
తనిఖీల్లో పరిశీలించిన ఐస్ క్రీంలు
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): నగరంలోని బిగ్ బజారులో తూనికలు, కొలతలు, విజిలెన్స్, అగ్రికల్చర్, ఫుడ్‌సేఫ్టీ విభాగం అధికారులు సోదాలు చేశారు. మంగళవారం ఉదయం తనిఖీలు నిర్వహించి పలు ఆహార పదార్థాలు, చాక్లెట్స్, క్రీంలు పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సోదాల్లో పలువురు అధికారులు పాల్గొన్నారు.