
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న బిగ్ బజార్, ఎఫ్‌బీబీ.. రెండు గంటల హోమ్ డెలివరీ సేవలను ఫ్యాషన్‌కూ విస్తరించాయి. ఇప్పటి వరకు బిగ్ బజార్ ఈ సేవల కింద నిత్యావసరాలను తన కస్టమర్లకు అందించింది. ఫ్యాషన్ కలెక్షన్‌ను ఇలా రెండు గంటల్లో వినియోగదార్లకు చేర్చడం దేశంలో ఇదే తొలిసారి అని కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా 144 నగరాలు, పట్టణాల్లో 352 స్టోర్ల ద్వారా ఉత్పత్తులను సరఫరా చేస్తారు. షాప్.బిగ్‌బజార్.కామ్ పోర్టల్ ద్వారా ఆర్డర్ చేయాల్సి ఉంటుంది.