న్యూఢిల్లీ: ఏటీఎంలు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించలేకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రజలకు ఎదురవుతున్న తాత్కాలిక ఇబ్బందులు తమకు బాధే అని చెప్పారు.
పెద్ద నోట్లు వెనక్కి తీసుకుంటే ములాయం, మాయావతికి ఎందుకంత బాధ అని అమిత్ షా ప్రశ్నించారు. నిజంగా ప్రజలకోసమే రాహుల్ గాంధీ, కేజ్రీవాల్ బాధపడుతున్నారా అని అనుమానం వ్యక్తం చేశారు. పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడంతో బ్లాక్ మార్కెట్లకు హవాలా డీలర్లకు పెద్ద షాక్ అని అమిత్ షా చెప్పారు.