ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’ | Future group buys Heritage retail | Sakshi
Sakshi News home page

ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’

Published Mon, Nov 7 2016 5:16 PM | Last Updated on Mon, Sep 4 2017 7:28 PM

ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’

ఫ్యూచర్ గ్రూప్ చేతికి ‘హెరిటేజ్’

హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ రిటైల్ను దేశీయ రిటైల్ దిగ్గజం ఫ్యూచర్ గ్రూప్ సొంతం చేసుకుంది. హెరిటేజ్ ఫుడ్స్‌కు చెందిన రిటైల్ డివిజన్‌ను ఫ్యూచర్ గ్రూప్ కొనుగోలు చేసింది.  హెరిటేజ్ ఫుడ్స్ ఈ మేరకు 124 స్టోర్లను ఫ్యూచర్ గ్రూప్కు అప్పగించింది. ఇకపై హెరిటేజ్ స్టోర్లు ఫ్యూచర్ గ్రూప్లో భాగం కానున్నాయి. బదులుగా ఫ్యూచర్ గ్రూప్ సంస్థ...3.5 శాతం వాటాను హెరిటేజ్కు ఇవ్వనుంది.

ఫ్యూచర్ గ్రూప్ సంస్థ ఇప్పటికే బిగ్ బజార్, ఈ-జోన్, షాపర్స్ స్టాప్ వంటి బ్రాండ్లతో రిటైల్ రంగంలో తనదైన ముద్ర సంపాదించుకుంది. బిగ్‌బజార్, ఫుడ్ బజార్ పేర్లతో దేశవ్యాప్తంగా 738 స్టోర్స్‌ను కలిగి వున్న కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూపు వ్యాపార విస్తరణపై దృష్టిసారిస్తోంది. ఈ మధ్య కాలంలో ఫ్యూచర్ గ్రూపు బిగ్ ఆపిల్, నిలగిరీ, భారతీ రిటైల్ ఔట్‌లెట్లను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ ఒప్పందంపై సెప్టెంబర్లోనే వార్తలు వెలువడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement