సర్దుకునే చాన్సివ్వలేదని బాధ! | PM Narendra Modi's Dig At Critics On Notes Ban: Their Problem Is They Couldn't Prepare | Sakshi
Sakshi News home page

సర్దుకునే చాన్సివ్వలేదని బాధ!

Published Sat, Nov 26 2016 1:13 AM | Last Updated on Tue, Aug 21 2018 9:33 PM

సర్దుకునే చాన్సివ్వలేదని బాధ! - Sakshi

సర్దుకునే చాన్సివ్వలేదని బాధ!

నోట్ల రద్దుకు గడువు ఇచ్చి ఉంటే పొగిడేవారు  విపక్షాలపై ప్రధాని మోదీ ధ్వజం
ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. సహకరిస్తున్న ప్రజలకు ధన్యవాదాలు
మొబైల్ బ్యాంకింగ్‌ను అలవాటు చేసుకోవాలని ప్రజలకు సూచన


న్యూఢిల్లీ/బఠిండా: నోట్లరద్దుపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని మోదీ తొలిసారి నోరువిప్పారు. ఈ విషయాన్ని ముందుగానే చెప్పి, కాస్త సమయం ఇచ్చి పెద్దనోట్లను రద్దుచేసి ఉంటే.. విపక్షాలన్నీ తనను ప్రశంసించి ఉండేవన్నారు. ఢిల్లీలో జరిగిన ‘అప్‌డేటెడ్ ఎడిషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, మేకింగ్ ద కాన్స్టిట్యూషన్’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. పార్లమెంటు సమావేశాలు జరగకుండా విపక్షాలు ఆందోళన చేస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ప్రధాని తీవ్రంగా ప్రతిస్పందించారు. ‘ప్రభుత్వం సరైన సన్నద్ధత లేకుండానే నోట్లరద్దు నిర్ణయం తీసుకుందని విమర్శిస్తున్నారు. అది అసలు విషయమే కాదు. వారు అన్నీ సర్దుకునేందుకు ప్రభుత్వం సరిపోయేంత సమయం ఇవ్వలేదని బాధపడుతున్నారు’ అని అన్నారు. విమర్శిస్తున్న వారందరికీ నోట్ల రద్దు చేసేముందు 72 గంటల సమయం ఇచ్చుంటే.. ఇవాళ తన నిర్ణయాన్ని ప్రశంసించి ఉండేవారన్నారు.

దేశం నల్లధనం, అవినీతిపై చేస్తున్న పోరాటంలో ప్రతి సామాన్య భారతీయుడూ సైనికుడేనన్నారు. ప్రపంచ అవినీతి సూచీలో భారత్ పేరు ప్రముఖంగా కనిపించటం గర్వపడాల్సిన విషయం కాదన్నారు. దేశ హితానికి కొన్ని ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిందేనన్నారు. నోట్లరద్దు నిర్ణయం వల్ల స్థానిక సంస్థలకు చాలా లాభం జరిగిందన్నారు. ‘దేశంలోని పలు నగరాల కార్పొరేషన్ల వివరాలందారుు. ఆ నగరాల్లో గతంలో 3-3.5 వేల కోట్ల పన్ను వసూలయ్యేది. కానీ ఈ పదిహేను రోజుల్లోనే రూ.13 వేల కోట్లు పన్ను రూపేణా వచ్చింది. ఈ నిధులు రోడ్లు, విద్యుత్ వంటి అభివృద్ధి పనులకు వాడొచ్చు’ అని పేర్కొన్నారు.
 
నోట్లకు ‘మొబైల్’ పరిష్కారం
పంజాబ్‌లోని బఠిండాలో ఎరుుమ్స్‌కు మోదీ శంకుస్థాపన చేశారు.  రూ.925 కోట్లతో 750 పడకల ఎరుుమ్స్ ఆస్పత్రిని 177 ఎకరాల్లో నిర్మించనున్నారు.  ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మోదీ పాల్గొన్నారు. కేంద్రం నిర్ణయం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా.. నిజారుుతీకి అండగా నిలుస్తున్నారన్నారు. ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. నోట్ల రద్దుతో ఎదురవుతున్న సమస్యల పరిష్కారాల్లో మొబైల్ బ్యాంకు ఓ పరిష్కారమని తెలిపారు. నల్లధనం, అవినీతిని తరిమికొట్టే ప్రయత్నంలో మొబైల్ ఫోన్లనే బ్యాంకు బ్రాంచీలుగా మార్చుకోవాలన్నారు. ‘పేమెంట్ల కోసం బ్యాంకులకు వెళ్లకుండా మొబైల్ యాప్‌లనే వినియోగించాలి.

సాంకేతికతను అందిపుచ్చుకోండి’ అని సూచించారు. నల్లధనం, అవినీతిని తరిమేస్తే.. పేదలకు వారి హక్కులు అందుతాయన్నారు. అనంతరం, ఆనంద్‌పూర్‌లోకి కేశ్‌గఢ్ సాహిబ్‌లో గురుగోవింద్ సింగ్ 350వ ప్రకాశ్ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన్నారు. బీజేపీ పంజాబ్ ఇంన్‌చార్జ్‌గా పనిచేసినపుడు ఆనంద్ నగర్‌లోని కేశ్‌గఢ్ సాహిబ్‌ను తరచూ సందర్శించిన రోజులను గుర్తుచేసుకున్నారు.

పంట వ్యర్థాలను కాల్చొద్దు..  పంజాబ్, హరియాణాల్లో రైతులు పంట వ్యర్థాలను కాల్చటాన్ని ఆపేసేలా ప్రతిజ్ఞ చేయాలని మోదీ సూచించారు. దీని వల్ల తీవ్రస్థారుులో కాలుష్యం జరుగుతుందన్నారు. ‘ఎన్నికలు సమీపిస్తున్నందున రైతులకు ఇలాంటి సూచనలు ఇస్తున్నారు. మోదీకి రాజకీయాలు తెలియవని చాలా మంది అనుకుంటున్నారు. కానీ నాకు ఎన్నికల ఫలితాలు ముఖ్యం కాదు. నా రైతు సోదర, సోదరీమణుల సంక్షేమమే ముఖ్యం. వ్యర్థాలను కాల్చటం ద్వారా కాలుష్యం పెరుగుతుంది. కానీ పంట వ్యర్థాల ద్వారా భూసారం పెరుగుతుందని కొత్త పరిశోధనలు చెబుతున్నారుు’ అని మోదీ తెలిపారు.

రాజ్యాంగ స్ఫూర్తితో.. ‘బాబా సాహెబ్ అంటేనే రాజ్యాంగం, రాజ్యాంగం అంటేనే బాబాసాహెబ్’ అని మోదీ అన్నారు. లోక్‌సభ సెక్రటేరియట్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రెండు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు.  ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని తమ హక్కులను తెలుసుకోవాలనుకుంటున్నారు. ‘దేశానికి స్వాతంత్య్రం వచ్చినపుడు ప్రజల బాధ్యత చాలా ఎక్కువగా ఉండేది. రాను రానూ పరిస్థితులు మారటం వల్ల బాధ్యత అనేది.. హక్కుల కోసం పోరాడటంగా మాత్రమే మారింది. స్కూళ్లు, కాలేజీల్లో రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేయాలి’ అని అన్నారు. బాగా తెలివైన వారు రాజ్యాంగాన్ని అర్థం చేసుకుని దుర్వినియోగం చేస్తున్నారని దీని వల్ల అరాచకం పెరిగిపోతోందన్నారు.

పాక్‌ది స్వీయ దహనం
భారత సైన్యం జరిపిన సర్జికల్ దాడులనుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదని.. భారత్‌తో పోరాడటం ద్వారా తనను తాను కాల్చుకుంటోందని మోదీ బఠిండాలో అన్నారు. ‘గతంలో భారత జవాన్లకు తమ సత్తాను చూపేందుకు అధికారాలిచ్చేవారు కాదు. కానీ సర్జికల్ దాడుల తర్వాత పాక్ మనోళ్ల ధైర్యసాహసాలను రుచిచూసింది’ అని అన్నారు. పాకిస్తానీలను ఉద్దేశించి ‘పెషావర్‌లో స్కూలు పిల్లలను చంపినపుడు 125 కోట్ల మంది భారతీయులు కన్నీళ్లు కార్చారు. మీరూ పేదరికంపై పోరాటం చేయాలంటున్నారు. కానీ మీ ప్రభుత్వం భారత్‌పై దాడి చేస్తోంది. ఈ దాడుల ద్వారా మిమ్మల్ని మీరు దహించుకోకండి. మీ ప్రభుత్వాన్ని అవినీతి, నల్లధనం నుంచి కాపాడమని అడగండి’ అని అన్నారు. సింధు, సట్లేజ్, బియాస్, రావి నదుల నీరు భారత్ హక్కు అని.. ఈ నీరు వ్యర్థంగా సముద్రంలో కలిసేబదులు ఇక్కడి రైతులకు ఉపయోగపడాలన్నారు. ‘చర్చల ద్వారానే నీటి సమస్యలు పరిష్కారం అవుతారుు. కేంద్రంలో అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు నీటిని అలాగే వదిలేయటం ద్వారా భారత రైతులకు నష్టం జరిగింద’న్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement