Big Bazaar Republic Day Sale Goes Live With Its Sabse Saste Din Sale - Sakshi
Sakshi News home page

బిగ్ బజార్ బంపర్ ఆఫర్.. వాటి మీద 50 శాతం డిస్కౌంట్..!

Published Wed, Jan 19 2022 6:00 PM | Last Updated on Wed, Jan 19 2022 6:55 PM

Big Bazaar Sabse Saste Din Sale Starts From Today, Claims 2Hr Delivery - Sakshi

ప్రముఖ రిటైల్ బ్రాండ్ సంస్థ ‘బిగ్ బజార్’ తాజాగా రిపబ్లిక్ డే సందర్భంగా ‘సబ్సే సస్తా దిన్’ ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్ జనవరి 19 నుంచి 26 వరకు కొనసాగుతుంది. ఈ ప్రత్యేక సేల్‌లో భాగంగా ఫుడ్, ఎలక్ట్రానిక్స్, దుస్తులు, ఫుట్‌వేర్, లగేజ్, కిచెన్‌వేర్, హోమ్ డెకోర్ వంటి తదితర వస్తు ఉత్పత్తులపై పలు రకాల డిస్కౌంట్ ఆఫర్లను అందిస్తున్నట్లు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్‌లో జరిగే ప్రముఖ సేల్‌లో తమ ‘సబ్సే సస్తే దిన్’ కూడా ఒకటని, ఇందులో వినియోగదారులు పలు ఆఫర్లను పొందొచ్చని బిగ్ బజార్ పేర్కొంది. 

ఈ సేల్‌లో భాగంగా ప్రతి బిగ్ బజార్ స్టోర్ కూడా ఉదయం 9 గంటలకే ప్రారంభంకానుంది. ఈ ఏడాది, కేవలం స్టోరుల్లో మాత్రమే కాకుండా బిగ్ బజార్ యాప్, వెబ్ సైట్ ద్వారా కూడా ప్రోడక్ట్స్ బుక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసిన 2 గంటల్లోగా ప్రోడక్ట్స్ ఉచిత హోమ్ డెలివరీ చేయనున్నారు. కస్టమర్లు ₹ 2,500 విలువైన ఫ్యాషన్ వోచర్లను ₹2,500 విలువైన షాపింగ్ పొందవచ్చు. అంటే, ఫ్యాషన్ మీద 50 డిస్కౌంట్ లభిస్తుంది. ఎస్బిఐ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు కనీసం స్టోరులో ₹3,500 షాపింగ్ చేస్తే అదనంగా 7.5% డిస్కౌంట్ కూడా పొందవచ్చు. సబ్సే సస్తా దిన్ షాపింగ్ ఫెస్టివల్స్‌లో భాగంగా ఫుడ్, ఫ్యాషన్, హోమ్, ఎలక్ట్రానిక్స్, స్మార్ట్ వాచ్ లను తక్కువ ధరకు వినియోగిస్తుంది.

(చదవండి: 5G Issue: 5జీతో నిజంగానే విమానాలకు ఇబ్బందా?)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement