ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత | RBI removes cash withdrawal limits for ATMs from Feb 1 | Sakshi
Sakshi News home page

ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత

Published Mon, Jan 30 2017 5:27 PM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత

ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా పరిమితులు ఎత్తివేత

న్యూఢిల్లీ : ఏటీఎంల్లో నగదు విత్డ్రాయల్స్పై ఆర్బీఐ గుడ్న్యూస్ చెప్పింది. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఏటీఎంల్లో విధించిన క్యాష్‌ విత్డ్రా నిబంధనలను కరెంట్ ఖాతాదారులకు, క్యాష్‌ క్రెడిట్ ఖతాదారులకు, ఓవర్డ్రాఫ్ట్ ఖాతాదారులకు ఎత్తివేస్తున్నట్టు రిజర్వు బ్యాంకు ప్రకటించింది. ఈ కొత్త నిబంధనలు 2017 ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్నట్టు ఆర్బీఐ పేర్కొంది. అయితే సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులకు ప్రస్తుతమున్న పరిమితులు యథాతథంగా కొనసాగుతాయని తెలిపింది.

భవిష్యత్తుల్లో వీరికి కూడా నిబంధనలు ఎత్తివేయడాన్ని పరిగణలోకి తీసుకుంటామని పేర్కొంది. సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు ప్రస్తుతం వారానికి రూ.24 డ్రా చేసుకునే అవకాశమే ఉంది. 2017-18కి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీనే కరెంట్ అకౌంట్ ఖాతాదారులకు ఈ నిబంధనలు ఎత్తివేయడం విశేషం. కాగ జనవరి 16న కరెంటు ఖాతా నుంచి నగదు ఉపసంహరణ పరిమితి వారానికి రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనలను ప్రస్తుతం పూర్తిగా ఎత్తివేశారు.  (చదవండి: ఏటీఎంలలో విత్డ్రా పరిమితి పెంపు)
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement