచ్చాయని, హోసంగాబాద్‌లోని సెక్యూరిటీ పేపర్ మిల్ సరఫరా చేసిన పేపర్‌పై ఈ నోట్లు ముద్రించినట్లు తెలిపారు. ఇందుకు బాధ్యులైన సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని, నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపరిచామని మంత్రి పేర్కొన్నారు. ప్లాస్టిక్ నోట్ల జీవితకాలం ఐదేళ్లవరకూ ఉంటుంది. వీటికి నకిలీలు తయారుచేయడం కూడా చాలా కష్టం. అదీగాక పేపర్ కరెన్సీ కంటే ప్లాస్టిక్ నోట్లు పరిశుభ్రంగా ఉంటాయి. నకిలీ నోట్ల బారినుంచి తప్పించుకునేందుకు ప్లాస్టిక్ నోట్లను తొలిసారిగా ఆస్ట్రేలియా ప్రవేశపెట్టింది. -
తగ్గని క్యూలైన్
► అందని నగదు ► ఇబ్బందులు పడుతున్న ఉద్యోగులు, పెన్షనర్లు ► అరకొర సేవలతో ఏటీఎంలు కరీంనగర్ బిజినెస్ : నోట్ల రద్దు కష్టాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నారుు. దాదాపు నెల రోజులకు దగ్గరపడుతున్నా నగదు ఇబ్బందులు తీర డం లేదు. శుక్రవారం ఉదయం బ్యాంకులు పెన్షనర్లు, ఉద్యోగులతో నిండిపోయారుు. ఏ బ్యాంకులో చూసిన జనం బారులుతీరి కనిపించారు. జిల్లావ్యాప్తంగా పలు బ్యాం కులు నగదు అవసరానికి తగ్గట్టుగా అంది స్తున్నప్పటికీ కొన్ని మాత్రం రూ.4 నుంచి రూ.6 వేలు మాత్రమే చెల్లిస్తున్నారుు. డ బ్బులు పెట్టిన గంటలోనే ఏటీఎంలు ఖాళీ అవుతున్నారుు. గురువారం సాయంత్రం మార్కెట్లోకి రూ.500 నోట్లు వచ్చారుు. రూ.500నోట్లను ఏటీఎంల ద్వా రానే విడుదల చేయాలని నిబంధనలున్నా..రూ.2వేల నోట్లు మాత్రమే వస్తున్నారుు. బారులుతీరిన ఉద్యోగులు ఒకటో తేదీన ఉద్యోగులందరికీ జీతాలు రాకపోవడంతో మిగతా వారికి శుక్రవారం ఖాతాల్లో చేరారుు. దీంతో ఉదయమే బ్యాంకులకు ఉద్యోగులు చేరుకున్నారు. బ్యాంకుల ప్రధానశాఖల వద్ద ఉన్న ఏటీంఎంలలోనూ డబ్బులు అందుబాటులో లేకపోవడంతో ఖాతాదారులు నిరాశతో వెనుదిరిగారు. ఆంధ్రాబ్యాంకు, ఎస్బీహెచ్ పలు శాఖలు ఉద్యోగులకు రూ.10వేలు చెల్లించారుు. ప్రభుత్వం పెద్ద ఎత్తున నగదును బ్యాంకులకు సరఫరా చేస్తేనే ఇక్కట్లు తొలగుతాయని వ్యాపార నిపుణులు పేర్కొంటున్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో పది రోజుల వరకు నగదు కష్టాలు తీరవని వారు అభిప్రాయపడుతున్నారు. ఇది ఇలా ఉండగా బంగారంపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను పలువురు మహిళలు స్వాగతించగా మరికొందరు విభేదించారు. వారసత్వ బంగారు నిల్వలు లెక్క చెప్పాలంటే కష్టమేనన్నారు. ఏది ఏమైనా రానున్న రోజుల్లో ప్రతి కొనుగోలుపై బిల్లుల రూపంతో జాగ్రత్త పరుచుకుంటేనే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పలువురు వ్యాపారవేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
సర్దుకునే చాన్సివ్వలేదని బాధ!
నోట్ల రద్దుకు గడువు ఇచ్చి ఉంటే పొగిడేవారు విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం ► ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు ► మొబైల్ బ్యాంకింగ్‌ను అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచన న్యూఢిల్లీ/బఠిండా: నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. ఈ విషయాన్ని ముందుగానే చెప్పి, కాస్త సమయం ఇచ్చి పెద్దనోట్లను రద్దుచేసి ఉంటే.. విపక్షాలన్నీ తనను ప్రశంసించి ఉండేవన్నారు. ఢిల్లీలో జరిగిన ‘అప్డేటెడ్ ఎడిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మేకింగ్ ద కాన్స్టిట్యూషన్’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా విపక్షాలు ఆందోళన చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘ప్రభుత్వం సరైన సన్నద్ధత లేకుండానే నోట్లరద్దు నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. అది అసలు విషయమే కాదు. వారు అన్నీ సర్దుకునేందుకు ప్రభుత్వం సరిపోయేంత సమయం ఇవ్వలేదని బాధపడుతున్నారు’ అని అన్నారు. విమర్శిస్తున్న వారందరికీ నోట్ల రద్దు చేసేముందు 72 గంటల సమయం ఇచ్చుంటే.. ఇవాళ తన నిర్ణయాన్ని ప్రశంసించి ఉండేవారన్నారు. దేశం నల్లధనం, అవినీతిపై చేస్తున్న పోరాటంలో ప్రతి సామాన్య భారతీయుడూ సైనికుడేనన్నారు. ప్రపంచ అవినీతి సూచీలో భారత్ పేరు ప్రముఖంగా కనిపించటం గర్వపడాల్సిన విషయం కాదన్నారు. దేశ హితానికి కొన్ని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల స్థానిక సంస్థలకు చాలా లాభం జరిగిందన్నారు. ‘దేశంలోని పలు నగరాల కార్పొరేషన్ల వివరాలందారుు. ఆ నగరాల్లో గతంలో 3-3.5 వేల కోట్ల పన్ను వసూలయ్యేది. కానీ ఈ పదిహేను రోజుల్లోనే రూ.13 వేల కోట్లు పన్ను రూపేణా వచ్చింది. ఈ నిధులు రోడ్లు, విద్యుత్ వంటి అభివృద్ధి పనులకు వాడొచ్చు’ అని పేర్కొన్నారు. నోట్లకు ‘మొబైల్’ పరిష్కారం పంజాబ్‌లోని బఠిండాలో ఎరుుమ్స్కు మోదీ శంకుస్థాపన చేశారు. రూ.925 కోట్లతో 750 పడకల ఎరుుమ్స్ ఆస్పత్రిని 177 ఎకరాల్లో నిర్మించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మోదీ పాల్గొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. నిజారుుతీకి అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారాల్లో మొబైల్ బ్యాంకు ఓ పరిష్కారమని తెలిపారు. నల్లధనం, అవినీతిని తరిమికొట్టే ప్రయత్నంలో మొబైల్ ఫోన్లనే బ్యాంకు బ్రాంచీలుగా మార్చుకోవాలన్నారు. ‘పేమెంట్ల కోసం బ్యాంకులకు వెళ్లకుండా మొబైల్ యాప్‌లనే వినియోగించాలి. సాంకేతికతను అందిపుచ్చుకోండి’ అని సూచించారు. నల్లధనం, అవినీతిని తరిమేస్తే.. పేదలకు వారి హక్కులు అందుతాయన్నారు. అనంతరం, ఆనంద్పూర్లోకి కేశ్‌గఢ్ సాహిబ్‌లో గురుగోవింద్ సింగ్ 350వ ప్రకాశ్ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. బీజేపీ పంజాబ్ ఇంన్చార్జ్గా పనిచేసినపుడు ఆనంద్ నగర్‌లోని కేశ్‌గఢ్ సాహిబ్‌ను తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్నారు. పంట వ్యర్థాలను కాల్చొద్దు.. పంజాబ్, హరియాణాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చటాన్ని ఆపేసేలా ప్రతిజ్ఞ చేయాలని మోదీ సూచించారు. దీని వల్ల తీవ్రస్థారుులో కాలుష్యం జరుగుతుందన్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నందున రైతులకు ఇలాంటి సూచనలు ఇస్తున్నారు. మోదీకి రాజకీయాలు తెలియవని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాకు ఎన్నికల ఫలితాలు ముఖ్యం కాదు. నా రైతు సోదర, సోదరీమణుల సంక్షేమమే ముఖ్యం. వ్యర్థాలను కాల్చటం ద్వారా కాలుష్యం పెరుగుతుంది. కానీ పంట వ్యర్థాల ద్వారా భూసారం పెరుగుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నారుు’ అని మోదీ తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తితో.. ‘బాబా సాహెబ్ అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం అంటేనే బాబాసాహెబ్’ అని మోదీ అన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని తమ హక్కులను తెలుసుకోవాలనుకుంటున్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రజల బాధ్యత చాలా ఎక్కువగా ఉండేది. రాను రానూ పరిస్థితులు మారటం వల్ల బాధ్యత అనేది.. హక్కుల కోసం పోరాడటంగా మాత్రమే మారింది. స్కూళ్లు, కాలేజీల్లో రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేయాలి’ అని అన్నారు. బాగా తెలివైన వారు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారని దీని వల్ల అరాచకం పెరిగిపోతోందన్నారు. పాక్‌ది స్వీయ దహనం భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులనుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదని.. భారత్‌తో పోరాడటం ద్వారా తనను తాను కాల్చుకుంటోందని మోదీ బఠిండాలో అన్నారు. ‘గతంలో భారత జవాన్లకు తమ సత్తాను చూపేందుకు అధికారాలిచ్చేవారు కాదు. కానీ సర్జికల్ దాడుల తర్వాత పాక్ మనోళ్ల ధైర్యసాహసాలను రుచిచూసింది’ అని అన్నారు. పాకిస్తానీలను ఉద్దేశించి ‘పెషావర్‌లో స్కూలు పిల్లలను చంపినపుడు 125 కోట్ల మంది భారతీయులు కన్నీళ్లు కార్చారు. మీరూ పేదరికంపై పోరాటం చేయాలంటున్నారు. కానీ మీ ప్రభుత్వం భారత్‌పై దాడి చేస్తోంది. ఈ దాడుల ద్వారా మిమ్మల్ని మీరు దహించుకోకండి. మీ ప్రభుత్వాన్ని అవినీతి, నల్లధనం నుంచి కాపాడమని అడగండి’ అని అన్నారు. సింధు, సట్లేజ్, బియాస్, రావి నదుల నీరు భారత్ హక్కు అని.. ఈ నీరు వ్యర్థంగా సముద్రంలో కలిసేబదులు ఇక్కడి రైతులకు ఉపయోగపడాలన్నారు. ‘చర్చల ద్వారానే నీటి సమస్యలు పరిష్కారం అవుతారుు. కేంద్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు నీటిని అలాగే వదిలేయటం ద్వారా భారత రైతులకు నష్టం జరిగింద’న్నారు. -
సంచార స్వైప్ మెషిన్లు
► చిల్లర నోట్ల సమస్యకు చిట్కా ►అత్యవసర సర్వీసులకు నేటితో తెర ► రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు సంచార స్వైప్ మెషిన్లను ప్రవేశపెట్టడం ద్వారా చిల్లర సమస్య పరిష్కారానికి కేంద్రం చిట్కాను కనుగొంది ఖాతాదారులు, ప్రభుత్వ ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి నగదును డ్రాచేసుకునే వసతిని కల్పించింది. సాక్షి ప్రతినిధి, చెన్నై సాక్షి ప్రతినిధి, చెన్నై: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతుండగా ఒకింత ఊరట కలిగిస్తూ సేలం జిల్లాలో సరికొత్త రూ.500 నోట్లు చెలామణిలోకి వచ్చారుు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలకు స్వైప్ మెషిన్లతో వెళ్లే ఏర్పాటును ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు కల్పించింది. సహాయ జనరల్ మేనేజర్ పాల్‌రాజ్ నేతృత్వంలో ఐదు బృందాలు స్వైప్ మెషిన్లతో సేవలు అందించనున్నారుు. వీరి ద్వారా రూ.2వేలను అందుకోవచ్చు. ఈరకమైన స్వైప్ సేవల కోసం రూ.2లక్షలను ప్రత్యేకంగా సిద్ధం చేసుకున్నారు. సుమారు 3 గంటల్లో వందమందికి నగదు పంపిణీ చేసినట్లు ఒక అధికారి తెలిపాడు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు: చెల్లని కరెన్సీ నోట్లను చేతపట్టుకుని ప్రజలు అల్లాడుతుండగా కేంద్రం మాత్రం తన చర్యను సమర్థించుకుంటోంది. పైగా ఇది అంతంకాదు ఆరంభం మాత్రమేననే ప్రకటనతో ప్రధాని భయపెట్టడం ప్రారంభించారు. రద్దరుున నోట్ల స్థానంలో కొత్తనోట్లను అందించే ప్రక్రియ ప్రారంభమై బుధవారానికి 16 రోజులు గడిచినా సాధారణ పరిస్థితి నెలకొనలేదు. కరెన్సీని మార్చుకోని బ్యాంకులు, పనిచేయని ఏటీఎంల వద్ద ప్రజలు బాధలు పడుతూనే ఉన్నారు. బ్యాంకులను ముట్టడించడం, ఆందోళనలకు పూనుకోవడం నిత్యకృత్యమైంది. పాత నోట్లు చెలామణిలోలేవు, వాటి స్థానంలో కొత్త నోట్లు ఇచ్చేనాథుడు లేక ఖాతాదారులు అల్లాడుతున్నారు. తమిళనాడు అవసరాలకు తగినట్లుగా రిజర్వు బ్యాంకు తగిన స్థారుులో నగదును విడుదల చేయడం లేదు. సహనం నశించిపోరుున ప్రజలు బుధవారం ఎవరికి వారుగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. దాదాపుగా ప్రతి బ్యాంకు ముందు ‘నో క్యాష్’ బోర్డులు దర్శనమిస్తున్నా రుు. 95 శాతానికి పైగా ఏటీఎంలు మూతపడి ఉన్నారుు. భారతీయ జనతా పార్టీ మినహా దాదాపుగా అన్ని పార్టీల నేతలూ కేంద్రాన్ని ఖండిస్తూ ఆందోళనకు దిగుతున్నారు. అధికార అన్నాడీఎంకే సైతం ఢిల్లీలో ప్రతిపక్షాలు నిర్వహించిన ధర్నాలో పాల్గొంది. తిరుప్పూరులో ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు దుకాణాలను మూసివేసి నిరసన పాటించారు. తిరుప్పూరు నుండి కడలూరుకు వెళుతున్న ప్రభుత్వ బస్సును గుర్తుతెలియని వ్యక్తులు తెల్లవారుజామున అడ్డగించి అద్దాలను ధ్వంసం చేశారు. తంజావూరులో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ముందు రాస్తారోకో నిర్వహించారు. అలాగే రామనాథపురంలో నిరసనలు సాగించారు. చైన్నై తిరువాన్మీయూరు ట్రాఫిక్ సిగ్నల్ వద్ద సీపీఎం నేతలు బిక్షమెత్తుతూ తమ నిరసనను వ్యక్తం చేశారు. ఒకటోతేదీ జీతాన్ని నగదు రూపంలో ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికసంఘాలు ఆందోళనలు నిర్వహించారుు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ చెన్నై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షులు జీకే వాసన్ అధ్వర్యంలో ఆందోళన సాగింది. ఈనెల 29వ తేదీన రాష్ట్రవ్యాప్త ఆందోళనకు దిగుతున్నట్లు వర్తక వాణిజ్య సంఘాల అధ్యక్షులు విక్రమ్‌రాజా ప్రకటించారు. రైళ్లు, బస్సులు తదితర అత్యవసర సర్వీసులకు పాత నోట్ల వినియోగం వెసులుబాటు ఈనెల 24వ తేదీతో ముగియనుంది. దీంతో శుక్రవారం నుంచి కరెన్సీ కష్టాలు రెట్టింపు కాగలవనే భయం ప్రజల్లో నెలకొంది.