
న్యూఢిల్లీ: ఏడాది క్రితం తీసుకున్న నోట్లరద్దు నిర్ణయం నిర్ణయాత్మకమైనదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 125 కోట్ల మంది ప్రజలు నల్లధనానికి వ్యతిరేకంగా పోరాడి విజయం సాధించారన్నారు. ‘నల్లధనం, అవినీతిపై కఠినమైన నిర్ణయాలు తీసుకోవటంలో మద్దతుగా నిలిచిన ప్రజలకు తలొంచి నమస్కరిస్తున్నా’ అని మోదీ ట్వీట్ చేశారు. నోట్లరద్దు వల్ల కలిగే ప్రయోజనాలను తెలిపే చిన్న షార్ట్‌ఫిల్మ్‌ను కూడా ప్రధాని పోస్టు చేశారు. నోట్లరద్దుతో భారత ఆర్థిక వ్యవస్థ క్రమబద్ధంగా మారిందని, వ్యవస్థలో స్వచ్ఛత తీసుకురావటం వల్ల ఉద్యోగ కల్పన సాధ్యమవుతుందన్నారు. అవినీతి, నల్లధనాన్ని పెకలించివేయటంలో కేంద్రం చేస్తున్న ప్రయత్నాలపై అభిప్రాయాలను ‘నరేంద్ర మోదీ యాప్’లో తెలపాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment