మహా అవస్థ | Even the banks with thousands of 2000 | Sakshi
Sakshi News home page

మహా అవస్థ

Published Mon, Nov 14 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 8:01 PM

మహా అవస్థ

మహా అవస్థ

కొత్త నోట్ల కోసం జనం పాట్లు.. 2వేలతో సరిపెట్టిన బ్యాంకులు
అర్ధరాత్రి వరకు ఏటీఎంల వద్ద పడిగాపులు
పడిపోరుున ఆర్టీసీ, క్యాబ్‌ల ఆక్యుపెన్సీ, ఆటోవాలా దివాళా
కొత్త సినిమాలొచ్చినా...వారాంతంలో బాక్సాఫీస్ ఢమాల్
మద్యం, మాంసాహార అమ్మకాలు మరింత డల్
సందడి లేని షాపింగ్ మాల్స్

నగరం బోసిపోరుుంది. సరదా సండే సీన్ మారింది. నోట్ల రద్దు ఎఫెక్ట్‌తో జనం వీకెండ్ జోష్‌ను మర్చిపోయారు. రోజంతా బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరగడంతోనే సరిపోరుుంది. మహిళలు, పిల్లలు సైతం భారీ క్యూలలో నిల్చోవాల్సి వచ్చింది. నోట్ల మార్పిడి పరిమితంగా ఉండడం..చిన్నపాటి ఖర్చులకు కూడా డబ్బులు లేకపోవడంతో సినిమాలు, పార్కులు, హోటళ్లు, నాన్‌వెజ్ వంటలకు జనం స్వస్తి చెప్పారు. దీంతో ఆదివారం సినిమా హాళ్లు, పార్కులు, రెస్టారెంట్లు, మటన్- చికెన్ షాపులు బోసిపోరుు కన్పించారుు. ఇక అడ్డాకూలీలకు పనిదొరక్క రోడ్లపైనే నిరీక్షించాల్సి వచ్చింది. మొత్తంగా పెద్ద నోట్ల రద్దు నగర ప్రజలకు, వ్యాపారులకు శరాఘాతమే అరుు్యంది. - సాక్షి, సిటీబ్యూరో

సిటీబ్యూరో :  మహానగరాన్ని కరెన్సీ కష్టాలు వీడటం లేదు.రిజర్వు బ్యాంకు చేస్తున్న ప్రకటనలకు..వాస్తవానికి భారీ తేడా ఉండటంతో నోట్ల బదిలీ, ఏటీఎం సెంటర్ల నుంచి కొత్త కరెన్సీ విత్ డ్రా వ్యవహారం నగరంలో సాధారణ జనానికి కంటి మీద కునుకు లేకుండా చేసింది. వారాంతపు సందడినీ దూరం చేసింది.సెలవు దినమైన ఆదివారం కూడా బ్యాంకులు పనిచేసినప్పటికీ సరిపోను రూ.2000, రూ.100 నోట్లు అందుబాటులో లేకపోవటంతో ఉదయం నుండే క్యూ కట్టిన వారికి అనేక చోట్ల నిర్ణీత రూ.4 వేలకు గానూ, రూ.2వేలు చెల్లించగా, మరిన్ని చోట్ల టోకెన్లు ఇచ్చి మంగళవారం రావాల్సిందిగా సూచించారు. దీంతో అనేక చోట్ల బ్యాంకు సిబ్బందికి, జనానికి వివాదాలు, ఘర్షణలు చోటు చేసుకున్నారుు. ఇక నగరంలో ఉన్న ఏడువేల ఏటీఎంలలో రూ.2 వేల నోట్లను అమర్చే ట్రే, సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి రాకపోవటంతో రూ.100 నోట్లతోనే సరిపెట్టటం, పెట్టిన రెండు గంటల్లోనే ఖాళీ కావటంతో అదివారం అర్థరాత్రి దాటేంత వరకు కూడా జనాలు ఏటీఎంల ముందు పడిగాపులు కాశారు.

నగరంలో అన్నింటా..తగ్గిన సందడి
పాత నోట్లు అన్ని చోట్ల చెల్లుబాటు కాకపోవటం, నోట్ల మార్పిడి ప్రక్రియ నెమ్మదించిన ప్రభావం నగరంలో అయా రంగాలపై గణనీయంగా కనిపించింది. ఆర్టీసీలో ఆక్యుపెన్సీ రేషియా పడిపోవటంతోపాటు క్యాబ్‌లు, ఆటోవాలాలు సైతం పూర్తిగా డీలాపడ్డారు. వారాంతంలో సినిమా హాళ్లు పూర్తిగా కళతప్పారుు. ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ ప్రధాన థియేటర్‌లో 1055 సీట్లకు గానూ ఆదివారం ఫస్ట్ షోలో కేవలం 250 సీట్లు నిండారుు. రూ.100 సీట్లన్నీ ఖాళీగానే ఉండగా, రూ.50 సీట్లలోనే ప్రేక్షకులు కనిపించారు. ఈ థియేటర్‌కు ప్రతి షోకు రూ.10 వేలకు పైగా మొత్తం రావాల్సి ఉండగా కేవలం రూ.3 వేలతో బాక్సాఫీస్ పల్టీ కొట్టింది. దీనికి తోడు 11న విడుదల కావాల్సిన పలు సినిమాలు సైతం వారుుదా పడ్డారుు. ఇక నగరంలో వారాంతంలో జరిగే విందు, వినోదాలపై నోట్ల రద్దు అంశం భారీగానే ప్రభావం చూపింది. నగరంలో ఆదివారం ఒక్క రోజే 18 నుండి 20 లక్షల కిలోల చికెన్ సగటు అమ్మకాలకు గానూ, ఈ వారం అందులో 30 శాతం అమ్మకాలు తగ్గారుు(ఇందులో కార్తీక మాసం ప్రభావం 10 శాతం). మిగిలిన రోజుల్లో 8 లక్షల కిలోల సగటు వినియోగం కూడా గడిచిన నాలుగు రోజుల్లో 5 లక్షల కిలోలకు చేరటంతో మార్కెట్ వర్గాలు ఆందోళన వక్తం చేశారుు.

ఇదే తరహాలో మద్యం అమ్మకాలు నిత్యం పది కోట్ల అమ్మకాలకు బదులు ఆరు కోట్లకు పడిపోయారుు. ఇక వస్త్ర వ్యాపారం సగానికి సగం పడిపోరుుంది. జూబ్లీహిల్స్‌లోని నీరూస్‌లో ప్రతి రోజూ రూ. 12 నుండి 15 లక్షల వరకు సేల్స్ జరిగే పరిస్థితి నుండి పెళ్లిళ్ల సీజన్ అరుునా ఆదివారం కనీస అమ్మకాలు జరగలేదని మేనేజర్ ప్రణీత ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దు అంశం తొలుత వీధి, చిరు వ్యాపారులపై పడగా క్రమంగా ఇతర బడా వ్యాపారం దిశగా తన ప్రభావాన్ని చూపే దిశగా వెళ్తోంది. తక్షణం నోట్ల బదిలీ, ఏటీఎం సెంటర్లలో నిరంతరం సరిపోను నగదు అందుబాటులో ఉంచకపోతే మరిన్ని ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement