ఆంధ్రాబ్యాంక్‌ క్యాషియర్‌ అరెస్ట్‌ | Andhra Bank cashier arrested | Sakshi
Sakshi News home page

ఆంధ్రాబ్యాంక్‌ క్యాషియర్‌ అరెస్ట్‌

Published Thu, Dec 29 2016 4:00 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

ఆంధ్రాబ్యాంక్‌ క్యాషియర్‌ అరెస్ట్‌ - Sakshi

ఆంధ్రాబ్యాంక్‌ క్యాషియర్‌ అరెస్ట్‌

నగదు మార్పిడికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడిన వైనం

హుజూర్‌నగర్‌: కమీషన్‌కు కక్కుర్తి పడి నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ఓ బ్యాంక్‌ క్యాషియర్‌ పోలీసులకు చిక్కాడు. వివరాలు .. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన రవీందర్‌రెడ్డి నాలుగేళ్లుగా మఠంపల్లి ఆంధ్రా బ్యాంక్‌లో క్యాషియర్‌. మఠంపల్లిలో ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్న స్వర్ణ డానియేల్‌ తరచూ ఆంధ్రా బ్యాంక్‌లో ఎలక్ట్రీషియన్‌ పనులు చేసేందుకు వెళుతుండేవాడు. ఈ క్రమంలో క్యాషియర్‌ రవీందర్‌రెడ్డి ఎలక్ట్రీషియన్‌ డానియేల్‌ ద్వారా కమీషన్‌ పద్ధతిలో నోట్ల మార్పిడి చేసేందుకు పథకం రచించాడు. సదరు ఆంధ్రాబ్యాంక్‌లో రవీందర్‌ రెడ్డి బంధువులకు చెందిన 5 ఖాతాలు, అదే బ్యాంక్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్న మాథ్యూ స్‌ బంధువులకు చెందిన 4 ఖాతాలను నోట్ల మార్పిడికి ఉపయోగించేందుకు సిద్ధమయ్యారు. 

డానియేల్‌ నూతన నోట్లు కావలసిన వారిని గుర్తించి రవీందర్‌రెడ్డికి అప్పగించేవాడు. రూ.100కు 19 శాతం కమీషన్‌ ఒప్పందంతో నవంబర్‌ 8వ తేదీ నుంచి 9 బ్యాంక్‌ ఖాతాల ద్వారా నోట్ల మార్పిడికి పాల్పడుతున్నారు.  ఈ క్రమంలో ఎస్‌ఐ రంజిత్‌రెడ్డి ఈ నెల 27న మఠంపల్లి రోడ్డులో  హుజూర్‌నగర్‌ వైపుగా వస్తున్న రవీందర్‌రెడ్డి కారును నిలిపి తనిఖీలు చేశారు. సదరు కారులో రూ. 2 లక్షలు నూతన కరెన్సీ నోట్లు దొరికాయి. సదరు నోట్లు కూడా ఆంధ్రాబ్యాంక్‌లోని ఖాతాల ద్వారా మార్పిడి చేసి ఇంటికి తీసుకువస్తున్న నగదుగా గుర్తిం చారు. హుజూర్‌నగర్‌ గోవిందాపురంలో గల రవీందర్‌రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టగా రూ.2 వేల నూతన నోట్లు రూ. 3 లక్షల 22 వేలు దొరికాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement