జిల్లాకు రూ.100 కోట్ల కరెన్సీ
జిల్లాకు రూ.100 కోట్ల కరెన్సీ
Published Mon, Nov 28 2016 10:35 PM | Last Updated on Mon, Sep 4 2017 9:21 PM
– కొత్త రూ. 500 నోట్లు
- అన్ని బ్యాంకులకు పంపిణీ చేసే విధంగా కలెక్టర్ చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాకు కరెన్సీ దాదాపు రూ. 100 కోట్లు వచ్చింది. ఈ మొత్తం ఆంధ్రబ్యాంకు కరెన్సీ చస్ట్‌కు వచ్చినట్లు సమాచారం. అయితే ఈ మొత్తం ఇంకా బ్యాంకులకు చేరలేదు. జిల్లాకు వచ్చిన కరెన్సీలో రూ.500 నోట్లు కూడా ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏఏ నోట్లు ఎంత విలువ వచ్చిందనే వివరాలు బయటికి రాలేదు. అన్ని బ్యాంకులకు కరెన్సీ ఇవ్వాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఉన్నట్లు తెలుస్తోంది. మంగళవారం కొత్త రూ. 500 నోట్లు మార్కెట్‌లోకి రానున్నాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు అన్ని బ్యాంకులకు కరెన్సీని పంపిణీ చేయనున్నారు.
అంతటా నో క్యాష్
సోమవారం అన్ని వర్గాల ప్రజలను నగదు కొరత వేధించింది. జిల్లాలో 403 ఏటీఎంలు ఉండగా నగదు కొరత వల్ల దాదాపు అన్ని ఏటీఎంలు మూత పడ్డాయి. ఎస్‌బీఐ బ్రాంచిల్లో నో క్యాష్, నో విత్‌డ్రాయల్ అనే బోర్డులు పెట్టారు. కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచికి ఉద్యోగులు విత్ డ్రా కోసం భారీగా వెళ్లారు. అయితే టు డే నో క్యాష్, నో విత్ డ్రా అనే బోర్డును కనిపించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
Advertisement