ముంబై: ముంబై మతుంగలోని బిగ్ బజార్ స్టోర్‌లో సోమవారం అగ్నిప్రమాదం చోటుచేసకుంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో స్టోర్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. తర్వాత అవి వేగంగా వ్యాపించాయి. మంటల కారణంగా ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు ఆలుముకున్నాయి. వెంటనే రంగంలో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపు ఐదు ఫైరింజన్లు ఘటన స్థలానికి చేరుకున్నాయి. అయితే అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో స్టోర్ లోపల ఉన్న వారందరిని బయటకు తరలించినట్టుగా సమాచారం. అగ్నిప్రమాదం కారణంగా ఆ మార్గంలో పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment