ఏటీఎం కార్డు ఉపయోగించాక కూడా చేతులు కడుక్కోండి...
మనమంతా సాధారణంగా భోజనానికి ముందు, భోజనం తర్వాత, బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చాక మాత్రమే చేతులు కడుక్కుంటాం.
మనమంతా సాధారణంగా భోజనానికి ముందు, భోజనం తర్వాత, బాత్‌రూమ్‌కు వెళ్లి వచ్చాక మాత్రమే చేతులు కడుక్కుంటాం. బాత్‌రూమ్‌కు వెళ్లొచ్చాక చేతులు కడుక్కోవడం ఎంత ముఖ్యమో... ఏటీఎం కార్డు ఉపయోగించాక చేతులు కడుక్కోవడమూ అంతే ప్రధానం అంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు. వీరు న్యూయార్క్ నగరంలోని భాగాలైన బ్రూక్లిన్, మాన్‌హటన్, క్వీన్స్ ప్రాంతాలలో ఉన్న 66 ఏటీఎం సెంటర్ల నుంచి ధూళిని సేకరించారు. దాన్ని ల్యాబ్‌లో పరిశీలిస్తే తేలిన అంశాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. మానవుల చర్మంలోని సూక్ష్మజీవులు (స్కిన్ మైక్రోబ్స్) అక్కడ వ్యాపించి ఉన్నట్లు ల్యాబ్స్‌లో తేలింది. ఈ విషయాలను న్యూయార్క్ యూనివర్సిటీకి చెందిన సెంటర్ ఫర్ జీనోమిక్ అండ్ సిస్టమ్ బయాలజీకి చెందిన జేన్ కార్ల్‌టన్ వెల్లడించారు. ఈ అంశాలు ‘జర్నల్ ఎమ్‌స్ఫియర్’లో అనే మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి. అందుకే ఎటీఎమ్ కార్డ్ ఉపయోగించాక కూడా చేతులు కడుక్కోవడం మంచిది.