‘కమర్షియల్’కు దీటుగా ‘కో ఆపరేటివ్’ సేవలు
‘కమర్షియల్’కు దీటుగా ‘కో ఆపరేటివ్’ సేవలు
Published Sat, Oct 15 2016 3:47 PM | Last Updated on Wed, Apr 3 2019 8:09 PM
దోమకొండ:
కమర్షియల్ బ్యాంకులకు దీటు గా కో ఆపరేటివ్ బ్యాంకులు ఖాతాదారులకు సేవలందిస్తున్నాయని డీసీసీబీ ఉపాధ్యక్షుడు పరికి ప్రేంకుమార్ అన్నారు. మండల కేం ద్రంలోని కో ఆపరేటీవ్ బ్యాంకులో శుక్రవా రం ఖాతాదారులకు ఏటీఎం కార్డులు పంపి ణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి జిల్లాలోని కో ఆపరేటీవ్ ఖాతాదారులందరికీ ఏటీఎంలు పంపిణీ చేస్తామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో ఏటీఎం కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే రైతులకు రూ.1లక్ష నుంచి రూ.2లక్షల వరకు రుణాలు ఇవ్వాలని బ్యాంకు నిర్ణయించిందన్నారు. కార్యక్రమంలో దోమకొండ సిం గిల్‌విండో చైర్మన్ నర్సారెడ్డి, ముత్యంపేట సింగిల్‌విండో చైర్మన్ తిరుపతిరెడ్డి, కో ఆపరేటీవ్ బ్యాంకు మేనేజర్ శాంతాదేవి, సొసైటీ సీఈవోలు బాల్‌రెడ్డి, రాంచంద్రం, నర్సాగౌడ్, బ్యాంకు సిబ్బంది శ్రీపాల్‌రెడ్డి, సాయికృష్ణ, సునీత, రాకేశ్, శ్రావణ్‌రెడ్డి, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement