Big bazaar
-
కొనుగోలు చేసేవాళ్లే లేరా.. మూసివేత దిశగా బిగ్‌బజార్?
న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) కొనుగోలు చేసేందుకు సరైన కొనుగోలుదారుపై రుణదాతలు ఒక నిర్ణయానికి రాలేకపోవడంతో సంస్థ మూసివేత దిశగా చర్యలు ప్రారంభం కానున్నాయి. సంస్థ లిక్విడేషన్ కోసం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ముంబై బెంచ్)లో పరిష్కార నిపుణుడు (ఆర్పీ) దరఖాస్తు సమర్పించినట్లు స్టాక్ ఎక్సే్చంజీలకు ఎఫ్ఆర్ఎల్ తెలియజేసింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఎఫ్ఆర్ఎల్కు రూ. 30,000 కోట్ల పైచిలుకు రుణభారం ఉంది. సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న ఫ్యూచర్ గ్రూప్ కంపెనీలను రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసేందుకు 2020లో రిలయన్స్ రిటైల్ ప్రతిపాదించినప్పటికీ .. అమెజాన్‌తో న్యాయపరమైన వివాదాల కారణంగా రుణదాతలు దాన్ని తిరస్కరించారు. ఎఫ్‌ఆర్‌ఎల్‌పై 2022 జులై 20 నుంచి దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ప్రారంభమయ్యాయి. పరిష్కార చర్యలకు గడువును ఎన్సీఎల్టీ నాలుగు సార్లు పొడిగించినప్పటికీ తగిన పరిష్కారం లభించలేదు. చివరి సారిగా నిర్దేశిత గడువులోగా స్పేస్ మంత్ర రూ. 550 కోట్లకు బిడ్ వేసినప్పటికీ రుణదాతల కమిటీలో (సీవోసీ) దానికి తగినంత స్థాయిలో మద్దతు లభించలేదు. దీంతో ఎఫ్ఆర్ఎల్ లిక్విడేషన్ బాట పట్టనుంది. -
రూ. 7,000 కోట్ల పెట్టుబడికి ‘సమర’ సిద్ధం
న్యూఢిల్లీ: ఫ్యూచర్ రిటైల్‌ను (ఎఫ్ఆర్ఎల్) రుణ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ సమర క్యాపిటల్ సిద్ధంగా ఉందని ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ వెల్లడించింది. ఎఫ్ఆర్ఎల్ నుంచి బిగ్ బజార్ తదితర సంస్థలను కొనుగోలు చేయడం ద్వారా సుమారు రూ. 7,000 కోట్లు ఇన్వెస్ట్ చేయడానికి సుముఖంగానే ఉందని తెలిపింది. ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లకు జనవరి 22న రాసిన లేఖలో ఈ విషయాలు వెల్లడించింది. రుణదాతలకు జరపాల్సిన చెల్లింపుల కోసం జనవరి 29 డెడ్‌లైన్ లోగా రూ. 3,500 కోట్లు సమకూర్చగలరా లేదా అన్నది తెలియజేయాలంటూ ఎఫ్ఆర్ఎల్ స్వతంత్ర డైరెక్టర్లు గతంలో రాసిన లేఖపై అమెజాన్ ఈ మేరకు స్పందించింది. 2020 జూన్ 30 నాటి టర్మ్ షీట్ ప్రకారం రూ. 7,000 కోట్లకు ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను (బిగ్ బజార్, ఈజీడే, హెరిటేజ్ మొదలైనవి) కొనుగోలు చేసేందుకు సిద్ధంగానే ఉన్నామని సమర క్యాపిటల్ తమకు తెలిపిందని అమెజాన్ పేర్కొంది. ఇందుకోసం ఎఫ్ఆర్ఎల్ వ్యాపారాలను మదింపు చేసేందుకు అవసరమైన వివరాలను సమరకు అందించాలని తెలిపింది. అయితే, సమర క్యాపిటల్ ఆ విషయాన్ని నేరుగా ఎఫ్ఆర్ఎల్కు తెలపకుండా అమెజాన్‌తో ఎందుకు చర్చిస్తోందన్న అం శంపై వివరణ ఇవ్వలేదు. సుమారు రూ. 24,713 కోట్లకు బిగ్ బజార్ తదితర వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ చేస్తున్న యత్నాలను ఎఫ్‌ఆర్‌ఎల్‌లో పరోక్ష వాటాదారైన అమెజాన్ అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ వివాదంపై న్యాయపోరాటం సాగిస్తోంది. -
బిగ్ బజార్ బంపర్ ఆఫర్.. వాటి మీద 50 శాతం డిస్కౌంట్..!
ప్రముఖ రిటైల్ బ్రాండ్ సంస్థ ‘బిగ్ బజార్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ‘సబ్సే సస్తా దిన్’ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 19 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఫుడ్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్, లగేజ్, కిచెన్వేర్, హోమ్ డెకోర్ వంటి తదితర వస్తు ఉత్పత్తులపై పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో జరిగే ప్రముఖ సేల్‌లో తమ ‘సబ్సే సస్తే దిన్’ కూడా ఒకటని, ఇందులో వినియోగదారులు పలు ఆఫర్లను పొందొచ్చని బిగ్ బజార్ పేర్కొంది. ఈ సేల్‌లో భాగంగా ప్రతి బిగ్ బజార్ స్టోర్ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభంకానుంది. ఈ ఏడాది, కేవలం స్టోరుల్లో మాత్రమే కాకుండా బిగ్ బజార్ యాప్, వెబ్ సైట్ ద్వారా కూడా ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసిన 2 గంటల్లోగా ప్రోడక్ట్స్ ఉచిత హోమ్ డెలివరీ చేయనున్నారు. కస్టమర్లు ₹ 2,500 విలువైన ఫ్యాషన్ వోచర్లను ₹2,500 విలువైన షాపింగ్ పొందవచ్చు. అంటే, ఫ్యాషన్ మీద 50 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు కనీసం స్టోరులో ₹3,500 షాపింగ్ చేస్తే అదనంగా 7.5% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సబ్సే సస్తా దిన్ షాపింగ్ ఫెస్టివల్స్‌లో భాగంగా ఫుడ్, ఫ్యాషన్, హోమ్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్ లను తక్కువ ధరకు వినియోగిస్తుంది. Ab India Har Ghar Mein #SabseSasteDin. LIVE NOW at https://t.co/GQ7cytNsyu pic.twitter.com/JAyVFzhmc2 — Big Bazaar (@BigBazaar) January 19, 2022 (చదవండి: 5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?) -
బిగ్ బాస్కెట్, జియో మార్ట్‌లకు పోటీగా...బిగ్ బజార్ భారీ స్కెచ్..!
కోవిడ్-19 రాకతో భారత్‌లో ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవలు భారీ ఎత్తున ఊపందుకున్నాయి. ఈ సేవలను అందించడంలో బిగ్ బాస్కెట్, ఇన్‌స్టామార్ట్, బ్లిన్క్ఇట్(గ్రోఫర్స్), జియో మార్ట్ లాంటి కంపెనీలు ఇప్పటికే ముందంజలో ఉన్నాయి. ఆన్లైన్ డెలివరీ సేవలను అందించడంలో ఫ్యుచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ బిగ్ బజార్ భారీ ప్రణాళికలను సిద్ధమైన్నట్లు సమాచారం. బెంగళూరు కంపెనీతో భాగస్వామ్యం..! బిగ్ బజార్ ఆయా నగరాల్లో రెండు గంటల్లో కస్టమర్లకు గ్రాసరీ సేవలను అందిస్తోంది. మరింత వేగవంతమైన ఆన్లైన్ గ్రాసరీ సేవలను అందించేందుకుగాను బెంగళూరుకు చెందిన ఈవెంట్ మార్కెటింగ్ టెక్నాలజీ స్టార్టప్ ఎర్సెస్ లైవ్ (Ercess Live)తో బిగ్ బజార్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. వీరి మధ్య ఈ ఒప్పందం గత ఏడాది డిసెంబర్లోనే జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం..ఎర్సెస్ లైవ్ ఆన్లైన్ గ్రాసరీ సేవల్లో భాగంగా బిగ్ బజార్‌కు స్ట్రాటిజిక్ వ్యూహాలను అందించనున్నట్లు సమాచారం. ఈ నెల జనవరిలో ఆన్లైన్ గ్రాసరీ సేవలను బిగ్ బజార్ మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది. ముందుగా దక్షిణ భారత్‌లో తన కొత్త హోమ్ డెలివరీ సేవలను బిగ్ బజార్ ప్రారంభించనుంది. డంజోతో రిలయన్స్ భారీ డీల్..! దేశవ్యాప్తంగా ఆన్లైన్ కిరాణా వ్యాపారాన్ని మరింత వేగవంతం చేసేందుకుగాను ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన రిటైల్ చైన్ సంస్థ రిలయన్స్ రిటైల్ ఆన్లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డంజోతో కలిసే పనిచేసేందుకు సిద్దమైన విషయం తెలిసిందే. అందుకోసం డంజోలో 25.8 శాతం వాటాలను రిలయన్స్ కొనుగోలుచేసినట్లు తెలుస్తోంది. ఈ డీల్ విలువ సుమారు రూ. 1,488 కోట్లు. డంజో భాగస్వామ్యంతో జియో మార్ట్, రిలయన్స్ రిటైల్ సేవలను మరింత వేగవంతంగా అందిస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. ఇక దేశవ్యాప్తంగా ఆన్లైన్ గ్రాసరీ డెలివరీ సేవల్లో బిగ్ ప్లేయర్స్‌గా జియో మార్ట్, బిగ్ బాస్కెట్స్ ముందుస్థానంలో ఉన్నాయి. చదవండి: ఉచితంగా నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్..! వీటితో పాటుగా మరో 14 ఓటీటీ సేవలు ఉచితం..! -
Big Bazaar: త్వరపడండి.! ప్రీ బుకింగ్‌తో 3 వేల గిఫ్ట్ ఓచర్
హైదరాబాద్: తమ రిటైల్ వినియోగదారుల కోసం మహాబచత్ ఆఫర్‌ను ముందే బుక్ చేసుకునే (ప్రీ–బుకింగ్) అవకాశాన్ని అందు బాటులోకి తెచ్చినట్లు బిగ్‌బజార్ ఓ ప్రకట నలో తెలిపింది. జూలై 31వ తేదీ నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు ఆటా, పప్పులు, బియ్యంపై ప్రీ–బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొంది. బిగ్బ జార్ స్టోర్లలో గానీ, ఆన్లైన్లో, వెబ్‌సైట్‌పై గానీ, బిగ్‌బజార్ యాప్‌లో గానీ ప్రీ–బుక్ చేసుకోవచ్చని వివ రించింది. ప్రీ–బుక్ చేసుకున్న వినియోగదారులకు రూ. మూడు వేల విలువైన ఈజీవీ ( ఎలక్ట్రానిక్ గిఫ్ట్ ఓచర్) లభిస్తుందని తెలిపింది. అలాగే, ఈ ఏడాది మహాబచత్ ఆఫర్ ఆగస్ట్ 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉంటుందని వెల్లడించింది -
దేశంలోనే తొలిసారి, 2 గంటల్లో ‘ఫ్యాషన్’ డెలివరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్, ఎఫ్‌బీబీ.. రెండు గంటల హోమ్ డెలివరీ సేవలను ఫ్యాషన్‌కూ విస్తరించాయి. ఇప్పటి వరకు బిగ్ బజార్ ఈ సేవల కింద నిత్యావసరాలను తన కస్టమర్లకు అందించింది. ఫ్యాషన్ కలెక్షన్‌ను ఇలా రెండు గంటల్లో వినియోగదార్లకు చేర్చడం దేశంలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా 144 నగరాలు, పట్టణాల్లో 352 స్టోర్ల ద్వారా ఉత్పత్తులను సరఫరా చేస్తారు. షాప్.బిగ్‌బజార్.కామ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. -
రెండు గంటల్లో డెలివరీ: బిగ్ బజార్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్ ఇన్స్టాంట్ హోం డెలివరీ సర్వీసులను ప్రారంభించింది. ఆన్లైన్లో ఆర్డర్ చేసిన రెండు గంటల్లోనే ఉత్పత్తులను కస్టమర్ ఇంటికి చేరుస్తారు. ఫ్యాషన్, ఫుడ్, ఎఫ్ఎంసీజీ, హోం విభాగాల్లో ఉత్పత్తులను సమీపంలోని బిగ్ బజార్ స్టోర్ నుంచి సరఫరా చేస్తారు. మొబైల్ యాప్, పోర్టల్ ద్వారా వినియోగదార్లు కనీసం రూ.500 విలువ చేసే వస్తువులను ఆర్డర్ చేయాల్సి ఉంటుంది. ఆర్డర్ విలువ రూ.1,000 దాటితే డెలివరీ చార్జీలు ఉచితం. ప్రస్తుతం ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరులో ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయి. క్రమంగా ఇతర నగరాలకూ విస్తరిస్తామని ఫ్యూచర్ గ్రూప్ ఫుడ్, ఎఫ్ఎంసీజీ ప్రెసిడెంట్ కమల్‌దీప్ సింగ్ తెలిపారు. 45 రోజుల్లో 21 నగరాలకు, ఆరు నెలల్లో అన్ని బిగ్ బజార్ స్టోర్ల నుంచి ఈ సేవలు ఉంటాయని చెప్పారు. కిశోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ రిటైల్ ప్రమోట్ చేస్తున్న బిగ్ బజార్ దేశవ్యాప్తంగా 150 నగరాలు, పట్టణాల్లో 285 ఔట్లెట్లను నిర్వహిస్తోంది. ఫ్యూచర్ రిటైల్ ఖాతాలో హైపర్సిటీ, ఫుడ్‌హాల్, ఎఫ్‌బీబీ, ఫుడ్ బజార్, ఈజీడే క్లబ్, హెరిటేజ్ ఫ్రెష్ సైతం ఉన్నాయి. -
బిగ్ బజారులో తనిఖీలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): నగరంలోని బిగ్ బజారులో తూనికలు, కొలతలు, విజిలెన్స్, అగ్రికల్చర్, ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించి పలు ఆహార పదార్థాలు, చాక్లెట్స్, క్రీంలు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాల్లో పలువురు అధికారులు పాల్గొన్నారు. -
అమీర్‌పేట బిగ్‌బజార్ మాల్లో ప్రణీత సందడి
-
బిగ్ బజార్లో అగ్నిప్రమాదం
ముంబై: ముంబై మతుంగలోని బిగ్ బజార్ స్టోర్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో స్టోర్‌లోని గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి. తర్వాత అవి వేగంగా వ్యాపించాయి. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు ఆలుముకున్నాయి. వెంటనే రంగంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఐదు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో స్టోర్ లోపల ఉన్న వారందరిని బయటకు తరలించినట్టుగా సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మంచుతో మనం..
-
బిగ్‌బజార్‌లో ప్రమాదం
హైదరాబాద్: బిగ్ బజార్ నిర్వాహకుల అలసత్వం ఓ బాలుడి ప్రాణాల మీదకు తెచ్చింది. షాపింగ్ చేయడానికి తల్లిదండ్రులతో కలిసి వచ్చిన ఓ చిన్నారి రైడర్ కారుతో ఆడుకుంటూ.. ప్రమాదవశాత్తు ఎస్కలేటర్ పై నుంచి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. నగరంలోని కాచిగూడ బిగ్‌బజార్‌లో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. దిల్సుఖ్ నగర్‌కు చెందిన అభిరామ్(3) తల్లిదండ్రులతో కలిసి మంగళవారం రాత్రి మాల్ షాపింగ్ చేస్తుండగా.. బొమ్మ కారుతో ఆడుకుంటూ ఎస్కలేటర్ పై నుంచి కిందపడ్డాడు. బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో లక్డీకపూల్ లోని లోటస్ ఆస్పత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
బిగ్‌బజార్ 5 రోజుల ‘మహాబచత్’
ఈ నెల 12 నుంచి 16 వరకు సేల్ హైదరాబాద్: ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్ చైన్ ‘బిగ్‌బజార్’ తాజాగా ఐదు రోజుల మెగా డిస్కౌంట్ సేల్ ’మహాబచత్’ను ప్రకటించింది. ఈ సేల్ ఆగస్ట్ 12 నుంచి 16 వరకు అందుబాటులో ఉండనున్న ఈ బిగ్గెస్ట్ సేవింగ్స్ సేల్‌లో వినియోగదారులు ఎలక్ట్రానిక్స్, ఫుడ్ అండ్ గ్రాసరీ, దుస్తులు, గృహోపకరణాలు వంటి పలు ఉత్పత్తులపై ఆకర్షణీయ డిస్కౌంట్‌ను పొందొచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. -
డిజిటల్ చెల్లింపులపై ప్రభుత్వ నజరానాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన పెద్దనోట్ల రద్దు తరువాత 27వ రోజుకూడా ప్రజల కష్టాలు యధావిధిగా కొనసాగుతున్నాయి. బ్యాంకులు, ఏటీఎంల కేంద్రాల వద్ద జనం క్యూలు కొనసాగనున్నాయి. పరిస్థితి ఇంకా సాధారణ స్థితికి చేరుకోలేదు. ముఖ్యంగా ఆదివారం సెలవు తర్వాత సోమవారం తిరిగి బ్యాంకుల బయట, ఏటీఎం కేంద్రాల వద్ద దీర్ఘమైన క్యూలు కొనసాగుతున్నాయి. అయితే నోట్ల రద్దుతో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించేందుకు కేంద్రం, ఆర్థిక శాఖ చేస్తున్న కసరత్తు కూడా ముమ్మరంగా సాగుతోంది. ముఖ్యంగా డిజిటల్ చెల్లింపుల ప్రక్రియపై పంచాయతీలు, జిల్లాలను పురస్కారాలతో సత్కరించనుంది. దేశవ్యాప్తంగా 90 వేల ఏటీయంలు అప్డేట్ అయ్యాయి. ఏటీఎం కేంద్రాలు, బిగ్ బజార్, పెట్రోల్ బంకుల కౌంటర్ల వద్ద కార్డుల స్వైపింగ్ ద్వారా రూ.2500 వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. మార్కెట్ లో ఒక చిన్న కరెన్సీ సరఫరా పెంచడానికి రిజర్వ్ బ్యాంకు నిర్ణయాలు తీసుకుంది. చిల్లర కష్టాలను తొలగించేందుకు గాను కొత్త రూ.20, రూ.50నోట్లను సిద్ధం చేస్తున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. దీంతోపాటు పాతనోట్లు కూడా చెల్లుబాటవుతాయనిస్పష్టం చేసింది నీతి అయోగ్ ప్రతి జిల్లాలో రూ .5 లక్షల నిధులను విడుదల చేయనుంది. జిల్లా మేజిస్ట్రేట్ మరియు పంచాయతీల లావాదేవీల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఎక్కువ డిజిటల్ సేవలను ప్రోత్సహించిన సంస్థలను సత్కరించనుంది. డిజిటల్ లావాదేవీల్లో మంచి పనితనం చూపించిన 10 జిల్లాలకు పురస్కారాలను ప్రదానం చేయనున్నట్టు కేంద్రం వెల్లడించింది. -
ఇక బిగ్బజార్లోనూ క్యాష్ విత్‌డ్రా
-
ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’
-
ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’
హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రిటైల్‌ను దేశీయ రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన రిటైల్ డివిజన్‌ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది. హెరిటేజ్ ఫుడ్స్ ఈ మేరకు 124 స్టోర్లను ఫ్యూచర్ గ్రూప్‌కు అప్పగించింది. ఇకపై హెరిటేజ్ స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్‌లో భాగం కానున్నాయి. బదులుగా ఫ్యూచర్ గ్రూప్ సంస్థ...3.5 శాతం వాటాను హెరిటేజ్‌కు ఇవ్వనుంది. ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర సంపాదించుకుంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందంపై సెప్టెంబర్‌లోనే వార్తలు వెలువడ్డాయి. -
హైదరాబాద్‌లో సినీతార తాప్సీ సందడి
-
బిగ్‌బజార్ చేతికి ‘హెరిటేజ్ ఫ్రెష్’!
• అమ్మకానికి హెరిటేజ్ రిటైల్ వ్యాపారం • ఫ్యూచర్ గ్రూప్‌తో చర్చలు నిజమేనన్న కంపెనీ • ఈ వార్తలతో పరుగులు తీసిన షేరు ధర సాక్షి, అమరావతి/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ గ్రూపు నష్టాల్లో ఉన్న రిటైల్ వ్యాపారాన్ని వదిలించుకోవడానికి సిద్ధమయ్యింది. ఇందుకు సంబంధించి ఫ్యూచర్ గ్రూపుతో చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది. ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, తుది రూపునకు వచ్చిన తర్వాత నిబంధనల ప్రకారం ఎక్స్ఛేంజీలకు పూర్తి వివరాలను తెలియచేస్తామని కంపెనీ ఆ లేఖలో పేర్కొంది. ఈ వాటాల విక్రయంపై ఒక ఆంగ్ల బిజినెస్ పత్రికలో వచ్చిన కథనంపై ఎక్స్చేంజీ వివరణ కోరింది. ఈ వార్తల నేపథ్యంలో హెరిటేజ్ ఫుడ్స్ షేరు సోమవారం ఒకానొక దశలో 20 శాతం అప్పర్ సర్క్యూట్‌ను రూ.956ను తాకి చివరకు క్రితం ముగింపుతో పోలిస్తే 10 శాతం లాభంతో రూ.898 వద్ద ముగిసింది. గతేడాది సెప్టెంబర్‌లో రూ.362లుగా ఉన్న షేరు ధర ఏడాదిలో సుమారు రెట్టింపై రూ. 956 వరకు పెరిగింది. నష్టాలకు తోడు... డెయిరీ, రిటైల్, ఆగ్రి, బేకరీ, రెన్యువబుల్ ఎనర్జీ రంగాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూపు గత మార్చి నాటికి రూ. 2,387 కోట్ల టర్నోవర్‌పై రూ. 55 కోట్ల లాభాలను నమోదు చేసింది. కానీ మొత్తం వ్యాపారంలో సుమారు 20 శాతం ఆదాయాన్ని సమకూరుస్తున్న రిటైల్ విభాగం మాత్రం నష్టాల్లోనే ఉంది. గత మార్చి నాటికి రిటైల్ విభాగం రూ. 583 కోట్ల ఆదాయంపై రూ. 14 కోట్ల నష్టాన్ని (పన్నుకు ముందు) ప్రకటించింది. హెరిటేజ్ ఫ్రెష్ బ్రాండ్ నేమ్‌తో దేశవ్యాప్తంగా 115 స్టోర్స్ ఉన్నాయి. నష్టాలకు తోడు సుమారు 70కిపైగా రిటైల్ ఔట్లెట్లు తెలంగాణాలోనే ఉండటం కూడా రిటైల్ వ్యాపారం నుంచి వైదొలగడానికి కారణం కావచ్చని విశ్లేషకులు పేర్కొంటున్నారు. రిటైల్ నుంచి వైదొలిగి ప్రధానమైన డెయిరీ వ్యాపారంపై మరింత దృష్టిసారించాలని కంపెనీ యోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందిన ‘మోర్’రిటైల్ ఔట్లెట్లను కొనుగోలు చేయనున్నట్లు వార్తలు వచ్చినా వాస్తవ రూపందాల్చలేదు. ఇప్పుడు దక్షిణాది మార్కెట్లో బాగా విస్తరించి ఉన్న హెరిటేజ్ ఫ్రెష్‌ను కొనుగోలు చేయడానికి చర్చలు దాదాపు చివరి దశకు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మార్జిన్లు అధికంగా ఉండే సొంత లేబుల్ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోవచ్చన్నది ఫ్యూచర్ గ్రూపు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. కానీ ఈ ఊహాగానాలపై ఫ్యూచర్ గ్రూపు స్పందించలేదు. హెరిటేజ్ రిటైల్ వ్యాపారం విలువ ఎంత కట్టారు, ఈ ఒప్పందం ఏ విధంగా జరగనుందన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఒప్పందం షేర్ల బదలాయింపు విధానంలో కాకుండా నేరుగా నగదు రూపంలోనే జరగొచ్చని తెలుస్తోంది. అంకెల్లో... ⇔ ప్రస్తుత హెరిటేజ్ గ్రూపు మార్కెట్ క్యాప్ రూ. 2,092 కోట్లు ⇔ మార్చి నాటికి హెరిటేజ్ గ్రూపు ఆదాయం రూ.2,387 కోట్లు ⇔ రిటైల్ బిజినెస్ ఆదాయం రూ. 583 కోట్లు ⇔ మార్చినాటికి కంపెనీకి ఉన్న అప్పులు రూ. 106 కోట్లు ⇔ రిటైల్ బిజినెస్ స్థూల నష్టం: 14 కోట్లు ⇔ ప్రస్తుత రిటైల్ ఔట్లెట్ల సంఖ్య 115 ⇔ నెలకు 20 లక్షల మంది ఖాతాదారులు ⇔ రిటైల్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 2,689 ⇔ ఏడాదిలో రెట్టింపై రూ.363 నుంచి రూ.956కి చేరిన షేరు -
బిగ్ బజార్ డిస్కౌంట్ స్కీమ్
ముంబై : ఆన్ లైన్ ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్ కార్ట్ నుంచి పోటీని తట్టుకోవడానికి దేశంలోనే అతిపెద్ద సూపర్ మార్కెట్ చైన్ బిగ్ బజార్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ప్రతినెలా మొదటి ఎనిమిది రోజులకు ఓ డిస్కౌంట్ స్కీమ్ ను ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీ ప్రవేశపెట్టనున్నారు. ఆన్ లైన్ షాపింగ్ లకు తరలిపోతున్న కస్టమర్ల వలసను ఆపడానికి, కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడానికి బిగ్ బజార్ సంస్థ ఈ డిస్కౌంట్ స్కీమ్ ను ప్రవేశపెట్టనుంది. వచ్చే నెల నుంచి ఈ కొత్త స్కీమ్ ప్రారంభంకాబోతుందని సంస్థ ప్రకటించింది. కేవలం వీకెండ్స్ లో, జీతాలు వచ్చిన కొన్నిరోజులు మాత్రమే కాకుండా.. నెలమొత్తం కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఈ స్కీమ్ ఉపయోగపడుతుందని తెలిపింది. కొత్త కస్టమర్లను ఆకట్టుకోవడంతో పాటు, పాత కస్టమర్లకు రివార్డులు ప్రకటించనున్నట్టు బిగ్ బజార్ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు. రూ. 2500కు పైగా వస్తువులు కొనుగోలు చేసిన వారికి, నగదు బహుమతులు, వివిధ సెగ్మెంట్ లో రూ. 2000 కు తగిన వోచర్స్ జూన్ నుంచి అందుబాటులో ఉంచనున్నట్టు బిగ్ బజార్ పేర్కొంది. ఈ వోచర్లను నెలమొత్తం షాపింగ్ లో ఎప్పుడైనా వాడుకునేలా అవకాశం కల్పించనుంది. రూ.22వేల కోట్లగా ఉన్న తమ రెవెన్యూలను 2021 నాటికి రూ.75 వేల కోట్ల నుంచి రూ.లక్ష కోట్లకు తెచ్చుకోవడమే తమ లక్ష్యమని బిగ్ బజార్ ప్రకటించింది. ఫుడ్ అండ్ గ్రోసరీలకు రిటైల్ బాస్కెట్ లోనే డిమాండ్ ఎక్కువగా ఉందని, ఆన్ లైన్ కొనుగోలుకు తక్కువగానే వినియోగదారులు మొగ్గుచూపుతున్నారని బిగ్ బజార్ పేర్కొంది. -
ఆన్ లైన్ లోకి ఫ్యూచర్ గ్రూప్!
♦ ఓమ్నీ చానల్ వ్యూహం.. ♦ మూడు నెలల్లో ఈ-జోన్‌తో ప్రారంభం ♦ ఆ తర్వాతే బిగ్ బజార్, షాపర్స్ స్టాప్లకు విస్తరణ ♦ ‘బ్రిక్స్ అండ్ క్లిక్’ సదస్సులో ఫ్యూచర్ గ్రూప్ జేఎండీ రాకేష్ బియానీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర వేసిన దేశీ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్... త్వరలో ఆన్‌లైన్‌లోకి ప్రవేశిస్తోంది. దేశవ్యాప్తంగా 200కు పైగా స్టోర్లలో 1.7 కోట్ల చదరపుటడుగుల రిటైల్ స్పేస్ ఉన్న ఈ సంస్థ... ఓమ్నీ చానల్ పేరిట మూడు నెలల్లో ఆన్‌లైన్‌లోకి దిగుతున్నట్లు గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డెరైక్టర్ రాకేష్ బియానీ చెప్పారు. మంగళవారమిక్కడ విలేకరులతో ఆయన మాట్లాడారు. ‘‘మొదట ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన ఈ-జోన్ (ఎలక్ట్రానిక్ ఉపకరణాలు) స్టోర్లలో ఈ సేవలను ప్రారంభిస్తాం. ఆ తర్వాత ప్లానెట్ స్పోర్ట్స్, బిగ్ బజార్, షాపర్స్ స్టాప్ స్టోర్లకూ విస్తరిస్తాం’’ అని చెప్పారు. ఓమ్నీ చానల్ ప్రత్యేకతను వివరిస్తూ ‘‘కస్టమర్లు మొబైల్, ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్ల ద్వారా దగ్గర్లోని ఏదైనా ఫ్యూచర్ గ్రూప్ స్టోర్లలో ఆర్డర్ ఇవ్వొచ్చు. ఇది రెండు రకాలుగానూ ఉంటుంది. అవసరమైతే ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చి.. స్టోర్‌కు వెళ్లి ఉత్పత్తులను తీసుకోవచ్చు. లేదంటే స్టోర్‌కి వెళ్లి ఆర్డర్ ఇస్తే.. ఆయా ఉత్పత్తులను ఇంటికి కూడా డెలివరీ చేస్తాం. దీనివల్ల స్టోర్ల విక్రయాలకు ఆన్లైన్ విక్రయాలు జతకలుస్తాయి’’ అని బియానీ వివరించారు. ఓమ్నీ చానల్ షాప్, టెక్నాలజీ అభివృద్ధి కోసం హైబ్రిస్ సాఫ్ట్‌వేర్‌తో ఒప్పందం చేసుకున్నామన్నారు. ఓమ్నీ చానల్ విధానంతో 30% మేర స్టోర్ల ఆదాయం పెరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఫిక్కీ హైదరాబాద్ చాప్టర్ ఆధ్వర్యంలో ‘బ్రిక్స్ అండ్ క్లిక్స్’ పేరుతో ఆన్లైన్-ఆఫ్‌లైన్ రిటైల్ అంశంపై జరిగిన సదస్సులో బియానీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయనతో పాటు హీలియన్ వెంచర్ పార్ట్నర్ శ్రీకాంత్ సుందరరాజన్, యాక్టస్ అడ్వైజరీ ప్రై.లి. కో-ఫౌండర్, ఎండీ మనీష్ చద్దా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాకేష్ బియానీ మాట్లాడుతూ.. ఓమ్నీ చానల్ రిటైల్‌లో 40 వేల నుంచి 60 వేల ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఆఫ్‌లైన్‌లో ఎలాంటి ఆఫర్లు, డిస్కౌంట్లు ఉంటాయో ఆన్‌లైన్‌లోనూ అవే వర్తిస్తాయని తెలియజేశారు. ఐదేళ్లలో 300 పట్టణాలకు... ప్రస్తుతం దేశవ్యాప్తంగా 102 పట్టణాల్లో 200లకు పైగా స్టోర్లను నిర్వహిస్తున్నామని ఏటా 20-30 స్టోర్లను ప్రారంభిస్తామని రాకేష్ బియానీ చెప్పారు. .. ఐదేళ్లలో 300 పట్ణణాలకు విస్తరించాలనేది తమ లక్ష్యమన్నారు. ప్రస్తుతం ఫ్యూచర్ గ్రూప్ ద్వారా ఫ్యాషన్, ఫుడ్, హోమ్ మూడు విభాగాల్లో కలిపి మొత్తం 40 లక్షల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. మరో 10 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నట్లు చెప్పారు. ‘‘ఇపుడు మా గ్రూప్ కస్టమర్ల సంఖ్య 33 కోట్లు. మాకు హైదరాబాద్‌తో ఎనలేని అనుబంధం ఉంది. పంజగుట్టలో తొలి స్టోర్‌ను ప్రారంభించాక షాపర్స్ స్టాప్, బిగ్ బజార్, పాంటలూన్స్ ఇలా అన్ని స్టోర్ల ఆరంభానికీ తొలి వేదిక హైదరాబాదే’ అన్నారాయన. -
బిగ్ బజార్ ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్
ప్రముఖ రిటైల్ బ్రాండ్ సంస్థ ‘బిగ్ బజార్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ‘సబ్సే సస్తా 4 దిన్’ షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. జనవరి 23 నుంచి 26 వరకు జరగనున్న ఈ షాపింగ్ ఫెస్టివల్లో ఫుడ్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్, లగేజ్, కిచెన్వేర్, హోమ్ డెకోర్ వంటి తదితర వస్తు ఉత్పత్తులపై పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో జరిగే ప్రముఖ షాపింగ్ ఫెస్టివల్స్‌లో తమ ‘సబ్సే సస్తే 4 దిన్’ కూడా ఒకటని, ఇందులో వినియోగదారులు పలు ఆఫర్లను పొందొచ్చని బిగ్ బజార్ సీఈవో సదాశివ్ నాయక్ తెలిపారు. ఈ ఫెస్టివల్లో భాగంగా ప్రతి బిగ్ బజార్ స్టోర్ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభమవుతుందన్నారు. -
పతంజలి నూడుల్స్ వచ్చాయ్..
70 గ్రాముల ప్యాక్ ధర రూ.15 * రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్ తదితర అవుట్‌లెట్స్‌లో లభ్యం న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ ప్రమోట్ చేస్తున్న పతంజలి ఆయుర్వేద సోమవారం దేశీ మార్కెట్లోకి నూడుల్స్‌ను ప్రవేశపెట్టింది. ‘ఆటా నూడుల్స్’ 70 గ్రాముల ప్యాక్ ధర రూ. 15గా నిర్ణయించింది. పోటీ సంస్థల నూడుల్స్ కన్నా తమ ఉత్పత్తి ధర రూ. 10 తక్కువగా ఉంటుందని బాబా రాందేవ్ తెలిపారు. ఇతర సంస్థల్లాగా వీటి తయారీలో పామాయిల్ కాకుండా రైస్ బ్రాన్ ఆయిల్ ఉపయోగిస్తున్నట్లు ఆయన వివరించారు. రిలయన్స్ ఫ్రెష్, బిగ్ బజార్, డి-మార్ట్ వంటి రిటైల్ అవుట్‌లెట్స్‌తో పాటు పతంజలి బ్రాండ్ సొంత రిటైల్ స్టోర్స్‌లో కూడా ఇవి లభిస్తాయని ఆయన చెప్పారు. డిసెంబరు ఆఖరు నాటికి పది లక్షల స్టోర్స్‌లో ఇవి అందుబాటులో ఉంటాయన్నారు. నూడుల్స్ ఉత్పత్తి కోసం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ ఎన్సీఆర్లో మొత్తం అయిదు తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ప్లాంట్లలో పతంజలి ఆయుర్వేదకు చెందిన ఇతర ఉత్పత్తులు కూడా తయారవుతాయని రాందేవ్ చెప్పారు. బహుళ జాతి సంస్థలతో పోటీ పడే దిశగా త్వరలో పతంజలి నూడుల్స్‌తో పాటు నెయ్యి, టూత్‌పేస్ట్ తదితర ఉత్పత్తుల ప్రచారానికి టీవీ ప్రకటనలూ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. 5 నెలల నిషేధం తర్వాత ఇటీవలే మళ్లీ అమ్మకాలు మొదలెట్టిన నెస్లే కంపెనీ మ్యాగీ నూడుల్స్‌తో పతంజలి నూడుల్స్ పోటీపడనుంది. త్వరలో చైల్డ్, స్కిన్ కేర్ ఉత్పత్తులు కూడా..: డిసెంబర్ నాటికి చైల్డ్‌కేర్, స్కిన్‌కేర్ ఉత్పత్తులతో పాటు హెల్త్ సప్లిమెంట్స్‌ను కూడా మార్కెట్లోకి తేనున్నట్లు బాబా రాందేవ్ వివరించారు. ‘శిశు కేర్’ బ్రాండ్‌తో శిశు ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులు, ‘సౌందర్య’ బ్రాండ్ పేరిట సౌందర్య సంరక్షణ ఉత్పత్తులు, ‘పవర్ వీటా’ బ్రాండ్ కింద హెల్త్ సప్లిమెంట్స్‌ను ప్రవేశపెడతామన్నారు. అలాగే టెక్స్టైల్స్ రంగంలోకి అడుగెట్టబోతున్నామని, ‘వస్త్రం’ బ్రాండ్ కింద ఉత్పత్తులు ఉంటాయని బాబా రాందేవ్ తెలిపారు. పతంజలి ఆయుర్వేదను స్టాక్ ఎక్స్చేంజీల్లో లిస్టింగ్ చేస్తారా అన్న ప్రశ్నపై స్పందిస్తూ అటువంటి యోచనేదీ ప్రస్తుతానికి లేదన్నారు. ఎగుమతి అవకాశాలపై మాట్లాడుతూ.. ప్రస్తుతం తమ కంపెనీ చిన్న స్థాయిదేనని, దేశీ డిమాండ్‌పైనే ప్రధానంగా దృష్టి పెడుతోందని రాందేవ్ చెప్పారు. ఎగుమతుల అంశాన్నీ పరిశీలిస్తామన్నారు. 2014-15లో కంపెనీ అమ్మకాల టర్నోవరు రూ. 2007 కోట్లని ఆయన పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరం 150% వృద్ధితో రూ. 5,000 కోట్ల లక్ష్యాన్ని సాధించాలని నిర్దేశించుకున్నట్లు రాందేవ్ తెలిపారు. -
పప్పుల నిల్వలపై పరిమితి
బడా రిటైలర్లు, ఎగుమతి-దిగుమతిదారులు, ప్రాసెసింగ్ సంస్థలకు వర్తింపు న్యూఢిల్లీ: కందిపప్పు, మినప్పప్పు వంటి పప్పుధాన్యాల ధరలు ఆకాశాన్నంటిన నేపథ్యంలో బహిరంగ మార్కెట్లో వాటి సరఫరాను మెరుగుపరచడంతోపాటు అక్రమ నిల్వలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. లెసైన్సుగల ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలు, పప్పుధాన్యాల ఎగుమతి, దిగుమతిదారులు, బిగ్ బజార్ వంటి పెద్ద రిటైల్ స్టోర్లు పప్పుధాన్యాలను అధికంగా నిల్వ ఉంచుకోకుండా పరిమితి విధించింది. అలాగే వ్యాపారులు బ్లాక్ మార్కెటింగ్‌కు పాల్పడకుండా తనిఖీలను ముమ్మరం చేయాలని రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆహార మంత్రిత్వశాఖ ఆదివారం ప్రకటన విడుదల చేసింది. కేంద్ర కేబినెట్ కార్యదర్శి నిత్యం వాటి ధరల పరిస్థితిని సమీక్షిస్తారని తెలిపింది. దేశంలో కొన్ని చోట్ల వర్షాభావ పరిస్థితులు, మరికొన్ని కోట్ల అకాల వర్షాల వల్ల 2014-15 పంట కాలానికి పప్పుధాన్యాల ఉత్పత్తి సుమారు 20 లక్షల టన్నులు తగ్గడంతో వాటి ధరలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా గతేడాది కిలో రూ. 85 చొప్పున పలికిన కందిపప్పు ధర ఈ ఏడాది ఏకంగా కిలోకు రూ. 190 వరకు చేరింది. అలాగే మినప్పప్పు ధర సైతం గతేడాది కిలో రూ. 100 చొప్పున నుంచి ఈ ఏడాది కిలో రూ. 190కి పెరిగింది. దీంతో రంగంలోకి దిగిన కేంద్రం రైతుల నుంచి మార్కెట్ ధరకు 40 వేల టన్నుల పప్పుధాన్యాలను కొనుగోలు చేసి నిల్వ ఉంచాలని గత వారం నిర్ణయించింది. తాజాగా 5 వేల టన్నుల కందిపప్పును దిగుమతి చేసుకున్న ప్రభుత్వం మరో 2 వేల టన్నుల దిగుమతులకు టెండర్లు పిలిచింది. -
ఢిల్లీలో మ్యాగీపై నిషేధం
15 రోజుల పాటు వేటు వేసిన రాష్ట్ర సర్కారు ♦ నూడుల్స్‌లో సీసం మోతాదు అధికంగా ఉందని పరీక్షల్లో వెల్లడి ♦ మ్యాగీ నూడుల్స్ వినియోగాన్ని నిలిపివేయాలని సైన్యం ఆదేశం ♦ బిగ్‌బజార్, కేంద్రీయ భండార్లలో మ్యాగీ విక్రయాల నిలిపివేత ♦ తెలుగు రాష్ట్రాలు సహా అన్ని రాష్ట్రాల్లోనూ నూడుల్స్‌కు పరీక్షలు ♦ తమిళనాడులో నెస్లే పాలపొడిలో బయటపడ్డ సజీవ లార్వా! సాక్షి, న్యూఢిల్లీ: మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో.. వాటి విక్రయాలపై ఢిల్లీ ప్రభుత్వం 15 రోజుల పాటు నిషేధం విధించింది. ఈ ఫాస్ట్ ఫుడ్ (తక్షణ ఆహారం)ను వినియోగించరాదని సైన్యం కూడా బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ప్రముఖ సూపర్ మాల్స్ అయిన బిగ్ బజార్, కేంద్రీయ భండార్లు దేశవ్యాప్తంగా గల తమ దుకాణాల్లో వీటి విక్రయాలను నిలిపివేశాయి. ఇతర రాష్ట్రాలు సైతం మ్యాగీ నూడుల్స్ సహా వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్లపై నాణ్యతా పరీక్షలకు ఆదేశాలిచ్చాయి. మరోవైపు.. గతంలో ఎన్నడూ లేని విధంగా మ్యాగీ నూడుల్స్ తయారు చేస్తున్న ‘నెస్లే ఇండియా’ సంస్థపై కేంద్ర ప్రభుత్వం సైతం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కారాల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఆహార భద్రతా ప్రమాణాలను ఆ సంస్థ ఉల్లంఘించిందని ఆరోపించింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బహుళజాతి సంస్థ భారతీయ విభాగమైన నెస్లే ఇండియా సంస్థ తయారు చేసి, పంపిణీ చేస్తున్న ఫాస్ట్ ఫుడ్ ఉత్పత్తుల్లో ‘2 మినిట్ మ్యాగీ నూడుల్స్’ విస్తృత ప్రజాదరణ పొందిన విషయం తెలిసిందే. ఈ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నట్లు ఫిర్యాదులు రావటంతో.. ఈ ఉత్పత్తి వాణిజ్య ప్రకటనల్లో పాల్గొన్న సినీనటులు అమితాబ్‌బచ్చన్, మాధురీదీక్షిత్, ప్రీతిజింటాలపై కేసులు నమోదు చేయాలని బిహార్ కోర్టు మంగళవారం ఆదేశాలు ఇచ్చిన విషయమూ విదితమే. ఈ కేసు విషయంలో చట్ట ప్రకారం సహకరిస్తానని అమితాబ్ చెప్పారు. 13 నమూనాల్లో పదింట అధికంగా సీసం మ్యాగీ నూడుల్స్‌కు సంబంధించి దేశ రాజధాని ఢిల్లీలో 13 మాగీ నూడుల్స్ నమూనాలను పరీక్షించగా 10 నమూనాల్లో సీసం మోతాదు ఎక్కువగా ఉన్నట్లు తేలిందని ఢిల్లీ సర్కారు తెలిపింది. ఈ విషయమై నెస్లే ఇండియా ప్రతినిధులు ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా లేదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్రజైన్ పేర్కొన్నారు. దీంతో.. రాష్ట్రంలో వీటి విక్రయాలపై 15 రోజులు నిషేధం విధించినట్లు తెలిపారు. నగరంలో ప్రస్తతం ఉన్న మ్యాగీ నూడుల్స్ స్టాకును 15 రోజుల్లో వెనక్కి తీసుకుని.. కొత్త స్టాకును అందుబాటులోకి తేవాలని నెస్లే ఇండియాను ఆదేశించామన్నారు. కొత్త స్టాకును కూడా పరీక్షించి భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విక్రయించటానికి అనుమతిస్తామని చెప్పారు. ఆహార కల్తీ చట్టంలోని నిబంధనల కింద నెస్లే ఇండియా సంస్థపై కోర్టులో కేసు దాఖలు చేస్తామన్నారు. ఆహార కల్తీకి పాల్పడే వారిని కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని కూడా సమీక్షించి మార్పులు చేస్తామని తెలిపారు. అలాగే.. ఇతర సంస్థలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్న నూడుల్స్పైనా పరీక్షలకు ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. ఇతర రాష్ట్రాల్లోనూ నూడుల్స్‌కు పరీక్షలు మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పశ్చిమబెంగాల్, అస్సాం, మేఘాలయ, జార్ఖండ్, ఒడిశా, గుజరాత్, హరియాణా తదితర రాష్ట్రాలు కూడా మాగీ నూడుల్స్ నమూనాలను సేకరించి ఆహార భద్రతా ప్రమాణాల పరీక్షలు చేపట్టాయి. పశ్చిమబెంగాల్లో కురుకురే, లేస్ వంటి ప్రజాదరణ పొందిన చిరుతిళ్ల నమూనాలనూ పరీక్షిస్తున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సాధన్ పాండే తెలిపారు. అయితే.. మహారాష్ట్ర, కేరళ, గోవా ప్రభుత్వాలు మాత్రం తాము నిర్వహించిన పరీక్షల్లో ప్రతికూల నివేదికలేవీ రాలేదని పేర్కొనటం నెస్లే ఇండియాకు కాస్త ఊరటనిస్తోంది. ఇదిలావుంటే.. నెస్లే ఇండియా తయారు చేసే పాల పొడి ఉత్పత్తిలో సజీవ లార్వా ఉందని, ఇది వినియోగించటం ప్రమాదకరమని పరీక్షల్లో ప్రాథమికంగా తేలిందని తమిళనాడు అధికారులు అనధికారికంగా తెలిపారు. సరైన అవగాహన లేదు.. ఆహార పదార్థాల ప్యాకెట్లపై ముద్రించే సమాచారం గురించి వినియోగదారులకు సరైన అవగాహన లేదని, ప్యాకెట్లలో ఉన్న ఆహారం గురించి కచ్చితమైన వివరాలు తెలుసుకోవడం వారి హక్కు అని బుధవారం ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్(సీఎస్ఈ)’ సంస్థ పేర్కొంది. దేశంలో సెలబ్రిటీల వ్యాపార ప్రకటనలను నియంత్రించేందుకు చట్టపరంగా నిబంధనలు లేవని, అలాంటి ప్రకటనలను కచ్చితంగా నియంత్రించేందుకు నిబంధనలు రూపొందించాలని సూచించింది. వివాదం ఎలా మొదలైంది..? మ్యాగీ.. రెండు నిమిషాల్లోనే నూడుల్స్! దేశంలోనే తొలి ఇన్స్టంట్ నూడుల్స్ బ్రాండ్ ఇది. అంతర్జాతీయ కంపెనీ నెస్లే 1947 నుంచే అందిస్తున్న ఈ బ్రాండ్ ప్రపంచవ్యాప్తంగా పిల్లలతో పాటు పెద్దలనూ బాగా ఆకట్టుకుంది. కానీ ఉత్తరప్రదేశ్‌లో విక్రయిస్తున్న మ్యాగీ నూడుల్స్‌లో సీసం(లెడ్), మోనోసోడియం గ్లుటామేట్‌లు అనుమతించిన మోతాదు కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు గతనెలలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించడంతో వివాదం మొదలైంది. ఆహార పదార్థాల్లో సీసం 0.01 పీపీఎం మాత్రమే ఉండాలి. కానీ లక్నోలో స్వాధీనం చేసుకున్న మ్యాగీ శాంపిళ్లలో ఏకంగా 17 పీపీఎంల సీసం ఉన్నట్లు తేలింది. దీంతో దేశవ్యాప్తంగా దుమారం రేగుతోంది. ఇందులో మోతాదుకు మించి ఉన్నాయంటున్న లెడ్(సీసం), మోనోసోడియం గ్లుటామేట్(ఎంఎస్‌జీ)ల వల్ల మన ఆరోగ్యానికి ఎంత హానికరం అని పరిశీలిస్తే... మోనోసోడియం గ్లుటామేట్ (ఎంఎస్‌జీ) గ్లుటామిక్ యాసిడ్, దాని గ్లుటామేట్‌లు(అయాన్లు, లవణాలు) కలిపితే మోనోసోడియం గ్లుటామేట్ ఏర్పడుతుంది. ఆహార పదార్థాల రుచిని పెంచేందుకు దీనిని కలుపుతారు. ఇది మోతాదుకు మించితే.. ♦ తలనొప్పి, చికాకు, అసౌకర్యం కలుగుతాయి. ♦ కొంతమందిలో ‘చైనీస్ రెస్టారెంట్ సిండ్రోమ్’ వస్తుంది. ♦ ఈ సిండ్రోమ్ వల్ల తలపోటు, వెన్ను, నొప్పులు, మగత కలుగుతాయి. ♦ ఛాతీలో మంట, దవడలు బిగుసుకుపోవడం, అలర్జీ వంటి సమస్యలు వస్తాయి. సీసం(లెడ్) ♦ ప్రాథమికంగా ఇది లోహం. విషపూరితం. ♦ గాలి, నీరు, ఆహారం, అనేక రకాలుగా మనుషుల్లోకి చేరుతుంది. ♦ ఆహార పదార్థాల్లోకి నీరు, పదార్థాలు, ప్యాకేజింగ్, ఇతర మార్గాల్లో వస్తుంది. ఇది మోతాదుకు మించితే.. ♦ కడుపు నొప్పి, తలనొప్పి వస్తాయి. ♦ గందరగోళం, చికాకు కలుగుతాయి. ♦ రక్తహీనత సమస్య ఏర్పడుతుంది. ♦ మోతాదు మరీ మించితే.. మూర్ఛ. కోమాలోకి వెళతారు. మరణమూ సంభవించవచ్చు. -
అసోం చెక్కేయాలని ‘బిగ్’ ప్లాన్
‘బిగ్‌బజార్’ చోరులు.. గతంలో అదే మాల్లో పలుమార్లు చిల్లర దొంగతనాలు రాయదుర్గంలోనే పట్టుకున్నామన్న పోలీసులు దొంగలకు రిమాండ్: డీసీపీ షానవాజ్ సుల్తాన్‌బజార్ : సొంత రాష్ట్రంలో స్థిరపడాలనే టార్గెట్‌తోనే కాచిగూడ బిగ్ బజార్లో చోరీకి పాల్పడినట్టు పట్టుబడ్డ ఐదుగురు సెక్యూరిటీ గార్డులు పోలీసుల విచారణలో వెల్లడించారు. దొంగతనం చేసి పారిపోతుండగా 24 గంటల్లోనే వీరిని పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ. 32.27 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మంగళవారం సుల్తాన్‌బజార్ ఠాణాలో జరిగిన విలేకరుల సమావేశంలో తూర్పు మండలం డీసీపీ షానవాజ్ ఖాసిం.. అదనపు డీసీపీ చంద్రశేఖర్, సుల్తాన్‌బజార్ ఏసీపీ టి .ఎస్.రవికుమార్‌లతో కలిసి వివరాలు వెల్లడించారు. అసోం రాష్ట్రానికి చెందిన కమల్‌దాస్ (22), రతన్‌దాస్ అలియాస్ పప్పుదాస్ (20), రూపంకాలిటా (20), రజనీపెగ్ (24), ఫరాగా జోటిదాస్ (24)లు గతంలో కాచిగూడ బిగ్‌బజార్, ఐనాక్స్ సినీప్లెక్స్ కాంప్లెక్స్‌లో సెక్యురిటీ గార్డులుగా పనిచేశారు. వీరు స్థానిక రాజ్‌మొహల్లాలో అద్దెకు ఉంటున్నారు. వీరు మూడు నెలల క్రితం బిగ్‌బజార్‌లో చిన్నా చితకా చోరీలు చేశారు. నిర్వాహకులు గమనించకపోవడంతో భారీ చోరీకి ప్లాన్‌వేసి, చోరీ సొత్తుతో పారిపోయి అసోంలో స్థిరపడాలని భావించారు. చోరీ జరిగిందిలా... కాచిగూడ బిగ్‌బజార్ గురించి ముందుగానే తె లిసినదొంగలు ప్రస్తుతం అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డు బిట్టు సహకారంతో బిగ్‌బజార్‌లోని 3వ అంతస్తు లోనుంచి 2వ అంతస్తులో ఉన్న ‘ఈ జోన్’కు చేరుకుని సీసీ కెమెరా కేబుళ్లను తొలగించారు. షాపులోనివే ముందుగా సిద్ధం చేసుకున్న ఏడు సూట్‌కేసులు, బ్యాగుల్లో ఎలక్ట్రానిక్ పరికరాలను సర్దుకున్నారు. అంతే కాకుండా వారు పోజులిస్తూ ఫొటోలు దిగారు. చోరీ చేసిన సొమ్ముతో రెండు ఆటోల్లో రాయదుర్గంలోని స్నేహితుల ఇంటికి వెళ్లారు. విశాఖ నుంచి అసోం చెక్కేయాలని.. చోరీ చేసిన సొమ్ముతో విజయవాడకు అక్కడి నుంచి విశాఖపట్నం ఆ తర్వాత అసోంకు వెళ్లి దొంగిలించిన ఎలక్ట్రానిక్ వస్తువులతో వ్యాపారంలో స్థిరపడాలని నిందితులు అనుకున్నారు. సొంత రాష్ట్రం పోతే హైదరాబాద్ పోలీసులు పట్టుకో లేరని భావించారు. అయితే, అసోంకు రైలు సోమవారం ఉండడంతో వారి ప్లాన్ మారింది. రాయదుర్గం నుంచి ప్రైవేటు బస్సులో విజయవాడకు పోవాలనుకున్నారు. కానీ, బిట్టు అనే సెక్యూరిటీ గార్డు ఇచ్చిన ఆధారంతో ఫోన్ సిగ్నల్‌ను ట్యాప్ చేసి దొంగలను రాయదుర్గంలోని వారి స్నేహితుల ఇంట్లో పట్టుకున్నామని డీసీపీ షానవాజ్ ఖాసిం వెల్లడించారు. కాగా, కృష్ణా జిల్లా కంచికచర్ల పోలీసులు పట్టుకుని హైదరాబాద్‌కు తరలించామని అక్కడి పోలీసులు సైతం అప్పటికే మీడియాకు వెల్లడించడం కొసమెరుపు. కేసును ఛేదించిన పోలీసులకు రివార్డులు అందిస్తామని డీసీపీ తెలిపారు. దొంగిలించిన ఎలక్ట్రాన్ పరికరాలు ఇవే.. బిగ్‌బజార్‌లో దొంగలు సుమారు రూ. 40 లక్షలకు పైగా దొంగతనం చేశారని బిగ్‌బజార్ స్టోర్ మేనేజర్ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. నిందితుల నుంచి రూ.32.27 లక్షల ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 105 సెల్ఫోన్లు, 12 ల్యాప్‌టాప్‌లు, 4 ట్యాబ్స్, 1 ఐప్యాడ్, 32 కెమెరాలు, 4 లెన్సులు, ఒక డీవీడీ ప్లేయర్, స్పీకర్ ఒకటి, 4 ట్రాలీ బ్యాగులు, 52 మొబైల్ చార్జర్లు, 6 ల్యాప్‌టాప్ బ్యాటరీలు, 42 డాటా కేబుళ్లు, 28 హెడ్‌ఫోన్స్, 7 ల్యాప్‌టాప్ చార్జర్లు, 12 కేబుల్ చార్జర్లు, 2 కెమెరా బ్యాటరీలు, 45 కేబుల్ వైర్లు ఉన్నాయి. -
బిగ్‌బజార్ నిందితుల పట్టివేత
-
బిగ్‌బజార్‌లో భారీ చోరీ
సుల్తాన్‌బజార్: ఒకప్పుడు ఉపాధినిచ్చి..ఆదుకున్న సంస్థకే కన్నం వేశారా ప్రబుద్ధులు. రూ.50 లక్షలకు పైగా విలువైన లాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు దోచుకున్నారు. ఈ సంఘటన శనివారం నగరంలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కాచిగూడ క్రాస్ రోడ్‌లోని బిగ్‌బజార్‌ను శుక్రవారం రాత్రి ఎప్పటిలాగానే పని వేళలు ముగిసిన తరువాత మూసేశారు. శనివారం తెల్లవారు జామున 3 గంటలకు సెక్యూరిటీ చెక్ నిర్వహించారు. డిస్ప్లేలో కొన్ని ల్యాప్‌ట్యాప్‌లు, సెల్ఫోన్లు కనిపించ కపోవడంతో అనుమానం వచ్చిన సెక్యూరిటీ సిబ్బంది సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ముగ్గురు వ్యక్తులు ఎలక్ట్రానిక్ వస్తువులు దొంగిలిస్తున్నట్లు అందులో గుర్తించారు. వెంటనే విషయాన్ని బిగ్‌బజార్ ఉన్నతాధికారులకు సెక్యూరిటీ సిబ్బంది సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకుని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి, సుల్తాన్‌బజార్ పోలీసులను ఆశ్రయించారు. ఏసీపీ రవికుమార్, డీఐ కిషోర్ లు సంఘటన స్థలానికి చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. క్లూస్ టీంను రప్పించి, వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించారు. సిబ్బందిని విచారించారు. బిగ్‌బజార్ మేనేజర్ ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ప్రణాళిక ప్రకారమే... గతంలో బిగ్‌బజార్ లో పనిచేసి, మానివేసిన ముగ్గురు సెక్యూరిటీ గార్డులుపక్కా ప్రణాళికతో చోరీ చేశారని సీసీ కెమెరా ఫుటేజ్‌ల ద్వారా తెలుస్తోంది. అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్‌లు బిగ్‌బజార్‌లో 3వ ప్లోర్లోని ఫైర్‌ఎగ్జిట్ ద్వారం నుంచి 2వ అంతస్తులోని ఎలాక్ట్రానిక్ విభాగంలోకి ప్రవేశించి అక్కడున్న ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, స్మార్ట్ ఫోన్లు, కెమెరాలను, తర్వాత పక్కనే ఉన్న స్టోర్‌రూమ్, స్టాఫ్‌రూమ్‌ల తాళాలను పగులగొట్టి లోనికి వెళ్లి రెండు బీరువాల తాళాలను పగులగొట్టి అందులో ఉన్న ఖరీదైన సెల్ఫోన్లను ఎత్తుకెళ్లారు. మొత్తం పరికరాల విలువ రూ.50లక్షలకు పైనేనని సిబ్బంది చెబుతున్నారు. సీసీ కెమెరాల వైర్లు కత్తిరించి: ముగ్గురు వ్యక్తులు లోనికి వస్తూనే కొన్ని సీసీ కెమెరాల వైర్లను కత్తిరించారు. ఓ కెమెరా వైర్లు కత్తిరించకపోవడంతో చోరీ దృశ్యాలు చిక్కాయి. అర్ధరాత్రి 12 గంటల 52 నిమిషాల నుంచి ఒంటిగంటన్నర వరకు చోరీ చేశారు. నిందితులు 4 సూట్‌కేసులు, 6 బ్యాగులను తీసుకువచ్చి వాటిలో చోరీ చేసిన వస్తువులు తీసుకుని దర్జాగా ఆటోలో వెళ్లిపోయారు. చివరకు రాత్రి డ్యూటీలో ఉన్న ఓ సెక్యూరిటీ గార్డ్ వద్ద నిందితుడు కూల్‌డ్రింక్ తాగి మరీ వెళ్లడం గమనార్హం. కీలకం కానున్న ఫోన్‌కాల్: చోరీ చేస్తున్న సమయంలో ముగ్గురిలో ఒకడు సరిగ్గా 1.05 గంటలకు ఎవరికో ఫోన్ చేశాడు. ఈ దృశ్యాలను సీసీ కెమెరాలో చూసిన పోలీసులు ఫోన్ కాల్‌పై దృష్టి పెట్టారు. బిగ్‌బజార్ నుంచిఆ సమయంలో వారు ఎక్కడికి ఫోన్ చేశారు? అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితుల బయోడేటా ఆధారంగా వారి ఫొటోలను సేకరించారు. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నగరంలోనే నిందితులు? నిందితులు పప్పుదాస్, కమల్‌దాస్, రజినిపెగ్ల పట్టుకునేందుకు 3 బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నిందితులు అసోం, అరుణాచల్‌ప్రదేశ్‌లకు చెందిన వారు. అసోం వె ళ్లేందుకు సోమవారం ఉదయం రైలుఉంది. మరే ఇతర మార్గాల ద్వారా నిందితులు వెళ్లినా పోలీసులకు దొరికిపోయే అవకాశాలు అధికంగా ఉన్నాయి. దీన్నిబట్టి నిందితులు న గరం, శివారు ప్రాంతాలలో ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితులను పట్టుకుంటాం: కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లోని బిగ్‌బజార్‌లో గుర్తు తెలియని వ్యక్తులు 35 సెల్ఫోన్లు, 15 ల్యాప్‌ట్యాప్‌లు. 7 కెమెరాలు చోరీ చేశారని ఏసీపీ రవికుమార్ విలేకరులకు తెలిపారు. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. 3 బృందాలతో గాలింపు చర్యలు మొదలుపెట్టామని ఆయన తెలిపారు. తన పర్యవేక్షణలో సుల్తాన్‌బజార్ డీఐ కిషోర్‌కుమార్ దర్యాప్తు చేస్తున్నార ని చెప్పారు.