
నోట్లరద్దు సమాచారాన్ని బయట పెట్టాల్సిందే
న్యూఢిల్లీ: నోట్లరద్దు ప్రక్రియలో భాగమైన ప్రతి ప్రభుత్వ విభాగం అందుకు సబంధించిన సమాచారాన్ని బయట పెట్టాల్సిందేనని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు పేర్కొన్నారు.
రద్దు సమయంలో ఎంత డబ్బు, ఎంత మందికి మార్చి ఇచ్చారో తెలపాలని ఓ వ్యక్తి పింటోపార్క్ ఎయిర్‌ఫోర్స్ పోస్టాఫీస్‌కు సమాచార హక్కు (సహ) దరఖాస్తు చేశారు. అందుకు అధికారులు నిరాకరించడంతో అప్పీల్ చేశారు. కేసును విచారించిన శ్రీధర్ పై విధంగా వ్యాఖ్యానించారు.