డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వ నజరానాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తరువాత 27వ రోజుకూడా ప్రజల కష్టాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల కేంద్రాల వద్ద జనం క్యూలు కొనసాగనున్నాయి. పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ముఖ్యంగా ఆదివారం సెలవు తర్వాత సోమవారం తిరిగి బ్యాంకుల బయట, ఏటీఎం కేంద్రాల వద్ద దీర్ఘమైన క్యూలు కొనసాగుతున్నాయి. అయితే నోట్ల రద్దుతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం, ఆర్థిక శాఖ చేస్తున్న కసరత్తు కూడా ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియపై పంచాయతీలు, జిల్లాలను పురస్కారాలతో సత్కరించనుంది.
దేశవ్యాప్తంగా 90 వేల ఏటీయంలు అప్డేట్ అయ్యాయి. ఏటీఎం కేంద్రాలు, బిగ్ బజార్, పెట్రోల్ బంకుల కౌంటర్ల వద్ద కార్డుల స్వైపింగ్ ద్వారా రూ.2500 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ లో ఒక చిన్న కరెన్సీ సరఫరా పెంచడానికి రిజర్వ్ బ్యాంకు నిర్ణయాలు తీసుకుంది. చిల్లర కష్టాలను తొలగించేందుకు గాను కొత్త రూ.20, రూ.50నోట్లను సిద్ధం చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతోపాటు పాతనోట్లు కూడా చెల్లుబాటవుతాయనిస్పష్టం చేసింది నీతి అయోగ్ ప్రతి జిల్లాలో రూ .5 లక్షల నిధులను విడుదల చేయనుంది. జిల్లా మేజిస్ట్రేట్ మరియు పంచాయతీల లావాదేవీల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కువ డిజిటల్ సేవలను ప్రోత్సహించిన సంస్థలను సత్కరించనుంది. డిజిటల్ లావాదేవీల్లో మంచి పనితనం చూపించిన 10 జిల్లాలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది.